peacefully
-
ప్రశాంతంగా పది పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విద్యార్థులు పరీక్ష రాశారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పరీక్ష రాయవలసిన అభ్యర్థులు 6,17,971 మంది కాగా 6,11,832 మంది (99.01 శాతం) హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి చెప్పారు. ఈసారి 26 జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో హడావుడి నెలకొంది. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఏర్పాటుచేయడం, వాటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించడంతో విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది సకాలంలోనే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్నిచర్‌తోపాటు మంచినీరు అందుబాటులో ఉంచారు. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈసారి అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కలిగేలా విస్తృతమైన ప్రచారం కల్పించింది. అన్ని పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లతో సహా ఎవరి ఫోన్లను అనుమతించలేదు. విద్యార్థులకు కూడా ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇయర్ఫోన్లు, బ్లూటూత్ వంటి డిజిటల్ పరికరాలను పూర్తిగా నిషేధించింది. ప్రతి కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక పోలీసు స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసింది. మొబైల్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్ల సంఖ్యను పెంచింది. లీక్‌లు, ఫేక్ ప్రచారాలు చేయకుండా ఈ చర్యలు అడ్డుకట్ట వేశాయి. ఎవరైనా ఎక్కడైనా లీక్ లేదా ఫేక్ ప్రశ్నపత్రాల ప్రచారం చేసినా వెంటనే పసిగట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సిద్ధం చేసింది. ప్రతి ప్రశ్నపత్రం మీద క్యూఆర్ కోడ్‌తో కూడిన రక్షణ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మాల్ ప్రాక్టీస్ కేసులు కూడా ఎక్కడా నమోదు కాలేదు. డిజిటల్‌గా పరీక్ష రాసిన దివ్యాంగ విద్యార్థులు అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఇన్‌క్లూజివ్ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు దివ్యాంగ (దృష్టిలోపం ఉన్న) విద్యార్థినులు డిజిటల్‌గా పరీక్ష రాశారు. ఈ పాఠశాలకు చెందిన ఎక్కలూరు దివ్యశ్రీ, పొలిమెర చైత్రిక, ఏకుల సౌమ్య, మేఖ శ్రీధాత్రి, ఉప్పర నాగరత్నమ్మ, చందుగారి పావని రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. వీరు డిజిటల్ విధానంలో కంప్యూటర్ ద్వారా స్క్రయిబ్ సహాయం లేకుండా పరీక్ష రాశారు. (చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!) -
ప్రశాంతంగా ముగిసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు
-
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గణేష్ నిమజ్జనాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా శుక్రవారం జీహెచ్ఎంసీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతోనే గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. మిగిలిన పండుగల కన్నా గణేష్ ఉత్సవాలు..నిమజ్జనాలు ప్రత్యేకంగా సాగుతాయన్నారు. అన్ని మతాలకు చెందిన వారు పరస్పర సహకరించుకుంటూ ఆనందంగా జరుపుకుంటారని చెప్పారు. పోలీసు, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విద్యుత్, ఇరిగేషన్, టూరిజం తదితర విభాగాలు సమన్వయంతో పనిచేసి గణపతి ఉత్సవాలను విజయవంతంగా సాగేలా చేశాయన్నారు. మెట్రో, ఎంఎంటిఎస్,ఆర్టీసీ మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాయని అభినందించారు. పరస్పర సహకారంతోనే.. గణేష్ నిమజ్జనాలు విజయవంతం అయ్యేందుకు జీహెచ్ఎంసీ అన్ని సందర్భాల్లోనూ మంచి సహకారం అందించిందని నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. నగర మౌలిక సదుపాయాల విషయంలో పరస్పర సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ప్రతి నిమిషం సమన్వయంతోనే నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేశామన్నారు. ప్రజలు కూడా సహకరించారని తెలిపారు. గతంలో కొన్ని ఇబ్బందులు కలిగాయని..ఈ సారి చిన్నపాటి అసౌకర్యం కూడా లేకుండా ప్రశాంతంగా ఉత్సవాలు ముగిశాయన్నారు. అన్ని విభాగాలు పూర్తి సహకారం.. గత నెలరోజులుగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడంతో జీహెచ్ఎంసీ నిమగ్నమైందని..అన్ని విభాగాలు పూర్తి సహకారం అందించాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ అన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. -
ఓటెత్తిన పల్లెలు !
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండో విడత జీపీల్లో శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఓట్లు వేసేందుకు పల్లె ప్రజలు ఉత్సాహం చూపారు. తొలి విడతతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. తొలి విడతలో 84.71 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ విడతలో 89.5 శాతంగా నమోదైంది. మొత్తంగా రెండో విడత పోలింగ్ సైతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ జిల్లాలోని పలు బూత్‌ల్లో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. 89.5 శాతం రెండో విడత ఎన్నికలు జిల్లాలోని ఏడు మండలాలు, 185 పంచాయతీల్లో జరిగాయి. ఈ సందర్భంగా 89.5 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, తొలి రెండు గంటల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తక్కువగానే వచ్చారు. ఇక 9 గంటల తర్వాత పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరిగింది. 9 నుంచి 11 గంటల వరకు ఏకంగా 68.98 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వికలాంగుల వెంట సహాయకులు తోడుగా ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ సమయం ముగియనుండగా చివరి గంటలో ఎక్కువ మంది బూత్‌లకు వచ్చారు. ఉత్సాహంగా.. ఓట్లు వేసేందుకు గ్రామాల్లో ప్రజలు ఉత్సహం చూపారు. ముందు నుంచి ప్రభుత్వం కూడా ఓటు హక్కుపై విస్తృతంగా ప్రచారం కల్పించడం.. గ్రామాల్లో అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు చేసిన కృషి ఫలించింది. ఉదయం కాస్తా పలుచగా కనిపించిన జనం సమయం దగ్గర పడుతున్న కొద్ది పోలింగ్ బూత్‌లకు ఎక్కువగా రావడం కనిపించింది. ఓటు హక్కు వినియోగించుకున్న 1,68,169 మంది రెండో విడతలో మొత్తం 1,68,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొ త్తం 1,88,845 ఓటర్లలో 1,68.169 మంది ఓటు వేశారు. దీంతో 89.5 శాతంగా పోలింగ్ నమోదైంది. కాగా, 1,88,845 మంది ఓటర్లలో 95,367 మంది పురుషులకు గాను 85,075 మంది, 93,478 మంది మహిళలకు గాను 83,094 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కట్టుదిట్టమైన భధ్రత జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయమైన టనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించిఛాయా ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించడం సత్ఫలితాలను ఇచ్చింది. కాగా, బందోబస్తు చర్యలను ఎప్పటికప్పుడు ఎస్పీ రెమారాజేశ్వరి పర్యవేక్షించారు. ఈ మేరకు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఘటనలు నమోదు కాకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. -
ఆర్కేనగర్ పోలింగ్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ నిమిత్తం ఉప ఎన్నిక నిర్వహించగా గురువారంతో పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయత్రం 5 గంటలకు ముగియగా 77.68 శాతం పోలింగ్ నమోదైంది. 2,28,234 మంది ఓటర్లు ఉండగా 51 పోలింగ్ కేంద్రాల పరిధిలో 258 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మధుసూదనన్ (అన్నాడీఎంకే), మరుదు గణేష్ (డీఎంకే), స్వతంత్ర అభ్యర్థి, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన చేపడతారు. అదే రోజు మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడుతాయని భావిస్తున్నారు. -
ముగిసిన తొలేళ్ల మహోత్సవం
-
ఐదువేల సంవత్సరాలు కలిసి బతికారు
టోక్యో: గత చరిత్ర మొత్తం కూడా సంఘర్షణలతో నిండుకొని రక్తపు సిరాతో రాయబడిందని చెప్తుంటారు. బలంకలవాడు బలహీనుడిని చిత్రహింసలు పెట్టి పెత్తనం చెలాయిస్తూ తన కుటుంబాన్ని సమాజాన్ని ప్రభావితం చేసే వ్యవస్థగా తయారుచేసుకున్నాడని కూడా చెప్తారు. ఈ క్రమంలోనే సమాజ నిర్మాణంలో, సంస్కృతి, సంప్రదాయాల్లో విభిన్న మార్పులు రావడం జరిగిందని, సమాజాల విచ్ఛిన్నతకు ప్రధాన కారణం యుద్ధాలవంటి ఘర్షణలే అని చెప్తారు. కానీ, ఒక్కసారి జపాన్‌లో క్రీస్తు పూర్వం కిందటి చరిత్ర చూస్తే మాత్రం పై విషయాలకు పూర్తి భిన్నం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేటగాళ్లంతా కూడా ఒకే సమాజంగా రూపొంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదువేల సంవత్సరాలపాటు కలిసి కట్టుగా జీవించారని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. జపాన్‌కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వం 14,500 నుంచి క్రీస్తు పూర్వం 300 వరకు ఉన్న చరిత్రను పరిశీలించారు. అందులో భాగంగా ఆ మధ్య కాలంలో జీవించి చనిపోయినవారి అవశేషాలను పరిశీలించారు. ఇందులో ముఖ్యంగా వారి ఎముకలపై ప్రశ్నలు జరపగా ఏ ఒక్కరికీ కూడా గాయాలు అయినట్లు బయటపడలేదు. ఇలా దాదాపు ఐదు వేల సంవత్సరాల కాలంలో లభించిన ఎముకలను పరిశీలించగా ఇలాంటి ఆధారాలే కనిపించాయి. ఆటవిక జీవితాన్ని అనుభవిస్తూ వేటపై ఆధారపడి జీవించే అప్పటి వారే ఎలాంటి ఘర్షణలకు దిగకుండా హాయిగా బతికేశారని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతోపాటు అప్పట్లోనే సమాజ సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా వారు జీవించారని కూడా చెప్తున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
హైదరాబాద్: చెదురుమదురు ఘటనలు మినహా మంగళవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలవరకు కొనసాగింది. గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగింది. సాయంత్రం ఐదు గంటలవరకు క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటింగ్‌లో పాల్గొనే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు 42.56 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ శాతానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సాయంత్రం 6.30 గంటలకు జీహెచ్ఎంసీ కమిషనర్ విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.