తెలంగాణ పేరుతో ఆర్టీసీ సేవలు ప్రారంభించాలి | to be start telangana name with rtc services | Sakshi
Sakshi News home page

తెలంగాణ పేరుతో ఆర్టీసీ సేవలు ప్రారంభించాలి

Published Thu, Jun 26 2014 4:07 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

తెలంగాణ పేరుతో ఆర్టీసీ సేవలు ప్రారంభించాలి - Sakshi

తెలంగాణ పేరుతో ఆర్టీసీ సేవలు ప్రారంభించాలి

నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 20రోజులు గడుస్తున్నా ఆర్టీసీలో మాత్రం ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీ పేరుతో  సేవలు కొనసాగడం సరికాద ని, వెంటనే తెలంగాణ పేరుతో సేవలు ప్రారంభించాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బస్టాండ్ ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. అనంతరం రీజినల్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా పీడీఎస్‌యూ నగర కార్యదర్శి ఎం. సుజి త్‌కుమార్ మాట్లాడుతూ.. అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రం ఏర్పడి ఇన్ని రోజులు గడుస్తున్నా ఆర్టీసీ లో మాత్రం ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీ  పేరుతో కార్యకలాపాలు కొనసాగించడం సరికాదన్నారు. వెంటనే ఏపీ పేరును తొలగించి, టీజీ ప్రారంభించాలన్నారు. బస్సులన్నింటికి ఆర్టీసీ గుర్తులో టీజీని చేర్చాలని కోరారు. వెం టనే అధికారులు నిర్లక్ష్యం వీడి టీజీ పేరుతో సేవలు ప్రారంభించాలన్నా రు.  కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఉపాధ్యక్షులు ప్రశాంత్, అబ్బు, శేఖర్, నాయకులు సంత్, సాయికుమార్, సుమన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement