నేడు పెన్నార్ డెల్టాకు నీరు విడుదల
సోమశిలలో 40.226 టీఎంసీల నీరు నిల్వ
సోమశిల : సోమశిల జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు గురువారం నీరు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ శ్రీరామగిరి వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాన్ డెల్టా పరిధిలోని ఉత్తర, దక్షిణ కాలువలకు నీటి విడుదలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 40.226 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. పైతట్టు ప్రాంతాల నుంచి 2756 క్యూసెక్కుల వంతున నీటి ప్రవాహం వచ్చి చేరుతోందని తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 94.220 మీటర్లు, 309.12 అడుగుల మట్టం నమోదైంది. సగటున 152 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది.