Petronet LNG
-
5ఏళ్లు, రూ.40వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ద్రవ రూపంలోని సహజ వాయువు (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్/ఎల్ఎన్జీ) తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ వచ్చే 4–5 ఏళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విదేశాల్లోని ప్లాంట్లపై కలిపి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్టు సంస్థ సీఈవో ఏకే సింగ్ వెల్లడించారు. ’’పెట్రోనెట్ ఎల్ఎన్జీ రూ.12,500 కోట్లతో ప్రొపేన్ డీహైడ్రోజెనరేషన్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. దిగుమతి చేసుకున్న ముడి సరుకు నుంచి ప్రాపీలేన్‌ను ఈ ప్లాంట్ తయారు చేస్తుంది. అలాగే, ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద రూ.1,600 కోట్లతో ఎల్ఎన్జీ దిగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం’’ అని సింగ్ తెలిపారు. తాము ఎప్పటికప్పుడు విదేశీ పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తుంటామని, దేశానికి ప్రయోజనకరం, మెరుగైనది అనిపిస్తే తప్పకుండా ముందుకు వెళతామని చెప్పారు. విద్యుత్, ఫెర్టిలైజర్, సీఎన్జీ అవసరాలను దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు సగం మేరే తీరుస్తోంది. మిగిలినది దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ‘‘రూ.600 కోట్లతో గుజరాత్‌లోని దహేజ్ ఎల్ఎన్జీ దిగుమతి టర్మినల్ సామర్థ్యాన్ని ప్రస్తుత 17.5 మిలియన్ టన్నుల (వార్షిక) నుంచి 22.5 మిలియన్ టన్నులకు పెంచుకుంటాం. రూ.1,245 కోట్లతో అదనపు స్టోరేజీ ట్యాంకు సమకూర్చుకుంటాం’’ అని సింగ్ తెలిపారు. దేశీయంగా ఎల్ఎన్జీ దిగుమతి సామర్థ్యం, పెట్రోకెమికల్ వ్యాపారం కోసం ∙రూ.17,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. -
పెట్రోనెట్ భారీ పెట్టుబడులు

ఆ సంస్థలోని వాటాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్
న్యూఢిల్లీ: పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఇంద్రప్రస్థ గ్యాస్(ఐజీఎల్)లో గల వాటాల విక్రయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ప్రభుత్వ రంగ దిగ్గజం బీపీసీఎల్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌లో మెజారిటీ వాటా విక్రయ సన్నాహాల్లో ఉన్న నేపథ్యంలో కంపెనీ తాజా వివరణ ఇచ్చింది. బీపీసీఎల్‌ను సొంతం చేసుకోనున్న కొత్త ప్రమోటర్ పెట్రోనెట్, ఐజీఎల్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇవ్వడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మినహాయింపును కోరామని, స్పందన వెలువడవలసి ఉన్నదని కంపెనీ సీఎఫ్‌వో వీఆర్కే గుప్తా పేర్కొన్నారు. బీపీసీఎల్‌కు ఐజీఎల్‌లో 22.5 శాతం, పెట్రోనెట్‌లో 12.5%చొప్పున వాటాలు న్నాయి. ఈ 2 కంపెనీలకూ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం బీపీసీఎల్లోగల 52.98 శాతం వాటాను డిజిన్వెస్ట్ చేస్తున్న విషయం విదితమే. -
బీపీసీఎల్ కొత్త యజమాని ఓపెన్ ఆఫర్ ఇస్తే?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ బీపీసీఎల్ ప్రైవేటీకరణలో ఓ అంశం కీలకంగా మారింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్)లో 22.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీ కంపెనీలో 12.5 శాతం చొప్పున బీపీసీఎల్‌కు వాటాలున్నాయి. బీపీసీఎల్‌లో ప్రభుత్వం తనకున్న 52.98 శాతం వాటాను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రైవేటీకరించే కసరత్తులో ఉన్న విషయం తెలిసిందే. బీపీసీఎల్‌ను కొనుగోలు చేసిన కొత్త యజమాని.. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐజీఎల్‌లో వాటాదారులకు 26 శాతం వాటాలను అదనంగా కొనుగోలు చేసేందుకు నిబంధనల మేరకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది విజయవంతం అయితే అప్పుడు ఐజీఎల్‌లో బీపీసీఎల్‌కు 48.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీలో 38.5 శాతానికి వాటాలు పెరుగుతాయి. దీంతో ఈ కంపెనీల్లో ఇప్పటికే వాటాలు కలిగిన ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), ఓఎన్జీసీ, గెయిల్ కంటే కూడా బీపీసీఎల్ పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా ఐజీఎల్, పెట్రోనెట్ రెండూ కూడా ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలన్నది కేంద్రం యోచన. కనుక ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెబీని కోరింది. ఈ అభ్యర్థన బీపీసీఎల్ నుంచి రావాలని సెబీ సూచించడంతో.. బీపీసీఎల్ ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది. ఒకవేళ సెబీ నుంచి మినహాయింపు రాని పక్షంలో.. అప్పుడు పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐజీఎల్ వాటాదారులకు ఇచ్చిన ఓపెన్ ఆఫర్లో ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్ కూడా పాల్గొని అదనపు వాటాలను కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే పెట్రెనెట్, ఐజీఎల్‌కు ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్ కూడా ప్రమోటర్లుగానే ఉండడంతో ఓపెన్ ఆఫర్లో పాల్గొనే అర్హత వాటికి కూడా ఉంటుంది. దీంతో బీపీసీఎల్ ప్రైవేటు పరం అయినా.. ఐజీఎల్, పెట్రోనెట్పై పీఎస్‌యూల ఆధిపత్యం కొనసాగే వీలుంటుంది. -
పెట్రోనెట్ ఎల్ఎన్జీ 1:1 బోనస్
♦ 92 శాతం పెరిగిన నికర లాభం ♦ ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్ న్యూఢిల్లీ: పెట్రోనెట్ ఎల్ఎన్జీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 92% పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.245 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.471 కోట్లకు పెరిగిందని పెట్రోనెట్ ఎల్ఎన్జీ పేర్కొంది. తమ కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభమని కంపెనీ డైరెక్టర్(ఫైనాన్స్) ఆర్.కె.గార్గ్ చెప్పారు. టర్మినల్ చార్జీలు పెరగడం, అధిక పరిమాణంలో గ్యాస్‌ను ప్రాసెస్ చేయడం వల్ల ఈ స్థాయి నికర లాభం వచ్చిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి లాభం 87% లాభంతో రూ.1,706 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇది కూడా రికార్డ్ లాభమని వివరించారు. ఒక షేర్‌కు మరో షేర్‌ను(1:1) బోనస్‌గా ఇవ్వనున్నట్లు తెలిపారు. గతేడాదికిగాను షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను(50 శాతం) ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఆధీకృత వాటా మూలధనాన్ని రూ.1,200 కోట్ల నుంచి రూ.3,000 కోట్లకు పెంచుకోవడానికి బోర్డ్ ఆమోదం లభించింది.