బంద్కు మేం కూడా మద్దతిస్తున్నాం
నిజామాబాద్: మున్సిపల్ కార్మికులకు మద్ధతుగా వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు తాము మద్ధతిస్తున్నామని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తమ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షం ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్ద పట్లోళ్ల సిద్ధార్థ్ రెడ్డి అన్నారు.
కాంట్రాక్టర్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చాలని అంటున్నారని ఆయన ఆరోపించారు. ఆయన నిర్ణయంతో ప్రజా నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో జలయజ్ఞం అద్భుతంగా సాగిందని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికుల బంద్కు తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.