తగిన మోతాదే అసలైన మందు
20 ఏళ్లు - యాంటీ బయాటిక్స్‌తో పెరిగిన మనిషి సగటు ఆయుర్ధాయం. 76 ఏళ్లు - పెన్సిలిన్ ఆవిష్కరణ తరువాత మనం భయంకరమైన వ్యాధులను సమర్థంగా తట్టుకున్న సమయం. 26 ఏళ్లు - కొత్త యాంటీబయాటిక్ తయారు కాకుండా గడిచిపోయిన కాలం. 1000 - మనిషి పేగుల్లో కనిపించే బ్యాక్టీరియా రకాలు. సగటున వీటి బరువే దాదాపు రెండు కిలోలు ఉంటుందని అంచనా. 9500000 - 2011లో సాంక్రమిక వ్యాధుల కారణంగా మరణించిన వారి సంఖ్య. వ్యాధికారక సూక్ష్మజీవులు మందులకు లొంగకపోవడం దీనికి ప్రధాన కారణం. ‘‘మీ వేలి కొన మొదలుకొని మోచేతి భాగం మధ్యలో ఉండే బ్యాక్టీరియా సంఖ్య ఎంతో తెలుసా? 20 లక్షల నుంచి కోటి!’’
‘‘బాగా తలనొప్పిగా ఉందయ్యా... జ్వరం వచ్చినట్లు కూడా అనిపిస్తోంది’’
‘‘దానిదేముంది... ‘ఫలానా’ యాంటీబ యాటిక్ వేసుకోండి. ఇట్టే తగ్గిపోతుంది.’’
‘‘ఒకే’’
తరచూ వినే సంభాషణ ఇది. కానీ ఇలా యథాలాపంగా మందేసుకుని మనకుమనం ఎంత హాని చేసుకుంటున్నామో ఎవరూ పట్టించుకోవడంలేదు. అవసరమున్నా లేక పోయినా యాంటీబయాటిక్స్- అదికూడా అధిక మోతాదులో-వాడటం వల్ల మానవ జాతికి పెనుప్రమాదం ముంచుకొచ్చింది. వ్యాధికారక సూక్ష్మక్రిములు ఈ మందులతో నిరోధకత పెంచుకుంటున్నాయి. 1943లో పెన్సిలిన్ ఆవిష్కరణ తరువా త మానవజాతి క్లిష్టమైన శస్త్రచికిత్సలను, సాంక్రమిక వ్యాధులను తట్టుకుని దాదాపు 76 ఏళ్లు మనగలిగింది. ఆ తరువాతి కాలంలో బ్యాక్టీరియా కూడా తెలివి మీరడం, కొత్తకొత్త రూపాల్లో విరుచుకుపడటం మొదలయ్యా యి. గత 30 ఏళ్లలో డెంగీ, చికెన్‌గున్యా వం టి దాదాపు 30 కొత్త వ్యాధులు పుట్టుకొచ్చా యని అంచనా. మందులకు లొంగని ఈ కొత్త వ్యాధుల కారణంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటు పేదదేశాల్లో ఏ టా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్‌లో ప్రతి ఐదు నిమిషాలకు ఒక పిల్లాడు సాంక్రమిక వ్యాధుల కారణంగా మర ణిస్తూం డడం మన ఖ్యాతిని పెంచే విషయం కాదు.
మందులకు నిరోధకత పెరగడానికి విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం ఒక్కటే కారణం కాదు. విచక్షణ మరచి పశు వులకూ వీటిని వాడటం మరో కారణం. ఆ మందులు పశు ఉత్పత్తుల ద్వారా పరోక్షంగా మనిషిలో తిష్టవేస్తున్నాయి. పోనీ కొత్తకొత్త మందులు తయారు చేసుకోవచ్చుకదా? అను కుంటే అదేమంత ఆషామాషీ కాదు. ఒక కొత్త మందు అభివృద్ధి చేయాలంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల వరకూ ఖర్చు అవు తుందని అంచనా. ఇంత భారీ మొత్తాన్ని పరి శోధన, అభివృద్ధులపై ఖర్చుపెట్టేందుకు కం పెనీలు ఇష్టపడటం లేదు. యాంటీబయా టిక్స్‌పై పెద్దగా లాభాలు రావన్న అంచనా దీనికి కారణం. అదే కేన్సర్, ఆర్థరైటిస్, మధు మేహాం వంటి వ్యాధులపై పెట్టే పెట్టుబడు లకు లాభాలు దండిగా ఉండటంతో ఎక్కువ కంపెనీలు అటువైపే మొగ్గుచూపు తున్నాయి.
మందుల తయారీ కంపెనీలు తమ కాలుష్యాన్ని నియంత్రించుకోకుండా తాగు నీటి వనరుల్లోకి వదులుతూండటం, కొన్ని ప్రై వేట్ ఆసుపత్రుల్లో అవసరానికి మించిన మోతాదుల్లో యాంటి బయాటిక్స్ ఇస్తూం డటం కూడా వ్యాధులకు లొంగని బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమని నిజామ్స్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లోని మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ వి.లక్ష్మి అంటున్నా రు. మందులకు పెరుగుతున్న నిరోధకత అం శంపై ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజిస్ట్ విస్తృ్తత అధ్యయనాలు చేస్తోంది. ‘‘దురదృష్టం ఏమిటంటే పాశ్చాత్య దేశాల్లో మాదిరి మన వద్ద యాంటీబయా టిక్స్ వాడకానికి సంబంధించి పూర్తిస్థాయిలో సమాచారం లేదు.
ఎన్ని ప్రిస్కిప్షన్స్ వస్తున్నా యి? ఎలాంటి మందులు వాడుతున్నారు? అన్న అంశాలపై ఎవరికి అనుకూలమైన వాద న వారు చేస్తున్నారు. ఇది సరికాదు’’ అం టారు డాక్టర్ లక్ష్మి. ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడేందుకు యాంటీబయా టిక్స్ వాడకానికి సంబంధించి సమగ్ర విధా నం అవసరమని ప్రభుత్వానికి సిఫారసు చేశామని, అన్నీ సవ్యంగా సాగితే మరో నాలు గైదు నెలల్లో ఇది అందుబాటులోకి రావచ్చు నని ఆమె వివరించారు. ప్రిస్కిప్షన్ లేకుండా దుకాణాలు మందులు ఇవ్వడాన్ని నియంత్రిం చాలని, ఆసుపత్రుల్లో కూడా తగిన మోతాదు లోనే మందులు ఇచ్చేలా చూసే విధానం ఉండాలని ఆశిస్తున్నామని డా.లక్ష్మీ తెలిపారు.
- గిళియార్ గోపాలకష్ణమయ్యా