people suffers
-
వేసవికి ముందే..
ఇల్లెందుఅర్బన్: మండల పరిధిలోని కొత్తపూసపల్లి గ్రా మస్తులకు వేసవి కాలం ప్రారంభం కాకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామంలో 50 కుటుంబాలు నివస్తిస్తున్నాయి. గ్రామం సమీపంలోని బ్రీటీష్ దొరల హాయంలో నిర్మించిన బావిలో నుంచి నీటిని గ్రామంలోని వాటర్ ట్యాంకుల్లోకి సరఫరా చేసి అనంతరం ఇండ్లల్లోకి సరఫరా చేస్తున్నారు. బ్రీటీష్ బావి ద్వా రానే గ్రామస్తులు తమ దాహార్తీని తీర్చుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా జనవరి చివరి వారం నుంచే భానుడి ప్రతాపం చూపిస్తుండటంతో బావిలో నీరు అడుగుంటిపోతోంది. దీంతో ఆరు రోజులకోసారి నీటిని సరఫరా చేయాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నిర్మించిన 5 మినీ వాటర్ ట్యాంకులు నీటి సరఫరా తగ్గిపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ఇది ఇలా ఉండగా 30 ఏళ్ల క్రితం వాటర్‌ట్యాంకులకు నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపులైన్లు పూర్తిగా శిథితమై తరచూ లీకేజీలవుతున్నాయి. దీంతో 20 నిమిషాల్లో నిండాల్సిన ట్యాంకు గంట సమయమైనా కూడ నిండటంలేదని గ్రామస్తులు చెబుతున్నారు. మార్చి చివరి నాటిలోపే బావిలో పూర్తి గా నీరు అడుగంటిపోతుందని అంటున్నారు. ప్రత్యామ్నాయంగా నీటి వసతిని కల్పించేందుకు రొంపేడు పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు. నిరుపయోగంగా ట్యాంకు గ్రామ ప్రజలకు నిరంతరం నీటిని అందిచేందుకు 2004లో సింగరేణి యాజమాన్యం రూ 14లక్షల వ్యయంతో గ్రామంలో ఓవర్ హెడ్‌ట్యాంకు నిర్మించడంతో పాటుగా సింగరేణి యాజమాన్యమే నీటిని సరఫరా చేసింది. కాలక్రమేణా ట్యాంకుకు ఏర్పాటు చేసిన పైపులైన్లు పూర్తిగా ధ్వంసం కాకపోవడంతో దాదాపు 9 ఏళ్లపాటు ట్యాంకు నిరుపయోగంగానే దర్శనమిస్తోంది. నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారేలేరని ఆవేదన వ్యక్తంచేశారు. వారానికోసారి.. గ్రామ ప్రజలకు నీటిని అందించే బ్రిటీష్ కాలంలో నిర్మించిన బావిలో నీరు సగానికిపైగా అడుగంటిపోవడంతో ప్రస్తుతం ఆరు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇటు సింగరేణి యాజమాన్యం, అటు పంచాయతీ అధికారులు కూడ నీటి ఎద్దడి సమస్యను తీర్చడంలో శ్రద్ధ కనబర్చడంలేదు . – కుమారస్వామి, పూసపల్లి నీటి కష్టాలు వేసవి ప్రారంభం కాకముందే పూసపల్లి గ్రామస్తులు నీటి కష్టాలు పడుతున్నారు. బావిలో సరిపడ నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర నీటి సరఫరా చేస్తున్నా పైపులైన్ లీకేజీల ద్వారా ప్రజల దాహార్తీ తీరడంలేదు. ఇప్పటికైనా అ«ధికారులుస్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలి. – బలరాం, పూసపల్లి -
చలి సంపేత్తోంది..!
అనంతపురం : చలి సంపేత్తోంది బాబాబోయ్ అంటున్నారు జిల్లా జనం. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. మడకశిర మండలం ఆర్.అనంతపురంలో ఆదివారం ఉదయం 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లులో 11.9, అగళిలో 12.5, రొద్దంలో 12.8 డిగ్రీలకు పడిపోయింది. అమడగూరు 13.1 డిగ్రీలు, సోమందేపల్లి 13.3, చిలమత్తూరు, నల్లమాడ, గుత్తిలో 13.5, కనగానపల్లి 13.7, గాండ్లపెంట 13.8, పెనుకొండ 13.9 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 14 నుంచి 17 డిగ్రీల మధ్య ఉంటోంది. పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 27 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ ఉదయం 78 నుంచి 90 శాతం మధ్య రికార్డయింది. ఈశాన్య, ఆగ్నేయ గాలులు గంటకు 6 నుంచి 10 కి.మీ. వేగంతో వీచాయి. సాయంత్రం, ఉదయం శీతలగాలులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈసారి జిల్లావ్యాప్తంగా మంచి వర్షాలు పడటం, చెరువులు, కుంటల్లోకి నీరు చేరడం, పంటలు, కొండలు, అటవీ ప్రాంతం పచ్చదనం సంతరించుకోవడంతో సహజంగానే చలి పెరిగింది. తమిళనాడు, కేరళలో అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో ఈనెల మొదట్లో వారం పది రోజులపాటు మేఘాలు ఆవరించడంతో చలి తీవ్రత అంతగా లేదు. కానీ వారం రోజులుగా వాతావరణం మారడంతో చలిపులి ప్రజలను వణికిస్తోంది. సాయంత్రం 6 నుంచి ఉదయం 8 గంటల వరకు చలి ఎక్కువగా ఉంటోంది. వేకువజామున మంచు దుప్పటి పరుచుకుంటోంది. పిల్లలు, వృద్ధులు, రోగులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే పరిస్థితి ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మడకశిర, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, పెనుకొండ ప్రాంతాల్లోనూ చలి ఎక్కువగానే ఉంటోంది. -
చావుదెబ్బ
భానుడు చండ ప్రచండుడిగా మారాడు. సూరీడు నిప్పుల సెగలు కక్కుతున్నాడు. జిల్లాలో ఒక్క ఆదివారం నాడే 44 మంది ఎండదెబ్బకు ప్రాణాలొదిలారు. ఉదయం 8 గంటలు దాటిందంటే బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. వడగాడ్పుల ప్రభావం సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. డబ్బాలో వృద్ధురాలు ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో అబ్బుని సత్తమ్మ(78) అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతిచెందింది. వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి రాగానే వాంతులు చేసుకుని కుప్పకూలింది. మీర్జంపేటలో వృద్ధుడు మీర్జంపేట(క్వాశ్రీరాంపూర్) : మండలంలోని మీర్జంపేటకు చెందిన పెనుగొండ రాజయ్య(60) గోదావరిఖనిలో ఉంటున్న కూతురి వద్దకు శనివారం వెళ్లాడు. వడదెబ్బకు గురై రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతుళ్లు ఉన్నారు. జీలకుంటలో మహిళ ఓదెల : మండలంలోని జీలకుంటకు చెందిన అ గ్గి శోభ ఉరఫ్ మల్లేశ్వరి వడగాడ్పులకు అస్వస్థతకు గురై మృతిచెందింది. శంకరపట్నంలో ఇద్దరు శంకరపట్నం : మండలంలో వడదెబ్బతో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. కేశవపట్నంకు చెందిన అల్లెంకి వీరమ్మ(80), వంకాయగూడెంకు చెందిన నాంపెల్లి కనుకమ్మ(65) వడదెబ్బతో మృతిచెందారు. కమలాపూర్‌లో నలుగురు కమలాపూర్ : మండలంలోని కమలాపూర్, గూడూరు, శ్రీరాములపల్లికి చెందిన నలుగురు వడదెబ్బతో మృతిచెందారు. కమలాపూర్‌కు చెందిన బైక్ మెనానిక్ కొండి సదానందం(65), మౌటం వనమ్మ(50), గూడూరుకు చెందిన తెప్ప కొమురయ్య(60) వడదెబ్బతో ప్రాణాలొదిలారు. శ్రీరాములపల్లికి చెందిన ఇమామ్ పటాన్(60) బండరారుు కొట్టేందుకు వెళ్లి ఎండదెబ్బకు గురయ్యూరు. అర్ధరాత్రి పరిస్థితి విషమించి ప్రాణాలొదిలారు. వేములవాడలో వృద్ధురాలు వేములవాడ అర్బన్ : వేములవాడలోని న్యూఅర్బన్ కాలనీకి చెందిన గొడిశెల బాలవ్వ(70) కూలీ పనులకు వెళ్తుంటుంది. అరుుతే ఎండలు తీవ్రంగా ఉండడంతో అస్వస్థతకు గురై మృతిచెందింది. కరీంనగర్లో వృద్ధుడు కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని సరస్వతినగర్‌లో కర్ర చంద్రారెడ్డి(80) వడదెబ్బకు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరీంనగర్లో యువకుడు కరీంనగర్ : వడదెబ్బతో కరీంనగర్‌లోని 25వ డివిజన్‌కు చెందిన మారుతూరి కిరణ్(30) హార్వెస్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వృత్తి నిమిత్తం ఖమ్మం జిల్లా యశ్వంత్‌రావుపేట మండలం అమ్మగారిపల్లికి వెళ్లాడు. అరుుతే కిరణ్ వడదెబ్బకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించగా మృతిచెందినట్లు డివిజన్ కార్పోరేటర్ కట్ల విద్యసతీశ్ తెలిపారు. మల్కపేటలో వివాహిత మల్కపేట(కోనరావుపేట) : మండలంలోని మల్కపేటకు చెందిన మొగిలి దివ్య(28) రెండు రోజులుగా వ్యవసాయ పనులకు వెళ్తుంది. వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. జాదారావుపేటలో ఉపాధిహామీ కూలీ కాటారం: మండలంలోని జాదారావుపేటకు చెందిన జాకె రాజయ్య(36) నాలుగు రోజుల క్రితం ఉపాధిహామీ పనులకు వెళ్లి అస్వస్థతకు గురయ్యూడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇబ్రహీంపల్లిలో వృద్ధురాలు కాటారం : మండలంలోని చింతకాని పంచాయతీ పరిధిలోని ఇబ్రహీంపల్లికి చెందిన చేరాల సమ్మక్క(65) బహిర్భూమికి వెళ్లి వడదెబ్బకు అస్వస్థతకు గురైంది. ఇంటికొచ్చిన కొద్ది సేపటికే మృతిచెందింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్పంచ్ ఆర్థిక సాయం చేశారు. బెజ్జంకిలో ఇద్దరు.. బెజ్జంకి : మండలంలోని జంగపల్లిలో వడదెబ్బతో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. గుంటుక తులుశవ్వ(75) శనివారం రాత్రి, పంతంగి రాజవ్వ(80) ఆదివారం ప్రాణాలొదిలారు. సుల్తానాబాద్‌లో ఇద్దరు సుల్తానాబాద్: మండల కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన బాదం జయప్రద (70) టీవీ వీక్షిస్తూ హఠాత్తుగా కుప్పకూలింది. వడగాల్పులు అధికంగా రావడంతోనే అస్వస్థతకు గురై మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గొల్లపల్లికి చెందిన బొంకూరి వెంకటయ్య (65) అనే మేకల కాపరి.. అడవి మేకలను తీసుకెళ్లి మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. మంచంలో పడుకుని అలాగే ప్రాణాలొదిలారు. వల్లంపెల్లిలో వృద్ధురాలు వల్లంపెల్లి(మేడిపెల్లి) : మండలంలోని వల్లంపెల్లికి చెందిన సంపతి లింగవ్వ(70) వృద్ధురాలు కూలీ పనులకు వెళ్తుంది. వడదెబ్బకు గురై శనివారం మృతిచెందింది. మానకొండూర్‌లో ముగ్గురు మానకొండూర్: మండలంలో ముగ్గురు మృతి చెందారు. మండలంలోని ఈదులగట్టెపల్లికి చెందిన చెలికాని మల్లమ్మ(70) పింఛన్ డబ్బులు తీసుకునేందుకు వచ్చి అస్వస్థతకు గురై శనివారం రాత్రి మృతిచెందింది. శ్రీనివాస్‌నగర్ గ్రామానికి చెందిన గట్టు లక్ష్మయ్య(55) తన గేదె కోసం గాలించి వడదెబ్బకు గురయ్యూడు. రాత్రరుునా ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇంటికి వెళ్లాడని కుటుంబసభ్యులు భావించగా.. గ్రామంలోని తూర్పు దర్వాజకు సమీపంలో మృతి చెందాడు. వెల్ది గ్రామానికి చెందిన గడమల్ల యాదయ్య(68) అనే వృద్ధుడు అస్వస్థతకు గురై కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు. చీలాపూర్‌లో వృద్ధుడు బెజ్జంకి : మండలంలో చీలాపూర్‌కు చెందిన పరుకాల నర్సయ్య(90) వడదెబ్బకు గురై ఇంటి వద్ద మృతి చెందాడు. ఎండతీవ్రతతో అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బొమ్మకల్‌లో వృద్ధుడు సైదాపూర్‌రూరల్ : మండలంలోని బొమ్మకల్‌కు చెందిన కొంకట ఓదయ్య(75) వడగాడ్పులకు అస్వస్థతకు గురయ్యూడు. పరిస్థితి విషమించి ఆదివారం ప్రాణాలొదిలాడు. చొప్పదండిలో ఇద్దరు చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్‌కు చెం దిన గాండ్ల సత్యనారాయణ(42) అనే రైస్‌మిల్ కార్మికుడు పనిచేస్తూ అస్వస్థతకు గురయ్యూడు. ఆస్పత్రికి తరలించేలోగానే ప్రాణాలొదిలాడు. దేశాయిపేటకు చెందిన కాషపాక సంపూర్ణ(19) వడదెబ్బతో మృతి చెందింది. వెంకటాయపల్లిలో గీతకార్మికుడు గంగాధర : మండలంలోని వెంకటాయపల్లికి చెందిన రావుల మల్లగౌడ్ అనే గీత కార్మికుడు ముంజలు విక్రరుుంచేందుకు ప్రధాన రహదారిపై మూడు రోజులుగా కూర్చోవడంతో అస్వస్థతకు గురయ్యూడు. పరిస్థితి విషమించి ప్రాణాలొదిలాడు. తంగళ్లపల్లిలో యువతి సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల మండలం తంగళ్లపల్లికి చెందిన వడ్నాల మానస(22) పనిపై బయటకు వెళ్లి అస్వస్థతకు గురైంది. ఇంటికొచ్చిన మానస ఒక్కసారిగా కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించేలోగానే మృతిచెందింది. లస్మక్కపల్లిలో వృద్ధురాలు వీణవంక : మండలంలోని లస్మక్కపల్లికి చెందిన మర్రి వీరమ్మ(60) వ్యవసాయ పనులకు వెళ్లింది. ఇంటికి రాగానే అస్వస్థతకు గురై మృతిచెందింది. హుస్నాబాద్‌లో ముగ్గురు హుస్నాబాద్‌రూరల్ : హుస్నాబాద్‌కు చెందిన బొడ్డు వెంకటాద్రి(58), కేశ్వాపూర్‌కు చెంది ఐద నాంపెల్లి(65) రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యూరు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి ప్రాణాలొదిలారు. అక్కన్నపేటకు పంచాయతీ పరిధిలోని పంతుల్నాయక్ తండాకు చెందిన బానోతు ముంజ్యా(65)కు చెందిన గడ్డి వాము ప్రమాదవశాత్తు నిప్పంటుకోగా చల్లార్పే ప్రయత్నంలో వడదెబ్బకు గురై ప్రాణాలొదిలాడు. జగిత్యాలలో వికలాంగురాలు జగిత్యాల అర్బన్ : పట్టణంలోని సాయిరాంనగర్‌కు చెందిన వెంకటేశ్, సత్యవతి దంపతుల కుమార్తె సాయిని అనూష(15) ఆదివారం వడదెబ్బతో మృతి చెందింది. గుల్లపేటలో వృద్ధురాలు జగిత్యాల జోన్ : జగిత్యాల మండలం గుల్లపేటకు చెందిన మెడపట్ల పోషవ్వ(86) ఆదివారం వడదెబ్బతో మృతిచెందింది. జమ్మికుంటలో ఇద్దరు చనపల్లి(జమ్మికుంట రూరల్): మండలంలోని మాచనపల్లికి చెందిన వేల్పుల రాజమ్మ(70), వావిలాలకు చెందిన గుమ్మడవెల్లి మొండయ్య(60) వడదెబ్బతో ప్రాణాలొదిలారు. జగ్గరావుపల్లిలో వృద్ధుడు బోయినపల్లి : మండలంలోని జగ్గారావుపల్లికి చెందిన మల్లయ్య(60) ఆదివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికొచ్చిన వెంటనే కుప్పకూలాడు. చీలాపూర్‌లో వృద్ధుడు బెజ్జంకి : మండలంలో చీలాపూర్‌కు చెందిన పరుకాల నర్సయ్య(90) తీవ్ర ఎండలకు అస్వస్థతకు గురయ్యూడు. పరిస్థితి విషమించడంతో ప్రాణాలొదిలాడు. పెద్దపల్లిలో మహిళ పెద్దపల్లి: పట్టణంలోని బండారుకుంట తాజ్మజీద్ ఏరియాకు చెందిన మీర్జా నబియూబేగం(42) శనివారం కూలీ పనులకు వెళ్లింది. రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆవునూర్‌లో వృద్ధురాలు ముస్తాబాద్ : మండలంలోని ఆవునూర్‌కు చెందిన ఉమ్మనవేని రాజవ్వ(66) ఉదయం పొలానికి వెళ్లింది. తిరిగి ఇంటికొచ్చిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సింగరేణిలో ముగ్గురు.. కోల్‌సిటీ : గోదావరిఖనిలో వడదెబ్బతో ముగ్గురు ప్రాణాలొదిలారు. విజయ్‌నగర్‌కు చెందిన పిక్కల ఓదెలు(59) పనిపై లక్ష్మీనగర్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలాడు. సింగరేణి ఏరి యా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. వినోభనగర్‌కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు తొగరి రాయలింగు(65) అస్వస్థతకు గురై తెల్లవారుజామున మృతిచెందాడు. కాకతీయనగర్‌లో ఆరెకటిక వృత్తి చేసుకునే కుంబార్కర్ లచ్చన్న(55) డయాలసిస్ చేయించుకునేందుకు కరీంనగర్‌కు శనివారం వెళ్లి వచ్చాడు. వడదెబ్బతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
సమ్మె ప్రభావం
- నిలిచిన 360 తెలుగు రాష్ట్రాల బస్సు సర్వీసులు..... - నిత్యం రూ.15 లక్షలు నష్టం - దోచుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు బెంగళూరు : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ కార్మికుల సమ్మె కర్ణాటకలోని ప్రవాసాంధ్రులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ సర్వీసులు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ఆపరేటర్లు టికెట్టు ధరలను భారీగా పెంచేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఫిట్‌మెంట్‌పై స్పష్టతలేక ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ఏవీ ఆయా డిపోల నుంచి బయటకు రావడం లేదు. అందులో భాగంగానే బెంగళూరు డిపో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు కూడా నిలిచిపోయాయి. బెంగళూరు డిపో నుంచి నిత్యం తెలంగాణ ప్రాంతానికి (హైదరాబాద్)కు 36 సర్వీసులు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు 324 బస్సు సర్వీసులు ఉన్నాయి. రిజర్వేషన్ చేయించుకుని (బెంగళూరు నుంచి) సగటున ప్రతి నిత్యం 2వేల మంది ఇరు రాష్ట్రాల్లోని వారు ప్రయాణం చేస్తుంటారు. మరో ఆరు వేల మంది అన్రిజర్వ్డ్ కేటగిరీలో బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కాగా ప్రస్తుతం రవాణా ఉద్యోగుల సమ్మె వల్ల బెంగళూరులోని తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలకు రోజుకు దాదాపు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ విషయమై బెంగళూరు డిపో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రవీంధ్ర మాట్లాడుతూ...‘బెంగళూరులో మొత్తం 19 మంది సిబ్బంది ఉండగా ఐదుగురు తప్ప మిగిలిన వారంతా సమ్మెలో ఉన్నారు. అందువ ల్లే బస్సులు నడపలేకపోతున్నాం. దీంతో రిజర్వేషన్ టికెట్ల రూపంలోనే రోజుకు రూ.10 లక్షల ఆదాయాన్ని కోల్పోతున్నాం.’ అని పేర్కొన్నారు. దోచుకుంటన్న ప్రైవేటు ఆపరేటర్లు వేసవి సెలవులతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ సమయంలో సాధారణం కంటే ఎక్కువ మంది బెంగళూరులోని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు తమ సొంత ఊళ్లకు వెలుతుంటారు. వీకెండ్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఐటీ రంగంలోని ఉద్యోగులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, నెల్లూరుకు వెళ్లడం పరిపాటి. అయితే ప్రభుత్వ స ర్వీసులు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైలు, ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. బస్సులు లేకపోవడంతో అందుకు అనుగుణంగా రైల్వేశాఖ బోగీలనుకాని రైల్వే సర్వీసులను కాని పెంచలేదు. ఈ విషయాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు టిక్కెటు ధరలను రెట్టింపు ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా సంబంధిత ప్రైవేటు ఆపరేటర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్లడానికి మెజెస్టిక్‌కు శుక్రవారం సాయంత్రం వచ్చిన సుప్రియా అనే ప్రయాణికురాలు వాపోయారు. -
సమ్మెట దెబ్బ
- నిలిచిపోయిన బస్సులతో ప్రయాణికుల పాట్లు - అధిక ధరలు దండుకున్న ప్రైవేట్ ఆపరేటర్లు - 120 సర్వీసులు నడిపిన ఆర్టీసీ అధికారులు - తాత్కాలిక ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ విజయవాడ : జిల్లాలో ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు ఆగిపోయాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు బుధవారం ఉదయం నుంచి సమ్మెబాట పట్టారు. వందల సంఖ్యలో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మరోవైపు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులు మాత్రం యథావిధిగా వెళ్లిపోయాయి. అధికార తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన టీఎన్టీయూసీ మినహా అన్ని సంఘాలు పాల్గొనడంతో మొదటి రోజు సమ్మె పూర్తిస్థాయిలో విజయవంతమైంది. టీఎన్టీయూసీ కార్మికులు విధులకు హాజరయ్యేందుకు యత్నించగా ఎంప్లాయీస్ యూనియన్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు సంఘాల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మరోవైపు సమ్మె ప్రభావం ఆర్టీసీ ఆదాయంపై కూడా పడింది. బుధవారం ఒక్కరోజే రూ.1.42 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 10 నెలలుగా విన్నపాలు... తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు గత పది నెలలుగా అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించాయి. ప్రధానంగా 2013 ఏప్రిల్ నుంచి పేస్కేల్ వేతన సవరణ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు 43 శాతం ఫిట్మెంట్, అంతకుముందు రావాల్సిన 19 శాతం ఫిట్మెంట్ కలిపి ప్రకటించాలని, సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్న 60 రోజులను స్పెషల్ లీవ్‌గా పరిగణించాలని తదితర డిమాండ్లను ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి. దీనిపై మంత్రి శిద్దా రాఘవరావు, ఆర్టీసీ ఎండీతో ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో బుధవారం ఉదయం నాలుగు గంటల నుంచి సమ్మె మొదలుపెట్టారు. దీంతో జిల్లాలోని 14 డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా విజయవాడ బస్టాండ్‌లో బస్సులు పూర్తిస్థాయిలో డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలతో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నాగరాజు విజయవాడ జోన్‌లోని మూడు జిల్లాల్లో ఉన్న అద్దె బస్సుల్ని ప్రైవేట్ డ్రైవర్లతో నిర్వహించాలని ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జిల్లాలో 120 బస్సు సర్వీసులు రాకపోకలు సాగించాయి. దీంతో 8 లక్షల మేర ఆదాయం వచ్చింది. జిల్లాలోని దగ్గర ప్రాంతాలకు మాత్రమే బస్సుల రాకపోకలు సాగాయి. మరోవైపు సమ్మె నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ యూనియన్‌కు నేషనల్ మజ్దూర్ యూనియన్‌తో పాటు అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. బస్సుల్ని అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు... మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం మధ్యాహ్నం నుంచి రోజువారీ వేతనంపై డ్రైవర్లను, కండక్టర్లను నియమించింది. డ్రైవర్‌గా పనిచేయటానికి 170 మంది, కండక్టర్‌గా పనిచేయటానికి 300 మంది వరకు విజయవాడ బస్టాండ్‌లో దరఖాస్తులు అందజేశారు. ఈ క్రమంలో దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియను కార్మిక సంఘాలు అడ్డుకొని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలో 120 మంది డ్రైవర్లు, 120 మంది కండక్టర్లను రోజువారీ వేతనం కింద నియమించుకొని 120 సర్వీసుల్ని నడిపారు. రోజువారీ వేతనంపై నియమితులైన కార్మికులు డిపోల నుంచి బస్సులను తీస్తున్న క్రమంలోనూ ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బస్సుల్ని అడ్డుకొని నిరసన తెలిపాయి. దీంతో పోలీసుల పహారా నడుమ బస్సులను బయటికి తీసుకెళ్లారు. గురు, శుక్రవారాల్లో సగటున 500 బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. యథేచ్ఛగా ప్రైవేటు దోపిడీ... ఆర్టీసీ సమ్మెతో ప్రైవేట్ బస్సుల దోపిడీ యథేచ్ఛగా సాగింది. హైదరాబాద్‌కు టిక్కెట్ ధర కంటే సగటున రూ.100 నుంచి రూ.300 వరకు అధికంగా వసూలు చేశారు. విజయవాడ నుంచి 100 ప్రత్యేక సర్వీసుల్ని నడిపారు. బెంగళూరు, చైన్నైకి రూ.300 నుంచి రూ.500 వరకు అధికంగా వసూలు చేశారు. ఆర్టీసీ బస్సులు లేకపోవటంతో ప్రెవేట్ బస్సులు నూరుశాతం ఆక్యుపెన్సీతో రాకపోకలు సాగించాయి.