penumaka farmers
-
సీఆర్డీఏ అధికారులకు షాక్
అమరావతి: సీఆర్డీఏ అధికారులకు పెనుమాక రైతులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. భూసేకరణ అభ్యంతరాలపై ఈరోజు సీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లకూడదని అన్నదాతులు నిర్ణయించారు. దీనిపై పెనుమాకలో డప్పుతో చాటింపు కూడా వేయించారు. ఇకపై సీఆర్డీఏ అధికారులు ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేసినా హాజరుకాకూడదని గ్రామస్తులు నిర్ణయించారు. రెండేళ్లలో చాలాసార్లు అభ్యంతరాలు ఇచ్చామని, అధికారులు ఏ ఒక్కటీ పట్టించుకోలేదని.. పైగా సమావేశాలకు పిలిచి అక్రమ కేసులు పెడుతున్నారని పెనుమాక రైతులు తెలిపారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజధానికి భూసేకరణ కోసం ఇంతకుముందు సీఆర్డీఏ నిర్వహించిన బహిరంగ విచారణను అడ్డుకున్నారనే ఆరోపణలతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సహా 13 మంది పెనుమాక రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈనెల 6న ఎమ్మెల్యే ఆర్కేను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. -
సీఆర్డీఏ అధికారులకు షాక్
-
ఎమ్మెల్యే ఆర్కేపై కేసు
అమరావతి: ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రైతుల పక్షాన నిలబడ్డారనే అక్కసుతో విపక్ష ఎమ్మెల్యేపై చంద్రబాబు సర్కారు కేసులో ఇరికించింది. రాజధానికి భూసేకరణ కోసం నిర్వహించిన బహిరంగ విచారణను అడ్డుకున్నారనే ఆరోపణలతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సహా 13 మంది పెనుమాక రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. మరికొంత మంది రైతులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. తమపై తప్పుడు కేసులు పెట్టడంపై రైతులు మండిపడుతున్నారు. న్యాయం చేయమని అడిగితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. మీటింగ్ మినిట్స్ ఎందుకు రాయడం లేదని, అంతా ప్రభుత్వం ఇష్టమేనా అని నిలదీశారు. రైతులను బెదిరించి భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆరోపించారు. ఎమ్మెల్యే ఆర్కే, రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. పెనుమాక రైతులపై కేసులు పెట్టడాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం రైతులు చేసిన నేరమా, అన్నదాతల తరపున స్థానిక ఎమ్మెల్యే నిలబడటం తప్పా అని ఆయన ప్రశ్నించారు. దుర్మార్గపు పోకడలను చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. -
ప్రభుత్వ తీరుపై పెనుమాక రైతుల ఆగ్రహం
-
సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
అమరావతి: పెనుమాక సీఆర్డీఏ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూసేకరణ నోటిఫికేషన్ విడుదలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన దిగారు. కూరగాయాలు పారబోసి నిరసన తెలిపారు. సీఆర్డీఏ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాజధానికి భూములు ఇచ్చేందుకు తాము నిరాకరించడంతో ప్రభుత్వం బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని పెనుమాక రైతులు రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుసు మార్కెట్ యార్డు ఎదుట అన్నదాతలు ఆందోళనకు దిగారు. గ్రేడింగ్ పేరుతో కొనుగోళ్లను మార్కెఫెడ్ అధికారులు కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తు రైతులు నిరసన చేపట్టారు. కొంతమంది రైతులు భవనంపైకి ఎక్కి దూకుతామని బెదిరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారికి సర్దిచెప్పేందుకు తోటి రైతులు ప్రయత్నించారు. -
భూ సేకరణ ఆపకపోతే దీక్షకు సిద్ధం
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ * కన్నీళ్లతో కట్టే రాజధాని వద్దు * టీడీపీకి మిత్రపక్షమే కానీ.. బానిసను కాను * వైఎస్సార్సీపీ శత్రువు కాదు.. నాకు ఏ పార్టీ ఎక్కువ కాదు సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ప్రకటించిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే నిలిపివేయక పోతే తాను బరిలోకి దిగుతానని.. అవసరమైతే ధర్నా, నిరాహార దీక్షకు సిద్ధమని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతం మంగళగిరి మండలం పెనుమాక గ్రామంలోని ఓ కళాశాల ఆవరణలో ఆయన ఆదివారం స్థానిక రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రాజధాని నిర్మాణంపై టీడీపీ అధిష్టానం తనతో చెప్పింది వేరని, ఇప్పుడు జరుగుతోంది వేరని ఆక్షేపించారు. రైతుల నుంచి భూములు తీసుకోబోమని చెప్పారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు స్వచ్ఛందంగా భూమలు ఇస్తే తీసుకోవచ్చని, బలవంతంగా తీసుకుంటామంటే మాత్రం ఊరుకోనని ఉద్ఘాటించారు. వ్యవసాయం లేకుంటే ఇబ్బందులు తప్పవు ‘‘కుప్పంలో నీరు లేకపోవడంతో ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని పంటలు పండిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో 20 అడుగుల్లోనే నీరు ఉండగా ఎందుకు ఇక్కడి భూములను వ్యవసాయానికి పనికిరాకుండా చేస్తున్నారు? వ్యవసాయాన్ని చంపుకుంటూ పోతే ఇబ్బందులు తలెత్తుతాయి. నేను తోటి రైతుగా ఇక్కడికి వచ్చా. ఇక్కడి రైతులకు అండగా ఉంటా’’ అని పవన్ పేర్కొన్నారు. 3,500 ఎకరాల కోసం రాద్ధాంతం ఎందుకని మంత్రి రావెల చేసిన వ్యాఖ్య పట్ల పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో 15 ఎకరాల స్థలం కోల్పోతే టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఎందుకు సుప్రీం వరకు వెళ్లారని ప్రశ్నించారు. ల్యాండ్‌బ్యాంక్ ఉన్న ఆయనే అంత విలవిలలాడితే ఎకరా, అర ఎకరా ఉన్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం త్యాగాలు చేయాలంటూ ఎంపీ గల్లా జయదేవ్ చెబుతున్నారని, మన దాకా వస్తే కానీ త్యాగాల విలువ తెలియదని మండిపడ్డారు. తాను టీడీపీకి మిత్రపక్షమే కానీ.. బానిసను మాత్రం కానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే? రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత కలిగిన కాగితంపై వారికి లిఖితపూర్వకంగా భరోసా కల్పించాలని కోరారు. సీఆర్డీఏ చట్టంలో లోపాలున్నాయని, వాటిని వెంటనే సరిచేయాలని చెప్పారు. రాజధానిపై సలహాలు సూచనల కోసం ఇంజినీర్లు, అనుభవజ్ఞులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. కన్నీటితో కట్టే రాజధాని మంచిది కాదు ఆనందంతో కట్టే రాజధాని కావాలి కానీ, కన్నీటితో కట్టే రాజధాని మంచిది కాదని చెప్పారు. తాను టీడీపీతో, బాబుతో గొడవకు రాలేదని వివరించారు. గొడవ పడితే సమస్య పరిష్కారం అవుతుందంటే అందు కు సిద్ధమన్నారు. వైఎస్సార్సీపీ తనకు శత్రువు కాదని, తన కు ఎవరితోనూ వ్యక్తిగత శతృత్వం లేదన్నారు. ఒక పార్టీ ఎక్కువ, ఒక పార్టీ తక్కువ కాదని, తాను ప్రజల పక్షమని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగితే దేనికి వెనుకాడనని, చావుకు కూడా వెనుకాడనని తెలిపారు. అన్నయ్య(చిరంజీవి) మనసు గాయపరిచి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చానని, తన చిత్తశుద్ధిని శంకిస్తే తనలో మరో మనిషిని చూస్తారని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, కులాల కుమ్ములాటలు జరిగే ప్రమాదం ఉందని పవన్ పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే మేల్కొని పరిస్థితిని చక్కదిద్దకుంటే అధికారం కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. చంద్రబాబు రాజధాని నిర్మాణానికే పరిమితమైతే రాయలసీమ ప్రజల్లో అసంతృప్తి వస్తుందన్నారు. ఆ ప్రాంతానికి న్యాయం జరగడం లేదన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఉందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లోనే కాదుకదా మరే ఎన్నికల్లోనూ టీడీపీ అధికారంలోకి రాదన్నారు. -
పెనుమాకలో పవన్ పర్యటన
-
లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. లాక్కోవద్దు: పవన్
-
పవన్ కల్యాణ్ పై రాయి విసిరిన అగంతకుడు
-
లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. లాక్కోవద్దు: పవన్ కల్యాణ్
పెనుమాక: టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబుతో గొడవ పెట్టుకోవాలనుకోవడం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీతో గొడవ పెట్టుకోవడానికి ఎంతోసేపు పట్టదన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు ఇష్టపడి ఇస్తే భూములు తీసుకోవాలన్నారు. భూములు ఇవ్వని రైతుల నుంచి లాక్కోవొద్దని స్పష్టం చేశారు. ఆనందంతో కట్టే రాజధాని కావాలిగానీ కన్నీళ్లతో కట్టింది కాదన్నారు. గుంటూరు జిల్లా పెనుమాకలో రాజధాని ప్రాంత రైతులతో ఆదివారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. పవన్ కల్యాణ్ ప్రసంగం ఆయన మాటల్లోనే.... * నటుడిగానో, రాజకీయ నాయకుడిగా ఇక్కడి రాలేదు రైతుగా వచ్చాను * నేను రాజకీయాల్లోకి రావడానికి రెండే కారణాలు ఒకటి రైతు సమస్య, రెండు శాంతిభద్రతల సమస్య * నేను మీకు అండగా ఉన్నాను, పారిపోవడం లేదు * వీధి పోరాటాల కోసం రాజకీయ పార్టీలు అవసరం లేదు * టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి రాలేదు * వైఎస్సార్ సీపీ నేతలు నాకు శత్రువులు కాదు * వ్యక్తిగతంగా నాకు ఎవరూ శత్రువులు లేరు * ఏ పార్టీ ఎక్కువ కాదు, ఏ పార్టీ తక్కువ కాదు * ప్రత్యేక పరిస్థితుల్లోనే టీడీపీకి, బీజేపీకి మద్దతు ఇచ్చా * నేను ప్రజల పక్షం, జనం పక్షం * నాకు పరిమితులు ఉన్నాయి, నా శక్తి మేరకు పోరాటం చేస్తున్నా * టీడీపీ నేతల మాటలు నాకు బాధ కలిగించాయి * అభివృద్ధికి ఆటంకం కలిగించేవాడిని అయితే టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను? * మిత్రపక్షం అంటే బానిస కాదు * తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యను ప్రజల కోసమే ఎదిరించాను * అన్నయ్య మనసు గాయపర్చి టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చాను * అధికారం కావాలని కోరుకోలేదు * సమస్యను పరిష్కరించేందుకు చావుకు కూడా వెనుకాడను * నా చిత్తశుద్ధిని శంకిస్తే నేను వేరే వ్యక్తిని * మాటలు, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించొచ్చు * ప్రత్యేక ప్యాకేజీ కోసం సిన్సియర్ గా ప్రయత్నించాలని సూచించా * ప్రజల దగ్గర నుంచి భూమి సేకరించకుండానే రాజధాని కడతామన్నారు * రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతాన్ని ఆకాంక్షించాను * ఆనందంతో కట్టే రాజధాని కావాలిగానీ కన్నీళ్లతో కట్టింది కాదు * అభివృద్ధి కోసం పొలాలను నాశనం చేయడం నాకు బాధ కలిగిస్తోంది * ప్రజల సమస్యల ముందుకు తీసుకెళ్తే నన్ను అభివృద్ధి నిరోధకుడు అంటున్నారు * ఆప్ట్రాల్ 3400 ఎకరాల భూమికే ఇంత రాద్ధాంతం చేస్తారా అని మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు * అధికారంలో ఉన్నవారు ఆప్ట్రాల్ అనే పదాన్ని మాట్లాడొద్దు * అవుటర్ రింగ్ రోడ్డులో లాక్కున్న కొంతభూమి కోసం టీడీపీ ఎంపీ మురళీమోహన్ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారు? * భూసేకరణ చేస్తే కచ్చితంగా ధర్నా చేస్తాను * రైతులు ఇష్టపడి ఇస్తే భూములు తీసుకోండి, ఇష్టపడని రైతులను ఒప్పించి తీసుకోండి * బలవంతంగా భూములు లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. లాక్కోవద్దు * దయచేసి నాకు కులాలు అంటగట్టకండి * నేను రెచ్చగొట్టడానికి మాట్లాడడం లేదు. ఒక్కసారి ఆలోచించండి * గల్లా జయదేవ్, మురళీమోహన్ రైతుల సమస్యలు వినాలని కోరుకుంటున్నా * రైతు సమస్యలపై సీఎం చంద్రబాబు మానవతా దృక్పధంతో వ్యవహరించాలి * ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారం రాకపోతే రైతులకు జవాబుదారీ ఎవరు? * ప్రభుత్వం భూములు లాక్కుంటున్నప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి * నేను ఎక్కడికీ పారిపోను, రైతుల వెంటే ఉంటాను -
మీ సమస్యలు వినడానికే వచ్చా: పవన్
-
పవన్ కల్యాణ్ పై రాయి విసిరిన అగంతకుడు
పెనుమాక: పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా పర్యటనలో కలకలం రేగింది. ఆదివారం మధ్యాహ్నం పెనుమాక రైతులతో పవన్ సమావేశమయ్యారు. రైతులతో మాట్లాడుతున్న ఆయనపై గుర్తు తెలియని అగంతకుడు రాయి విసిరాడు. దీంతో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది. వేదికపైనున్న పవన్ కల్యాణ్ కు సమీపంలో రాయి పడింది. రాయి విసిరింది ఎవరనేది తెలియలేదు. దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే తనపై విసిరిన రాయిని చేతిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ రైతుల సమస్యలు విన్నారు. మరోవైపు పవన్ తో మాట్లాడేందుకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. మీరు ఓటు వేయమంటనే టీడీపీకి ఓటు వేశామని... ఇప్పుడు తమ భూములు లాక్కుంటున్నారని పవన్ తో రైతులు చెప్పారు. తమను భయపెట్టి భూములు లాక్కుంటున్నారని వాపోయారు. ల్యాండ్ పూలింగ్ పై ఓపెన్ బ్యాలెట్ పెట్టాలని సూచించారు. ఎక్కువ మంది ముందుకు తాము ఎటువంటి ప్యాకేజీ అవసరం లేకుండానే భూములు ఇచ్చేస్తామని ఒక రైతు చెప్పాడు. -
మీ సమస్యలు వినడానికే వచ్చా: పవన్
పెనుమాక: రాజధాని ప్రాంత రైతుల సమస్యలు వినడానికే వచ్చానని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా పెనుమాకలో ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'మీ సమస్యలు వినడానికే వచ్చా... సహకరించండి' అంటూ విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ చేస్తే మీకు ఏంటి సమస్య అని పవన్ పశ్నించగా... అన్నదాతలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. బలవంతంగా భూములు లాక్కుంటున్నారని రైతులు ఆయనకు మొరపెట్టుకున్నారు. భూములు ఇవ్వకుండానే ఇచ్చామని ప్రచారం చేస్తున్నామని వాపోయారు. భూసమీకరణపై స్పష్టత లేదన్నారు. ఉండల్లి, పెనుమాన ప్రాంతాల్లో పండిన పంటలను రైతులు పవన్ కల్యాణ్ కు చూపించారు. -
భూములు ఇచ్చేది లేదు:పెనుమాక రైతులు