Petra Laszlo
-
ఆ మహిళా జర్నలిస్టుపై వేటు
-
ఆ మహిళా జర్నలిస్టుపై వేటు
శరణార్థుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన హంగేరీ మహిళా వీడియో జర్నలిస్టు పెట్రా లాజ్లోపై వేటు పడింది. ఆమెపై కోర్టు మూడేళ్ల ప్రొబెషన్ బాన్ విధించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన జెజెడ్ పట్టణ న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. శరణార్థుల పట్ల పెట్రా లాజ్లో ఉద్దేశపూర్వకంగా అవమానవీయంగా ప్రవర్తించిందని కోర్టు తేల్చింది. వీడియో లింకు ద్వారా ఆమె తన వాదనలను కోర్టుకు వినిపించారు. అయితే శరణార్థులపై పెట్రా లాజ్లో జాతివివక్షతో దాడి చేయాలని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. సెర్బియా-హంగరీ సరిహద్దులోని రోజ్కే గ్రామంలో 2015, సెప్టెంబర్ లో శరణార్థుల పట్ల పెట్రా లాజ్లో ప్రవర్తించిన తీరు లోకానికి వెల్లడికావడంతో ఆమె తీవ్ర విమర్శలకు గురయ్యారు. మధ్యదరా సముద్రాన్ని దాటి సెర్బియా గుండా హంగరీలోకి ప్రవేశించిన శరణార్థులకు కాళ్లు అడ్డంపెట్టి పడేసింది. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. శరణార్థులను హింసించిన దృశ్యాలు బయటకు రావడంతో ఎన్1 టీవీ యాజమాన్యం ఆమెను డిస్మిస్ చేసింది. ఉద్యోగ బాధ్యతలు వదిలిపెట్టి జాత్యంహకారంతో ప్రవర్తించినందుకు ఆమె కోర్టు విచారణ ఎదుర్కొవాల్సి వచ్చింది. కోర్టు తీర్పును అప్పీలు చేస్తానని పెట్రా లాజ్లో తెలిపింది. -
మహిళా జర్నలిస్ట్ పైశాచికం
-
మహిళా జర్నలిస్ట్ పైశాచికం
మానవత్వం: నిలుఫర్ డెమిర్.. అలలపై నిద్రిస్తున్నట్లుగా చనిపోయిన అయలన్ కుర్దీ పొటోను తీసి, శరణార్థుల సంక్షోభాన్ని తాత్కాలికంగానైనా నిరోధించిన ధీరోదాత్త మహిళా జర్నలిస్ట్ కమ్ ఫొటోగ్రాఫర్. పైశాచికం: పెట్రా లాజ్లో.. ఎన్1 టీవీ అనే ఛానెల్ లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న ఈమె.. కుర్దీ చావుతో తెరుచుకున్న యూరప్ మార్గాల గుండా కొత్త లోకంలోకి ప్రవేశిస్తున్న.. దాదాపు కుర్దీ వయసే ఉన్న చిన్నారులపై తన పైశాచికాన్ని ప్రదర్శించింది. భయంతో పరుగుపెట్టిన పిల్లలకు కాళ్లు అడ్డంగా పెట్టి కిందపడేలా చేసింది. బ్యాగ్రౌండ్: అది సెర్బియా- హంగరీ సరిహద్దులోని రోజ్కే గ్రామం. మధ్యదరా సముద్రాన్ని దాటి సెర్బియా గుండా హంగరీలోకి ప్రవేశించే సిరియా శరణార్థులను తనిఖీ చేసే ప్రదేశం. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తనిఖీల కోసం బిలబిలమంటూ శరణార్థులు పరుగుపెట్టారు. వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అలా పరుగెడుతూ తన దగ్గర్నుంచి వెళుతున్న వారికి కాళ్లు అడ్డంపెట్టి పడేసింది పెట్రా లాజ్లో. నిజానికి ఆమె అక్కడికొచ్చింది శరణార్థుల బాధలు షూట్ చేయడానికి! టీవీల్లో ప్రసారం: అలా పెట్రా శరణార్థులను హింసించిన దృశ్యాలు వేరొక ఛానెల్ కు చెందిన కెమెరాకు చిక్కాయి. గత మంగళవారం ప్రసారమైన కార్యక్రమంలో పెట్రా పైశాచికాన్ని ప్రపంచమంతా వీక్షించింది. దీంతో ఆమెను డిస్మిస్ చేయక తప్పలేదు.. ఎన్1 టీవీ యాజమాన్యానికి.