pdsu leaders
-
జోరుగా పీడీఎస్ దందా!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): సివిల్ సప్లయి శాఖలో ఎన్ని సంస్కరణలు తెచ్చినా జిల్లాలో పీడీఎస్ దందా యథేచ్ఛగా సాగుతోంది. వాహనాల్లో తరలిస్తున్న, ఇంట్లో దాచి ఉంచిన బియ్యం బస్తాలను అధికారులు పట్టుకుంటున్నా.. ఈ అక్రమ వ్యాపారం మాత్రం పెరుగుతూనే వస్తోంది. ఇందుకు ఈ ఏడాదిలో పట్టుబడ్డ పీడీఎస్ బియ్యం, నమోదైన కేసులే నిదర్శనం. గడిచిన రెండేళ్లలో 100 కేసులు నమోదైతే ,ఈ ఏడాదిలోనే 96 పైగా కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన 4,869.38 క్వింటాళ్ల బియ్యం పట్టుకోవడం గమనార్హం. కేసుల పరంగా, పట్టుబడిన బియ్యం పరంగా చూసినా రెండేళ్లలో కంటే ఎక్కువగానే ఉన్నాయి. గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ–పాస్, బయోమెట్రిక్ విధానం రాకముందు తక్కువ కేసులు నమోదు కాగా, అమల్లోకి వచ్చిన తరువాత కేసులు ఎక్కువైయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ బియ్యం అక్రమ దందాను అరికట్టడానికి రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ విధానాన్ని 2017 నవంబర్‌లో అమలులోకి తెచ్చింది. దీంతో రేషన్ డీలర్ల చేతి వాటానికి దాదాపు అడ్డుకట్ట పడింది. అయితే కొన్ని చోట్ల రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ మెషిన్లు పని చేయడం లేదని, లబ్ధిదారుల బయోమెట్రిక్ వేలిముద్రలు రావడం లేదని సాకు చూపి అందిన కాడికి బియ్యాన్ని దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. లబ్ధిదారులు కూడా పీడీఎస్ బియ్యం పొంది వ్యాపారులకు రూ.10 నుంచి రూ.14 వరకు విక్రయిస్తున్నారు. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసే వ్యాపారులు ఎక్కువైయ్యారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన బియ్యంను రెండవ వ్యాపారికి, రెండవ వ్యాపారి నుంచి ప్రధాన వ్యాపారికి విక్రయిస్తున్నారు. ప్రధాన వ్యాపారి తన వద్దకు చేరిన పెద్ద మొత్తం పీడీఎస్ బియ్యంను ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తున్నారు. ఇలా క్షేత్ర స్థాయి నుంచి పెద్ద వ్యాపారమే కొనసాగుతోంది. ఈ వ్యాపారంపై పూర్తిస్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అవగాహన ఉన్నప్పటికీ కొన్ని కేసులపైనే దృష్టిసారించి పట్టుకుంటున్నారని, వారికి అనుకూలంగా ఉన్న వారి జోలికి పోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. నామమాత్రపు చర్యలు.. పైగా మంతనాలు జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా పెరుగుతుందడానికి చాలా కారణాలున్నాయి. 2016 సంవత్సరంలో పట్టుబడిన 58 కేసుల్లో 3171.09 క్వింటాళ్ల బియ్యం పట్టుకోగా, 2017లో 42 కేసులకు గాను 2002.76 క్వింటాళ్లు, అదే విధంగా 2018లో ఇప్పటి వరకు 96 కేసులకు గాను 4869.38 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఈ మూడేళ్లలో 196 కేసులకు గాను 10,004 క్వింటాళ్ల బియ్యంను పట్టుకుని 258 మందిపై (6ఏ) కేసు నమోదు చేయగా, రూ.7,55,000 జరిమానా విధించారు. అయితే పీడీఎస్ బియ్యం పట్టుబడిన వారికి తక్కువ శిక్ష, జరిమాన పడే విధంగా కేసును పట్టుకున్న వారే మంతనాలు జరుపుతున్నారే ఆరోపణలున్నాయి. అందుకే ఇది వరకే రెండు, మూడ్లు సార్లు పట్టుడిన కొంతమంది సులువుగా కేసు నుంచి తప్పించుకోవడం సాధ్యమైందని తెలుస్తోంది. పీడీఎస్ బియ్యం ప్రకారంగా అక్రమ వ్యాపారం చేసే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, జైలు శిక్షతో పాటు, భారీ మొత్తంలో జరిమానా విధించాల్సి ఉంటుంది. కానీ చిన్నపాటి చర్యలు, తక్కువ జరిమానాలు విధించడంతో పట్టుబడిన వారే మళ్లీ పీడీఎస్ బియ్యంతో వ్యాపారం చేస్తున్నారు. మచ్చుకు కొన్ని ఘటనలు.. గతేడాది మాక్లూర్‌లో పెద్ద ఎత్తున పట్టుడిన పీడీఎస్ బియ్యం కేసులో కేవలం రూ.50వేలు జరిమానా విధించి వాహనాన్ని సీజ్ చేశారు. అదే విధంగా గత ఏడాదితో పాటు ఈ ఏడాదిలో కూడా నిజామాబాద్ నగరంలో పీడీఎస్ బియ్యంతో పట్టుబడిన రెండు వాహనాలను సీజ్ చేసిన అధికారులు ఒకరికి రూ.45వేలు, మరొకరికి రూ.40వేలు జరిమానా విధించారు. -
చంద్ర బాబు రాయలసీమ ద్రోహి
ఆదోని అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీమ ప్రజలకు అన్యాయం చేసి ద్రోహిగా నిలిచారని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి బీవీ రమణ అన్నారు. గురువారం పట్టణంలోని జార్జిరెడ్డి భవన్లో రాయలసీమ సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రాజధాని పేరుతో అమరావతి పిచ్చి పట్టిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడిచినా సీమ ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కోస్తా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ రాయలసీమను గాలికి వదిలేయడం సిగ్గుచేటన్నారు. రాజధానిని సీమకు రాకుండా చేసి, విభజన హామీల్లో ప్రకటించిన కడపలో ఉక్కు పరిశ్రమ, కర్నూలులో హై కోర్టు ఏర్పాటు అంశాలను ప్రభుత్వాలు గాలికి వదిలేశాయన్నారు. జీఓ 69ని రద్దు చేయకుండా రాయలసీమ రైతాంగాన్ని బలితీసుకుంటున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీమలో విద్యాభిద్ధికి రూ.వంద కోట్లు, సీమ అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో నాయకులు నరేష్ ఆచారి, అంజి, రాము, మహేంద్ర, రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శాతవాహన వర్సిటీ వద్ద ఉద్రిక్తత
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వద్ద స్థానిక యువకులకు, కాలేజీ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ దగ్గర మనుధర్మ శాస్త్రాన్ని పీడీఎస్యు, డీఎస్యు, బీఎస్ఎఫ్ విద్యార్థులు తగులబెట్టారు. దీంతో ఈ సంఘాల విద్యార్థులు, స్థానిక యువకులు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నగర పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ అక్కడకు చేరుకుని కమలాసన్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఆయన వారితో మాట్లాడి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
20 రోజుల్లో 40 మంది విద్యార్థుల ఆత్మహత్య
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు 20 రోజుల్లో 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారిన నారాయణ, చైతన్య విద్యా సంస్థలను మూసివేస్తూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక మాదాల నారాయణస్వామి భవన్లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉందన్నారు. ర్యాంకుల కోసం, మార్కుల కోసం విద్యార్థులను మర యంత్రాలుగా మార్చేస్తున్నాయని విమర్శించారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేని విద్యార్థులు చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ, చైతన్య కాలేజీలకు చెందిన విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. ఇంటర్‌బోర్డు కార్పొరేట్ కాలేజీల జేబు సంస్థగా మారిందని విమర్శించారు. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నా, ఆదివారాలు, సెలవు రోజుల్లో తరగతులు కొనసాగిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం వారి తల్లిదండ్రులేనంటూ ప్రభుత్వం నివేదిక సమర్పించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని, ప్రొఫెసర్ నీరదారెడ్డి, చక్రపాణి కమిటీల సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ఎం.ధనరాజ్‌తో పాటు నాయకులు పాల్గొన్నారు. -
తెలంగాణ పేరుతో ఆర్టీసీ సేవలు ప్రారంభించాలి
నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 20రోజులు గడుస్తున్నా ఆర్టీసీలో మాత్రం ఇంకా ఏపీఎస్ఆర్టీసీ పేరుతో సేవలు కొనసాగడం సరికాద ని, వెంటనే తెలంగాణ పేరుతో సేవలు ప్రారంభించాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బస్టాండ్ ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. అనంతరం రీజినల్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా పీడీఎస్‌యూ నగర కార్యదర్శి ఎం. సుజి త్‌కుమార్ మాట్లాడుతూ.. అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రం ఏర్పడి ఇన్ని రోజులు గడుస్తున్నా ఆర్టీసీ లో మాత్రం ఇంకా ఏపీఎస్ఆర్టీసీ పేరుతో కార్యకలాపాలు కొనసాగించడం సరికాదన్నారు. వెంటనే ఏపీ పేరును తొలగించి, టీజీ ప్రారంభించాలన్నారు. బస్సులన్నింటికి ఆర్టీసీ గుర్తులో టీజీని చేర్చాలని కోరారు. వెం టనే అధికారులు నిర్లక్ష్యం వీడి టీజీ పేరుతో సేవలు ప్రారంభించాలన్నా రు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఉపాధ్యక్షులు ప్రశాంత్, అబ్బు, శేఖర్, నాయకులు సంత్, సాయికుమార్, సుమన్, కార్యకర్తలు పాల్గొన్నారు.