Physically challenged girl
-
అబోలీ.. ద డిజేబుల్డ్ సెలబ్రెటీ
కొంతమందికి పరిస్థితులన్నీ చక్కగా అనుకూలంగా ఉంటే, మరికొందరికి కనీసం వయసుకు తగ్గినట్లుగా శరీరం ఎదగక నానా ఇబ్బందులు పడుతుంటారు. అబోలి జరీత్ జీవితం సరిగ్గా ఇలానే ఉంది. శరీరం ఎదగకపోడంతో తన పనులు తాను సరిగా చేసుకోలేని సమస్యతో బాధపడుతోంది. బతికినంత కాలం సమస్య తీరదని తెలిసినప్పటికీ తను ఒక స్టార్‌గా ఎదగాలనుకుంటుంది అబోలి. కేవలం మూడు అడుగుల ఎత్తున్న అబోలీ... స్టార్ అయ్యేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ నెటిజన్లతో అబ్బో..లీ అనిపిస్తుంది. నాగ్‌పూర్‌కు చెందిన అబోలీ జరీత్ చిన్నారిగా ఉన్నప్పుడే ఆస్టియోమలాసియా (అస్థిమృదుత్వం) వచ్చింది. చిన్నపిల్లల్లో అసాధారణంగా వచ్చే ఈ వ్యాధి విటమిన్ లోపం కారణంగా వస్తుంది. అబోలికి ఈ సమస్య రావడంతో ఎముకలు సరిగా ఎదగలేదు. దీనికితోడు కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం మానేశాయి. ఫలితంగా తన ఎత్తు కేవలం మూడు అడుగుల నాలుగు అంగుళాలు మాత్రమే పెరిగింది. ఈ అనారోగ్య సమస్య వల్ల ప్రస్తుతం 19 ఏళ్ల అబోలీ ఐదేళ్ల చిన్నారిలా కనిపిస్తుంది. కిడ్నీ పనితీరు దెబ్బతినడంతో నిత్యం డయపర్లు వేసుకుని ఉండాల్సిందే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదని డాక్టర్లు స్పష్టం చేయడంతో మరింత దిగులుపడింది అబోలి. ఒకపక్క మానసిక బాధ, మరోపక్క తన రోజువారి పనులు చేసుకోవడానికి కూడా కదలలేని పరిస్థితి. అయినా అబోలి ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఉపశమనం కలిగించే వైద్యచికిత్సలు తీసుకుని కాస్త అటూ ఇటూ కదలగలిగేలా శక్తిని పుంజుకుంది. స్టార్‌గా ఎదగాలని.. ఆరోగ్యం బాగోకపోయినా అబోలికి చిన్నప్పటి నుంచి స్టార్‌గా ఎదగాలనే కల ఉంది. ఈ విషయం తెలిసిన వారు నిరుత్సాహపరిచేలా గేలిచేయడం, ఆమె దురదృష్టాన్ని అవహేళనచేస్తూ తనని మరింత కుంగదీసేవారు. అయినా అబోలి అధైర్యపడలేదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎలాగైనా స్టార్‌గా ఎదగాలనుకుంది. ఈ క్రమంలోనే.. ముందుగా డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంది. కానీ శరీరం సహకరించకపోవడంతో..గాయనిగా మారాలనుకుంది. సంగీతం నేర్చుకుంటూనే ‘మిస్ వీల్ చెయిర్ ఇండియా’ పోటీల్లో ఫైనల్స్ వరకు చేరింది. అంతేగాక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యాక్టింగ్ చేస్తోన్న ఫోటోలు, వీడియోలు, పాటలు పాడుతోన్న వీడియోలు పంపుతూ నెటిజన్లను అలరిస్తోంది. తన హావభావాలతో ఏడువేలమందికి పైగా ఫాలోవర్స్‌ను మెప్పిస్తూ డిజేబుల్డ్ సెలబ్రెటీగా దూసుకుపోతోంది. నాకు నేనే ప్రేరణ.. సంగీతం నేర్చుకుంటూ, పాటలు పాడుతూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాను. నా గురించి ఎవరు ప్రతికూలంగా మాట్లాడినా నేనస్సలు పట్టించుకోను. చిన్నప్పటి నుంచి ఎదుర్కోన్న అనే అనుభవాలు నాకు నేనే ప్రేరణగా తీసుకునేలా చేశాయి. నాకున్న ఒకే ఒక కల పాపులర్ సింగర్‌ని కావడం. నా దృష్టి మొత్తం దానిమీదే ఉంటుంది. – అబోలి -
వసతి గృహంలో కీచక్ హెచ్ఎం.. దివ్యాంగులైన బాలికలపై..
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): దివ్యాంగుల వసతి పాఠశాలలో విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ప్రధానోపాధ్యాయుడిని నెలమంగల తాలూకా దాబస్‌పేట పోలీసులు అరెస్టు చేసారు. దివ్యాంగుల వసతి పాఠశాలలో హెచ్ఎం రంగనాథ్ (35) కోవిడ్ నేపథ్యంలో అందరిని ఊర్లకు పంపి ఏడుగురు విద్యార్థులను మాత్రమే పాఠశాలలో ఉంచుకుని వారిని నిత్యం తన గదిలోకి పిలిపించి లైంగికంగా వేధించేవాడు. ఇంట్లో చెబితే చంపేస్తానని విద్యార్థులను బెదిరించేవాడు. ఈ విషయం రంగనాథ్ తల్లికి తెలిసి ఆమె పాఠశాల పాలక మండలికి ఫిర్యాదు చేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: మూడేళ్ల నుంచి లైంగిక వేధింపులు.. కేసు పెట్టిన మారలేదు.. చివరకు.. -
ఆ ఘటనలో నివ్వెరపోయే నిజాలు
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడి చేశారనే సంఘటన కలకలం రేపింది. జిల్లాలోని నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సారిపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో సంఘటనపై విచారణ చేపట్టిన పోలీసులుకు దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. జిల్లా ఎస్పీ పాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి అసలు గ్యాంగ్ రేప్ జరుగలేదని తేలింది. అత్యాచారం జరిగిందని యువతి చెబుతున్న వివరాలకు, పోలీసులు విచారణలో తెలిసిన విషయాలకు పొంతన కుదరలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి అత్యాచార సంఘటన అబద్ధమని తేల్చేశారు. అంతేకాక ఘటన వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకుని పోలీసులు ఆశ్చర్చపోయారు. సదరు యువతి ఆదివారం రాత్రి ఇంటికి ఆలస్యంగా వెళ్లింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యలు తిడతారని తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు నాటకమాడింది. ఈ విషయాన్ని యువతి ఒప్పుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఆదివారం ఏం జరిగింది..? ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ యువతి ఆటో ఎక్కింది. అదే వాహనంలో మరో ఇద్దరు వ్యక్తులున్నారు. పూల్‌బాగ్‌కాలనీ వద్ద ఆమె దిగాల్సి ఉన్నా డ్రైవర్ ఆటోను ఆపలేదు. ఎందుకు ఆపలేదని ఆడిగిన ఆమెను బలవంతంగా నోరు నొక్కి సారిపల్లి రోడ్డులో నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై ఆటో డ్రైవర్‌తో పాటు, మరో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతలోనే సమీపంలో వినికిడి రావడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత సదరు యువతి స్థానికలు సహాయంతో ఇంటికి చేరింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లిన యువతిని తల్లిదండ్రులు ప్రశ్నించగా... తనపై సాముహిక అత్యాచారం జరిగినట్టు తెలిపింది. దీంతో వారు పూసపాటిరేగ ఆస్పత్రికి తరలించడంతో పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి జిల్లా ఎస్పీ దీంతో విషయం తెలుసుకున్న ఎస్పీ పాలరాజు ఘటన జరిగిన స్థలానికి స్వయంగా వెళ్లి పరిశీలించారు. విజయనగరం కోట కూడలి నుంచి అత్యాచారం జరిగిందని చెప్పిన ప్రదేశం వరకు రోడ్లకు ఇరువైపులా 15 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సమీపంలో ఉన్న గ్యాస్ గోదాము నిర్వాహకుల నుంచి సైతం వివరాలు సేకరించారు. పలు విషయాలపై ఆరా తీసిన పోలీసులు, మరింత సమాచారం కోసం యువతిని ప్రశ్నించారు. అయితే ఆమె చెప్పిన విషయాలు నమ్మశక్యం కాకపోవడంతో మరింత లోతుగా విచారణ చేసిన పోలీసులు నిజాలు నిగ్గు తేల్చారు. -
మృగాళ్ల కావరం
ఐదేళ్ల క్రితం నిర్భయ దృష్టాంతం ఇంకా జనం మనోఫలకం నుంచి తొలగిపోలేదు. రెండు రోజుల క్రితం ఎనిమిదేళ్ల చిన్నారిపై గ్యాంగ్‌రేప్ సంఘటన ఇంకా దేశాన్ని కుదిపేస్తోంది. ఇంతలోనే మరో ఘటన. అదెక్కడో కాదు. మన జిల్లాలోనే. సరిగ్గా నడవలేని దివ్యాంగురాలని కూడా చూడకుండా... ఇద్దరు ప్రబుద్ధులు మద్యం మత్తులో కూరుకుపోయి... కామంతో కళ్లు మూసుకుపోయి... దారుణంగా లైంగికదాడి చేసిన సంఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు కామాంధులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. నిజానికి జిల్లాలో ఇలాంటి సంఘటనలు కొత్త కాదు. ఏటా ఎన్నో జరుగుతున్నా... వెలుగులోకి రానివెన్నో. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అమాయక మహిళలపై అఘాయిత్యాలుసర్వసాధారణమైనప్పటికీ ఏ ఒక్కటీ పోలీస్ స్టేషన్ వరకూ రాదు. స్థానిక పెద్దలే పంచాయతీ చేసి, ఆమె శీలానికి వెలకట్టేస్తుంటారు. పోలీస్ రికార్డుల ప్రకారం జిల్లాలో గతేడాది మూడు, 2016లో ఐదు లైంగిక దాడి ఘటనలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దారుణాలు 2016లో 33 నమోదైతే గతేడాది 46, ఈ ఏడాది ఇప్పటి వరకూ 6 కేసులు రికార్డయ్యాయి. ఈ పరిస్థితులపై ప్రజా, మహిళా సంఘాలు, వైద్యులు, న్యాయ నిపుణులు మండి పడుతున్నారు. సభ్య సమాజం సిగ్గుపడే సంఘటనలు రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నా... చట్టాల్లో మార్పులు, ప్రజల్లో చైతన్యం రావాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చాయని మేధావులు నినదిస్తున్నారు. నిర్భయ చట్టాన్ని అమలు చేయాలి మానవత్వం మరణించిన వేళ చిన్నపిల్లలను, దివ్యాంగులను కూడా విడవని దుర్మార్గులు ఉన్న ఈ ప్రపంచంలో ఏడు సంవత్సరాల బాలికలకైనా... 70ఏళ్ల అవ్వకైనా రక్షణ లేదు. స్వచ్చభారత్ అన్న మోదీగారు ఆడవాళ్ల ఆత్మగౌరవం కోసం ఏం చేస్తున్నారు. ఆడవాళ్లకోసం ఇచ్చిన చట్టాలు ఏమయ్యా యి. తప్పుడు భావంతో అమ్మాయిని చూడాలంటే మృగాళ్లు భయపడేలాంటి చట్టం మాకు కావాలి. నిర్భయ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి. – తుమ్మి లక్ష్మీరాజ్, మహిళా సమాఖ్య జిల్లా సహాయకార్యదర్శి, విజయనగరం. పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యమే కారణం పోలీస్ వ్యవస్థ బాగుంటే అంతా బాగుం టుంది. ముఖ్యంగా శాఖాపరమైన నిర్లక్ష్యం వల్లే అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు మహిళా చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయి. అభం, శుభం తెలియని అమాయకుల జీవితాలను నాశనం చేసే కామాం ధుల్ని ఉరితీయాలి. రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గడం వల్ల నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. – పాలూరి రమణమ్మ, ఐద్వా జిల్లా సహాయకార్యదర్శి, విజయనగరం ఎన్నో కారణాలు... మరెన్నో బాధలు తల్లిలేదా తండ్రి లేని వారు, ఉన్నప్పటికీ వారి ప్రేమ, భయం, పర్యవేక్షణ లేనివారు ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. సెల్ఫోన్లలో ఆశ్లీల దృశ్యాలను ఎక్కువగా చూసేవారు తాము అలా చేయాలని కోరుకుంటారు. స్నేహితుల ప్రభావం కూడా ఉంటుంది. ఇక గ్యాంగ్‌రేప్‌కు గురైన యువతులు భయభ్రాంతులకు లోనవుతారు. ఒక్కోసారి తల్లిదండ్రులను కూడ దగ్గరకు రానివ్వరు. అలాంటి వారికి వెంటనే వైద్యం అందించాలి. రెండు రోజుల పాటు వారి దగ్గరకు ఎవరూ వెళ్లకూడదు. సహాయకులుగా ఒక్కరే ఉండాలి. అదీ మహిళలై ఉండాలి. రెండు మూడు రోజులు తర్వాత సైకాలజిస్టు తో కౌన్సెలింగ్ ఇప్పించాలి. –ఎస్.వి.రమణ, సైకాలజిస్టు, విజయనగరం చట్టాల పటిష్టంగా అమలైతే చాలు మహిళల రక్షణ దిశగా రూపొందించిన చట్టాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించాలి. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. నిర్థిష్ట సమయంలో విచారణ చేపడితేనే ఇలాంటి దారుణాలు తగ్గుతాయి. మహిళల రక్షణ కోసం గృహ హింస నిరోధకచట్టం, దీనినే నిర్భయ చట్టంగా పిలుస్తున్న ఫోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రం సెక్సవల్ అఫైన్‌సెస్) చట్టం రూపొందించారు. విచారణకు ప్రత్యేక కోర్టులు లేకపోవడం వల్ల కేసుల్లో జాప్యం జరుగుతోంది. -కె.ఆర్.దాశరధి, సీనియర్ న్యాయవాది, విజయనగరం. -
వికలాంగురాలిపై మేనమామ అత్యాచారం
హోసూరు (కర్ణాటక) : వికలాంగురాలైన మేనకోడలిని బెదిరించి ఆరు మాసాలుగా అత్యాచారం చేస్తున్న మేనమామ కిరాతకం ఆలస్యంగా మంగళవారం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం హోసూరు పట్టణం డెంకణీకోట తాలూక అంచెట్టి సమీపంలోని ఏ.పుదూరు గ్రామానికి చెందిన ఓ రైతుకు వికలాంగురాలైన కూతురు(17) ఉంది. గేరెట్టి గ్రామానికి చెందిన అమావాసి(40) ఆ అమ్మాయికి మేనమామ. కాగా ఆమెను బెదిరించి ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల కూతురి ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్షించగా గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో వారు విషయం తెలుసుకుని డెంకణీకోట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న అమావాసి కోసం గాలిస్తున్నారు.