perala chandrashekar rao
-
తెలుగింటి బతుకమ్మ సంబరాల వీడియో
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండగ విశిష్టత, ప్రత్యేకతలపై బీజేపీ రూపొందించిన ‘తెలుగింటి బతుకమ్మ సంబరాలు’వీడియోను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పేరాల చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ గ్రామీణ అస్తిత్వాన్ని తెలిపే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బతుకమ్మ ఉత్సవాలను ప్రజలు చక్కగా వినియోగించుకున్నారని వ్యాఖ్యానించారు. కాగా, రాష్ట్రంలోని న్యాయవాదులు తమ డిమాండ్లను బీజేపీ మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. ఈమేరకు బీజేపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మల్లారెడ్డిని పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేయగా, వారి డిమాండ్లను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని మల్లారెడ్డి తెలిపారు. -
అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి
నిధుల సద్వినియోగం, సేంద్రియ వ్యవసాయంపై దృష్టి అవసరం నెహ్రూ యువ సంఘటన ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు హన్మకొండ : గ్రామ సమగ్రాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని నెహ్రూ యువ సంఘటన జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు అన్నారు. హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్ కాలేజీ సెమినార్ హాల్లో నైబర్‌హుడ్ యూత్ పా ర్లమెంట్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం యువజన సంఘాలకు క్రీడా సామగ్రి పం పిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నెహ్రూ యువ సంఘటన జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్ జ్యోతి వెలిగించి ప్రా రంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలకు పంపిస్తున్న నిధులు సక్రమంగా వినియోగమవుతున్నాయా లేదా అనే విషయంలో యువజనులు దృష్టి సారించాలన్నారు. అలాగే, యువత నైపుణ్యాలు పెం పొందించుకోవాలన్నారు. నైపుణ్యాలుం టేనే రాణిస్తామన్నారు. అంతేకాకుండా రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాల్సిన బాధ్యత యువజన సంఘాలపై ఉందన్నారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ రామనుజాచారి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ మనోరంజన్ పాల్గొన్నారు. -
'ముసుగు పాలన నుంచి సీఎం బయటకు రావాలి'
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఏ పని కావాలన్నా కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని, అయితే సీఎం కేసీఆర్ అహంకారం వల్లే ప్రజలకు అన్యాయం జరుగుతోందని నెహ్రూ యువకేంద్రం ఆల్ ఇండియా వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇప్పటి వరకు ప్రధానిని రాష్ట్రానికి పిలువకపోవడం బాధాకరమన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. రాజులు, జమీందారి పాలన ముసుగు నుంచి కేసీఆర్ బయటకు రావాలని సూచించారు. శనివారం నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో చంద్రశేఖర్‌రావు విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల బడ్జెట్‌ను రైతులు, పేదలు, మధ్యతరగతి వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గతంలో 50 శాతం పంట నష్టపోతేనే నష్టపరిహారం ఇచ్చేవారని, ఇప్పుడు 30 శాతం పంటనష్ట పోయినా పరిహారం అందుతోందన్నారు.