Philadelphia city
-
ఘనంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావుతో మీట్ & గ్రీట్
అమెరికాలో 'తానా' 23వ మహా సభలు ఘనంగా జరగనున్నాయి. వచ్చే ఏడాది జులై 7, 8, 9 తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న మహా సభల్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సభలకు అంజయ్య చౌదరి లావు అధ్యక్షులుగా, రవి పొట్లూరి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్ట్ 20న కన్వెన్షన్ కన్వీనర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్ అట్లాంటిక్ జట్టు ఫిలడెల్ఫియా స్థానిక నాయకులు, వలంటీర్లతో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావుతో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. 300 మంది ఫిలడెల్ఫియాలో జరిగిన కార్యక్రమానికి 300 మంది హాజరై తమ మద్దతు ప్రకటించారు. అందుకు ఫిలడెల్ఫియా తానా టీం రవి పొట్లూరి, సునీల్ కోగంటి, సతీష్ తుమ్మల, ఫణి కంతేటి, రంజిత్ మామిడి, ప్రసాద్ క్రొత్తపల్లి, సురేష్ యలమంచి, కోటి యాగంటి, మోహన్ మల్లా, గోపి వాగ్వల, జాన్ మార్క్, రాజేశ్వరి కొడాలి, రామ ముద్దన, సాంబయ్య కోటపాటి కారణమని ఈ సందర్భంగా వక్తలు అభినందించారు. ఘనంగా సన్మానం ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తానా సేవా కార్యక్రమాల్ని వివరించారు. అలాగే సుమారు 22 సంవత్సరాల తర్వాత తానా మహాసభల్ని మళ్ళీ హోస్ట్ చేసే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఫిలడెల్ఫియా నగరాన్ని తానా మహాసభల చరిత్రలో అత్యున్నత స్థానంలో నిలబెడతారని ఆశిస్తున్నామని అన్నారు. అనంతరం ఫిలడెల్ఫియాలో 2001లో జరిగిన తానా 13వ మహాసభలలో పాల్గొన్న హరనాథ్ దొడ్డపనేని, సరోజ సాగరం, మదన్ ఇనగంటి, సుధాకర్ పావులూరి,శ్యాంబాబు వెలువోలు తదితరులను తానా మిడ్ అట్లాంటిక్ బృందం ఘనంగా సన్మానించింది. అంజయ్య చౌదరి లావు తోపాటు తానా నుంచి జానీ నిమ్మలపూడి, రాజా కసుకుర్తి, శ్రీనివాస్ ఓరుగంటి, దిలీప్ ముసునూరు, నాగరాజు నలజుల, కిరణ్ కొత్తపల్లి, శ్రీ అట్లూరి, సతీష్ చుండ్రు, మోహన్ మల్లా, లక్ష్మణ్ పర్వతనేని, శ్రీలక్ష్మి కులకర్ణి, వెంకట్ సింగు, శ్రీనివాస్ కోట, సుబ్బా ముప్ప, సాంబ నిమ్మగడ్డ, రామ ముద్దన, రావు యలమంచిలి, లక్ష్మి అద్దంకి, హరి మోటుపల్లి, పాపారావు ఉండవల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న జాతీయ,ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు తానా సభలకు మద్దతు పలికిన Ata, Tta, Nata, Nats, Tagdv, Pta, Tfas, Tasj, Hta, Njta వంటి వివిధ జాతీయ, ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు ముజీబుర్ రెహ్మాన్, సురేష్ రెడ్డి వెంకన్నగారి, శ్రీనివాస్ కాశీమహంతు, మాధవరెడ్డి మోసర్ల, శర్మ సరిపల్లి, శ్రీనివాస్ భరతవరపు, సుధాకర్ తురగ, లక్ష్మి నరసింహారెడ్డి కొండా, ప్రసాద్ కునారపు, కిరణ్ గూడూరులను ఘనంగా సత్కరించారు. -
మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం... 13 మంది మృతి
అమెరికాలో ఫిలడెల్ఫియాలోని మూడు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఏడుగురు పిల్లలతో సహా సుమారు 13 మంది మృతి చెందారు. ఈ మేరకు నగరంలోని పబ్లిక్ హౌసింగ్ అథారిటీకి చెందిన నగరంలోని ఫెయిర్‌మౌంట్ పరిసరాల్లోని మూడు-అంతస్తుల భవనంలోని రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. అంతేకాదు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించింది. (చదవండి: వామ్మో ! కుక్కపిల్ల మాదిరి సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చేసింది!!) పైగా మంటలను అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బందికి సుమారు 50 నిమిషాల సమయం పట్టింది. అయితే భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్లు ఉన్నప్పటికీ అవి విఫలమవ్వడంతోనే పిల్లలతో సహా 13 మంది చెందారని ఫిలడెల్ఫియా ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ క్రమంలో ఎనిమిది మంది రెండు ఎగ్జిట్ మార్గాల గుండా ప్రాణాలతో బయటపడగలిగారని, మరణించిన వారిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారని ఫిలడెల్ఫియా డిప్యూటీ ఫైర్ కమిషనర్ క్రైగ్ మర్ఫీ వెల్లడించారు. ఇప్పటికి వరకు తాను చూసిని ప్రమాదాల్లో ఇదే అత్యంత భయంకరమైన అగ్ని ప్రమాదం అని మేయర్ జిమ్ కెన్నీ అన్నారు. అంతేకాదు ఈ భవనంలో రెండు కుటుంబాల వాళ్లు ఉండేందుకు అనువుగా మార్చారని, పైగా ఈ భవనంలో సుమారు 26 మంది నివసిస్తున్నట్లు తెలిపారు. అయితే మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఫైర్ కమిషనర్ క్రైగ్ మర్ఫీ పేర్కొన్నారు. (చదవండి: నోట్లో సిగరెట్, చేతిలో గన్.. జాంజాం అని బుల్లెట్ రైడింగ్.. విషయం బయటపడటంతో..) -
సంబరానికి నాటా సై..!
సాక్షి, హైదరాబాద్: సప్త సముద్రాల ఆవల తెలుగు మహా సంబరానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) కనీవినీ ఎరుగని రీతిలో వేడుకలకు సిద్ధమవుతోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా వేదికగా జూలై 6, 7, 8 తేదీల్లో జరగనున్న నాటా మహా సభలకు 13 వేల మంది హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నాటా సభలకు అతిథులుగా హాజరు కానున్నారు. సామాజిక సేవ, తెలుగు సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలన్న లక్ష్యంగా ఏర్పడిన నాటా.. అనతి కాలంలో మహావృక్షంగా మారింది. విద్యా, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కోసం అమెరికా వచ్చే వారిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి. తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సేవలందించడం ప్రారంభించింది. రెండేళ్లకోసారి కన్వెన్షన్ నిర్వహిస్తున్న నాటా.. 2016లో డాలస్‌లో, ఈసారి ఫిలడెల్ఫియాలో వేడుకలు నిర్వహిస్తోంది. సామాజిక సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: గంగసాని రాజేశ్వర్ రెడ్డి, అధ్యక్షుడు అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి నాటాకు ప్రాతినిధ్యం ఉంది. నిజాయతీ, నిబద్ధత, అంకిత భావం, సామాజిక సేవ అనే పునాదులపై నాటాను ముందుకు తీసుకెళ్తున్నాం. తెలుగు సంస్కృతి, వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తున్నాం. ఈసారి ఫిలడెల్ఫియాలో జరగనున్న మహాసభలకు 13 వేల మంది రానున్నారు. ఒకే గొడుగు కిందకు వస్తున్నాం: డాక్టర్ ప్రేంసాగర్ రెడ్డి, నాటా అడ్వైజరీ కౌన్సిల్ నాటాతో ఎన్నారైలకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రాంతీయ భేదాలు లేవు. అందరం ఒకే గొడుగు కిందికి వస్తున్నాం. నేను నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చా. అమెరికాకు వచ్చి అతిపెద్ద ఆస్పత్రుల నెట్వర్క్ ప్రైమ్ ఏర్పాటు చేసి 45 వేల అమెరికన్లకు ఉద్యోగాలిచ్చా. నాటా వేదికగా వైఎస్సార్ జయంతి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని నాటా వేదికగా నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ తెలిపింది. నాటా నిర్వహించనున్న పొలిటికల్ ఫోరంలో భాగంగా వైఎస్సార్‌ను స్మరించుకుంటామని ప్రకటించింది. మహా సభలకు హాజరు కావాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారని, అయితే పాదయాత్ర కారణంగా ఆయన రాలేకపోతున్నారని పార్టీ తెలిపింది. నాటా ప్రతినిధులు, అతిథులను ఉద్దేశించి తన సందేశాన్ని వైఎస్ జగన్ పంపనున్నట్టు పార్టీ నేతలు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు ఈ వేడుకలకు హాజరు కానున్నారని చెప్పారు. -
ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర సంబరాలు