person commit suicide
-
సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
స్థలానికి పట్టా చేయకపోవడంతో మనస్తాపం వికారాబాద్ టౌన్: అధికారులు సర్టిఫికెట్ ఇచ్చిన స్థలాన్ని పట్టా చేయాలని ఆయన ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగాడు. కాగా, సదరు స్థలం తమదంటూ మున్సిపల్, మార్కెట్ కమిటీ అధికారులు పేచీ పెట్టారు. జీవనాధారమైన స్థలం కోల్పోతానేమోనని మనస్తాపం చెందిన ఆయన కలెక్టర్‌కు విన్నవించాలనుకున్నాడు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన ఈ ఘటన మంగళవారం జరిగింది. పట్టణంలోని ఎడ్ల బజార్ సమీపంలో ఉండే లక్ష్మయ్య(55)కు వికలాంగురాలైన భార్య బాలమణి, ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఆయన స్థానిక మార్కెట్లో ఎద్దుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వికారాబాద్ సుభాష్‌నగర్ రోడ్డులో 1961 నుంచి సర్వేనంబర్ 20లో ఆయన 260 గజాల స్థలం కబ్జాలో ఉంది. కాగా, తన ఐదుగురు అన్నదమ్ములతో కలిసి అందులో పాక వేసుకొని గేదెలను సాకుతున్నాడు. సదరు స్థలం తనకు కేటారుుంచాలని లక్ష్మయ్య అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కలెక్టర్లను వేడుకున్నాడు. దీంతో అధికారులు 1998లో ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చారు. స్థలాన్ని పట్టా చేసుకోవాలని లక్ష్మయ్య మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా మార్కెట్ కమిటీ వాళ్లు స్థలం తమదంటూ పేచీ పెట్టారు. దీంతో వ్యవహారం కోర్టులో నడుస్తోంది. స్థలం పట్టా చేసిస్తామని ఇటీవల లక్ష్మయ్య నుంచి మార్కెట్ కమిటీ అధికారులు రూ.3లక్షలు కట్టించుకొని అనంతరం వేధించసాగారు. రెండు శాఖల అధికారులు ఇబ్బంది పెట్టడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మనస్తాపం చెందిన లక్ష్మయ్య సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వీడియో కాన్ఫరెన్స కోసం వచ్చిన కలెక్టర్ దివ్యను కలిసి విన్నవించుకోవాలని భావించాడు. ఆమె అందుబాటులో లేకపోవడంతో తనతో తెచ్చుకున్న పురుగులమందును కార్యాలయం దగ్గర తాగేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని పట్టణంలోని మిషన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. లక్ష్మయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. -
సీఎం సభా ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటపల్లి ప్రాజెక్టు సభా ప్రారంభానికి ముందే, గురువారం సభా ప్రాంగణం పరిసరాలలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం, ఎం.రాజపురానికి చెందిన కొప్పర దుర్గారావు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం రాత్రి 9 గంటలకు బయటకు పొక్కింది. దీనికి సంబంధించి స్థానిక ఏరియా ఆస్పత్రిలో బాధితుని సోదరి కొప్పర జ్యోతి అందించిన వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం కవిటి పంచాయతీ ఎం.రాజపురం గ్రామానికి చెందిన కొప్పర దుర్గారావు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఉల్లిభద్రలో ముఖ్యమంత్రి సభ వద్ద ఎండ్రిన్ తాగి, అనంతరం సమీపంలోని ఉన్న పోలీసు వద్దకు వెళ్లి, ఆతని కాళ్లపై పడి ‘నేను ఎండ్రిన్ తాగాను, చచ్చిపోతున్నాన’ని చెప్పాడు. దీంతో పోలీసులు అతనిని ఆస్పత్రికి తరలించారు. దుర్గారావుకు మూడు నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
పోలీసులకు భయపడి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ముంగిమళ్ల (కోస్గి): భార్య ఆత్మహత్య కేసులో 45 రోజులపాటు జైలుశిక్ష అనుభవించి వచ్చిన ఓ వ్యక్తి మరోసారి పోలీసు కేసు నమోదవుతుందని భయపడి కిరోసిన్‌తో నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన మండలంలోని ముంగిమళ్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి సాయప్ప (22) భార్య ఉమాదేవి రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో గృహహింస చట్టం కింద భర్తతోపాటు అత్త, మామలపై కేసు నమోదైంది. ఈ కేసులో తల్లిదండ్రితోపాటు సాయప్ప జైలుకెళ్లాడు. 45 రోజులపాటు జైలుశిక్ష అనుభవించి వారంరోజుల క్రితమే విడుదలై గ్రామానికి వచ్చారు. ఇదిలా ఉండగా గురువారం గ్రామంలో మద్యం విక్రయించే ఓ బెల్టు దుకాణానికి వెళ్లగా అక్కడ గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో దుకాణదారులు కొందరు గ్రామస్తులతో కలిసి సాయప్పపై దాడిచేయడంతోపాటు దొంగతనం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి గ్రామానికి వెళ్లి సంఘటనపై విచారణ జరిపి శుక్రవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించి వెళ్లిపోయారు. దీంతో మరోసారి జైలుకెళ్లాల్సి వస్తుందేమోనని భయపడి సాయప్ప శుక్రవారం ఉదయం కిరోసిన్ తీసుకొని వ్యవసాయ పొలానికి వెళ్లి నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఇదే విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరణ కోరగా.. అలాంటిదేమీ జరగలేదంటూ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు.