
మీ సమస్యలు వినడానికే వచ్చా: పవన్
పెనుమాక: రాజధాని ప్రాంత రైతుల సమస్యలు వినడానికే వచ్చానని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా పెనుమాకలో ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'మీ సమస్యలు వినడానికే వచ్చా... సహకరించండి' అంటూ విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ చేస్తే మీకు ఏంటి సమస్య అని పవన్ పశ్నించగా... అన్నదాతలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
బలవంతంగా భూములు లాక్కుంటున్నారని రైతులు ఆయనకు మొరపెట్టుకున్నారు. భూములు ఇవ్వకుండానే ఇచ్చామని ప్రచారం చేస్తున్నామని వాపోయారు. భూసమీకరణపై స్పష్టత లేదన్నారు. ఉండల్లి, పెనుమాన ప్రాంతాల్లో పండిన పంటలను రైతులు పవన్ కల్యాణ్ కు చూపించారు.