Pay Salaries
-
రుణమాఫీలో మాది ఆల్ టైం రికార్డ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో పాలనలో తెలంగాణలో వ్యవసాయ రంగం స్వర్ణయుగం సాధించడంతోపాటు రుణమాఫీలో రైతులకు రూ.1.20లక్షల కోట్లు లబ్ధి చేకూర్చి దేశంలోనే ఆల్ టైం రికార్డు సృష్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం హరీశ్‌రావు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా బీఆర్ఎస్ పాలనలో రైతులకు జరిగిన లబ్ధిని వివరించారు.కేసీఆర్ పాలనలో వివిధ పథకాల కింద రైతులకు రూ.1.20 లక్షల కోట్లు నేరుగా సాయం అందించిందన్నారు. రైతుబంధు కింద 69 లక్షల మంది రైతులకు రూ.72,972 కోట్లు, రైతు బీమా కింద 1.11 లక్షల మంది రైతులకు రూ.6,488 కోట్ల తమ ప్రభుత్వ హయాంలో చెల్లించామన్నారు. రైతు రుణమాఫీ కింద రెండు విడతల్లో కలుపుకుని రూ.29,144.61 కోట్లు చెల్లించామన్నారు. ఇతర రైతు సంక్షేమ పథకాల కింద రైతులకు రూ.11,401 కోట్లు సాయం అందించామన్నారు. చిరుద్యోగుల వెతలు తీర్చండి ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వారికి వేతనాలివ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రతీ నెలా 1న వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. -
ఏప్రిల్ నుంచి టేక్ హోమ్ శాలరీలో కోత!
న్యూఢిల్లీ, సాక్షి: వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22) నుంచీ ఉద్యోగులకు లభించే నికర వేతనాలలో కోతపడే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం ఇకపై అలవెన్సుల వాటా 50 శాతానికి మించరాదు. దీంతో బేసిక్ శాలరీని 50 శాతంగా నిర్ణయించవలసి ఉంటుందని సంబంధితవర్గాలు చెబుతున్నాయి. 2019 కొత్త వేతన నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమలయ్యే వీలున్నట్లు పేర్కొన్నాయి. దీంతో కంపెనీలు పే ప్యాకేజీలలో సవరణలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డాయి. ఫలితంగా ఏప్రిల్ నుంచీ టేక్ హోమ్ శాలరీ తగ్గే చాన్స్ ఉన్నట్లు తెలియజేశాయి. తాజా నిబంధనలపై నిపుణులు ఏమంటున్నారంటే... చదవండి: (23,000 క్యాంపస్ ఉద్యోగాలకు రెడీ) రిటైర్మెంట్ లబ్ది కొత్త వేతన నిబంధనలు అమలైతే జీతాలలో అలవెన్స్ వాటా 50 శాతానికి మించరాదు. దీంతో బేసిక్ శాలరీ వాటా 50 శాతానికి చేర్చవలసి ఉంటుంది. ఫలితంగా గ్రాట్యుటీకోసం చెల్లింపులు, ప్రావిడెండ్ ఫండ్‌కు ఉద్యోగుల జమలు పెరిగే అవకాశముంది. వెరసి ఉద్యోగులు అందుకునే నికర వేతనాలలో ఆమేర కోత పడే చాన్స్ ఉంది. అయితే ఈ మార్పులతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరగనున్నాయి. ప్రయివేట్ రంగంలో చాల కంపెనీలు అలవెన్సుల వాటాను అధికంగా ఉంచుతూ.. నాన్అలవెన్స్ వాటాను 50 శాతానికంటే తక్కువ స్థాయిలో అమలు చేస్తున్నాయి. ఫలితంగా కొత్త వేతన నిబంధనలు ప్రయివేట్ రంగ కంపెనీలపై అధికంగా ప్రభావం చూపే వీలుంది. అయితే తాజా నిబంధనలు ఉద్యోగులకు సామాజిక భద్రతతోపాటు.. పదవీ విరమణ లాభాలను పెంచే వీలుంది. కొత్త వేతన నిబంధనలు అమలుచేస్తే కంపెనీలకు 10-12 శాతం మేర ఉద్యోగ వ్యయాలు పెరగవచ్చు. వేతన కోడ్‌ను గతేడాది పార్లమెంట్ ఆమోదించింది. తుది నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రస్తుతం ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. చదవండి: (జనవరి 1 నుంచి విప్రో వేతన పెంపు!) -
'నగదు రూపంలో రూ.10 వేల వేతనం'
-
'నగదు రూపంలో రూ.10 వేల వేతనం'
విజయవాడ: ఉద్యోగులకు రూ. 10 వేల వేతనం నగదు రూపంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్టు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నగదు రహిత లావాదేవీల కోసం కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా కమిటీలు చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు. 29 వేల రేషన్ షాపులను యాక్టివ్ చేశామని చంద్రబాబు తెలిపారు. బయోమెట్రిక్ విధానంలో రేషన్ సరుకులు అందిస్తామన్నారు.