people angry
-
కర్నూలు ప్రజల సమస్యలను వినడానికి కూడా ఇష్టపడని మంత్రి టీజీ భరత్
-
పోలీసులపై స్థానిక ప్రజల ఎదురుదాడి.. 'సీఐ' ను వ్యవసాయ పొలాల్లో వెంబడించి.. మరీ
సాక్షి, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని చిత్తనూర్‌లో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ వ్యర్థాలను ఎక్లాస్పూర్, జిన్నారం, చిత్తనూర్, చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామాల శివారుల్లో పారబోస్తుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ ట్యాంకర్ వ్యర్థాలను నింపుకొని బయటికి రావడాన్ని గమనించిన గ్రామస్తులు.. ఎక్లాస్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద అడ్డుకున్నారు. ఇథనాల్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. 16 గంటలపాటు ఆత్మకూర్ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం తహసీల్దార్ సునీత అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ నెల 25న ఆర్డీఓ సమక్షంలో కంపెనీని పరిశీలిస్తామని చెప్పినా వినలేదు. ట్యాంకర్లో ఉన్న కెమికల్‌ను పరీక్షించే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు భీష్మించారు. నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ ఆదేశాల మేరకు మరికల్, మక్తల్, నర్వ, ధన్వాడ పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామస్తులపై లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలవగా.. పొలాల వెంబడి గ్రామస్తులు పరుగులు పెట్టారు. ఇదే సమయంలో ఇథనాల్ కంపెనీ ట్యాంకర్‌ను పోలీసుల బందోబస్తు మధ్య తరలించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. రాళ్లు, ఇటుకలు, కర్రలతో దూసుకురావడంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. మక్తల్ సీఐ రాంలాల్‌ను వ్యవసాయ పొలాల్లో వెంబడించి తీవ్రంగా గాయపర్చారు. గాయపడిన మరికొందరు పోలీసులు పక్కనే ఉన్న నరసింహస్వామి ఆలయ గదిలోకి వెళ్లారు. అనంతరం అరెస్ట్ చేసిన ఆందోళనకారులను వదిలిపెట్టి, గదిలో ఉన్న పోలీసులను విడిపించుకున్నారు. గాయపడిన పోలీసులు.. చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ ఆందోళనలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య జరిగిన ఘర్షణలో మక్తల్ సీఐ రాంలాల్తోపాటు కృష్ణ ఎస్ఐ విజయభాస్కర్, కానిస్టేబుళ్లు అనిత, అరుణ, వెంకటేశ్వరమ్మ, చెన్నరాయుడు, నవ్వు శ్రీనులకు గాయాలయ్యాయి. అలాగే పోలీస్ టీఆర్ గ్యాస్ వాహనంతోపాటు రెండు బైక్‌లకు గ్రామస్తులు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి. డీఎస్పీ వాహనంతోపాటు మరో మూడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. కంపెనీకి వెళ్లే 8 లారీల అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు టైర్లలో గాలి తీశారు. ఈ ఘటనకు కారణమైన వారి ఆచూకీ కోసం చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాలను జల్లెడ పడుతున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. కాలు విరగొట్టారు.. పోలీసులు కర్రలతో కొట్టడంతో కాలు విరిగిపొయింది. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల నుంచి తమకు ప్రాణహాని ఉందని రెండేళ్ల నుంచి ఆందోళన చేస్తున్నాం. పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు కొట్టడం వల్ల చాలామంది గాయపడ్డారు. ఇంకా కంపెనీని రద్దు చేసే వరకు నిద్రపోం. – చంద్రమ్మ, జిన్నారం ప్రాణం పోయినా.. పట్టువదలం! ఇక్కడి నుంచి కంపెనీ ఎత్తివేసే వరకు తమ పోరాటం ఆగదు. ఇథనాల్ కంపెనీ నుంచి ప్రమాదం కలిగించే కెమికల్స్‌ను గ్రామ శివారులో వేయడం వల్ల దుర్వాసన వస్తోంది. వ్యర్థాలను తరలించే ట్యాంకర్‌ను అడ్డుకొని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు దాడిచేసి గాయపర్చారు. అక్కడి నుంచి పరుగు తీసినా వదిలిపెట్టలేదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు.. కంపెనీని తొలగించే వరకు ఆందోళన చేస్తాం. – హన్మమ్మ, మానస, ఎక్లాస్పూర్ డీఎస్పీదే బాధ్యత.. ఇథనాల్ కంపెనీ నుంచి బయటకు తెచ్చి పారబోస్తున్న విష రసాయనాల ట్యాంకర్‌ను అడ్డుకొని ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై పోలీసు లను రెచ్చగొట్టి లాఠీచార్జీ చేయించిన డీఎస్పీపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యు డు చక్రవర్తి అన్నారు. కంపెనీ నుంచి ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తీసుకువచ్చి జిన్నారం, ఎక్లాస్పూర్, చిత్తనూర్, ఉంద్యాల గ్రామాల పక్కన పారపోయడంపై తహసీల్దార్‌తో మాట్లాడుతుండగా డీఎస్పీ పోలీసులను రెచ్చగొట్టి లాఠీచార్జీ చేయించారని, ఇందుకు ఆయనే బాధ్యత వహించాలని చెప్పారు. -
ఎన్నాళ్లీ నరకం?
సాక్షి, కడియం (తూర్పుగోదావరి) : వాడుక నీరు గొట్టాల్లోకి వెళ్లి అక్కడి నుంచి ఎవరో ఒకరి ఇంటి ఆవరణలోకి వస్తోంది. లేకపోతే మ్యాన్‌హోల్స్ నుంచి లీకై నేరుగా రోడ్డు మీదకే చేరుతోంది. దుర్వాసనతో కూడిన ఆ మురుగు నీటిలో ఇటుకలు వేసి వాటి మీద నుంచి అక్కడి ప్రజలు నడవాల్సిన దుస్థితి. ఇదీ మోడల్‌గా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించిన దుళ్ళ గ్రామంలోని ఎర్రకాలనీ, బీసీ కాలనీల్లోని పరిస్థితి. ఈ నరకం నుంచి తమకు విముక్తి కలిగించండి మహాప్రభో అంటూ వాటిని చూసేందుకు వచ్చిన అధికారులు, నాయకులను స్థానికులు వేడుకొంటున్నారు. అప్పటి మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షించిన పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో సాగిన ఈ నిర్లక్ష్య నిర్మాణం కారణంగా తాము పడుతున్న కష్టాలను కనిపించిన ప్రతి ఒక్కరికీ వారు వివరిస్తున్నారు. కేవలం రెండంటే రెండు వర్షాలు కురిశాయో లేదో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వేసినంత మేరా అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక భారీ వర్షాలు కురిస్తే ఎంతటి దుర్భర పరిస్థితులుంటాయోనని దుళ్ళ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కూలికి వెళ్తేనే కానీ రోజు గడవని ఆ కుటుంబాలు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కారణంగా ఏర్పడిన మురికి కూపంలో బతకలేక తల్లడిల్లుతున్నారు. నిర్మాణ సమయంలో వచ్చిన అధికారులు కానీ, నాయకులు కానీ ఇప్పుడు కనిపించడం లేదని, తమ ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు గొట్టాలు ఏర్పాటు చేసేందుకు జరిపిన తవ్వకాల్లో పలుచోట్ల తాగునీటి పైపులైన్లు కూడా దెబ్బతిన్నాయి. పనులు జరుగుతున్నంతసేపూ నీటిని విడుదల చేయకుండా కాంట్రాక్టర్లు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. తీరా ఇప్పుడు తాగునీరు విడుదల చేస్తూంటే ఎక్కడికక్కడ నీరు లీకైపోతోంది. ముఖ్యంగా బీసీ కాలనీలో మొత్తం తాగునీటి పైపులైన్ వ్యవస్థ అధ్వానంగా తయారైంది. దీంతో నెల రోజులుగా నీటిని విడుదల చేయడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం తలాతోకా లేకుండా, ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడకుండా చేసిన పనులకు దుళ్ళలో జరిగిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పరాకాష్టగా కనిపిస్తోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► దుళ్ళ గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి వాడిన పైపులైన్ల సామర్థ్యం వాస్తవంగా సరిపోతుందా? ► పనులు చేసిన కాంట్రాక్టర్లకు తగిన అనుభవం ఉందా? ► పనులు జరుగుతున్నప్పుడు అసలు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు పర్యవేక్షించారా? ► మోడల్‌గా నిర్మించామని చెబుతున్నారు. ఒకవేళ విఫలమయితే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందా? ► ప్రస్తుతం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సక్రమంగా పని చేయడం లేదు. ఇందుకు కాంట్రాక్టర్లపై తీసుకునే చర్యలేమిటి? ► ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు తీసుకునే తక్షణ చర్యలేమిట ► మురుగునీటి వ్యవస్థ నిర్మాణంలో సదరు నీరు బయటకు వెళ్లే మార్గం అత్యంత ప్రధానమైనది. అటువంటి అవకాశం లేకుండా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించేందుకు ఎలా సిద్ధమయ్యారు? ఉండలేకపోతున్నాం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం వేసిన పైపులు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. మురుగునీరు వెనక్కి తన్నుకొస్తోంది. ఇంట్లోకి కూడా దుర్వాసన వస్తోంది. వీధుల్లో కూడా అదే పరిస్థితి. ఉండలేకపోతున్నాం. మా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. ఏ డ్రైనూ లేనప్పుడే బాగుంది. – జి.వెంకటలక్ష్మి మరీ దారుణం మురుగునీరు బయటకు వెళ్లేందుకు ఏమాత్రం అవకాశం లేదు. కానీ పనులు మాత్రం చేసేశారు. అవి కూడా అత్యంత దారుణంగా చేశారు. అసలు ఈ గొట్టాల నిర్మాణం చూస్తే ఇందులో నుంచి నీరు ఎలా వెళ్తుందని వేశారో అర్థం కావడం లేదు. అధికారులు, నాయకులు ఇక్కడకొచ్చి చూస్తే మా బాధలు అర్థమవుతాయి. – ఎం.కుమారి -
ఆగుతూ.. సాగుతూ
వనపర్తి : జిల్లా కేంద్రంలో నిత్యంరద్దీగా ఉండే బ్యాంక్ స్ట్రీట్‌లో చేపట్టిన రోడ్డు సుందరీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రెండునెలలుగా ఈ కాలనీవాసులు, ఇక్కడి వ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. రాకపోకలకూ తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. 2018 మార్చిలో ఈ పనులకు కేటీఆర్ రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్‌లో ఈ పనులకు అధికారులు టెండర్లు, అగ్రిమెంట్ ప్రక్రియను చేపట్టారు. 2019 ఏప్రిల్‌లో పనులను ప్రారంభించారు. రూ.1.31 కోట్ల నిధులతో చేపట్టిన ఈ పనులు గత రెండు నెలలుగా కేవలం 20శాతం పూర్తి చేసినట్లు అధికారులు రికార్డులు వెల్లడిస్తున్నాయి. సుమారు ఐదుబ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, వందకుపైగా.. వ్యాపారదుకాణాలు, నివాస గృహాలు ఉన్న ఈ రోడ్డులో పనుల కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డుకు రెండు వైపులా ఒకేసారి డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టి గోతులు తవ్వటంతో ఈ రోడ్డు మార్గాన వెళ్లే వాహదారులకు, పాదచారులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ప్రధానమైన బీటీ, ఫుట్‌పాత్ సీసీ నిర్మాణం చేయాల్సి ఉంది. కేవలం 560 మీటర్ల కాంక్రీట్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టేందుకే రెండు నెలల సమయం తీసుకుంటే.. మిగతా పనులు చేపట్టేందుకు ఎంతకాలం పడుతుందని ఈ రోడ్డు మార్గాన వెళ్లే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేయాల్సి పనులు ఇవే.. బ్యాంక్ స్ట్రీట్‌గా పిలువబడే.. ఈరోడ్డు ఆర్టీసీ డిపో నుంచి ఇందిగాంధీ చౌరస్తా వరకు సుందరీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.1.31 కోట్ల నిధులు కేటాయించారు. ఇరువైపులా 560 మీటర్ల కాంక్రీట్ రోడ్డు, 33 ఫీట్ల బీటీరోడ్డు, రోడ్డుకు ఇరువైపులా.. ఒక్కోవైపు ఆరు ఫీట్ల చొప్పున మొత్తం 12 ఫీట్ల సీసీ ఫుట్‌పాత్ నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాజీవ్ చౌక్ నుంచి పూజా ఎలక్ట్రానిక్స్ వరకు మాత్రమే పనులు చేయనారంభించారు. అక్కడి నుంచి డిపో వరకు పనులు సంగంలోనే ఆగిపోయాయి. రాజీవ్‌చౌక్ నుంచి ఇందిగాంధీ చౌరస్తా వరకు ఒకవైపు డ్రెయినేజీ నిర్మాణం ఇదివరకే చేసిన కారణంగా.. పడమర వైపు మాత్రమే నిర్మాణం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇంకా పనులు ప్రారంభంకాలేదు. ప్రధాన చౌరస్తాలో మురికి కూపం జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ప్రధాన రాజీవ్‌చౌక్‌లో డ్రెయినేజీ నీరు నిలుస్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. పుర పాలకులు, అధికారులు ఎన్నోసార్లు ఈ ప్రధాన కూడలి గుండా వెళ్తుంటారు. కానీ ఎవ్వరికీ ఈ సమస్య పట్టకపోవటం గమనార్హం. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే చిరువ్యాపారులు మురికి కూపం నుంచి వచ్చే దుర్గంధంను భరించకతప్పని పరిస్థితి ఏర్పడింది. దుకాణాల ఎదుట కర్ర నిచ్చెనలు డ్రెయినేజీ నిర్మాణం కోసం రెండు వైపులా గోతులు తవ్వటంతో బ్యాంకులకు, వ్యాపార దుకాణాలకు, నివాసగృహాలకు వెళ్లే వారు కర్రనిచ్చెనలు రూ.వేలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డు పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే.. ఓ ప్రధాన ఆస్పత్రి వైద్యురాలు కర్రనిచ్చెన దాటబోయి కిందపడి గాయాలపాలైంది. అయినా పనుల్లో వేగం పెరగలేదు. రోడ్డుపై పారుతున్న మురుగునీరు రెండు వైపులా ఒకేసారి డ్రైనేజీల నిర్మాణం చేపట్టడంతో ఇరువైపుల నుంచి వచ్చే మురుగునీరు రోడ్డుపై పారుతోంది. దీంతో ఈ దారిగుండా వెళ్లే పాదచారులు ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఈ కాలనీలో నివాసం ఉంటున్నవారు దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని వాపోతున్నారు. అనారోగ్యం పాలవుతున్నామని అంటున్నారు. పుర పాలకులకు పట్టదా..? నిత్యం జిల్లా కేంద్రంలో ఉండే.. పురపాలకులు ఈ పనుల జాప్యం విషయంలో ఎందుకు చొరవ చూపించటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటికి మంచినీరు వచ్చే కుళాయి పైప్లైన్లు కట్ అయ్యాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది రెండుమూడు రోజులకు ఒకసారి ట్యాంకర్లతో ఈ రోడ్డున ఉన్న నివాసగృహాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. రోడ్డు సుందరీకరణ పనులు నెమ్మదించడం, ఇక్కడి ప్రజల ఇబ్బందుల విషయమై ఇదే కాలనీకి చెందిన ఓ యువకుడు ట్విటర్లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అతని పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఆక్రమణల విషయంలో ఆలస్యమైంది ఈ రోడ్డులో కొన్ని నిర్మాణాలు మున్సిపల్ రోడ్డును కొంతమేర ఆక్రమించుకుని చేశారు. వాటిని తొలగించి డ్రెయినేజీ నిర్మాణం చేయాల్సి ఉన్నందు వల్ల ఆలస్యమైంది. మరో రెండుమూడు రోజుల్లో డ్రెయినేజీల నిర్మాణం పూర్తిచేసి బీటీ రోడ్డు వేయిస్తాం. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – భాస్కర్, మున్సిపల్ ఇంజనీర్ -
‘హామీ’ల ఊసేది..!
సాక్షి, నూజివీడు: గత ఎన్నికలప్పుడు దాదాపు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఒక్కటంటే ఒక్క హామీ కూడా సమగ్రంగా అమలు చేసింది లేదు. అందుకే ఏ పల్లె చూసినా, ఏ పట్టణం చూసినా నిన్ను నమ్మం బాబూ అంటూ నినదిస్తున్నాయి. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, మున్సిపల్ పారిశద్ధ్య కార్మికుల క్రమబద్ధీకరణ, బాబొస్తే జాబు వస్తుంది, నిరుద్యోగ భృతి తదితర హామీలన్నీ గంగలో కలిపేయడంలో చంద్రబాబును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతు రుణమాఫీని ఐదు విడతలలో డబ్బులు జమ చేస్తామని చెప్పి రైతు కుటుంబాల్లో చిచ్చు పెట్టారు. బ్యాంకుల వడ్డీ చెల్లించకపోవడంతో మహిళల మెడలో పుస్తెలు తాకట్టులో పోయాయి. అనంతరం విడతల వారీగా విదుల్చుతున్న రుణమాఫీ డబ్బులు ఎందుకూ అక్కరకు రాకుండా ఉన్నాయి. దీనిపై ప్రజలు రగిలిపోతున్నారు. డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను డిఫాల్టర్లుగా చేశారు. దీంతో గ్రూపులను మళ్లీ గాడిలో పెట్టేందుకు అపరాధ వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. ఏ ముఖం పెట్టుకుని వస్తారు..! – దేవిరెడ్డి శివ శేషిరెడ్డి, రైతు, నూజివీడు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఐదేళ్లవుతున్నా నేటికీ పూర్తి కాలేదు. రుణమాఫీ హామీని నమ్మి బ్యాంకుల్లో పెట్టిన బంగారం తీసుకురాలేదు. దీంతో బ్యాంకు అధికారులు వడ్డీలు కలుపుకుని నోటీసులు పంపించారు. ఇలా ఇంత వరకు నోటీసులు అందుకోలేదు. రుణమాఫీ మొత్తం చేస్తామని చెప్పి కొర్రీలు పెట్టారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ మా దగ్గరకు వస్తారు. గుర్తున్నామా సీఎం గారూ..? – కోట సుబ్బుమాదిగ, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మార్పీస్ గత ఎన్నికలకు ముందు తెలంగాణలో ప్రచారానికి మిమ్మల్ని రానివ్వకుంటే మాదిగ జాతి అండగా ఉండి స్వాగతించింది. మీ పాదయాత్రలో మాల మహానాడు కార్యకర్తలు రాళ్లురువ్వితే కాపాడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు అండగా నిలుస్తామన్నారు. నిన్ను నమ్మి ఏపీ రాష్ట్రంలోనూ పూర్తిగా మీకు సహకరించాం. నేటికీ మీరిచ్చిన హామీని మాత్రం నెరవేర్చలేదు. బాబూ ఇంక నిన్ను నమ్మం. ఉద్యోగాలే లేవు – రాజశేఖర్, నూజివీడు బాబొస్తే జాబొస్తుందన్నారు...ఇంతవరకు యవతకు ఉద్యోగాలే లేవు. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరిచిపోయారు. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు బాబు మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఓట్లంటూ వస్తే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. బాబుదంతా మోసం –పిడతల ఝాన్సీ, ఎంపీటీసీ సభ్యురాలు యడ్లపాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామిని నమ్మి మోసపోయారు. మహిళా స్వయం సహాయక సంఘాల రుణమాఫీకి శఠగోపం పెట్టారు. అప్పటి వరకు వాయిదాలు కట్టనందుకు పలు సంఘాలు డీఫాల్టర్లుగా మారాయి. మరి కొన్ని సంఘాల నిర్వీర్యమయ్యాయి. ప్రభుత్వం 2015, 2016 సంవత్సరాల్లో రెండు విడతలుగా రూ.3 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. తీరా ఎన్నికలు సమీపించడంతో మళ్లీ మభ్యపెట్టేందుకు యత్నిస్తోంది. ఇదంతా ఎన్నికల కోసమేనని ప్రజలు గ్రహించారు. అందుకే మహిళలందరూ నిన్ను నమ్మం బాబూ అంటూ నినదిస్తున్నారు. -
నాణ్యతకు తిలోదకాలు.!
తాండూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం తాండూర్ మండలంలో అభాసుపాలవుతుంది. ఇష్టారీతిన, నిబంధనలు పాటించకుండా ట్యాంక్‌ల నిర్మాణం చేపడుతుండడంతో ప్రభుత్వ చేరేలా కనిపించడం లేదు. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణంలో నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని ఏడు పంచాయతీల పరిధిలో ప్రభుత్వం మిషన్ భగీరథ పనులు చేపట్టింది. మొత్తం 49 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్‌లైన్ నిర్మాణ పనులను ప్రారంభించింది. 49 నీటి ట్యాంకులలో ఇప్పటికీ 15 ట్యాంకుల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఈ 15లో ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదు. పనుల్లో కనిపించని నాణ్యత... ట్యాంకుల నిర్మాణ పనులు నాణ్యత లేకుండా సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం ఇసుక వాడకం, క్యూరింగ్ సరిగా చేపట్టడం లేదు. దీంతో నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనబడుతుంది. నిర్మాణ పనులకు కాం ట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే సాకుతో అధికారులు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు బాహటంగా విమర్శిస్తున్నారు. పనుల్లో నాణ్య త పాటించక పోవడం, క్యూరింగ్ చేపట్టక పోవడంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేసిన సంఘటనలు ఉన్నా యి. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. అధికారులు నిర్లిప్త ధోరణిని అవలంబిస్తుండడంతో ప నులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేకు ఫిర్యాదు.. మిషన్ భగీరథ పథకంలో జరుగుతున్న పనుల్లో నాణ్యత పాటించడం లేదని పేర్కొంటూ కొందరు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి సైతం తీసుకువెళ్లారని సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మండల పరిధిలో రూ.13.81 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపడుతున్నారు. ఇందులో రూ.8.36 కోట్లతో ట్యాంక్‌ల నిర్మాణం, రూ. 6.95 కోట్లతో అంతర్గత పైప్లైన్లు, నల్లా కనెక్షన్ల పనులు చేపడుతున్నారు. ఇంత భారీగా నిధులు వెచ్చించి చేపడుతున్న పనుల్లో నాణ్యత కనిపించ డం లేదు. చివరకు నిధులు దుర్వినియోగమయ్యే అవకాశముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు పర్యవేక్షణ జరిపి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరుతున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం మిషన్ భగీరథ ట్యాంక్‌ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. పనుల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. క్యూరింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. నాసిరకంగా పనులు చేపతితే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. – దివ్య, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, తాండూర్ -
ఏపీలో నాలుగు రోజులుగా ‘ఆధార్’ బంద్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ సేవలు నిలిచిపోయాయి. మీ సేవా కేంద్రాలకు వెళ్లిన ప్రజలకు సర్వర్ కనెక్ట్ కావడం లేదన్న జవాబు మీ-సేవ కేంద్రాల నిర్వాహకులనుంచి వినవస్తోంది. దీంతో నాలుగు రోజులుగా ఆధార్‌కు సంబంధించి వివిధ సమస్యలపై ప్రజలు మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. సర్వర్ ఎప్పుడు కనెక్టు అవుతుంది.. తమ సమస్యల పరిష్కారం ఎప్పటికి అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా, తప్పుడు ఐడిలతో ఆధార్ అక్రమాలు జరుగుతుండడంతో యుఐడి అధికారులకు అందిన ఫిర్యాదులతో ఆధార్ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే కిందిస్థాయిలో ఈ సమాచారం లేకపోవడంతో గందరగోళం నెలకొంది. -
దమ్ముంటే పార్టీకి రాజీనామా చేసి గెలవాలి
-
పార్టీ ఫిరాయించి వెన్నుపోటు పొడిచారు
-
మంత్రి పదవి కోసం ప్రజలకు ద్రోహం చేశారు
-
జన్మభూమి సభల్లో జనాగ్రహం
ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : జన్మభూమి గ్రామ సభల్లో జనాగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రజల నుంచి గతంలో వచ్చిన విన్నపాలను పరిష్కరించకుండా.. కొత్తగా సమస్యలు తెలుసుకుంటామంటూ గ్రామసభలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులపై జనం తిరగబడుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు భయం భయంగా జన్మభూమి సభల్లో పాల్గొంటున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. నరసాపురం నియోజకవర్గంలో సోమవారం నిరసనలు వ్యక్తమయ్యాయి. నరసాపురం మండలం వేములదీవిలో ఏపీ రైతు సంఘం నాయకులు కవురు పెద్దిరాజు, ఎం.రామాంజనేయులు తదితరులు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు అరగంటపాటు సమావేశం నిలిచిపోయింది. కొవ్వూరు మండలం వాడపల్లిలో 90 ఏళ్ల ఎల్లా వీరమ్మ అనే అంధురాలు నడవలేని స్థితిలో కుటుంబ సభ్యుల సహాయంతో జన్మభూమి సభకు వచ్చింది. తనకు 8 నెలలుగా పింఛను సొమ్ము ఇవ్వడం లేదని వాపోయింది. మద్దూరులో పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, పారిశుద్ధ్యం పడకేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను, ప్రజాప్రతినిధులను గ్రామస్తులు నిలదీశారు. కొవ్వూరు పట్టణంలో నిర్వహించిన సభలో పింఛన్లు ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిడదవోలులో జరిగిన కార్యక్రమంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇచ్చారని.. గత మూడు జన్మభూమి సభల్లో అర్జీలు ఇచ్చిన వారికి ఎందుకు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపాలపురం నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన సభల్లో రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలపై అధికారులను ప్రశ్నించగా, సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడ్డారు. దేవరపల్లి మండలం యాదవోలు, కురుకూరు గ్రామాల్లో జరిగిన సభల్లో పింఛన్లు, ఇంటిస్థలాల కోసం దరఖాస్తులు అందజేశారు. -
బలవంతపు భూసేకరణపై జనాగ్రహం
-
కాంగ్రెస్‌పై ప్రజలు కోపంగా ఉన్నారు: జెడి శీలం
గుంటూరు: కాంగ్రెస్‌పై ప్రజలు కోపంగా ఉన్నారని కేంద్ర మంత్రి జేడీ శీలం చెప్పారు. అయితే ఎప్పటికైనా కాంగ్రెస్‌యే ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుతోపాటు జేడీ శీలం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ను యూటీ చేయకుంటే రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకి స్పష్టం చేసినట్లు కూడా ఆయన తెలిపారు.