Physical exercises
-
Science Facts: ఎక్సర్సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం..
Can You Change Your Body Shape With Daily Exercises: నిద్రలేచి అద్దంలో చూసుకునే వాళ్లు ఎంతమంది ఉంటారో కానీ బయటకు వెళ్లడానికి తయారైన తర్వాత అద్దంలో చూసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ‘పట్టుచీరల షోరూమ్ ముందు హోర్డింగ్‌లో ఉన్న మోడల్ కట్టుకుంటే అంత అందంగా అమరిన చీర తనకెందుకు ఆ స్థాయిలో నప్పడం లేదు. మూడు నెలలుగా ఎక్సర్సైజ్ చేస్తున్నా ఫలితం అంతంత మాత్రమే’ అని ఓ యువతి అసంతృప్తిగా ముఖం పెట్టడం సహజమే. అలాగే స్లిమ్ ఫిట్ షర్ట్‌ను ధరించిన మోడల్‌ను చూసి మనసు పడి ఆ చొక్కా కొనుక్కున్న ఓ కుర్రాడు కూడా అద్దంలో చూసుకుంటూ ‘మోడల్ ఉన్నంత స్మార్ట్‌గా లేను’ అనుకోవడమూ, మరుసటి రోజు నుంచే వ్యాయామం మొదలు పెట్టడం కూడా సర్వసాధారణమే. ఎక్సర్సైజ్ దేహాకృతిని మారుస్తుంది. నిజమే, అయితే ఎక్సర్సైజ్ ఎన్ని రోజులు చేస్తే ప్రకటనలో ఉన్న మోడల్ దేహాకృతి వస్తుంది..? ఇది జెనెటిక్స్ నిర్ణయం... మనిషి దేహాకృతిని ప్రధానంగా జెనెటిక్స్ నిర్దేశిస్తాయి. బొద్దుగా లేదా బక్క పలుచగా ఉండడం వంటి లక్షణాలు పిల్లలకు వారసత్వంగా సంక్రమిస్తాయి. అలా సంక్రమించిన లక్షణాలను మన జీవనశైలి ప్రభావితం చేస్తుంది. ఆహారవిహారాల ప్రభావంతో సన్నని వాళ్లు కూడా అధిక బరువుకు లోనవుతుంటారు. బొద్దు వాళ్లు ఏకంగా ఒబేసిటీ బారిన పడుతుంటారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల దేహంలో కొవ్వు కరిగి కండరాలు చక్కని షేప్‌లో రూపుదిద్దుకుంటాయి. అందులో సందేహం లేదు. చదవండి: Science Facts: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..! అయితే నడుము భాగం సన్నగా ఉండడం లేదా వెడల్పుగా ఉండడం, భుజాలు విశాలంగా ఉండడం లేదా కుంచించుకు పోయినట్లు ఉండడం వంటివి వారసత్వంగా వస్తాయి. వ్యాయామం వల్ల దేహ నిర్మాణరీతిలో ఎటువంటి మార్పు రాదు. ఈ అంశం మీద ఏకంగా 24 అధ్యయనాలు జరిగాయి. మూడు వేలమందికి పైగా ఇందులో పాల్గొన్నారు. వారంలో మూడు రోజుల చొప్పున పన్నెండు వారాలపాటు వ్యాయామం చేస్తే... ఒకరి దేహం స్పందించినట్లు మరొక దేహం స్పందించలేదు. మనిషి ఎత్తు, బరువు, వయసు, ఆహారవిహారాలు, నిద్ర వంటి వాటన్నింటినీ ఆరోగ్యవంతంగా క్రమబద్ధం చేసుకుంటూ వ్యాయామాన్ని కొనసాగించాలి. వ్యాయామం దేహాన్ని శక్తిమంతంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. దేహం అంతర్గత అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. సమగ్ర ఆరోగ్యం వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యాయామం మంచిదే. అలాగే దేహాకృతి మీద ధ్యాస ఉండడం కూడా ఆరోగ్యకరమే. అయితే మనదేహం మరొకరి దేహాకృతిలాగా మారిపోవాలనుకోవడం ఆరోగ్యకరం కాదు. అది సాధ్యం కాదు. చదవండి: Covid Taste Test: తెలుసా..! కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు... ఎలాగంటే.. -
ఆ తర్వాతే నా ఆలోచనలు తప్పని నాకు అర్థమైంది
‘‘ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరకంగా దృఢంగా ఉండటమే కాదు... మానసికంగా కూడా బలంగా ఉండటం. కొన్ని సందర్భాల్లో మన భావోద్వేగాలను మనమే కంట్రోల్ చేసుకోగల మనోధైర్యాన్ని కలిగి ఉండాలి’’ అని అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. ఇంకా రకుల్ ప్రీత్ మాట్లాడుతూ – ‘‘యోగా చేయడం చాలా బోర్‌గా ఉంటుందేమో అనుకునేదాన్ని. కానీ ఒకసారి మొదలు పెట్టిన తర్వాత నా ఆలోచనలు తప్పని నాకు అర్థమైంది. యోగా వల్ల సత్ఫలితాలు ఉంటాయని తెలిసింది. యోగా వల్ల నాలో సానుకూల ఆలోచనా ధోరణి పెరిగింది కూడా. ఇక.. మన శరీరం రీచార్జ్ కావాలంటే హాయిగా నిద్రపోవాలి. అప్పుడే మనలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. నిద్రించే ముందు డిజిటల్ డివైజ్‌లకు దూరంగా ఉండండి. మొబైల్ ఫోన్స్ వాడకాన్ని తగ్గించండి. ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోండి. సరిపడా నిద్రతో పాటు వర్కౌట్స్‌తో నేను రీచార్జ్ అవుతున్నాను. మీరు కూడా సరైన నిద్ర, వ్యాయామాలతో రీచార్జ్ అవుతూ ఉండండి’’ అన్నారు. -
కరోనాను ఎదుర్కొనే కొత్త వ్యాయామం
సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామానికి మించిన మంచి మార్గం మరొకటి లేదని నిపుణులు ఆది నుంచి చెబుతూనే ఉన్నారు. వ్యాయామంలో రెండు రకాలని, ఒకటి ఎరోబిక్ అయితే మరొకటి ఎనరోబిక్ వ్యాయామాలంటూ కూడా విభజన తీసుకొచ్చారు. ఎరోబిక్ అంటే గాలి ఎక్కువగా అందుబాటులో ఉండే మైదానాల్లో నడవడం, పరుగెత్తడం, ఈత కొట్టడం కాగా, ఎనరోబిక్ అంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వెయిట్ లిఫ్టింగ్, జంపింగ్ లాంటివి. ఒకానొక దశలో ఈ రెండు కూడా కలసిపోయి జిమ్ముల రూపంలో వెలిశాయి. ఎరోబిక్స్‌లో డాన్యుల లాంటివి కూడా కలిసిపోయాయి. (చదవండి : కరోనా రోగులకు మరో షాక్?!) ఆరోగ్యంతో పాటు శీరర సౌష్టవం సొగసుగా ఉండాలంటే ఎరోబిక్స్ ముఖ్యమని, ఎనరోబిక్స్ కూడా ముఖ్యమని, రెండూ కూడా అవసరమనే వాదనలు తలెత్తాయి, సద్దుమణిగాయి. ప్రాణాంతక కరోనా విజంభిస్తోన్న నేటి సమయంలో వ్యాయామం ఒక్క దానితో ప్రాణాలను కాపాడు కోలేమని, పౌష్టికాహారంతోపాటు అవసరమైన విటమిన్లు మింగాల్సిందేనంటూ కొంత మంది వైద్యులు చెబుతూ వచ్చారు. విటమిన్ల వల్ల మానవ శరీరాల్లో రోగ నిరోధక శక్తి పెరగుతోందని కూడా చెప్పారు. మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ల సమతౌల్యంతో పౌష్టికాహారం తీసుకుంటే సరిపోదని, ‘రెసిస్టెంట్ ఎక్సర్సైజ్’ అవసరమని డాక్టర్ మైఖేల్ మోస్లీ కొత్త వాదన తీసుకొచ్చారు. ఈ వ్యాయామం చేసే వారికి కరోనా వ్యాక్సిన్లు కూడా బాగా పని చేస్తాయని చెప్పారు. ఈ విషయం కాలిఫోర్నియాలో వాలంటర్లీపై తాజాగా జరిపిన అధ్యయనంలో తేలిందని చెప్పారు. అంటు రోగాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు తాను గత కొంత కాలంగా రెసిస్టెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. (చదవండి : అందుకే లాక్డౌన్ పొడగిస్తున్నాం) పుషప్స్, ప్రెసప్స్, స్క్వాట్స్, అబ్డామన్ క్రంచెస్, లంగ్స్, ప్లాంక్ వ్యాయామాలతో శరీరంలోని ‘టీ–సెల్స్’ అభివద్ధి చెంది రోగ నిరోధక శక్తి పెరగతుందని ఆయన చెప్పారు. ఫిజియో థెరపీ కింద వాడే సాగే రిబ్బన్లను తీసుకొని 15 నిమిషాలపాటు చేతులు, భుజాల వ్యాయామం తాను కొత్తగా ప్రయోగించి చూశానని, సాగే రిబ్బన్లను లాగడం వల్ల శరీర కణాల్లో చురుకుదనం బాగా పెరగతోందని ఆయన వివరించారు. ఆయన తన అధ్యయన వివరాలను పూర్తిగా ‘స్పోర్ట్స్ అండ్ హెల్త్’ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. గుండె బాగుండాలంటే పషప్స్ ఒక్కటే సరిపోవని, శరీరాన్ని బాలెన్స్ చేస్తూ చేసే స్క్వాట్స్ ఎంతో అవసరమని డాక్టర్ మైఖేల్ తెలిపారు. వీటి వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతుందని డాక్టర్ చెప్పారు. మొదట కరోనా ఎదుర్కోవాలంటీ యోగా చేయాలని, ఊపిరితిత్తుల బలం కోసం బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలంటూ ఇంతవరకు ప్రచారంలో ఉన్న విషయం తెల్సిందే.(చదవండి :కరోనా దెబ్బ: తిరోగమనమే!) -
మతపరమైన మనోభావాలకు అతీతం యోగా
అవలోకనం ఆసనాల్లోనే అత్యంత సమగ్రమైన ఆసనం సూర్య నమస్కారాలు. మీరే మతానికి, జాతికి చెందినవారైనా సరే, ఎవ్వరైనా చేయగలిగిన అత్యుత్తమ వ్యాయామమిది. ముస్లిం బృందాలు ఇలాంటి విషయాల్లో మరింత ఉదారంగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమం వివాదరహితంగా అన్ని మతాలకూ, వర్గాలకూ చేరాలి. అలా చేరనట్లయితే అది ప్రభుత్వ స్వయంకృతాపరాధమే అవుతుంది. భారతీయ పాఠశాలల్లో శారీరక వ్యాయామాన్ని, ప్రత్యేకించి యోగాను మరింతగా అమలు చేయడం మంచిదేనని నేననుకుం టున్నాను. యోగా (శారీరక భంగిమలు అని అర్థం) ఏమంత పురాతనమైనది కాదని, అది ఇటీవలి వ్యవహారమేనని పండితురాలు వెండీ డోనిగెర్ రాశారు. పతంజలి యోగసూత్రాల్లో ఎలాంటి భంగి మలను పేర్కొనలేదు. ఆధునిక యోగా 18, 19 శతాబ్దాలలో యూరో పియన్ల ద్వారా భారత్‌లో అడుగుపెట్టింది. వ్యాయామంలో ఉన్న ప్రయోజనాలను వారు పసిగట్టారు. రూసో రచన ‘ఎమిలి’ వంటి పుస్తకాల ద్వారా వారు ఉత్తేజం పొందారు. ఈ వాస్తవంతో పలువురు విభేదిస్తూ యోగా పురాతనమైనదని భావిస్తున్నారు. సత్యం ఏదైనా కావచ్చు కానీ యోగా అనేది కోట్లాది భారతీయులు ఎరుకతో ఆచ రిస్తున్న అభ్యాసమన్నది వాస్తవం. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్ వంటి శరీర వ్యాయామ శిక్షకుల కంటే ఎక్కువగా యోగా.. పాఠశాల విద్యార్థులకు సులువుగా నేర్పగలదన్న విషయాన్ని కనుగొనడం పెద్ద కష్టమైన పనేం కాదు. చాలా సంవత్సరాల క్రితం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సు చేస్తున్న సమయంలో యోగా ద్వారా కలిగే కొన్ని ప్రయోజనాలను నేను తెలుసుకున్నాను. యోగా ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి శరీరం ఉపయోగపడుతుందన్నది నేను తెలుసుకున్న ఉపయోగాల్లో ఒకటి. సుదర్శన క్రియ అనే శ్వాస ప్రక్రియను నేర్చుకుంటున్న సెషన్లో నాకు ఈ విషయం బోధపడింది. ఆ సెషన్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ ఫొటోను తరగతి ముందు అమర్చారు. ఇష్టమైతే ఎవరైనా ఆ ఫొటోకు నమస్కరించవచ్చు. కాని అది తప్పనిసరి కాదు. నాకు ఆ వ్యవహారం కాస్త అసౌకర్యంగా అనిపించింది. దీంతో నేను ఆ ఫొటో వందనం నుంచి తప్పుకున్నాను. తన పేరుకు ముందు రెండు శ్రీలను ఎందుకు పెట్టుకున్నారంటూ ఒకరడిగిన ప్రశ్నకు రవిశంకర్ ఇచ్చిన కొంటె సమాధానం కూడా నన్ను సంతృప్తిపర్చలేదు. మా తరగతి టీచర్ చెప్పిందాని ప్రకారం, త న పేరుకు మూడు శ్రీలు తగిలించుకుంటే మరీ ఎక్కువ. ఒకే శ్రీని జోడిస్తే మరీ తక్కు వగా ఉంటుందని ఆయన చెప్పారట. ఏదేమైనా, యోగాతో ఎవరైనా ప్రయోజనం పొందగలరనీ, ఎలాంటి మతపరమైన మనోభావాలకు గురికాకుండానే దాని గ్రూప్ సెషన్లలో పాలు పంచుకోవచ్చుననీ చెప్పడానికే నేను ఈ కథనాన్ని మళ్లీ గుర్తు చేశాను. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహించనున్న వివిధ ఆసనాల నుంచి (భంగిమలని అర్థం) సూర్య నమస్కారాలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ వారం తీవ్ర ఒత్తిడికి గురయింది. ముస్లిం విద్యా ర్థులు హిందూ మత ఆచారాలను పాటించేలా భారతీయ జనతా పార్టీ బలవంత పెడుతోందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది. నాకయితే ఇది బాధాకరమైన విషయమే. ఎందుకంటే, సూర్య నమస్కారం అనేది అత్యంత సమగ్రమైన ఆసనం. అంతే కాకుండా మీరే మతానికి, జాతికి చెందినవారైనా సరే, బహుశా ఎవ్వరైనా చేయగలిగిన అత్యుత్తమమైన వ్యాయామం అది. సూర్యనమస్కారాలనేవి నిటారుగా నిలబడటం, శరీరాన్ని విల్లులాగా వెను కకు వంచడం, భూమికి సమాంతరంగా శరీరాన్ని ఉంచి పైకిలేవటం వంటి ఆసనా లతో కూడి ఉంటాయి. వీటిని అభ్యసించే క్రమంలో మన కాళ్లు వెనుకకు వం గుతూ స్ప్రింగ్ లాగా ముందుకు వస్తుంటాయి. సూర్య నమస్కారాల్లో తేలికపాటి కసరత్తు, బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ మిళితమై ఉంటాయి. సూర్య నమస్కారాలు మత సంబంధమైనవేనా? నేనయితే అలా అను కోవడం లేదు. యోగాను అభ్యసించేవారిలో కొద్దిమంది సూర్య నమస్కారాలను కూడా చేస్తుంటారు. ఇక లక్షలాదిమంది అమెరికన్లు, యూరోపియన్లు వీటిని సూర్య ఆరాధనా రూపంగా చూస్తున్నారు. ఇది మంచి వ్యాయామం కాబట్టే వారు దాన్ని చేస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం ముస్లిం బృందాలు ఇలాంటి విష యాల్లో మరింత సరళత పాటించవలసిన అవసరం ఉంది. తమ సమస్యను వీరు ఘర్షణాత్మకరూపంలో సమర్పించవలసిన అవసరం లేదనుకుంటున్నాను. ఇలా అంటున్నానని ముస్లిం బృందాలు అతిగా స్పందిస్తున్నాయని అర్థమా? ప్రభుత్వం దాని మంత్రుల చరిత్ర, నేపథ్యం మనల్ని మరోలా భావించేలా చేస్తున్నాయి. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మహిళలు, పురుషుల నిందాపూర్వకమైన వ్యాఖ్యల ద్వారా మైనారిటీ బృందాలను నిత్యం లక్ష్యంగా చేసుకోవటం జరుగుతోంది. బీజేపీ మాటలు, చేతల ద్వారా తాము ముట్టడికి, బెదిరింపులకు గురవుతున్నట్లు అనేక ముస్లిం బృందాలు భావిస్తున్న విషయాన్ని మనం తప్పక అంగీకరించాలి. తమను రెచ్చగొడుతున్నారని వారు భావించినట్లయితే అందుకు మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అయితే యోగాను ప్రోత్సహించడంలో ప్రభుత్వం చెడుగా వ్యవ హరిస్తోందని నేను భావించటం లేదు. ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తి గతంగా దీనిపట్ల తీవ్రమైన ఉద్వేగం ప్రదర్శిస్తున్నారు. నేను గతంలో పని చేసిన గుజరాతీ దినపత్రికలో మోదీ ప్రతిరోజూ యోగాసనాలు వేసేవారన్న వార్త వచ్చింది. వివిధ ఆసన భంగిమలలో ఆయన ఫొటోలను కూడా మోదీ కార్యా లయం పంపించేది. మోదీ అభ్యర్థన మేరకు జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రకటించడం, 175 దేశాలు దానికి మద్దతు ప్రకటించడం అనేది మోదీకి వ్యక్తిగత విజయమని చెప్పాలి. దీంతో ఉత్సాహపడిన కేంద్ర ప్రభుత్వం అతి పెద్దదైన రైల్వేలతోపాటు తన శాఖలన్నింటినీ రోజువారీగా కొన్ని యోగాసనాలను వేయవలసిందిగా కోరింది. అయితే జూన్ 21 ఆదివారం కావడంతో ఇది కాస్త వివాదాస్పదమైంది. ఏదేమైనా ఈ విషయంలో ప్రభుత్వం వివాదాలకు దూరం జరిగితే మంచిది. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పినట్లు, యోగాసనాలు మంచివి, ఇవి అందరికీ, ప్రత్యేకించి పిల్లలకు మేలు చేకూరుస్తాయి. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైనట్లయితే అది ఒకమేరకు స్వయంకృతాపరాధమే అవుతుంది. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం అన్ని కమ్యూనిటీలనూ చేరాలి. అయితే తన గత చరిత్ర, ప్రతిష్ట రీత్యా చూసినప్పుడు ఈ కార్యక్రమం కొంతమేరకు సమస్యాత్మకం అవుతుందని ప్రభుత్వమే ముందుగా ఊహించి ఉండాలి. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) ఆకార్ పటేల్ -
నడుము నొప్పితో బాధపడుతున్నారా?
అధునాతనమైన పద్ధతుల్లో సర్జరీ చేయడంవల్ల ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోనవసరం లేకుండానే తొందరగా కోలుకుని రోజువారీ పనుల్లో నిమగ్నమైపోవచ్చు. నడుము నొప్పి ఈ రోజుల్లో సర్వసాధారణం. వెనుకటి తరం వారితో పోల్చిచూస్తే ఈతరం వారు ఎక్కువగా నడుమునొప్పి సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామాలు తగ్గడం, ఎక్కువగా ద్విచక్రవాహనంపై ప్రయాణించడం, కంప్యూటర్, ఫోను వినియోగం పెరగడం, మానసిక, శారీరక ఒత్తిడి పెరగడంవల్ల కూడా నడుము నొప్పి రావడానికి కారణమవుతాయి. అప్పటికే ఉన్న నొప్పి పెరిగి దైనందిన కార్యక్రమాలకు కూడా అంతరాయం కలగడానికి, ప్రమాదకర పరిస్థితికి చేరడానికి కూడా అవకాశముంది. 99 శాతం నడుమునొప్పులకు సరైన సమయంలో, సరైన వైద్యం అందితే ఈ సమస్య నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. చాలా మంది అశ్రద్ధ చేసి ఈ సమస్యను జటిలం చేసుకుంటున్నారు. తొలి దశ : ప్రారంభ సమయంలో నడుము నొప్పి కండరాల బలహీనత వల్ల వస్తుంది. అలాంటి సమయంలో అలవాటులేని పని ఎక్కువగా చేస్తే నొప్పి కలుగుతుంది. అయితే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ నొప్పి తగ్గుతున్నట్టనిపించినా.. తరువాత తిరగబెడుతుంది. ఈ సమయంలో సరైన మందులతో పాటు బలహీనమైన కండరాలను గుర్తించి, వాటిని బలపరిచే విధంగా చికిత్స చేయాలి. మధ్య దశ : ఈ దశలో వెన్నెముక మధ్యలో ఉన్న డిస్క్‌పై ఒత్తిడి పెరిగి డిస్క్ పక్కకు జరిగి పక్కనున్న నరాలపై ప్రభావం పడడం వల్ల నడుము నొప్పి పెరగడం, కాళ్లలో తిమ్మిర్లు, లాగడం, కరెంటు షాక్‌కు గురైనట్లు, సూదులతో గుచ్చినట్లుగా ఉంటుంది. ఈ స్థితిలో సర్జరీ లేకుండా రూట్ బ్లాక్, ఎపిడ్యూరల్ ఇంజక్షన్ ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ దశలోనే వెన్నెముకలో ఉన్న జాయింట్స్ అరగడంవల్ల పొద్దున నిద్ర లేవగానే నడుం పట్టేసినట్లుంటుంది. మెల్లగా నాలుగు అడుగులు నడిస్తే ఉపశమనం పొందుతారు. అలాగే ముందుకి గాని, వెనక్కి గాని, పక్కలకు గాని వంచినప్పుడు నిర్ణీత ప్రదేశంలో నొప్పిగా అనిపించవచ్చు. అలాంటివారు ఫేసెట్ బ్లాక్ ఇంజెక్షన్ ద్వారా ఉపశమనం పొందవచ్చు. మూడో దశ : రెండో దశలో ఉన్న సమస్యలన్నీ మరింత ఎక్కువగా విజృంభిస్తాయి. కాళ్లు బలహీనపడడం, మలమూత్రాలపై నియంత్రణ కోల్పోతారు. ఇలాంటి సమయంలో అధునాతన సర్జరీతో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇలాంటి అధునాతన టెక్నాలజీ ప్రక్రియ ద్వారా ఎంతో కాలంగా నడుము నొప్పితో బాధపడుతున్న వారిలో అవసరమైన వారికి మాత్రమే సర్జరీ చేస్తూ, మిగతా వారికి సర్జరీ లేకుండానే సత్ఫలితాలను సాధించవచ్చు. - డా॥ రాఘవ సునీల్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్, హైదరాబాద్ 9000060639, 9533557557