Pediatric surgeon
-
ఫస్ట్ ఎయిడ్‌తో వేలకొద్దీ ప్రాణాలను కాపాడవచ్చు
ఫస్ట్ ఎయిడ్ గురించి కొద్దిపాటి అవగాహన ఉన్నా వేలకొద్దీ ప్రాణాలను కాపాడవచ్చు అంటున్నారు డాక్టర్ శివరంజని. హైదరాబాద్‌కు చెందిన ఈ పిడియాట్రీషియన్ పసిపిల్లల్లో, పెద్దల్లో వచ్చే హటాత్ అపస్మారకం, ఉక్కిరిబిక్కిరి, ఫిట్స్ సమయాల్లో ఎలా వ్యవహరిస్తే ప్రాణాలు నిలుస్తాయో గత దశాబ్దకాలంగా ఉచిత వర్క్‌షాపుల ద్వారా చైతన్యపరుస్తున్నారు. తన జీవితంలోని ఒక సంఘటన వల్లే లైఫ్ సేవింగ్ స్కిల్స్ అవసరాన్ని తెలుసుకున్నానని అంటున్నారామె. రాధిక (పేరు మార్చాం) హాల్లో టీవీ చూస్తోంటే బాత్రూమ్లోనుంచి ధబ్మని శబ్దం వచ్చింది. పరిగెత్తుకెళ్లి చూస్తే భర్త అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతనికి హార్ట్ఎటాక్ వచ్చినట్టు ఆమెకు అర్థమైంది. అదృష్టవశాత్తు నెల క్రితం ఆమె డాక్టర్ శివరంజని నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో సి.పి.ఆర్. ఎలా చేయాలో తెలుసుకుంది. వెంటనే ఛాతీ మీద నియమానుసారం నొక్కుతూ భర్తకు నోటితో ఊపిరి అందించింది. భర్తలో చలనం వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తే అతనికి వచ్చిన హార్ట్ఎటాక్ ప్రాణాంతకం కాకుండా కాపాడటంలో ఆమె చేసిన సి.పి.ఆర్ చాలా ముఖ్యపాత్ర పోషించిందని డాక్టర్లు తెలిపారు. ‘ఫస్ట్ ఎయిడ్ తెలిస్తే ఇలాగే ఎన్నోప్రాణాలు నిలుస్తాయి. ఆమె సాధారణ గృహిణి. సి.పి.ఆర్. ఎలా చేయాలో ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆమెకే కాదు.. ఆమెలాంటి గృహిణులకు స్త్రీలకు అందరికీ ఎవరో ఒకరు తెలపాలి. నా వంతుగా నేను వర్క్‌షాప్స్ ద్వారా తెలుపుతున్నాను’ అంటారు శివరంజని. పిల్లల డాక్టర్ డాక్టర్ శివరంజని పిల్లల డాక్టర్. ‘మా నాన్నగారు, తాతగారు కూడా డాక్టర్లే. నేను డాక్టర్ కావాలనుకున్నప్పుడు పిల్లలంటే ఇష్టం కనుక వారికి వైద్యం చేయడంలో ఆనందం ఉందనిపించింది. జిప్మర్ (పాండిచ్చేరి)లో పిల్లల వైద్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాను’ అన్నారు శివరంజని. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో పిల్లల డాక్టర్‌గా పని చేస్తున్నారు. అయితే కేవలం తన వృత్తిని పనిగా మాత్రమే చూడదలుచుకోలేదు. తనకు తెలిసిన జ్ఞానాన్ని సామాన్యులకు కొద్దిగానైనా అందుబాటులో తేవాలని అనుకున్నారు. ‘మన దగ్గర ప్రతి ఆరు మరణాల్లో ఒకటి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలియపోవడం వల్ల జరుగుతోంది. గుండెపోటు, మూర్ఛ, అపస్మారకం, ఊపిరాడకపోవడం ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఎలా చేయాలో అందరికీ శాస్త్రీయమైన శిక్షణ ఉంటే చాలా ప్రాణాలు కాపావచ్చు. అందుకే గత పదేళ్లుగా నేను ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ చైతన్యం తెస్తున్నారు’ అన్నారామె. మలుపు తిప్పిన ఘటన ‘నేను పాండిచ్చేరిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఒకరోజు ఉసిరి కాయలు తింటుంటే హటాత్తుగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నా పక్కనే సహ విద్యార్థిని ఉంది. ఆమెకు ఇలాంటి స్థితిలో చేయాల్సిన హైమ్లక్ మనూవా (ఉక్కిరిబిక్కిరి సమయంలో పొత్తికడుపు మీద నొక్కుతూ చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్) తెలుసు. వెంటనే చేసింది. ఆమె లేకున్నా, ఆ ఫస్ట్ ఎయిడ్ చేయకున్నా ఇవాళ మిగిలేదాన్ని కాదు. అప్పుడే నాకు ఫస్ట్ ఎయిడ్ విలువ ఏంటో తెలిసింది. కా6ఋ దురదృష్టం మన దేశంలో ఇందుకై సాధారణ ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వరు. అవగాహన కల్పించరు. కొద్దిమందికే ఈ అవగాహన ఉంటుంది. నా వంతుగా నేను వర్క్‌షాప్స్ ద్వారా అవగాహన కలిగిస్తున్నాను’ అన్నారు శివరంజని. పసిపిల్లలకు ‘చంటిపిల్లలు ఒక్కోసారి ఊపిరిపీల్చని స్థితికి వెళతారు. సి.పి.ఆర్ చేయడం తెలిసుంటే పిల్లల్ని కాపాడుకోగలుగుతారు తల్లులు. అలాగే వారు గొంతుకు అడ్డం పడేలా ఏదైనా మింగినప్పుడు కూడా ఏం చేయాలో తల్లులకు తెలియాలి. ఇవన్నీ నా వర్క్‌షాప్స్‌లో చూపిస్తాను. ఇందుకు బొమ్మలను ఉపయోగిస్తాను’ అన్నారు శివరంజని. ఇందుకోసం ఆమె నేరుగా ఆన్లైన్లో సెషన్స్ నిర్వహిస్తారు. ‘కాని చాలామంది తల్లులు సెషన్స్‌కు రారు. ఆ ఏముందిలే అనుకుంటారు. వారిని ఒప్పించి తేవడం కష్టం. అయినా నేను పట్టువిడవక ప్రయత్నిస్తాను. ఫోన్లు చేసి పిలుస్తాను. వాట్సప్ గ్రూప్ పెట్టి వెంటపడతాను’ అంటారు శివరంజని. డాక్టర్ శివరంజని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగుళూరులలో గత పదేళ్లలో 12 వేల మంది తల్లులకు, సాధారణ వ్యక్తులకు ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ నేర్పించారు. అంతేకాదు... సీజనల్‌గా అవసరమైన హెల్త్ అవేర్నెస్ కోసం వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి కృషి విలువైనది. ఇతర డాక్టర్లు అనుసరించాల్సినది. -
సీహెచ్సీల్లోనూ కోవిడ్ చికిత్స!
సాక్షి, అమరావతి: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి ఆస్పత్రులకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులకే కోవిడ్ చికిత్సలు పరిమితమయ్యాయి. మూడో వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇకపై సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కోవిడ్ చికిత్సలు అందించేలా వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 30 నుంచి 50 పడకల వరకూ ఉంటాయి. వీటిల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యుల బృందం ఉంటుంది. 18ఏళ్ల లోపు పిల్లలకు కోవిడ్ సోకినా ఇబ్బందులు తలెత్తకుండా సీహెచ్సీల్లోనూ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల బాధితులకు సత్వరమే సమీపంలోనే సేవలు అందనున్నాయి. 24 గంటలూ కరెంటు ఉండేలా చర్యలు చేపట్టారు. వెంటనే ఆస్పత్రికి చేరుకునేలా.. సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు కలిపి 50కిపైగా ఆస్పత్రులను కోవిడ్ చికిత్సకు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇవికాకుండా 10 ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఇంతకుముందు వీటిల్లో కోవిడ్ సేవలు అందించలేదు. కొత్తగా కోవిడ్ చికిత్స కోసం వీటిని సిద్ధం చేస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు సాధారణంగా నియోజకవర్గ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా తక్షణమే ఆస్పత్రికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆస్పత్రుల్లో కొత్తగా ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, వార్డుల పునరుద్ధరణ చేపట్టారు. కోవిడ్‌కు అవసరమైన మౌలిక వసతులను అన్నిటినీ ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్థంగా చికిత్స అందించేలా వసతులు కల్పిస్తున్నారు. పీడియాట్రిక్ వైద్యులు లేని చోట్ల తక్షణమే నాన్‌కోవిడ్ ఆస్పత్రులకు చెందిన పిల్లల వైద్యులను నియమిస్తారు. ఏ జిల్లాలో ఎక్కడ..? ► అనంతపురం: అనంతపురం సీడీహెచ్, గుత్తి, కల్యాణదుర్గం, మడకశిర, పెనుగొండ,ఉరవకొండ సీహెచ్‌సీలు ► తూర్పు గోదావరి: రంపచోడవరం, తుని (ఏరియా ఆస్పత్రి), అడ్డతీగల, చింతూరు, గోకవరం, పి.గన్నవరం, పెద్దాపురం, పత్తిపాడు, రాజోలు, ఏలేశ్వరం సీహెచ్‌సీలు ► గుంటూరు: చిలకలూరిపేట, సత్తెనపల్లి (ఏరియా ఆస్పత్రులు), ఫీవర్ ఆస్పత్రి ► ప్రకాశం: గిద్దలూరు,యర్రగొండపాలెం (ఏరియా ఆస్పత్రులు), డోర్నాల, కంభం సీహెచ్‌సీలు, ఎంసీహెచ్ ఒంగోలు ► చిత్తూరు: మహల్, పుత్తూరు, సత్యవేడు, వాయల్పాడు సీహెచ్‌సీలతో పాటు తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రి ► పశ్చిమ గోదావరి: భీమవరం,చింతలపూడి, నరసాపురం,పాలకొల్లు (ఏరియా ఆస్పత్రులు), కొవ్వూరు, నిడదవోలు సీహెచ్‌సీలు ► కృష్ణా: జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ (విజయవాడ), సీహెచ్‌సీ మైలవరం ► శ్రీకాకుళం: నరసన్నపేట, సీతంపేట ఏరియా ఆస్పత్రులు ► కడప: జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి (ఏరియా ఆస్పత్రులు), బద్వేల్, పోరుమామిళ్ల, వేంపల్లి, మైలవరం సీహెచ్‌సీలు ► కర్నూలు: బనగానపల్లి, ఆదోని, ఎమ్మిగనూరు సీహెచ్‌సీలు ► విశాఖపట్నం: అగనంపూడి (ఏరియా ఆస్పత్రి),చింతపల్లి, కోటపాడు, నక్కపల్లి, యలమంచిలి సీహెచ్‌సీలు -
'హృదయ' విదారకం
తాళ్లరేవు(ముమ్మిడివరం) : ప్రతి మనిషిలో గుండె ఎడమవైపున ఉంటుంది. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట గ్రామానికి చెందిన ఎనిమిది నెలల వయస్సుగల బాబుకి గుండె కుడివైపున ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.వివరాల్లోకి వెళితే.. చొల్లంగిపేట గ్రామానికి చెందిన కందెళ్ల శ్రీను వ్యవసాయం చేసుకుంటూ, ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి సొంత అక్క కూతురు దుర్గాదేవితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిది నెలల క్రితం ఒక బాబు జన్మించాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి ఊపిరి సరిగా అందకపోవడంతో తల్లిదండ్రులు ఇటీవల కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు గుండె కుడివైపున ఉందని, సర్జరీకి లక్షలో ఖర్చవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం చొల్లంగిపేట పంచాయతీలో జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో బాలుడిని చూపించారు. తాళ్లరేవు సీహెచ్‌సీ జనరల్ సర్జన్ ఎల్.గోపాలరావు అతడిని పరీక్షించి గుండె కుడివైపున ఉన్నట్టు నిర్ధారించారు. బాలుడి గుండెతోపాటు వెంట్రుకల్స్ సైతం సక్రమంగా లేకపోవడంతో భవిష్యత్‌లో రక్తం సరఫరా సక్రమంగా జరగకపోవచ్చని తెలిపారు.దీనికి హైదరాబాద్‌లోని నీలోఫర్, నిమ్స్, కామినేని, తిరుపతి రియా ఆస్పత్రులలో కార్డియాలజిస్ట్‌లు మాత్రమే శస్త్ర చికిత్సలు చేయగలరని, రూ.లక్షల్లో ఖర్చవుతుందన్నారు. తాళ్లరేవు సీహెచ్‌సీ ద్వారా కాకినాడ పిడియాట్రిక్ సర్జన్‌కు రిఫర్ చేయనున్నట్టు తెలిపారు. ఒకట్రెండు లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని, దీనికి మేనరికమే కారణంగా తెలుస్తోందని గోపాలరావు తెలిపారు. -
రాష్ట్రంలో పీడియాట్రిక్ సర్జన్ల కొరత
రాష్ట్రంలో పీడియాట్రిక్ సర్జన్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వంలోనే కాదు, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉన్న కొద్దిమందీ ప్రైవేటు ఆస్పత్రుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో చిన్నారులకు శస్త్రచికిత్సలు అందే పరిస్థితి లేకుండాపోయింది. మన రాష్ట్రంలో ఏటా 8 లక్షల పై చిలుకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో 3.80 లక్షలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరుగుతున్నట్టు ప్రభుత్వ అంచనా. చిన్న పిల్లలకు కనీసం ఐదేళ్ల వరకూ ఎలాంటి శస్త్రచికిత్సలైనా పీడియాట్రిక్ సర్జన్లే నిర్వహించాలి. అంటే మన రాష్ట్రంలో ఐదేళ్ల లోపు చిన్నారులు 30 లక్షల మందిపైనే ఉన్నారు. వీరిలో 20 లక్షల మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారే. వీరిలో 5 నుంచి 6 శాతం శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వాళ్లు వస్తున్నారు. కానీ, ఇక్కడ సర్జన్లు లేరు. సర్జన్ల కొరతతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలూ ఉన్నాయి. 30 లక్షల మందికి 10 మంది సర్జన్లా ఈ సంఖ్య వింటేనే వైద్య వర్గాల్లోనే కాదు సామాన్యులు కూడా నోరెళ్లపెట్టే పరిస్థితి. రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులకు ఏటా 20 లక్షల మంది చిన్నారులు వస్తూండగా అందుబాటులో ఉండే పీడియాట్రిక్ సర్జన్లు10 మంది మాత్రమే. అంటే, రెండు లక్షల మందికి కూడా ఒక డాక్టరు లేరు. అదే ఎండీ పీడియాట్రిక్ డాక్టర్లు మాత్రం 91 మంది ఉన్నారు. వీళ్లు కేవలం పిల్లవాడి జబ్బు నిర్ధారణ చేయగలరు గానీ, శస్త్రచికిత్స చేయరు. దీనికోసం పీడియాట్రిక్సర్జనే ఉండాలి. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళుతున్నారు. పీడియాట్రిక్ సర్జరీపై చాలామంది వైద్యులు ఆసక్తి చూపడం లేదు. ఎంసీహెచ్ పీడియాట్రిక్ అనేది సూపర్ స్పెషాలిటీ కోర్సు. పీజీ తర్వాత చేయాల్సి ఉంటుంది. పైగా చిన్నపిల్లల సర్జరీకి డిమాండ్ తక్కువ. అందుకే నీలోఫర్ లాంటి ఆస్పత్రిలో 5 ఎంసీహెచ్ సీట్లు ఉంటే కూడా ఒక్కోసారి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా ఈ ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ తీసుకున్నా కోర్సు పూర్తవగానే కార్పొరేట్ ఆస్పత్రులకు వెళుతున్నారు. వేతనాలు తక్కువని.. ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ సూపర్‌స్పెషాలిటీ కోర్సు. అయినా సరే పీజీ కోర్సు అయిన ఎండీ పీడియాట్రిక్ మీద ఆధారపడాలి. ఎండీలు సర్జరీకి చెబితేనే ఈయన చేయాలి. నేరుగా పేషెంట్లు వచ్చే పరిస్థితి ఉండదు. అదే జనరల్ సర్జనీ పీజీ కోర్సు అయినా పెద్దవాళ్లు వస్తారు. కానీ పిల్లల్లో ఎండీ చెబితేనే సర్జన్ వద్దకు వెళతారు. పైగా ప్రభుత్వంలో తక్కువ జీతాలు ఇస్తారు కాబట్టి పీడియాట్రిక్ సర్జన్లు మొగ్గుచూపరు. -డాక్టర్ ఫణిమహేశ్వరరెడ్డి, జనరల్ సర్జన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ