pay salary
-
వేతన జీవులకు షాక్: కొత్త ఐటీఆర్..ఎన్నో మార్పులు
ఐటీఆర్–1 వేతనజీవుల కోసం. దీన్లో ఇదివరకు జీతభత్యాల గురించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఇవ్వాలి. ►ఉద్యోగస్తులకు యాజమాన్యం వారిచ్చే స్టాక్ ఆప్షన్ ప్లాన్ విషయంలో మార్పుల వలన, లిస్ట్ కాని కంపెనీ షేర్లుంటే వాటి ‘ప్రైమరీ మార్కెట్’ విలువను సీఏ, మర్చంట్ బ్యాంకర్‌తో ధ్రువీకరించాలి. ►అద్దెకిచ్చిన ఇంటి మీద అద్దె వివరాలివ్వాలి. ►మూలధన లాభాలకు సంబంధించి అదనపు వివరాలివ్వాలి. మినహాయింపులు పొందిన వారు వాటిని ఎంతో వివరంగా తెలియజేయాలి. ►కొన్ని ఫారాలలో అసెస్సీకి సంబంధించిన కాలమ్ ‘జెండర్’ తొలగించారు.ఈ సమాచారం ఇవ్వక్కర్లేదు. ►భాగస్వామ్య సంస్థలు భాగస్వాముల ఆధార్ వివరాలను తెలియజేయాలి. ►భాగస్వామి గత సంవత్సరం వరకూ ఫారం–2ను దాఖలు చేయవచ్చు. ఈ సారి ఫారం–3లో రిటర్నులు దాఖలు చేయాలి. ► అలాగే నాన్ రెసిడెంట్లు ఫారం–1కి బదులుగా ఫారం–2 దాఖలు చేయాలి. ఇందులో అదనంగా సమాచారం ఇవ్వాలి. వారు రిఫండ్ క్లెయిమ్ చేసినప్పుడు విదేశీ బ్యాంక్ వివరాలిస్తే.. ఆబ్యాంక్ ఖాతాకు రిఫండ్ ఇస్తారు. ► కొంతమంది నిర్దేశించిన శాతాన్ని లాభంగా చూపించడం ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అంటారు. వారు ఈసారి అదనంగా సమాచారం ఇవ్వరు. (ఇది వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు మాత్రమే). ►వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు జీఎస్టీ రిటర్నులలో పేర్కొన్న టర్నోవర్‌ను చూపించాలి. దీనివలన పుస్తకాల టర్నోవర్‌తో, జీఎస్టీ టర్నోవర్‌ను పోల్చి చూస్తారు. వ్యత్యాసం ఉంటే వివరణ ఇవ్వాలి. ►అలాగే కంపెనీల విషయంలో ఎన్నెన్నో వివరాలు ఇవ్వాలి. ►వేతనజీవుల విషయంలో గడువుతేది 31/07/2018. ఆన్లైన్లో దాఖలు చేయాలి. అన్ని కాగితాలు సంపాదించి, సరిచూసుకొని, ఖచ్చితంగా ఫైల్ చేయండి. 31/07/2018 దాటితే రూ.5,000, 31/12/2018 దాటితే రూ.10,000 పెనాల్టీ పడుతుంది. -
పనిచేసే గోపాలమిత్రలకే వేతనం
అనంతపురం అగ్రికల్చర్: వి«ధి నిర్వహణలో ఉన్న గోపాలమిత్రలకే గౌరవ వేతనం చెల్లిస్తామని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ–డీఎల్‌డీఏ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) డాక్టర్ ఎన్.తిరుపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక సాయినగర్ పశువైద్యశాలలో సాక్షితో మాట్లాడుతూ... గోపాలమిత్రలు సమ్మెలో ఉన్నందున జిల్లాలో కృత్రిమ గర్భోత్పత్తి, లేగదూడల సంరక్షణ, పశువైద్యానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. గోపాలమిత్రల డిమాండ్లు పరిష్కరించడానికి ముందుకు వస్తున్నా తమ పరిధిలో పరిష్కారం కాని కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకువస్తూ నిరసన కొనసాగిస్తున్నారని తెలిపారు. కొత్తగా ఏర్పాటవుతున్న పశుమిత్రల ద్వారా గోపాలమిత్రలకు ఢోకా లేదన్నారు. ఈ క్రమంలో ఆగస్టు ఒకటో తేదీలోగా విధుల్లో చేరాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ క్రమంలో మే నెలకు సంబంధించి 85 మందికి మాత్రమే వేతనాలు ఇస్తున్నామన్నారు. మిగతా వారు కూడా రెండు మూడు రోజుల్లో విధుల్లో చేరి రికార్డులు సమర్పిస్తే పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తామని తెలిపారు. లేదంటే వారి స్థానాల్లో కొత్తగా గోపాలమిత్రల నియామకానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిరసన ఉధృతం తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపకపోవడంతో గోపాలమిత్రలు తమ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సోమవారం స్థానిక జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) కార్యాలయాన్ని ముట్టడించాలని తీర్మానించారు. ఇదే అంశంపై గోపాలమిత్రల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటేశులు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్ట్స్‌కళాశాల మైదానంలో సమావేశమై చర్చించారు. డిమాండ్ల పరిష్కారానికి ఎవరి నుంచి కూడా స్పష్టమైన హామీ లభించకపోవడంతో నిరవదిక సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.