ప్రవేశాలు
పీహెచ్డీ ఎలిజిబిలిటీ టెస్ట్-2014
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ వివిధ విభాగాల్లో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘పీహెడ్డీ ఎలిజిబిలిటీ టెస్ట్-2014’ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుతో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. యూజీసీ నెట్/సీఎస్ఐఆర్ నెట్/ ఏపీసెట్/ జెస్ట్ అర్హత ఉన్నవారు, ఉస్మానియా వర్సిటీ నుంచి రెగ్యులర్ విధానంలో ఎంఫిల్ చేస్తున్న అభ్యర్థులు, అలైడ్ సబ్జెక్టులతో పీహెచ్డీ చేస్తున్నవారు ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జూలై 10 - ఆగస్టు 10
వెబ్సైట్: www.osmania.ac.in
పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన దూరవిద్యా కేంద్రం (పీజీఆర్ఆర్సీడీఈ) ‘పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్’ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వ్యవధి: ఏడాది రెగ్యులర్ కోర్సు
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సైన్స్/ అగ్రికల్చర్/ వెటర్నరీ/ మెడిసిన్/ ఫార్మసీ/ ఇంజనీరింగ్/ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
దరఖాస్తు: ‘Director, PGRRCDE, Osmania University‘ పేరుతో రూ.300 డీడీ చెల్లించి, దూరవిద్యా కేంద్రం నుంచి వ్యక్తిగతంగా పొందవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది:ఆగస్టు 22
వెబ్సైట్: www.oucde.ac.in