
పవన్ కల్యాణ్ పై రాయి విసిరిన అగంతకుడు
పెనుమాక: పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా పర్యటనలో కలకలం రేగింది. ఆదివారం మధ్యాహ్నం పెనుమాక రైతులతో పవన్ సమావేశమయ్యారు. రైతులతో మాట్లాడుతున్న ఆయనపై గుర్తు తెలియని అగంతకుడు రాయి విసిరాడు. దీంతో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది. వేదికపైనున్న పవన్ కల్యాణ్ కు సమీపంలో రాయి పడింది. రాయి విసిరింది ఎవరనేది తెలియలేదు. దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే తనపై విసిరిన రాయిని చేతిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ రైతుల సమస్యలు విన్నారు.
మరోవైపు పవన్ తో మాట్లాడేందుకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. మీరు ఓటు వేయమంటనే టీడీపీకి ఓటు వేశామని... ఇప్పుడు తమ భూములు లాక్కుంటున్నారని పవన్ తో రైతులు చెప్పారు. తమను భయపెట్టి భూములు లాక్కుంటున్నారని వాపోయారు. ల్యాండ్ పూలింగ్ పై ఓపెన్ బ్యాలెట్ పెట్టాలని సూచించారు. ఎక్కువ మంది ముందుకు తాము ఎటువంటి ప్యాకేజీ అవసరం లేకుండానే భూములు ఇచ్చేస్తామని ఒక రైతు చెప్పాడు.