అ‘ధనం’ మీ చేతికొస్తే..!
ఇన్వెస్ట్‌మెంట్‌కు రకరకాల సాధనాలు
రియల్టీ నుంచి బాండ్ల వరకూ చూడొచ్చు
నెల జీతంతోనూ ఆర్డీ, సిప్ వంటివి చేయొచ్చు
సేవింగ్స ఖాతాలో పడేయటం లాభదాయకం కాదు
సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
ఏడవ వేతన సంఘం సిఫారసులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు బాగా పెరిగాయి. అంతేకాక ఏడు నెలల బకాయిలు కూడా వచ్చేశాయి. కేంద్ర సర్వీసుల నుంచి రిటైరైన వారికీ అధిక పెన్షన్లతో పాటు బకాయి అందాయి. ఇవే కాదు. భూమి లేదా ఇల్లు అమ్మితే వచ్చే ధనం... ఆస్తి పంపకాలు లేదా ఇతర లావాదేవీల్లో పెద్ద ఎత్తున అదనపు సొమ్ము... వీటన్నిటినీ ఎలా సద్వినియోగం చేసుకోవాలోనన్న విషయమై చాలా మందిలో గందరగోళం నెలకొంటుంది. అదనపు ధనం అకస్మాత్తుగా వస్తే ఏం చేయాలో తోచదు. ఎలాంటి ప్రయోజనం లేని విలాసాల కోసం ఖర్చు చేసేస్తారు. లేదా నామమాత్ర రాబడి వచ్చే సేవింగ్స ఖాతాలో పడేస్తారు. ఈ అ‘ధనం’ నిధులను ఎలా సమర్థంగా వినియోగించుకోవాలో, ఆర్థిక భవిష్యత్తును మరింత భద్రతనిచ్చేలా ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెబుతున్న నిపుణుల సూచనలివి...
సుకన్య సమృద్ధి యోజన
పెట్టుబడులు పెట్టడానికి సుకన్య సమృద్ధి యోజన ఒక మంచి స్కీమ్. పది సంవత్సరాలలోపు వయస్సున్న కూతురు ఉంటేనే ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏడాది ఇన్వెస్ట్మెంట్ పరిమితి రూ.1.5 లక్షలు. ఈ ఇన్వెస్ట్మెంట్స్, విత్డ్రాయల్స్పై సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. భవిష్యత్తులో దీనిని ప్రభుత్వ బాండ్ల ఈల్డ్లతో అనుసంధానించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయినప్పటికీ, పీపీఎఫ్ కంటే అధిక రాబడులే వస్తాయనే అంచనాలున్నాయి.
రియల్టీలో పెట్టుబడి పెట్టండి..
ప్లాటో, ఫ్లాటో కొనగలిగే స్థాయిలో అదనపు డబ్బులొస్తే, వాటిని కొనుగోలు చేయడమే మంచి పని. స్థలాలకు, ఇళ్లకు డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గుతుందనే సమస్యే లేదు. వీటిని కొనుగోలు చేస్తే స్వల్పకాలంలోనే మంచి రాబడులొస్తాయి. మీకు ఇప్పటికే సొంత ఇల్లున్నా కానీ, మరో ఇంటినో, స్థలాన్నో కొనుగోలు చేస్తే మంచిదే. కానీ రియల్టీ కొనుగోళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా అంతా పక్కాగా ఉన్న ఆస్తులనే కొనుగోలు చేయడం మంచిది.
అత్యవసర నిధి..
అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం అత్యంత ప్రాధాన్యమైన అంశం. మీ వయస్సు, ఆర్థిక పరిస్థితులు, మీపై ఆధారపడి ఉన్నవాళ్లు తదితర అంశాలు ఆధారంగా ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు యుక్త వయస్సులో ఉండి, మీపై ఆధారపడి ఉన్నవాళ్లు ఎవరూ లేకపోతే, మీ నెలవారీ ఖర్చులన్నింటినీ లెక్కవేసి, దానికి మూడు రెట్ల మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు మధ్య వయస్సులో ఉన్నా, మీపై ఇద్దరు అంతకు మించి ఆధారపడ్డ వాళ్లు ఉన్నా, మీ నెలవారీ ఖర్చులకు ఆరు రెట్ల మొత్తం అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక వేళ మీరు రిటైరైనా, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నా కూడా రెండు సంవత్సరాల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పటికే అత్యవసర నిధి ఏర్పాటు చేసుకుంటే, ఈ నిధి మొత్తంలో కనీసం 10-25% వరకూ అదనంగా జమ చేయండి.
ఖరీదైన అప్పును తీర్చేయండి..
అధిక వడ్డీరేట్లు ఉండే క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత, ఇతర ప్రైవేట్ రుణాలను చెల్లించివేయండి. అధికంగా మీకు సొమ్ములు వచ్చినప్పుడు ఇలాంటి ఖరీదైన అప్పుల్లో కొంత భాగాన్ని గానీ, వీలైతే పూర్తిగా కానీ తీర్చివేయండి. ఇలా చేస్తే అధిక వడ్డీ భారం మీపై తగ్గుతుంది. నెలా నెలా ఇలా చెల్లించే వడ్డీ మీకు మిగులుతుంది. ఇలా మిగిలే మొత్తాన్ని ప్రయోజనకరమైన ఖర్చులకు వినియోగించుకోవచ్చు.
రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)..
రికరింగ్ డిపాజిట్లలో ఉన్న ఒక మంచి లక్షణం.. మీరు డిపాజిట్ చేసినప్పుడు ఏ వడ్డీరేటు ఉంటుందో, అదే వడ్డీరేటు మీ డిపాజిట్ మెచ్యూరయ్యేదాకా వర్తిస్తుంది. వడ్డీరేట్లలో మార్పు ఉండదు. వడ్డీరేట్లు తగ్గినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకని వేతనం పెరగగానే/అదనపు సొమ్ములు రాగానే ఎంతో కొంత మొత్తంతో ఆర్డీ ప్రారంభించండి. స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యం కోసం రికరింగ్ డిపాజిట్లలో మదుపు చేయండి. పొదుపు చేసే అలవాటును పెంపొందించే సురక్షితమైన సాధనాల్లో ఇదొకటి. బ్యాంకులు పదేళ్ల కాలపరిమితి వరకూ రికరింగ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నారుు. మీ అవసరాలను బ ట్టి కాలపరిమితిని ఎంచుకోవాలి.
మ్యూచువల్ ఫండ్స..
ఏ ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో అయినా షేర్లు కీలకం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి షేర్లలో పెట్టుబడులు మంచి రాబడులను ఇస్తాయి. మీరు మ్యూచువల్ ఫండ్స ద్వారా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. కొత్త ఇన్వెస్టర్లకై తే ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స స్కీమ్) ఫండ్స మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనం. సెక్షన్ 80సీ కింద ఈ ఫండ్సలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పన్ను మినహాయింపులు లభిస్తాయి. వీటిపై వచ్చే రాబడులపై కూడా ఎలాంటి పన్ను పోటు ఉండదు. ఈక్విటీ ఫండ్స ద్వారా ఆర్జించిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులు, పన్ను ప్రయోజనాలూ పొందవచ్చు.
న్యూ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)..
ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి అదనపు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్‌పీఎస్‌లో రూ.50,000 వరకూ ఇన్వెస్ట్ చేయండి. సెక్షన్ 80 సీసీడీ(1బి) కింద అదనపు పన్ను మినహాయింపులు పొందవచ్చు. 30 శాతం పన్ను స్లాబ్ ఉన్న వ్యక్తి రూ.34,550 వరకూ ఇన్వెస్ట్ చేస్తే, అతనికి రూ.15,450 పన్ను ప్రయోజనాలు లభిస్తారుు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ ఫండ్స, కార్పొరేట్ బాండ్ ఫండ్స, ప్రభుత్వ బాండ్ ఫండ్‌సల్లో కలిపి ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ వయస్సుకు తగ్గట్లుగా లైఫ్‌సైకిల్ ఫండ్ కూడా అందుబాటులో ఉంది.
మంత్లీ ఇన్కమ్ ప్లాన్(ఎంఐపీ)..
షేర్లలో ఇన్వెస్ట్ చేయడం మీకు ఇష్టం లేకపోతే, రిస్క్ తక్కువగా ఉండే మంత్లీ ఇన్కమ్ ప్లాన్(ఎంఐపీ)లో గానీ, డెట్ ఫండ్సలో గానీ ఇన్వెస్ట్ చేయండి. ఎంఐపీల నిధుల్లో 15-20 శాతం వాటానే షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన దానిని బాండ్లు, డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తారు. డెట్ ఫండ్స విషయంలో రిస్క్ మరింత తక్కువగా ఉంటుంది. ఇవి ఈక్విటీలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయవు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు కంటే కూడా డెట్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేయడం మంచి ఆప్షన్. డెట్ ఫండ్స ఆదాయం విత్‌డ్రా చేసుకున్నప్పుడు మాత్రమే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను భారం కూడా తక్కువగానే ఉంటుంది. వీటిపై వచ్చే రాబడులు కూడా తక్కువగానే ఉంటాయనుకోండి.
జీవిత బీమా కవర్..
జీవితం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థిక భారాన్ని తగ్గించడంలో జీవిత బీమా తోడ్పడుతుంది. మీ వార్షికాదాయానికి 6-7 ఏళ్ల రెట్లకు బీమా కవర్ ఉండాలి. సంప్రదాయ జీవిత బీమా పాలసీలు అధిక ప్రీమియమ్‌లను వసూలు చేస్తుండగా, టర్మ్ ప్లాన్లు తక్కువ ప్రీమియమ్‌కే అధిక బీమాను కల్పిస్తున్నారుు. అందుకని తక్కువ వ్యయమయ్యే టర్మ్ ప్లాన్ తీసుకోవడం ద్వారా మీపై ఆధారపడ్డవాళ్లకు ఆర్థిక భద్రత భరోసానివ్వండి.
పీఎఫ్ మొత్తాన్ని పెంచండి..
రిటైరైన తర్వాత అవసరాలకు పన్ను పోటు లేని నిధిని ఏర్పాటు చేసుకోవడానికి కంట్రిబ్యూటరీ ప్రావిడెండ్ ఫండ్(సీపీఎఫ్) ఒక మంచి విధానం. వేతనం పెరిగింది కాబట్టి సీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచండి. మీరు నెలవారీ ఉద్యోగులైతే వేతనం పెరగగానే మొదట చేయవలసిన పని ఇదే. మీ వేతనం నుంచి అధిక మొత్తం సీపీఎఫ్లో డిపాజిట్ చేయమని మీ అకౌంట్స్ సెక్షన్‌కు ఒక దరఖాస్తు పెట్టుకోండి.