Pick pocketer
-
పర్సు కొట్టేసి.. జేబులో పెట్టుకోబోయేలోపే
ముంబై : ఓ దొంగ తన చేతివాటంతో పర్సు కొట్టేస్తే.. అంతే చాకచక్యంగా ఓ పోలీసు అతన్ని క్షణాల్లో పట్టుకున్నారు. ఈ సంఘటన మన్మాడ్‌లోని రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. మహారాష్ట్రాలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకోవడానికి వచ్చిన ఓ ప్రయాణికుడి పర్సును దొంగ కొట్టేసి, తన జేబులో పెట్టుకోబోయాడు. అక్కడే ఉన్న ఏఎస్ఐ దీన్ని గమనించి వెంటనే దొంగను పట్టుకున్నాడు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వెంటనే స్పందించి దొంగను పట్టుకున్న ఏఎస్ఐను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
దొంగ తన చేతివాటంతో పర్సు కొట్టేస్తే..
-
జేబు దొంగకు దేహశుద్ధి
మేడారం(జయశంకర్ భూపల్లపల్లి జిల్లా): మేడారం మినీ జాతరకు వచ్చిన భక్తుల జేబులను కత్తిరించడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తికి భక్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం దొంగకు బుద్ధి చెప్పిన తర్వాత పోలీసులకు అప్పగించారు. దొంగ ఏమీ మాట్లాడకపోవడంతో అతని వివరాలు తెలియడం లేదు. తాడ్వాయి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రయాణికుడిపై పిక్ పాకెటర్ దాడి
హైదరాబాద్: సికింద్రాబాద్ బాటా బస్టాప్ వద్ద దారుణం జరిగింది. బస్సులో పిక్ పాకెటింగ్ కు పాల్పడ్డ దొంగను ఒక ప్రయాణికుడు దొంగను పట్టుకోవడంతో ఆగ్రహానికి గురైన దొంగ అతన్ని కత్తితో పొడిచి పరారయ్యాడు. దాడిలో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
తిరుమలలో ఎన్ఆర్ఐ భక్తుడిని దోచేసిన జేబుదొంగ
తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూలైన్లో వెళ్తున్న ఓ ఎన్ఆర్ఐ భక్తుడిని జేబుదొంగ దోచేశాడు. స్వామివారికి కానుకగా సమర్పించాలనుకున్న భక్తుడి పర్స్‌ని జేబుదొంగ కాజేశాడు. బాధితుడు ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సి.సి కెమెరా ద్వారా ఈ దొంగతనాన్ని గుర్తించారు. మహాద్వారం భద్రతా సిబ్బందికి తెలిపారు. మహాద్వారం వద్దగల తనిఖీ కేంద్రం వద్ద చేతివాటం ప్రదర్శించిన దొంగను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తనిఖీలో 18 లక్షలు విదేశీ కరెన్సీ వుండటంతో అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు గుట్టు భయటపడింది. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారించి దొంగను తిరుమలలోని క్రైం పోలీసులకు అప్పగించారు.నిందితుడు అనంతపురానికి చెందిన రాజేష్‌గా పోలీసులు చెబుతున్నారు.నిందితుడు పాత నేరస్తుడిగా వెల్లడించారు.