Peethala Sujata
-
పీతల సుజాతకు పొగరు,అహంకారం..
-
పవన్ పోరాడితే మా ఎంపీల మద్దతు: సుజాత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మంత్రి పీతల సుజాత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడువేల అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తూ ఆమె సంతకం చేశారు. నూతన రాజధాని అమరావతిని భ్రమరావతిగా విమర్శించడం సరికాదని మంత్రి సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. హోదాపై పవన్ పోరాడితే టీడీపీ ఎంపీలంతా మద్దతిస్తారని అన్నారు. -
సభకే తప్పుడు సమాచారం
మంత్రి పీతల సుజాతపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన కేసుల నమోదుపై గనులు, భూగర్భ శాఖ మంత్రి పీతల సుజాత సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్ చంద్రబోస్, డి.చిన్నగోవిందరెడ్డి ధ్వజమెత్తారు. శాసన మండలి మీడియా పాయింట్లో మంగళవారం వారు మాట్లాడుతూ.. ఇసుక తవ్వకాల్లో గతంలో జరిగిన అవకతవకలపై తీసుకున్న చర్యలేమిటని సభలో ప్రశ్న వేయగా.. రాష్ట్రంలో 2,727 కేసులు నమోదు చేసి రూ.22.39 కోట్ల మేర అపరాధ రుసుము వసూలు చేసినట్లు మంత్రి చెప్పారన్నారు. అయితే ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో మాత్రం 32,398 కేసులు నమోదు చేసి రూ.39 కోట్ల జరిమాన విధించినట్లు లిఖితపూర్వకంగా ఇచ్చారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో నలుగురు మంత్రులు, 36 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు జడ్పీ చైర్మన్లు, ముగ్గురు ఎంపీలకు ఇసుక మాఫియాతో సంబంధం ఉందని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పత్రికలో వార్తలు వచ్చాయని, సదరు ప్రజా ప్రతినిధుల పేర్లు సభలో చెప్పాలని డిమాండ్ చేసినప్పటికీ మంత్రి నుంచి సమాధానం రాలేదన్నారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి వేసిన పిల్‌పై హైకోర్టు స్పందిస్తూ అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు విశ్రాంత హైకోర్టు జడ్జి నేతృత్వంలో కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నించారు. -
పొంతనలేని సమాధానాలు!
-
శాఖలు ఖరారు
సాక్షి, ఏలూరు :రాష్ట్ర కేబినెట్లో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు బుధవారం శాఖలు కేటాయించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావుకు దేవాదాయ శాఖ, చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దక్కాయి. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవుల కేటాయింపు కత్తిమీద సామే అయ్యింది. ఆ పార్టీకి ఏకపక్షంగా పట్టం గట్టిన జిల్లా నుంచి ఎవరిని మంత్రులుగా చేయాలనే దానిపై తీవ్ర స్థాయిలో కసరత్తు జరిగింది. మాజీ మంత్రి సహా సీనియర్లు అమాత్య పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అన్నిటినీ మించి పార్టీకోసం ఆస్తులు అమ్ముకుని, అప్పులపాలై అధినేతకు అధికారాన్ని కట్టబెట్టే బాధ్యతను భుజాలకెత్తుకుని శ్రమించిన ఓ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందని అంతా ఎదురుచూశారు. అయినా సీనియర్లలో ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఈ పరిణామాలు జిల్లా టీడీపీ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కొత్త మంత్రుల ప్రాధాన్యతలేమిటోకొత్త మంత్రుల ప్రాధాన్యతలు ఏమిటనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. జిల్లాలో రెండు పంచారామ క్షేత్రాలతోపాటు ప్రసిద్ధి చెందిన ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వర క్షేత్రం ఉన్నాయి. భీమవరంలో మావుళ్లమ్మ ఆలయం, గుర్వాయిగూడెంలో మద్ది క్షేత్రం వంటి ప్రముఖ ఆలయూలు కూడా ఉన్నారుు. కొత్త రాష్ట్రంలో వీటిని మరింత అభివృద్ధి చేయడంతోపాటు వందలాది దేవాలయాల జీర్ణోద్ధరణకు దేవాదాయశాఖ మంత్రి కృషి చేయాల్సి ఉంది. అన్యాక్రాంతమవుతున్న దేవాదాయ ఆస్తులు, కబ్జాకు గురవుతున్న భూముల పరిరక్షణకు కొత్త మంత్రి కృషిచేస్తారని ప్రజలు ఆశపడుతున్నారు. జిల్లాలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ద్వారా అయినా అడ్డుకట్టపడాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకూ జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇకనైనా మహిళలు, చిన్నారుల కోసం సంక్షేమ భవనాలు, ప్రత్యేక వసతులు, రక్షణ ఏర్పాట్లు వస్తాయనే ఆశ ఉంది. ప్రజల ఆశలను, ఆకాంక్షలను కొత్త మంత్రులు ఏ మేరకు నెరవేరుస్తారో వేచిచూడాలి.