payments feature
-
ఇక ఈ క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు...ఫస్ట్ చాన్స్ వారికే
సాక్షి,ముంబై: యూపీఐ చెల్లింపుల విషయంలో క్రెడిట్ కార్డ్ యూజర్లకు తీపి కబురు అందించింది. దేశంలో డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు త్వరలో వస్తువులు, సేవల కోసం యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆపరేటెడ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. దీంతో ప్రస్తుతం వినియోగదారుల బ్యాంకు ఖాతాలకే పరిమితమైన యూపీఐ చెల్లింపులు ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా అందుబాటులో వస్తాయి. బుధవారం నుంచి యూపీఐలో క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ప్రారంభమైనట్లు రేజర్ పే ప్రకటించింది. వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూపీఐతో లింక్ చేయడానికి అనుమతించే ఎన్సీపీఐ ఫీచర్‌ను స్వీకరించిన తొలి చెల్లింపు గేట్‌వే తామేనని రేజర్ పే తెలిపింది. తమ చెల్లింపుల గేట్‌వేని ఉపయోగించే వ్యాపారులకు మాత్రమే పరిమితమని వెల్లడించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందని రేజర్‌పే ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్డిఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ,ఇండియన్ బ్యాంక్‌ల కస్టమర్లు ఈ ప్రయోజనాలను మొదట పొందుతారని తెలిపింది. ఇప్పటికే రూపేక్రెడిట్ కార్డ్‌ల చెల్లింపులు మొదలైన సంగతి తెలిసిందే. (వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) యూపీఐ క్రెడిట్ కార్డ్ లింకింగ్ ద్వారా కస్టమర్లు ఇకపై చెల్లింపుల కోసం తమ క్రెడిట్ కార్డ్‌లను అన్ని సమయాల్లో తమ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.తద్వారా చోరీ, లేదా క్రెడిట్ కార్డ్ పోగొట్టుకోవడం లాంటి కష్టాలు లేకుండా కస్టమర్లకు భద్రతను పెంచుతుంది. అలాగే స్వైపింగ్ మెషీన్ల వద్ద సున్నితమైన కస్టమర్ సమాచారాన్ని స్కిమ్మింగ్ చేసే లేదా కాపీ చేసే ముప్పునుంచి తప్పిస్తుంది. (సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?) కాగా దాదాపు 250 మిలియన్ల మంది భారతీయులు తమ రోజువారీ లావాదేవీల కోసం UPIని ఉపయోగిస్తున్నారు మరియు దాదాపు 50 మిలియన్ల మంది వినియోగదారులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం క్రెడిట్ కార్డ్ పరిశ్రమ గత మూడు సంవత్సరాలలో 30 శాతం పెరిగింది. -
ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు
వాట్సాప్ ! ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ ఫోన్ లో ఎక్కువగా వినియోగించే యాప్. ఈ యాప్ తో స్నేహితులతో ముచ్చట్లు, కుటుంబ సభ్యులతో సంభాషణలు, నచ్చిన వారితో గిల్లిగజ్జాలు. ఇలా ఒకటేమిటి.‘వాట్సాప్’ గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత హిస్టరీయే ఉంది. అయితే ఇన్ని రోజులు వాట్సాప్ లో చాటింగ్ చేసిన మనం ఇకపై ఆర్ధిక లావాదేవీలను జరుపుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. చదవండి: సాఫ్ట్వేర్ సంస్థ (24)7.ఏఐ భారీ నియామకాలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామయ్యంలో వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను మంగళవారం ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.గూగుల్ పే తరహాలో మనీ ట్రాన్స్ ఫర్ చేసేందుకు రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. ఈ సందర్భంగా వాట్సాప్ పేమెంట్ డైరక్టర్ మనేష్ మహాత్మే మాట్లాడుతూ.. వాట్సాప్ నుంచి 227 రకాల బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.వాట్సాప్ ద్వారా మనీ సెండ్ చేయడం.. అదే వాట్సాప్ నుంచి మనీ తీసుకోవడం అనేది ట్రాన్సాక్షన్ మాత్రమే. కానీ యూజర్లు వారి భావాల్ని ఒకరికొకరు పంచుకోవడం వెలకట్టలేనిది. అందుకే భవిష్యత్‌లో వాట్సాప్‌కు మరిన్ని ఫీచర్లను అప్డేట్ చేయనున్నట్లు తెలిపారు. వాట్సాప్ నుంచి డబ్బులు పంపడం ఎలా? ♦ ముందుగా వాట్సాప్ డ్యాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి ♦ రైట్ సైడ్ టాప్ లో ఉన్న మూడు డాట్స్ పై ట్యాప్ చేయాలి ♦ ట్యాప్ చేస్తే మీకు న్యూ గ్రూప్, న్యూ బ్రాడ్ కాస్ట్, లింక్డ్ డివైజెస్, స్టార్డ్ మెసేజెస్ తో పాటు చివరిగా పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ♦ ఆ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ♦ అలా పేమెంట్ మెథడ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే పేమెంట్స్ ఆప్షన్ తో డ్యాష్ బోర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో కంటిన్యూ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ♦ కంటిన్యూ ఆప్షన్ తరువాత మీకు నచ్చిన బ్యాంక్ ను సెలక్ట్ చేసుకోవాలి. ♦ అనంతరం మీ కాంటాక్ట్ నెంబర్ ను వెరిఫై చేసుకోవాలి ♦ వెరిఫై తరువాత.. న్యూ పేమెంట్ ఆప్షన్ లో మీరు ఎవరికైతే మనీ సెండ్ చేయాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ నెంబర్ మీద క్లిక్ చేసి..డబ్బులు పంపించుకోవచ్చు. -
వాట్సాప్‌కు కేంద్రం ఝలక్!
న్యూఢిల్లీ : ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్ త్వరలోనే భారత్‌లో తన పేమెంట్ సర్వీసులను లాంచ్ చేయబోతుంది. దీని కోసం సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ రూపొందించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ కొత్త ఫీచర్‌ను బీటా టెస్టింగ్‌కు తీసుకొచ్చింది. అయితే వాట్సాప్ సర్వీసులు దేశవ్యాప్తంగా అధికారికంగా లాంచ్ చేయడానికి కంటే ముందే.. ఈ కంపెనీ భారత్‌లో కొత్త ఆఫీసును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ భారత్‌లో పేమెంట్ ఫీచర్‌ను లాంచ్ చేయాలనుకుంటే, ముందస్తుగా ఇక్కడ ఒక ఆఫీసు ఏర్పాటు చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆఫీసు ఏర్పాటు చేసేంతవరకు ఈ సర్వీసులు లాంచ్ చేయొద్దని తెలిపింది. పేమెంట్ సర్వీసులను లాంచ్ చేయనున్న నేపథ్యంలో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాట్ ఐడెమా, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్బీఐ మార్గదర్శకాలను కోడ్ చేసిన మంత్రిత్వ శాఖ, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్ లాంచ్ చేయబోయే ఈ సర్వీసులపై ప్రభుత్వం కూడా నిఘా ఉంచనుంది. రెండు దశల ధృవీకరణ, ఫైనాన్సియల్‌గా కీలకమైన డేటాను ఎలా స్టోర్ చేస్తారు అనే విషయాలపై వాట్సాప్‌కు ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అంతేకాక వాట్సాప్‌కు ఫేస్‌బుక్‌కు చెందినది కావడంతో, డేటా షేరింగ్‌పై కూడా కేంద్రం పలు ప్రశ్నలు వేస్తోంది. ఇప్పటికే ఫేస్బుక్ తన యూజర్ల డేటా థర్డ్ పార్టీలకు షేర్ చేయడంపై కేంద్రం సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. పేమెంట్ సర్వీసుల్లో కస్టమర్లకు ఏదైనా సమస్య వస్తే, వాటిని వెంటనే పరిష్కరించడానికి 24 గంటల టోల్-ఫ్రీ కస్టమర్ సర్వీసును ఏర్పాటు చేయాలని వాట్సాప్ యోచిస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో, వాట్సాప్ భారత్‌లో ఓ కార్యాలయం ఏర్పాటు చేయడాన్ని కీలకమైన అంశంగా పరిగణలోకి తీసుకుంది. అంతేకాక కొత్త ఆఫీసు ఏర్పాటుతో పాటు భారత్‌లోనూ ఓ బృందం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. వాట్సాప్ ఇండియా హెడ్, హెడ్ ఆఫ్ పాలసీలను నియమించుకోవడం కోసం వాట్సాప్ తీవ్ర కసరత్తు చేస్తోంది. భారత్‌లో ఆఫీసు ఏర్పాటు చేయడంతో కేవలం సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. పేమెంట్స్ అప్లికేషన్లో విశ్వసనీయతను పెంచడానికి ఇది సహకరించనుందని తెలిసింది. వాట్సాప్ ఇప్పటికే తన ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసింది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్‌లను తన పార్టనర్ బ్యాంక్‌లుగా చేర్చుకుంది. జూలై నెల మొదటి వారంలోనే ఈ సర్వీసులను భారత్‌లో లాంచ్ చేయాలని అనుకుంది. కానీ కొత్త డెవలప్మెంట్తో ఈ ఫీచర్ లాంచింగ్ వాయిదా పడింది. -
ఇన్‌స్ట్రాగ్రామ్‌లోనూ పేమెంట్స్ చేసుకోండి
ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఒక్కొక్కటి తమ యూజర్లకు పేమెంట్ ఫీచర్‌ను ఆఫర్ చేయడం మొదలు పెట్టాయి. తాజాగా ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్ కూడా చడీచప్పుడు లేకుండా తన ప్లాట్‌ఫామ్‌కు పేమెంట్స్ ఫీచర్‌ను జత చేసింది. అంటే ఇన్స్టాగ్రామ్ యూజర్లు యాప్ నుంచే ఇతరులకు డబ్బు చెల్లింపులు చేయవచ్చు. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతానికి అందరికీ కాకుండా కొంత మందికే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే మిగిలిన వారికి కూడా అందుబాటులోకి రానుంది. దీనికోసం తొలుత యూజర్లు తమ ప్రొఫైల్‌కు క్రెడిట్ లేదా డెబిట్ కార్డును జత చేసి పిన్ నంబర్ సెట్ చేసుకోవాలి. దీంతో ఇన్స్టాగ్రామ్ నుంచి బయటికి రాకుండా ఆ పిన్ ఆధారంగా కావాల్సిన వారికి చెల్లింపులు చేసుకోవచ్చు. అంతేకాక కావాల్సిన వస్తువులను కొనుక్కోవచ్చు. తమ ప్లాట్‌ఫామ్‌పై పేమెంట్స్ ఫీచర్‌ను జత చేసిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ అధికార ప్రతినిధి ధృవీకరించారు. రెస్టారెంట్లు, సెలూన్లు వంటి వాటిని బుక్ చేసుకుని పేమెంట్లు జరుపుకోవచ్చని, పరిమిత సంఖ్యలో పార్టనర్లతో ఈ సేవలను లైవ్‌లోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం పేమెంట్ సెట్టింగ్స్‌ను కొందరికి కనిపించేలా చేస్తున్నామని, కానీ అందరికీ ఇది ఇప్పుడే అందుబాటులోకి రాదని కంపెనీ పేర్కొంది. అమెరికాలో కొందరికి, యూకే కొందరికి ఇది అందుబాటులో ఉంది. ఫేస్బుక్ పేమెంట్స్ నిబంధనలకు అనుగుణంగా ఇన్‌స్ట్రాగ్రామ్ పేమెంట్స్ పనిచేయనుంది. ఒకటికి మించిన సేవలకు అనువుగా మార్చడం ద్వారా యూజర్లను నిలుపుకునే ప్రయత్నాలేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఫోటో షేరింగ్ యాప్ అయిన ఇన్స్టాగ్రామ్ ఇక చెల్లింపుల సాధనంగానూ ఉపయోగపడనుందని తెలిపారు. -
వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్
-
వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ వారికి వచ్చేసింది..
మెసేజింగ్ యాప్‌లో బాగా పాపులర్ అయిన వాట్సాప్, యూపీఐ ఆధారిత పేమెంట్స్ ఫీచర్‌తో మరింత మంది భారత కస్టమర్లను ఆకట్టుకోవాలనుకుంటోంది. ఈ మేరకు భారత్‌లో పేమెంట్స్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఎంపిక చేసిన ఐఓఎస్, ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో యూపీఐ ఆధారితంగా.. నగదును వేరే వాళ్లకి పంపించడం, వేరే వాళ్ల ద్వారా నగదును యూజర్లు పొందడం వంటివి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్‌లోని 2.18.21 వాట్సాప్ వెర్షన్‌కు, ఆండ్రాయిడ్ 2.18.41 వెర్షన్ వారికి అందుబాటులో ఉన్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల భారత్‌లో డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా పెరగడంతో, పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ను ఆఫర్‌చేసి మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని వాట్సాప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గిజ్మో టైమ్స్‌లో ఈ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ తొలుత స్పాట్ అయింది. చాట్ విండోలోనే ఈ ఫీచర్‌ను యూజర్లు యాక్సస్ చేసుకోవచ్చు. గేలరీ, వీడియో, డాక్యుమెంట్లు వంటి ఇతర ఆప్షన్లతో పాటు ఈ ఆప్షన్ కూడా ఇక అందుబాటులో ఉంటుంది. పేమెంట్స్‌ను క్లిక్ చేస్తే.. ఓ డిస్క్లైమర్ విండో ఓపెన్ అవుతుంది. దీనిలో బ్యాంకుల జాబితా కూడా ఉంటుంది. యూపీఐతో కనెక్ట్ అయిన బ్యాంకు అకౌంట్‌ను యూజర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ను మీరు కనుక వాడి ఉండకపోతే, ప్రమాణీకరణ పిన్ను క్రియేట్ చేసుకోవాలి. అదనంగా యూపీఐ యాప్ ద్వారా లేదా సంబంధిత బ్యాంకు వెబ్సైట్ ద్వారా యూపీఐ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. లావాదేవీని విజయవంతంగా పూర్తిచేసుకోవాలంటే నగదు పంపేవారికి, స్వీకరించే వారికి ఇద్దరికీ కచ్చితంగా వాట్సాప్ ఆఫర్ చేసే పేమెంట్స్ ఫీచర్ ఉండాలి. -
వాట్సాప్‌కు గట్టి పోటీ: హైక్ ఆ ఫీచర్ తెచ్చేసింది
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను అధిగమించడానికి దేశీయ మెసేజింగ్ యాప్ హైక్ ఓ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ను యాడ్ చేయకముందే, హైక్ తన ప్లాట్ ఫామ్ పై ఈ పేమెంట్స్ ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో 100 మిలియన్ కు పైగా ఉన్న తమ యూజర్లు, హైక్ ద్వారానే నగదు ట్రాన్స్ ఫర్స్, మొబైల్ బిల్స్ చెల్లించడం, రీఛార్జ్ చేసుకోవడం వంటి చేయవచ్చని కంపెనీ తెలిపింది. యూపీఐ ద్వారా ఉచితంగా, వెనువెంటనే బ్యాంకు నుంచి బ్యాంకుకు ట్రాన్స్ ఫర్లు, ఎలాంటి బ్యాంకు అకౌంట్లు లేకుండా వాలెట్ నుంచి వాలెట్ కు తక్షణ నగదు ట్రాన్స్ ఫర్ వంటివి చేసుకోవచ్చని హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు, సీఈవో కవిన్ భారతి మిట్టల్ చెప్పారు. యాప్ నుంచి రీఛార్జ్ కూడా చేసుకోవచ్చని తెలిపారు. గత ఆరు నెలలుగా తమ యూజర్లకు కొత్త అనుభవాన్ని అందించడం కోసం ఎంతో తాపత్రయపడ్డామని పేర్కొన్నారు.. భారత్ లో మెసేజింగ్ ప్లాట్ ఫామ్ పై పేమెంట్ సౌకర్యాన్ని తీసుకొచ్చిన తొలి యాప్ తమదేనని సంతోషం వ్యక్తంచేశారు. యూజర్ ఇంటర్ ఫేస్ ను మెరుగుపరిచామని, అదేవిధంగా యాప్ కెమెరాకు కొత్త ఫీచర్లను యాడ్ చేసినట్టు మిట్టల్ తెలిపారు. హైక్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వాట్సాప్ డిజిటల్ పేమెంట్ సర్వీసులు అందజేయడం కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ గతేడాది తీసుకున్న హఠాత్తు నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పలు పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మెసేజింగ్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ యాప్స్ కూడా పేమెంట్ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి.