దర్జాగా దోచేశారు..
రైతుల వద్ద ఎకరా రూ.60 వేలకు కొని.. రూ. 6 లక్షలకు అమ్మకం!
వివాదాస్పద భూముల ఏపీఐఐసీకి విక్రయం
ఙ్ట్చఛగ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే ఇండస్ట్రియల్ పార్కుకు అప్పగింత
మూడేళ్ల పెండింగ్ ఫైల్‌కు మూడు రోజుల్లోనే మోక్షం!
చేతులు మారిన కోట్లాది రూపాయలు.. నష్టపోతున్న రైతులు
మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న అక్రమ భూ దందా ఫైల్‌కు కొత్తరాష్ట్రంలో రెక్కలొచ్చాయి. ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న ఆ ఫైల్‌ను మూడురోజుల్లో క్లియర్ చేశారు. ‘సాక్షి’ హెచ్చరికలను, బాధిత రైతుల నుంచి ఫిర్యాదులను అందుకుంటూనే రెవెన్యూ అధికారులు మరో చేతితో వివాదాస్పద భూములను ఏపీఐఐసీకి కట్టబెట్టారు. రూ.కోట్లు చేతులు మారిన ఈ భూ దందా తెలంగాణ రాష్ట్రంలో తొలి అవినీతిగా గుర్తింపు పొందింది. అత్యంత గోప్యంగా...పక డ్బందీగా సాగిన ఈ వ్యవహారంపై అధికారులు ఎవ్వరూ నోరు మెదపటం లేదు. నంగునూరు తహశీల్దార్ దగ్గర నుంచి డీఆర్వో వరకు ప్రతి ఒక్కరూ తమకు తెలియదంటే తమకు తెలియదని చెప్తున్నారు. రైతుల నుంచి ఎకరాకు రూ. 60 వేలకు లోపే కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులు, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే ఇండస్ట్రీయల్ పార్కుగా మలిచి, ఎకరాకు రూ.6 లక్షల చొప్పున ఏపీఐఐసీకి అంటగట్టారు.
తక్కువ ధరకే కొట్టేసి...
నంగునూరు మండలం నర్మెట గ్రామ పంచాయతీ పరిధిలోని మైసంపల్లి మధిర గ్రామ శివారులోని భూములున్న రైతుల వద్ద 2006 - 2010 మధ్య కాలంలో సిద్దిపేటకు చెందిన ఓ వ్యాపారి దశలవారీగా పలువురు బినామీల పేర్లతో సర్వే నంబర్ 372 నుంచి 390 వరకు సుమారు 110 ఎకరాల వరకు కొనుగోలు చేశారు. ఈ భూముల్లో కోళ్ల ఫాంలు నిర్మిస్తామని, బోర్లు వేయించి వ్యవసాయం చేసేందుకు వీలుగా మార్చి, మళ్లీ భూములమ్మిన రైతులకే కౌలుకు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పారు. అప్పట్లో గ్రామానికి చెందిన రైతులు వేల్పుల నర్సింహులు, గోనెపల్లి తిరుపతి, చంద్రయ్య, రాములు, దమ్మక్కపల్లి మల్లేశం, కనుకవ్వ, సత్తవ్వ, నాగభూషణం, సోమిరెడ్డి మల్లారెడ్డి, అంజవ్వ, శ్రీనివాస్, శ్రీలతమ్మ, నర్సవ్వలతో పాటు పలువురు రైతుల వద్ద నుంచి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు రైతుల ఆవసరాలను బట్టి భూమికి ధర నిర్ణయించి కారు చౌకగా భూములు కొట్టేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించిఈ భూమిని అధిక ధరకు ఏపీఐఐసీకి అప్పగించేందుకు పథక రచన చేశారు.
నమ్మించి ముంచిన పెద్దసార్లు
తమ వద్ద భూములు కొని ఏళ్లు గడుస్తున్నా, బోర్లు వేయకపోవడంతో అనుమానం వచ్చిన రైతులు 2012లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు 2013 నవంబర్ 20న జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్, ఏపీఐఐసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సంధ్యారాణి, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, నంగునూరు తహశీల్దార్ బానోతు గీతతో కలసి స్థలాన్ని పరిశీలించారు. రైతులకు అన్యాయం జరిగిందని రెవిన్యూ సదస్సులో నిర్ధారించారు. రైతులకు న్యాయం జరిగిన తర్వాతే ఆ భూముల్లో ఇండస్ట్రీయల్ పార్క్‌గా నిర్మించాలని సూచించారు. అప్పటి నుంచి దీనికి సంబంధించిన ఫైల్ పెండింగ్ పడుతూ వస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జేసీ శరత్ ఈ ఫైల్‌ను కదిలించారు. వ్యాపారులకు అనుకూలంగా ఫైల్ తయారు చేసి జిల్లా కలెక్టర్ అనుమతి కోసం పంచారు. సరిగ్గా అదే సమయంలో ఈ అవినీతి వ్యవహారాన్ని పసిగట్టిన ‘సాక్షి’ ‘రియల్ మోసం’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దీంతో కొద్ది రోజులు ఓపికపట్టిన అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఫైల్‌ను క్లియర్ చేశారు. ఎకరాకు రూ.6 లక్షల చొప్పున 105 ఎకరాలను, ఎకరాకు రూ.5 లక్షల చొప్పున మరో ఐదు ఎకరాలను మొత్తం దాదాపు రూ 6.55 కోట్లకు ఏపీఐఐసీకి అప్ప