ఏపీలో నాలుగు రోజులుగా ‘ఆధార్‌’ బంద్‌ | Adhar band in A.P. | Sakshi
Sakshi News home page

ఏపీలో నాలుగు రోజులుగా ‘ఆధార్‌’ బంద్‌

Published Wed, Jan 17 2018 3:28 PM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM

Adhar band in A.P.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆధార్‌ సేవలు నిలిచిపోయాయి. మీ సేవా కేంద్రాలకు వెళ్లిన ప్రజలకు సర్వర్ కనెక్ట్ కావడం లేదన్న జవాబు మీ-సేవ కేంద్రాల నిర్వాహకులనుంచి వినవస్తోంది. దీంతో నాలుగు రోజులుగా ఆధార్‌కు సంబంధించి వివిధ సమస్యలపై ప్రజలు మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. సర్వర్‌ ఎప్పుడు కనెక్టు అవుతుంది.. తమ సమస్యల పరిష్కారం ఎప్పటికి అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా, తప్పుడు ఐడిలతో ఆధార్ అక్రమాలు జరుగుతుండడంతో యుఐడి అధికారులకు అందిన ఫిర్యాదులతో ఆధార్ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే కిందిస్థాయిలో ఈ సమాచారం లేకపోవడంతో గందరగోళం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement