వేతన జీవులకు షాక్‌: కొత్త ఐటీఆర్‌..ఎన్నో మార్పులు | Returns should be completed by the end of July | Sakshi
Sakshi News home page

వేతన జీవులకు షాక్‌: కొత్త ఐటీఆర్‌..ఎన్నో మార్పులు 

Published Mon, Apr 16 2018 1:34 AM | Last Updated on Thu, Sep 27 2018 3:54 PM

Returns should be completed by the end of July - Sakshi

ఐటీఆర్‌–1 వేతనజీవుల కోసం. దీన్లో ఇదివరకు జీతభత్యాల గురించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఇవ్వాలి. 

►ఉద్యోగస్తులకు యాజమాన్యం వారిచ్చే స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌ విషయంలో మార్పుల వలన, లిస్ట్‌ కాని కంపెనీ షేర్లుంటే వాటి ‘ప్రైమరీ మార్కెట్‌’ విలువను సీఏ, మర్చంట్‌ బ్యాంకర్‌తో ధ్రువీకరించాలి. 

►అద్దెకిచ్చిన ఇంటి మీద అద్దె వివరాలివ్వాలి.

►మూలధన లాభాలకు సంబంధించి అదనపు వివరాలివ్వాలి. మినహాయింపులు పొందిన వారు వాటిని ఎంతో వివరంగా తెలియజేయాలి.

►కొన్ని ఫారాలలో అసెస్సీకి సంబంధించిన కాలమ్‌ ‘జెండర్‌’ తొలగించారు.ఈ సమాచారం ఇవ్వక్కర్లేదు.

►భాగస్వామ్య సంస్థలు భాగస్వాముల ఆధార్‌ వివరాలను తెలియజేయాలి.

►భాగస్వామి గత సంవత్సరం వరకూ ఫారం–2ను దాఖలు చేయవచ్చు. ఈ సారి ఫారం–3లో రిటర్నులు దాఖలు చేయాలి.

► అలాగే నాన్‌ రెసిడెంట్లు ఫారం–1కి బదులుగా ఫారం–2 దాఖలు చేయాలి. ఇందులో అదనంగా సమాచారం ఇవ్వాలి. వారు రిఫండ్‌ క్లెయిమ్‌ చేసినప్పుడు విదేశీ బ్యాంక్‌ వివరాలిస్తే.. ఆబ్యాంక్‌ ఖాతాకు రిఫండ్‌ ఇస్తారు.

► కొంతమంది నిర్దేశించిన శాతాన్ని లాభంగా చూపించడం ప్రిజంప్టివ్‌ ట్యాక్సేషన్‌ అంటారు. వారు ఈసారి అదనంగా సమాచారం ఇవ్వరు. (ఇది వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు మాత్రమే).

►వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు జీఎస్‌టీ రిటర్నులలో పేర్కొన్న టర్నోవర్‌ను చూపించాలి. దీనివలన పుస్తకాల టర్నోవర్‌తో, జీఎస్‌టీ టర్నోవర్‌ను పోల్చి చూస్తారు. వ్యత్యాసం ఉంటే వివరణ ఇవ్వాలి.

►అలాగే కంపెనీల విషయంలో ఎన్నెన్నో వివరాలు    ఇవ్వాలి.

►వేతనజీవుల విషయంలో గడువుతేది 31/07/2018.  ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. అన్ని కాగితాలు సంపాదించి, సరిచూసుకొని, ఖచ్చితంగా ఫైల్‌ చేయండి. 31/07/2018 దాటితే రూ.5,000, 31/12/2018 దాటితే రూ.10,000 పెనాల్టీ పడుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement