సెల్ టవరెక్కి ఆందోళన
ఆదిలాబాద్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి శుక్రవారం ఉట్నూర్‌లో సెల్ టవర్ ఎక్కి ఆందోళన నిర్వహించాడు. స్థానికుల కథనం ప్రకారం... ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్‌కు చెందిన ఇమ్రాన్‌ఖాన్ కొన్నేళ్లుగా మండల కేంద్రంలోని గంగన్నపేట్‌లో నివాసముంటున్నాడు.
కొద్ది నెలల క్రితం అతడి భార్య షేక్ షీమాతో విడాకులు తీసుకున్నారు. ఆమె పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో మనస్తాపం చెందిన ఇమ్రాన్‌ఖాన్ తనకు న్యాయం చెయ్యూలంటూ సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని కిందకు దించే ప్రయత్నం చేశారు. అతడి తల్లి కుర్షీద్ ఉన్నిసాతో సెల్లో మాట్లాడించినా దిగిరాలేదు. రాత్రి వరకు కూడా ఇమ్రాన్‌ఖాన్ కిందకు దిగలేదు.