Pending file
-
ఎదురుచూపులు ఎన్నాళ్లు!
♦ బిల్లుల కోసం 2,977 మంది పడిగాపులు ♦ ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో ఎడతెగని జాప్యం ♦ ద్విసభ్య కమిటీ తేల్చినా నిధులివ్వని సర్కారు ♦ రెండునెలలుగా ప్రభుత్వం వద్ద ఫైలు పెండింగ్ ఈమె పేరు పంబల్ల శాంతమ్మ. యాచారం మండలం, నల్లవెల్లి. రెండున్నరేళ్ల క్రితం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. గోడలు స్లాబు లెవల్ వరకు లేచాయి. బిల్లు మాత్రం అందలేదు. రెండేళ్లుగా ఆమె బిల్లు కోసం ఎదురుచూస్తూనే ఉంది. రూఫ్ లేవల్ బిల్లు రూ.35 వేలకుపైగా రావాలి. ఇప్పటికే రూ.లక్షన్నర అప్పు చేశానని, బిల్లిస్తే ఇల్లు పూర్తి చేస్తానని చెబుతోంది శాంతమ్మ. పేదింటి కల సాకారం కాలేదు. ఇందిరమ్మ ఇళ్లకు ఇంకా మోక్షం కలగలేదు. అప్పులుచేసి ఈ పథకం కింద ఇళ్లు కట్టుకున్న బడుగులను ప్రభుత్వం కరుణించడంలేదు. ఇందిరమ్మ పథకంలో అక్ర మాలు జరిగాయని సీఐడీ దర్యాప్తు పేరిట కొన్నాళ్లు కాల యాపన చేసిన సర్కారు.. ఆ తర్వాత అర్హుల గుర్తింపు నెపంతో మరికొంత సమయాన్ని దాటవేసింది. ఆఖరికి ఈ క్రతువు ముగిసి రెండు నెలలైనా నిధులు విడుదల చేయకుండా ఫైలును పక్కనపడేసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లావ్యాప్తంగా వేలాది మంది పేదలు సొం తింటి కోసం పునాదులు వేశారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో ఈ లబ్ధిదారుల పేర్లు ఆన్లైన్లో గల్లంతయ్యాయి. ఇందిరమ్మ పథకం కింద బిల్లుల చెల్లింపులన్నీ ఆన్లైన్ ద్వారా జరుగుతాయి కనుక.. వీరికి ఇప్పటివరకు నయాపైసా అందలేదు. కనీసం వీరి ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయనే సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర నమోదు కాకపోవడంతో బిల్లులు చెల్లింపులకు సాంకేతిక సమస్య అడ్డొచ్చింది. అంతలోనే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు.. ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ పథకంలో బినామీలే ఎక్కువగా ఉన్నారని భావించిన ప్రభుత్వం.. కొత్త ఇళ్ల కేటాయింపులను రద్దు చేసింది. అప్పటికే వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు బిల్లుల చెల్లింపులను కూడా నిలిపివేసింది. 2,877 మంది ఎదురుచూపు 2013లో దాదాపు 3 వేల ఇందిరమ్మ గృహాలను ప్రభుత్వం మంజూరుచేసింది. వీటిలో 50శాతం ఇళ్లు పూర్తి కాగా, మిగతావి అసంపూర్తిగా ఉన్నాయి. అయితే, ఇందిరమ్మ పథకంలో అక్రమాలను వెలికితీసేంతవరకు బిల్లులు నిలిపివేయాలనే ప్రభుత్వ నిర్ణయం వీరికి ఆశనిపాతంగా మారింది. అప్పోసప్పో చేసి ఇళ్లను మొదలు పెట్టిన వారికి బిల్లులు రాకపోవడం వారిని ఆర్థికంగా దిగజార్చింది. చివరకు లబ్ధిదారుల మొర ఆలకించిన ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించేందుకు తహసీల్దార్, ఆర్డీఓ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి అర్హత నిర్ధారించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 2,877 ఇళ్ల శ్లాబ్‌లు పూర్తయినట్లు తేల్చాయి. వీటికి బిల్లులు చెల్లించాలని నిర్దేశించాయి. అదేసమయంలో 8,831 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారుల కమిటీ గుర్తించింది. ఈ క్రమంలో 2,877 ఇళ్లకు రూ.14 కోట్ల మేర బిల్లులు చెల్లించాలని సిఫార్సు చేస్తూ జిల్లా గృహనిర్మాణశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రెండు నెలల క్రితం ప్రభుత్వానికి చేరిన ఈ ఫైలుకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఇందిరమ్మ పథకం కింద పూర్తి చేసుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లిస్తామని పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేస్తున్నా.. నిధుల విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు సర్కారు కరుణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.40 వేల బిల్లు రావాలె.. రూ. 40 వేల బిల్లు రావాలి. ఇందిరమ్మ ఇళ్లు వచ్చిందన్న సంతోషమే కానీ ఇంటి నిర్మాణానికి అప్పే అయింది. రెండు సార్లు రూ.60 వేల వరకు బిల్లు వచ్చింది. మిగితా రూ.40 వేల కోసం నిత్యం మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. రవాణా చార్జీలే ఖర్చువుతున్నాయి కానీ పైసా బిల్లు మాత్రం రావడం లేదు. రూ.40 వేల బిల్లుఇస్తే ఇంటి నిర్మాణం కోసం తెచ్చి అప్పులకు వడ్డీలైనా చెల్లించుకుంటాం. - పి.లింగమ్మ, (తక్కళ్లపల్లి) యాచారం మండలం -
ఎట్టకేలకు ‘పుర’ ఫైళ్ల కదలిక
50కి పైగా ఆమోదించిన సీఎం జీహెచ్ఎంసీ సీఈ వీఆర్ఎస్ తిరస్కృతి హైదరాబాద్ : ముఖ్యమంత్రి కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పెండింగ్ ఫైళ్లకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు సోమవారం 50కి పైగా పెండింగ్ ఫైళ్లపై నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో సీఎంఓ నుంచి పురపాలక శాఖకు ఒకటీ రెండు ఫైళ్లు తిరిగి రావడం అరుదైన విషయంగా మారగా... ఒకేసారి 50 ఫైళ్లపై సీఎం సంతకాలు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరిశ్రమల స్థాపన కోసం భూ వినియోగ మార్పిడి అనుమతులు కోరుతూ టీఎస్-ఐపాస్‌కు వచ్చిన దరఖాస్తులతో పాటు పురపాలక శాఖలోని కొందరు అధికారుల పదోన్నతులు, బదిలీలు, వైద్య బిల్లుల చెల్లింపులు, కారుణ్య నియామకాలకు సంబంధించిన పదుల సంఖ్యలో ఫైళ్లు సీఎం ఆమోదం పొంది పురపాలక శాఖకు తిరిగి చేరుకున్నాయి. నిజామాబాద్‌కు మునిసిపల్ కమిషనర్.. ఆర్నెల్ల కిందటి ఓ ప్రతిపాదనకు మోక్షం లభించడంతో మంగళవారం నిజామాబాద్మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నాగేశ్వర్, అదనపు కమిషనర్‌గా విశ్వనాథంకు పోస్టింగ్ కేటాయిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలలుగా నాగేశ్వర్ పోస్టింగ్ లేక ఖాళీగా ఉన్నారు. ఆరేళ్ల కింద తల్లిదండ్రులిద్దరూ చనిపోగా అనాథగా మారిన యువతి ప్రియాంక కారుణ్య నియామకం కింద జల మండలిలో తండ్రి ఉద్యోగాన్ని త్వరలో పొందనున్నారు. దాదాపు ఏడాది నిరీక్షణ తర్వాత ఈ ఫైల్‌కు మోక్షం లభించింది. కొందరు ఉద్యోగుల వైద్య బిల్లుకు సంబంధించిన ైఫైళ్లు సైతం ఏడాది తర్వాతే ఆమోదం పొందాయి. ఇదిలా వుండగా, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇంతియాజ్ అహమ్మద్ స్వచ్ఛంద పదవి విరమణ కోసం నెల రోజుల కింద పెట్టుకున్న దరఖాస్తును సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ప్రభుత్వ సర్వీసులో కొనసాగాలని ఇంతియాజ్‌కు సూచించినట్లు సమాచారం. కొండలా పేరుకుని.. సీఎం సొంత శాఖల్లో పురపాలక, పట్టణాభివృద్ధి ఒకటి. సీఎం సంతకం కోసం పురపాలక శాఖ నుంచి వెళ్తున్న ఫైళ్లు సీఎంఓలోనే పేరుకుపోతుండడంతో పెండింగ్ ఫైళ్ల సంఖ్య వేలల్లో వుంది. వివిధ శాఖలకు సంబంధించి 6,500కు పైగా ఫైళ్లు పెండింగ్‌లో ఉండగా, అందులో సగం పురపాలక శాఖకు సంబంధించినవేనని సమాచారం. సీఎంఓలో పురపాలక శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు పెండింగ్ ఫైళ్ల విషయంలో చొరవ తీసుకోవడం లేదని విమర్శలున్నాయి. -
దర్జాగా దోచేశారు..
రైతుల వద్ద ఎకరా రూ.60 వేలకు కొని.. రూ. 6 లక్షలకు అమ్మకం! వివాదాస్పద భూముల ఏపీఐఐసీకి విక్రయం ఙ్ట్చఛగ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే ఇండస్ట్రియల్ పార్కుకు అప్పగింత మూడేళ్ల పెండింగ్ ఫైల్‌కు మూడు రోజుల్లోనే మోక్షం! చేతులు మారిన కోట్లాది రూపాయలు.. నష్టపోతున్న రైతులు మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న అక్రమ భూ దందా ఫైల్‌కు కొత్తరాష్ట్రంలో రెక్కలొచ్చాయి. ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న ఆ ఫైల్‌ను మూడురోజుల్లో క్లియర్ చేశారు. ‘సాక్షి’ హెచ్చరికలను, బాధిత రైతుల నుంచి ఫిర్యాదులను అందుకుంటూనే రెవెన్యూ అధికారులు మరో చేతితో వివాదాస్పద భూములను ఏపీఐఐసీకి కట్టబెట్టారు. రూ.కోట్లు చేతులు మారిన ఈ భూ దందా తెలంగాణ రాష్ట్రంలో తొలి అవినీతిగా గుర్తింపు పొందింది. అత్యంత గోప్యంగా...పక డ్బందీగా సాగిన ఈ వ్యవహారంపై అధికారులు ఎవ్వరూ నోరు మెదపటం లేదు. నంగునూరు తహశీల్దార్ దగ్గర నుంచి డీఆర్వో వరకు ప్రతి ఒక్కరూ తమకు తెలియదంటే తమకు తెలియదని చెప్తున్నారు. రైతుల నుంచి ఎకరాకు రూ. 60 వేలకు లోపే కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులు, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే ఇండస్ట్రీయల్ పార్కుగా మలిచి, ఎకరాకు రూ.6 లక్షల చొప్పున ఏపీఐఐసీకి అంటగట్టారు. తక్కువ ధరకే కొట్టేసి... నంగునూరు మండలం నర్మెట గ్రామ పంచాయతీ పరిధిలోని మైసంపల్లి మధిర గ్రామ శివారులోని భూములున్న రైతుల వద్ద 2006 - 2010 మధ్య కాలంలో సిద్దిపేటకు చెందిన ఓ వ్యాపారి దశలవారీగా పలువురు బినామీల పేర్లతో సర్వే నంబర్ 372 నుంచి 390 వరకు సుమారు 110 ఎకరాల వరకు కొనుగోలు చేశారు. ఈ భూముల్లో కోళ్ల ఫాంలు నిర్మిస్తామని, బోర్లు వేయించి వ్యవసాయం చేసేందుకు వీలుగా మార్చి, మళ్లీ భూములమ్మిన రైతులకే కౌలుకు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పారు. అప్పట్లో గ్రామానికి చెందిన రైతులు వేల్పుల నర్సింహులు, గోనెపల్లి తిరుపతి, చంద్రయ్య, రాములు, దమ్మక్కపల్లి మల్లేశం, కనుకవ్వ, సత్తవ్వ, నాగభూషణం, సోమిరెడ్డి మల్లారెడ్డి, అంజవ్వ, శ్రీనివాస్, శ్రీలతమ్మ, నర్సవ్వలతో పాటు పలువురు రైతుల వద్ద నుంచి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు రైతుల ఆవసరాలను బట్టి భూమికి ధర నిర్ణయించి కారు చౌకగా భూములు కొట్టేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించిఈ భూమిని అధిక ధరకు ఏపీఐఐసీకి అప్పగించేందుకు పథక రచన చేశారు. నమ్మించి ముంచిన పెద్దసార్లు తమ వద్ద భూములు కొని ఏళ్లు గడుస్తున్నా, బోర్లు వేయకపోవడంతో అనుమానం వచ్చిన రైతులు 2012లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు 2013 నవంబర్ 20న జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్, ఏపీఐఐసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సంధ్యారాణి, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, నంగునూరు తహశీల్దార్ బానోతు గీతతో కలసి స్థలాన్ని పరిశీలించారు. రైతులకు అన్యాయం జరిగిందని రెవిన్యూ సదస్సులో నిర్ధారించారు. రైతులకు న్యాయం జరిగిన తర్వాతే ఆ భూముల్లో ఇండస్ట్రీయల్ పార్క్‌గా నిర్మించాలని సూచించారు. అప్పటి నుంచి దీనికి సంబంధించిన ఫైల్ పెండింగ్ పడుతూ వస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జేసీ శరత్ ఈ ఫైల్‌ను కదిలించారు. వ్యాపారులకు అనుకూలంగా ఫైల్ తయారు చేసి జిల్లా కలెక్టర్ అనుమతి కోసం పంచారు. సరిగ్గా అదే సమయంలో ఈ అవినీతి వ్యవహారాన్ని పసిగట్టిన ‘సాక్షి’ ‘రియల్ మోసం’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దీంతో కొద్ది రోజులు ఓపికపట్టిన అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఫైల్‌ను క్లియర్ చేశారు. ఎకరాకు రూ.6 లక్షల చొప్పున 105 ఎకరాలను, ఎకరాకు రూ.5 లక్షల చొప్పున మరో ఐదు ఎకరాలను మొత్తం దాదాపు రూ 6.55 కోట్లకు ఏపీఐఐసీకి అప్ప