Penicillin
-
పొంచి ఉన్న కోవిడ్ జేజమ్మ!
‘కోవిడ్–19 మానవాళిని మూడేళ్లు మాత్రమే ఇబ్బందులకు గురి చేసింది. దీనికి జేజమ్మలా తయారైంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎమ్మార్). ఇది భవిష్యత్‌లో మానవాళిని నిరంతరం ఇబ్బందులకు గురి చేయనుంది. దీనివల్ల భవిష్యత్‌లో ప్రపంచం తీవ్రమైన గడ్డు పరిస్థితిని చవిచూడబోతున్నాం’ అని ఇండియన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ చైర్మన్ డాక్టర్ బుర్రి రంగారెడ్డి హెచ్చరించారు. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే ప్రజలు యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వినియోగం తగ్గించాలని సూచించారు. వీటిని వైద్యుల సూచనలు లేకుండా సొంతంగా వినియోగించకూడదని స్పష్టం చేశారు. వైద్యులు సైతం క్లినికల్ పరీక్షల అనంతరం,, వ్యాధి నిర్ధారణ అయ్యాక ప్రోటోకాల్స్ ప్రకారమే యాంటీబయోటిక్స్‌ను చికిత్స కోసం వాడాలన్నారు. కంటికి కనిపించకుండా చాపకింద నీరులా మానవ ఆరోగ్యానికి పెను విపత్తుగా మారుతున్న ఏఎమ్మార్ నియంత్రణ, ప్రజలు, వైద్యులు పాటించాల్సిన జాగ్రత్తలను ‘సాక్షి’తో రంగారెడ్డి పంచుకున్నారు. ఆయన భారత, ఏపీ ఏఎమ్మార్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనలో సలహాదారుగా ఉన్నారు. ఏఎమ్మార్పై రంగారెడ్డి ఏమంటున్నారంటే.. –సాక్షి, అమరావతిటాప్–10లో ఇదే ప్రధానం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టిన పెన్సిలిన్ ఇంజెక్షన్ 1940 దశకంలో వినియోగంలోకి వచ్చింది. ఇది ఆరోగ్య రంగం, రోగుల సంరక్షణలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. అనంతరం రకరకాల యాంటీబయోటిక్స్ తయారీ ఊపందుకుంది. వీటివల్ల సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే అనేకానేక ఇన్ఫెక్షన్లను నయం చేస్తూ బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తూ వైద్య రంగం ముందుకు వెళ్లింది. పెన్సిలిన్ కనుగొన్న సమయంలోనే దీన్ని విచ్చలవిడిగా వినియోగిస్తే బ్యాక్టీరియాలో ఒకరకమైన నిరోధకత పెరిగి మనం ఇచ్చే ఏ మందులకు పని చేయకుండా సూపర్ బగ్స్‌గా మారతాయని అలెగ్జాండర్ హెచ్చరించారు. వైద్యులు, ప్రజలు లెక్కలేనితనంతో విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్‌ని వినియోగించడంతో ఏఎమ్మార్ సమస్య ఉత్పన్నం అవుతోంది.ప్రపంచ ప్రజారోగ్య రంగంలో ఎదుర్కొంటున్న టాప్–10 సమస్యల్లో ఏఎమ్మార్ ప్రధానమైందని డబ్ల్యూహెచ్‌వో సైతం హెచ్చరించింది. అతిగా యాంటీబయోటిక్స్ వినియోగంతో మనుషుల్లో సూపర్ బగ్స్ పెరిగిపోతున్నాయి. దీంతో 80 శాతం యాంటీబయోటిక్స్ పనిచేయడం లేదని ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వో తేల్చాయి.అడ్వాన్స్డ్ డ్రగ్స్ సైతం 10 మందికి ఇస్తే అందులో 9 మందిలో పనిచేయడం లేదు. సెప్సిస్ వంటి జబ్బులు వచి్చనప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయక చేతులు ఎత్తేసే పరిస్థితులు చూస్తున్నాం.యాక్షన్ ప్లాన్‌ను ఆచరణలో పెట్టాలి2016లో డబ్ల్యూహెచ్‌వో ఏఎమ్మార్‌ను విపత్తుగా పరిగణించి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దానికి అనుగుణంగా 2022లో యాక్షన్ ప్లాన్‌ను రూపొందించిన నాలుగో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రస్తుత రోజుల్లో ఏదైనా జబ్బు చేస్తే వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఒకటి రెండు రోజుల్లో నయమవ్వాలని ప్రజలు భావిస్తున్నారు. వైద్యులపై ఒత్తిడి తెచ్చి యాంటీబయోటిక్స్ రాయించుకుంటున్న వారు ఉంటున్నారు. లేదంటే ఆ వైద్యుడిని పనికిమాలిన వాడికింద లెక్కగడుతున్నారుమరికొందరైతే వైద్య పరీక్షలు దండగని భావించి.. నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి ఫార్మాసిస్ట్ ఇచి్చన యాంటీబయోటిక్స్ వేసుకుంటున్నారు. ఈ చర్యలతో తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని వారే పాడుచేసుకుంటున్నారు. చనిపోతామని తెలిసి ఏ వ్యక్తిని కావాలనే విషాన్ని కొనుక్కుని తినడు. యాంటీబయోటిక్స్ విషయంలోనూ ప్రజలు అదే విధంగా ఆలోచించాలి. రోగులు, ప్రభుత్వాలపై ఆర్థిక భారం ఏఎమ్మార్‌ను అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వాలు, వైద్యులు పరిగణించాలి. లేదంటే ప్రజారోగ్య వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ప్రజలు, దేశాలు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తుంది. గతంలో చాలా పెద్దపెద్ద జబ్బలకు పెన్సిలిన్, సల్ఫర్ డ్రగ్ ఇస్తే మూడు నుంచి నాలుగు రోజుల్లో రోగి కోలుకుని ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం చాలా సందర్భాల్లో అవి పనిచేయకపోవడంతో ఒక డోస్, రెండో డోస్ అని డోస్‌ల మీద డోస్‌లు యాంటీబయోటిక్ మందులు వాడాల్సి వస్తోంది. దీంతో రోగులు, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. చికిత్సా సమయం పెరుగుతోంది. ఒక రోగాన్ని తగ్గించడం కోసం యాంటీబయోటిక్స్‌ను డోస్‌ల మీద డోస్‌లు ఇవ్వడం శరీరంలో మరో సమస్యకు దారితీస్తోంది. జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా నిరీ్వర్యమై, జీర్ణకోశ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. -
ఏపీలో అరబిందో ప్లాంటు సిద్ధం
హైదరాబాద్: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెన్–జి (పెన్సిలిన్) ప్లాంటు ఏప్రిల్‌లో ట్రయల్ రన్‌కు సిద్ధం అయింది. జూన్‌లోగా వాణిజ్యపరంగా తయారీ కార్యకలాపాలు మొదలవుతాయని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి వెల్లడించారు. పెన్సిలిన్–జి ధర విషయంలో చైనాతో పోటీపడాలన్నది తమ లక్ష్యం అని చెప్పారు. పూర్తిగా దేశీయంగా పెన్సిలిన్ ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. ఏటా 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,400 కోట్లు వెచి్చస్తోంది. ఈ ప్లాంటు జూలై–సెపె్టంబర్ కాలంలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోనుంది. 80–90 శాతం పెన్సిలిన్‌ను కంపెనీ దేశీయంగా విక్రయించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద పెన్సిలిన్ ప్లాంటు ఆమోదం పొందింది. మరో రూ.1,000 కోట్లు.. అరబిందో ఫార్మా 8–10 ప్లాంట్ల ఏర్పాటుకు గడిచిన మూడు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు ఖర్చు చేసింది. వచ్చే రెండేళ్లలో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడి చేయనుంది. చైనాలో ఏర్పాటు చేస్తున్న ఓరల్ సాలిడ్స్ తయారీ ప్లాంటులో వచ్చే త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సంస్థ సీఎఫ్‌వో శాంతారామ్ సుబ్రమణియన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరబిందో టర్నోవర్ 3.4–3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాగా పేర్కొన్నారు. డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో టర్నోవర్ 2.6 బిలియన్ డాలర్లు నమోదైంది. అరబిందో ప్రస్తుతం అంటువ్యాధుల విభాగంలో ఐదు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైంది. సంస్థ ఖాతాలో 25 తయారీ, ప్యాకింగ్ కేంద్రాలు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న 10 ప్లాంట్లు ఒకట్రెండేళ్లలో కార్యరూపం దాల్చనున్నాయి. -
వెయ్యేళ్లకొక్కడు
‘అలాంటి వారు వేయేళ్లకు ఒకరు పుడతారు! ఎంతో విస్తృతీ, ప్రయోజనమూ ఉన్న ఆవిష్కరణలను అందించిన అలాంటి వ్యక్తి, ఇంతవరకు నమోదైన 5,000 ఏళ్ల జీవశాస్త్ర, వైద్యశాస్త్ర చరిత్రలలో మరొకరెవరైనా ఉంటారన్నా కూడా అనుమానమే.’ సీసీఎంబీ ఒకప్పటి సంచాలకుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త పీఎం భార్గవ రాసిన ఒక వ్యాసంలోని వాక్యాలివి. అంతకంటే చాలా ముందే, అమెరికా జర్నలిస్ట్ డొరొన్ కె. ఎంట్రిమ్ ఆ ‘వ్యక్తి’ గురించే ఒక వ్యాసంలో ఇంకో గొప్ప మాట అన్నారు. ఈ వ్యాఖ్యతోటే ఆ ‘వ్యక్తి’ ఎవరో కూడా మనకు తెలుస్తుంది. ‘ఎల్లాప్రగడ సుబ్బారావు గురించి మనకి తెలియకపోవచ్చు. కానీ ఆయన జీవించాడు కనుక మనం హాయిగా బతుకుతున్నాం. ఇక ముందు కూడా జీవిస్తాం.’ నిజమే, ఆయన గురించి మనకి ఎంతో కొంత మాత్రమే తెలిసి ఉండవచ్చు. లేదా ఏమీ తెలియకపోవచ్చు. కానీ కేన్సర్ చికిత్సలో ఉపయోగించేందుకు మెథోట్రెక్సేట్‌ను అభివృద్ధి చేసినవారాయన. మానవ శరీరంలోని కణాలకు శక్తినిచ్చేది ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) అని కనుగొన్నది ఆయనే. ఫైలేరియాకు హెట్రాజన్ కనుగొన్నదీ ఆయనే. ఆయన కనుగొన్న, ఆయన పర్యవేక్షణలో వెలువడిన (ఆరోమైసిన్) రోగ నిరోధకాలు పెన్సిలిన్ కంటే ఎంతో శక్తిమంతమైనవి. ఆయన కనిపెట్టిన ఫోలిక్ యాసిడ్, స్ప్రూ మందులు నేటికీ మానవాళికి ఉపయోగపడుతున్నాయి. ఎల్లాప్రగడ (1895–1948) వైద్యశాస్త్రానికీ, జీవ రసాయనిక శాస్త్రానికీ చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోయాయి. ఈ క్షణాన కూడా ఆయన ఆవిష్కరణలతో ప్రయోజనం పొందుతున్న ప్రపంచం మాత్రం ఆ పేరును విస్మరించింది. ఇంత విషాదం మరొక శాస్త్రవేత్త జీవితంలో కనిపించకపోవచ్చు. ప్రపం^è ప్రఖ్యాత శాస్త్రవేత్తలంతా ఒక ఆవిష్కరణకే పరిమితం కావడం సాధారణం. దానికే గొప్ప కీర్తిప్రతిష్టలు దక్కుతాయి. నోబెల్ లేదా తత్సమానమైన పురస్కారాలు వచ్చి పడతాయి. ఎక్స్‌రేను అందించిన విల్హెల్మ్ రొయింటెన్, రేడియంను కనుగొన్న మేడం క్యూరీ, ద్రవాల ద్వారా జరిగే కాంతి విచ్ఛిత్తి గురించి చెప్పిన సీవీ రామన్, కాస్మిక్ కిరణాలను కనుగొన్న పీఎంఎస్ బ్లాకెట్, మలేరియా పరాన్నజీవి పరిణామం గురించి చెప్పిన రొనాల్డ్ రాస్ (ఈయన సికింద్రాబాద్‌లో ఉన్నప్పుడే ఆ పరిశోధన చేశారు), పెన్సిలిన్‌ను కనుగొన్న అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వంటివారంతా ఒక ఆవిష్కరణతోనే విఖ్యాతులయ్యారు. వీరందరినీ నోబెల్ పురస్కారం వరించింది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, సాపేక్ష సిద్ధాంతం), జాన్ బార్డీన్ (ట్రాన్సిస్టర్స్, సూపర్ కండెక్టివిటీ), హరగోవింద్ ఖురానా (జెనిటిక్ కోడ్, సింథసిస్ ఆఫ్ జీన్) రెండు ఆవిష్కరణలు చేసి నోబెల్ పురస్కారాలు అందుకున్నవారు. ఒక్క రంగానికే పరిమితమైనా ఎన్నో ఆవిష్కరణలు చేసిన రాబర్ట్ ఉడ్‌వార్డ్ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) కూడా ఉన్నారు. ఆయనకూ నోబెల్ పురస్కారం వచ్చింది. మరోవైపున చూస్తే– నేటికీ ప్రపంచ ప్రజల అవసరాలను తీరుస్తున్న ఆవిష్కరణలను అందించిన శాస్త్రవేత్తలు కొందరు ఉన్నారు. ఏ విధమైన పురస్కారం కూడా వీరి జోలికి రాలేదు. మొదటిసారి పోలియో వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్త జొనాస్ సాల్క్. ఆధునిక ఇమ్యూనాలజీకి పిత వంటివారు మైఖేల్ హీడల్బెర్గర్. మన శరీరంలో పుష్కలంగా ఉండే ప్రొటీన్ కొలాజిన్. దాని ఆకృతి గురించి చెప్పినవారు జీఎన్ రామచంద్రన్. సీటీ స్కాన్ వంటి సాంకేతిక పద్ధతులకు పునాదులు వేసిన వారు కూడా ఆయనే. కానీ వీరికి ఎలాంటి పురస్కారం దక్కలేదు. వీరందరికీ అతీతుడు. ప్రపంచ శాస్త్ర విజ్ఞాన పటాన్నీ, మానవాళి జీవితాలనూ మార్చినవాడు, అన్నీ వదులుకుని పాతికేళ్ల పాటు అనేక ఆవిష్కరణల కోసం శ్రమిస్తూ జీవితాన్ని ధారపోసినవాడు ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆయన పేరు మాత్రం చాలా పొదుపుగా వినిపిస్తుంది. విశాల ప్రపంచానికీ, అందులోని బాలలకీ ఇతోధికంగా ఉపయోగపడుతుంది కాబట్టి పోలియో వ్యాక్సిన్ మీద పేటెంట్ హక్కును సాల్క్ ఐచ్ఛికంగా వదలుకున్నారని చెబుతారు. కానీ ఎల్లాప్రగడ అసలు పేరు ప్రఖ్యాతలనే ఆశించలేదు. తన ఆవిష్కరణ గురించి చెప్పేందుకు పత్రికల వారి సమావేశం ఏర్పాటు చేస్తే, ఆయన ప్రేక్షకుల మధ్య ఎక్కడో కూర్చునేవారు. ఎవరో ఒకరు బలవంతంగా వేదిక మీదకు నెట్టవలసి వచ్చేది. ఆవిష్కరణలపై శాస్త్రవేత్తలు పేటెంట్ ప్రకటించుకోవడం సర్వ సాధారణం. ఎల్లాప్రగడకు అలాంటి ఆలోచన ఉన్నట్టు కూడా అనిపించదు. బాల్యం నుంచీ పేదరికం. అనారోగ్యం. అమెరికా వెళ్లినా తప్పని అర్ధాకలి. ఒంటరి జీవితం. హార్వర్డ్‌లో చదువుతున్నా పక్క ఆస్పత్రులలో ప్యాన్లు కడుగుతూ ఆర్జన చేసుకున్నారాయన. వీటన్నిటికీ మించి వర్ణ వివక్ష చేసిన ఘోరమైన గాయం. కానీ ఒక మహోన్నత శాస్త్రవేత్తగా ఎల్లాప్రగడ ఎదగడానికి, ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఇవేమీ ఆటంకం కాలేదు. ఆయన జీవన ప్రస్థానం, ఆయన ఆవిష్కరణలు, ప్రస్తుతం అవి ప్రపంచ మానవాళికి రక్షణ కవచాలుగా నిలిచిన తీరు అద్భుతమనిపిస్తాయి. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరం (నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ)లోనే ఎల్లాప్రగడ జన్మించారు. జగన్నాథం, వెంకమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో నాలుగో సంతానం. జగన్నాథం మధ్యలోనే ప్రభుత్వోద్యోగం వదిలేశారు. కారణం– అనారోగ్యం. సంపాదించుకున్నది కూడా ఏమీలేదు. అలాంటి సమయంలో ఎల్లాప్రగడ ఇంటి నుంచి పారిపోదామని ప్రయత్నించి, నిడదవోలు దగ్గరే దొరికిపోయారు. తరువాత తల్లి పట్టుపట్టి కొడుకును రాజమండ్రిలో చేర్పించారు. అక్కడ నుంచి మద్రాస్ వెళ్లి హిందూ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ చేశారు. పరీక్షలు రెండు మాసాలు ఉన్నాయన గా, పెద్ద పరీక్ష ఎదురైంది. అప్పటికే ఇద్దరు సోదరులు మరణించారు. ఇప్పుడు తండ్రి. మద్రాస్ నుంచి ఇంటికొచ్చిన కొడుకును మళ్లీ పంపడానికి ఆ తల్లి తన ఒంటి మీదున్న కొద్దిపాటి బంగారం అమ్మించారు. ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్ చదివాక, మద్రాస్ వైద్య కళాశాలలో చేరారు. రాజమండ్రిలో ఉండగా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి సంస్కరణ ల ధోరణినీ, వందేమాతరం ఉద్యమం వేడినీ చూసిన ఎల్లాప్రగడ విదేశీ వస్త్ర బహిష్కరణ కోసం గాంధీ ఇచ్చిన పిలుపునకూ స్పందించారు. ఖద్దరుతో ఆపరేషన్ థియేటర్లో కనిపించారు. ఇదే జీవితం మీద తొలిదెబ్బ అవుతుందని ఆయన ఊహించలేదు. సర్జరీ ప్రొఫెసర్ ఎంసీ బ్రాడ్‌ఫీల్డ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పరీక్ష బాగా రాసినా ఎల్లాప్రగడకు పూర్తి స్థాయిలో ఎంబీబీఎస్ పట్టా ఇవ్వనివ్వలేదు. ఎల్ఎంఎస్ సర్టిఫికెట్తో సరిపెట్టారు. మద్రాస్ మెడికల్ సర్వీస్‌లో చేరడానికి ఇది ఆటంకమైంది. అందుకే డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారి(ఎల్లాప్రగడ అమెరికా వెళ్లడానికి ముందు అతిసారకు గురయ్యారు. ఇంగ్లిష్ మందు పనిచేయలేదు. అప్పుడు ఆ వ్యాధి నుంచి ఆయనను బయటపడవేసినది ఈయనే) ఆయుర్వేద కళాశాలలో అనాటమీ అధ్యాపకునిగా చేరారు. ఆయుర్వేద ఔషధాలలోని రోగ నిరోధక లక్షణం ఆయనను ఎంతో ఆకర్షించింది. అందుకే కొత్త పద్ధతులను మేళవించి పరిశోధన ప్రారంభించారు. ఇంతలోనే హార్వర్డ్ మెడికల్ కళాశాలలో ఉష్ణమండల రుగ్మతల విభాగం నుంచి పిలుపు వచ్చింది. మల్లాడి సత్యలింగనాయకర్ చారిటీస్ (కాకినాడ) వారి సాయం కూడా అందింది. హార్వర్డ్‌లో డిప్లొమా పొంది అక్కడే అధ్యాపకుడయ్యారు. కానీ తాత్కాలికోద్యోగమే. వైద్య పరిశోధనలో ఎల్లాప్రగడ ప్రతిభ ఎంతటిదో మొదట రుజువైనది ఇక్కడే. కానీ ఆయన ఆవిష్కరణల, పరిశోధనల వివరాలకు వెలుగులోకి రాకుండా కుట్ర జరిగింది కూడా ఇక్కడే. శరీరంలో ఉండే ద్రవాలు, ధాతువులలో భాస్వరం ఎంత ఉందో అంచనా వేసే విధానాన్ని ఇక్కడే సైరస్ హార్ట్వెల్ ఫిస్కే అనే మరో శాస్త్రవేత్తతో కలసి ఎల్లాప్రగడ కనుగొన్నారు. ఇదే ఎల్లాప్రగడ పేరును 1930లో జీవన రసాయన శాస్త్ర గ్రంథాలలోకి తీసుకువెళ్లింది. వైద్య పరిభాషలో ఈ ఆవిష్కరణను ‘ర్యాపిడ్ క్యాలరోమెట్రిక్ మెథడ్’ అని పిలిచినా, వ్యవహారంలో ‘ఫిస్కే–సుబ్బారావ్ మెథడ్’ అంటారు. ఆయనకు పీహెడీ పట్టా కూడా ఆ సంవత్సరమే ఇచ్చారు. ఆ పట్టాతో పదేళ్లు పనిచేసినా హార్వర్డ్‌లో కూడా ఆయనకు అన్యాయమే ఎదురైంది. ఉద్యోగాన్ని స్థిరం చేసేందుకు అంగీకరించలేదు. దీనితోనే లెడర్లీ లేబరేటరీస్ సంస్థలో చేరారు. ఇక్కడే ఫిస్కే చేసిన కుట్ర గురించి చెప్పుకోవాలి. ఎల్లాప్రగడ పరిశోధన వివరాలను ఫిస్కే అణచిపెట్టాడు. ఈ సంగతి 1988లో నోబెల్‌కు ఎంపికైన జార్జి హిచింగ్స్ బయటపెట్టారు. హిచింగ్స్ తొలి రోజులలో ఎల్లాప్రగడ సహాధ్యాయి. మెథోట్రెక్సేట్ ఎల్లాప్రగడ సాధించిన మరో గొప్ప విజయం. ఇక్కడ పీఎం భార్గవ రాసుకున్న ఒక అనుభవం గురించి ఉదహరించాలి. భార్గవ 1965–66లో లండన్‌లో పర్యటించారు. ప్రఖ్యాత చెస్టర్ బియట్టీ కేన్సర్ పరిశోధన సంస్థకు అప్పుడు సర్ అలెగ్జాండర్ హడో సంచాలకుడిగా ఉండేవారు. తనను కలసిన భార్గవతో, ‘మీకు తెలుసా! మెథోట్రెక్సేట్ కనుగొన్నది ఒక భారతీయుడే!’ అని చెప్పారట హడో. భార్గవ వంటి సైంటిస్ట్ కూడా విస్తుపోయారు. ఎవరు అని ప్రశ్నించారు. ‘డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు’ అని చెప్పారట హడో. రక్తహీనతకు ఉపయోగపడే ఫోలిక్ యాసిడ్‌ను 1945లో ఎల్లాప్రగడ కనుగొన్నారు. రెండేళ్లకే ప్రపంచం మొత్తం ఒక అద్భుతంగా భావించిన, మహోన్నత ఫలితాలను ఇచ్చిన ఆరోమైసిన్ను కూడా ఆయన కనుగొన్నారు. ఇందులో బెంజమిన్ దుగ్గర్ అనే వృక్షశాస్త్రవేత్త సాయపడ్డాడు. ఇది అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న, రోగ నిరోధక ఔషధ రాజ్యంలో వెలిగిపోతున్న పెన్సిలిన్ , స్ట్రెప్టోమైసిన్లను అధిగమించింది. ఈ రోగ నిరోధకం గ్రామ్– పాజిటివ్, గ్రామ్– నెగెటివ్ సూక్ష్మజీవుల మీద సమంగా పనిచేస్తుంది. ప్లేగు నివారణ మందులకు ఇదే మూలం. తాను అమెరికా వెళ్లడానికి ఆర్థిక సాయం చేసిన కస్తూరి సూర్యనారాయణ (అనపర్తి, తూర్పుగోదావరి) కుమార్తె శేషగిరిని షరతు మేరకు ఎల్లాప్రగడ పెళ్లి చేసుకున్నారు. ఆమె రెండోనెల గర్భవతిగా ఉన్నప్పుడే ఆయన అమెరికా వెళ్లిపోయారు. ఇక తిరిగి రాలేదు. ఆయన సోదరుల మాదిరిగానే కొడుకు కూడా సంవత్సరం తిరగకుండానే రక్తహీనత జబ్బుతో మరణించాడు. శేషగిరి భర్త గురించి ఎదరుచూస్తూనే ఉండిపోయింది. ఆయన 1948లో గుండెపోటుతో 53వ ఏట అమెరికాలోనే కన్నుమూశారు. తను స్వదేశం రాబోతున్నాననీ కలసి ఉందామనీ శేషగిరికి ఆయన రాసిన ఉత్తరం మాత్రం మిగిలిపోయింది. అంతకాలం అమెరికాలో ఉన్నా, గ్రీన్‌కార్డ్ రాలేదు. కాబట్టి తుదివరకు ఆయన భారతీయుడే.మనిషి రుగ్మతలు ఎన్నింటికో ఎల్లాప్రగడ మందు కనిపెట్టారు. కానీ ప్రపంచానికి పట్టిన రుగ్మతలకు మందు కనిపెట్టే వారి కోసం ప్రజలు ఎదురుచూస్తూనే ఉంటారు. వర్ణ వివక్ష, ఈర్షా్యద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలతో బాధపడుతున్న ప్రపంచాన్ని మరమ్మతు చేయగల ఒక ఔషధం కోసం లోకం అర్రులు చాస్తోంది. ఎల్లాప్రగడ వంటి ప్రతిభా సూర్యుడిని మేఘాల్లా కమ్మేసినవి ఇవే కదా!ఇక్కడే ఫిస్కే చేసిన కుట్ర గురించి చెప్పుకోవాలి. ఎల్లాప్రగడ పరిశోధన వివరాలను ఫిస్కే అణచిపెట్టాడు. ఈ సంగతి 1988లో నోబెల్‌కు ఎంపికైన జార్జి హిచింగ్స్ బయటపెట్టారు. హిచింగ్స్ తొలి రోజులలోఎల్లాప్రగడ సహాధ్యాయి. - డా. గోపరాజు నారాయణరావు -
ఆ నేడు 28 సెప్టెంబర్, 1928
పెన్సిలిన్ వ్యాక్సీన్‌ను కనుగొన్న ఫ్లెమింగ్ ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు కూడా మంచే చేస్తాయనడానికి తార్కాణమే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ను కనుగొనడం. లండన్ సెయింట్ మేరీస్ హాస్పిటల్‌లోని ఒక ల్యాబ్‌లో కూర్చొని స్టెఫిలో కాకై బ్యాక్టీరియా గురించి పరిశోధనలు చేస్తున్నాడు ఫ్లెమింగ్. ఓ రోజు అలా పరిశోధన చేస్తుండగా, అత్యవసరంగా బయటకు వెళ్లవలసి వచ్చింది. దాంతో చేస్తున్న పనిని అర్ధంతరంగా ఆపి, కనీసం ఆ పరీక్ష నాళికకు మూత కూడా పెట్టకుండా వెళ్లిపోయాడు. మర్నాడు వచ్చి చూసేసరికి, నిన్న తాను వదిలి వెళ్లిన పరీక్ష నాళికపైన బూజులాంటి పదార్థం ఏర్పడి ఉండటం చూశాడు. నొచ్చుకుంటూ, దానిని శుభ్రం చేద్దామని చేతిలోకి తీసుకున్నాడు. ఆశ్చర్యం... ఆ బూజు ఏర్పడ్డ చోట స్టెఫిలో కాకై బ్యాక్టీరియా నాశనమై ఉంది. బూజు లేని చోట బ్యాక్టీరియా నిక్షేపంగా ఉంది. దాంతో ఆ బూజును మరికాస్త అభివృద్ధి చేసి చూశాడు. ఈసారి బ్యాక్టీరియా పూర్తిగా నాశనమై కనిపించింది. అంటే ఆ బూజులో బ్యాక్టీరియాను ధ్వంసం చేసే ఏదో సూక్ష్మజీవి ఉందని తెలుసుకున్నాడు. ఆ సూక్ష్మజీవికే పెన్సిలిన్ అని పేరు పెట్టాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గాయాల పాలై, పుండ్లపై స్టెఫిలో కాకై బ్యాక్టీరియా చేరి మొండివ్రణాలతో బాధపడుతున్న ైసైనికులపై దానిని ప్రయోగించి చూశాడు. అది సత్ఫలితాలనిచ్చింది. మానవాళికి మహోపకారం జరిగింది. ఆ విధంగా సెప్టెంబర్ 28, 1928ని సెన్సిలిన్ కనుగొన్న రోజుగా పరిశోధక ప్రపంచం గుర్తుంచుకుంది. -
తగిన మోతాదే అసలైన మందు
20 ఏళ్లు - యాంటీ బయాటిక్స్‌తో పెరిగిన మనిషి సగటు ఆయుర్ధాయం. 76 ఏళ్లు - పెన్సిలిన్ ఆవిష్కరణ తరువాత మనం భయంకరమైన వ్యాధులను సమర్థంగా తట్టుకున్న సమయం. 26 ఏళ్లు - కొత్త యాంటీబయాటిక్ తయారు కాకుండా గడిచిపోయిన కాలం. 1000 - మనిషి పేగుల్లో కనిపించే బ్యాక్టీరియా రకాలు. సగటున వీటి బరువే దాదాపు రెండు కిలోలు ఉంటుందని అంచనా. 9500000 - 2011లో సాంక్రమిక వ్యాధుల కారణంగా మరణించిన వారి సంఖ్య. వ్యాధికారక సూక్ష్మజీవులు మందులకు లొంగకపోవడం దీనికి ప్రధాన కారణం. ‘‘మీ వేలి కొన మొదలుకొని మోచేతి భాగం మధ్యలో ఉండే బ్యాక్టీరియా సంఖ్య ఎంతో తెలుసా? 20 లక్షల నుంచి కోటి!’’ ‘‘బాగా తలనొప్పిగా ఉందయ్యా... జ్వరం వచ్చినట్లు కూడా అనిపిస్తోంది’’ ‘‘దానిదేముంది... ‘ఫలానా’ యాంటీబ యాటిక్ వేసుకోండి. ఇట్టే తగ్గిపోతుంది.’’ ‘‘ఒకే’’ తరచూ వినే సంభాషణ ఇది. కానీ ఇలా యథాలాపంగా మందేసుకుని మనకుమనం ఎంత హాని చేసుకుంటున్నామో ఎవరూ పట్టించుకోవడంలేదు. అవసరమున్నా లేక పోయినా యాంటీబయాటిక్స్- అదికూడా అధిక మోతాదులో-వాడటం వల్ల మానవ జాతికి పెనుప్రమాదం ముంచుకొచ్చింది. వ్యాధికారక సూక్ష్మక్రిములు ఈ మందులతో నిరోధకత పెంచుకుంటున్నాయి. 1943లో పెన్సిలిన్ ఆవిష్కరణ తరువా త మానవజాతి క్లిష్టమైన శస్త్రచికిత్సలను, సాంక్రమిక వ్యాధులను తట్టుకుని దాదాపు 76 ఏళ్లు మనగలిగింది. ఆ తరువాతి కాలంలో బ్యాక్టీరియా కూడా తెలివి మీరడం, కొత్తకొత్త రూపాల్లో విరుచుకుపడటం మొదలయ్యా యి. గత 30 ఏళ్లలో డెంగీ, చికెన్‌గున్యా వం టి దాదాపు 30 కొత్త వ్యాధులు పుట్టుకొచ్చా యని అంచనా. మందులకు లొంగని ఈ కొత్త వ్యాధుల కారణంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటు పేదదేశాల్లో ఏ టా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్‌లో ప్రతి ఐదు నిమిషాలకు ఒక పిల్లాడు సాంక్రమిక వ్యాధుల కారణంగా మర ణిస్తూం డడం మన ఖ్యాతిని పెంచే విషయం కాదు. మందులకు నిరోధకత పెరగడానికి విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం ఒక్కటే కారణం కాదు. విచక్షణ మరచి పశు వులకూ వీటిని వాడటం మరో కారణం. ఆ మందులు పశు ఉత్పత్తుల ద్వారా పరోక్షంగా మనిషిలో తిష్టవేస్తున్నాయి. పోనీ కొత్తకొత్త మందులు తయారు చేసుకోవచ్చుకదా? అను కుంటే అదేమంత ఆషామాషీ కాదు. ఒక కొత్త మందు అభివృద్ధి చేయాలంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల వరకూ ఖర్చు అవు తుందని అంచనా. ఇంత భారీ మొత్తాన్ని పరి శోధన, అభివృద్ధులపై ఖర్చుపెట్టేందుకు కం పెనీలు ఇష్టపడటం లేదు. యాంటీబయా టిక్స్‌పై పెద్దగా లాభాలు రావన్న అంచనా దీనికి కారణం. అదే కేన్సర్, ఆర్థరైటిస్, మధు మేహాం వంటి వ్యాధులపై పెట్టే పెట్టుబడు లకు లాభాలు దండిగా ఉండటంతో ఎక్కువ కంపెనీలు అటువైపే మొగ్గుచూపు తున్నాయి. మందుల తయారీ కంపెనీలు తమ కాలుష్యాన్ని నియంత్రించుకోకుండా తాగు నీటి వనరుల్లోకి వదులుతూండటం, కొన్ని ప్రై వేట్ ఆసుపత్రుల్లో అవసరానికి మించిన మోతాదుల్లో యాంటి బయాటిక్స్ ఇస్తూం డటం కూడా వ్యాధులకు లొంగని బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమని నిజామ్స్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్లోని మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ వి.లక్ష్మి అంటున్నా రు. మందులకు పెరుగుతున్న నిరోధకత అం శంపై ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజిస్ట్ విస్తృ్తత అధ్యయనాలు చేస్తోంది. ‘‘దురదృష్టం ఏమిటంటే పాశ్చాత్య దేశాల్లో మాదిరి మన వద్ద యాంటీబయా టిక్స్ వాడకానికి సంబంధించి పూర్తిస్థాయిలో సమాచారం లేదు. ఎన్ని ప్రిస్కిప్షన్స్ వస్తున్నా యి? ఎలాంటి మందులు వాడుతున్నారు? అన్న అంశాలపై ఎవరికి అనుకూలమైన వాద న వారు చేస్తున్నారు. ఇది సరికాదు’’ అం టారు డాక్టర్ లక్ష్మి. ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడేందుకు యాంటీబయా టిక్స్ వాడకానికి సంబంధించి సమగ్ర విధా నం అవసరమని ప్రభుత్వానికి సిఫారసు చేశామని, అన్నీ సవ్యంగా సాగితే మరో నాలు గైదు నెలల్లో ఇది అందుబాటులోకి రావచ్చు నని ఆమె వివరించారు. ప్రిస్కిప్షన్ లేకుండా దుకాణాలు మందులు ఇవ్వడాన్ని నియంత్రిం చాలని, ఆసుపత్రుల్లో కూడా తగిన మోతాదు లోనే మందులు ఇచ్చేలా చూసే విధానం ఉండాలని ఆశిస్తున్నామని డా.లక్ష్మీ తెలిపారు. - గిళియార్ గోపాలకష్ణమయ్యా