పీరీలను నిమజ్జనం చేసిన భక్తులు
ధర్మారం: ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో గురువారం మోహార్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ధర్మారం, మల్లాపూర్, ఎర్రగుంటపల్లి, మేడారం, దొంగతుర్తి తదితర గ్రామాలలోని హిందూ, ముస్లీంలు ఐక్యంగా వేడుకలను నిర్వహించారు. సాయంత్రం ఆయా గ్రామాలలో దర్గాల ఎదుట పీరీల వద్ద భక్తులు దూలాటలు ఆడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పీరీలను ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేశారు.