pickpocketers
-
టార్గెట్ సెల్‌ఫోన్స్ ! ఏటా వేల సంఖ్యలో గల్లంతు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి రోజైన గత నెల 31న మార్కెట్లలో జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఆ ఒక్క రోజే రాజధాని వివిధ ప్రాంతాల్లోని జనసమర్థ ప్రాంతాల నుంచి 327 సెల్ఫోన్లను తస్కరించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదులందాయి. ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులూ పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్ చోరీల బాధితులుగా మారారు. చవితి నుంచి నిమజ్జనం వరకు 134 ఫోన్లు పోయినట్లు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి... ఇంకా అందుతున్నాయి. కేవలం ఈ రెండు సందర్భాలే కాదు గడిచిన కొన్నాళ్లుగా నగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న పోలీసులు చోరుల కన్ను సెల్ఫోన్లపై ఉన్నట్లు స్పష్టమవుతోందని చెప్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ఈ నేరాలు... రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నా, రద్దీ బస్సులో ప్రయాణిస్తున్నా, మార్కెట్‌కు వెళ్లినా, సభలు/ఉత్సవాలకు హాజరైనా అక్కడ పొంచి ఉంటున్న చోరులు స్పార్ట్ ఫోన్లను స్వాహా చేస్తున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటుపడిన వాళ్ళు సైతం ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు కొత్త సవాల్ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రస్తుతం సిటీ పోలీసులకు ‘సెల్‌ఫోనే’ ఓ పెద్ద ఛాలెంజ్‌గా మారింది. అధికారిక, అనధికారిక సమాచారం ప్రకారం నగరంలో ఏటా దాదాపు 50 వేల వరకు సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. ఇటీవల పిక్పాకెటర్లు పర్సులు, స్నాచర్లు గొలుసుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డారు. కొందరైతే ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. నిషా జోరులో, సరదా కోసం రెచ్చిపోతూ.... ఇటీవల కాలంలో ‘జాయ్ సెల్‌ఫోన్ స్నాచర్లు’ పెరిగిపోతున్న పరిస్థితి నగర పోలీసులకు కొత్త సవాళ్ళను విసురుతోంది. ఈ నేరాలు చేసే వారిలో అత్యధికులకు వాస్తవానికి ఆ అవసరం ఉండదు. ఇలాంటి స్నాచర్ల కుటుంబాలు సైతం స్థిరపడినవో, విద్యాధికులతో కూడినవో అయి ఉంటున్నాయి. అయితే మద్యం మత్తులోనో, గంజాయికి బానిసలుగా మారడంతోనో వీరు గతి తప్పుతున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ‘తాత్కాలిక స్నాచర్లుగా’ మారిపోయి అప్పుడప్పుడు నేరాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలోనూ కొందరు ఈజీ మనీకి అలవాటుపడి వరుసపెట్టి నేరాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి కేసుల్ని సీసీ కెమెరాల ఆధారంగా కొలిక్కి తెస్తున్న పోలీసులు నేరగాళ్ళను కట్టడి చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. పెండింగ్ భయంతోనే అధికం... జేబు దొంగతనాలు, స్నాచింగ్స్, సెల్‌ఫోన్ చోరీలు, వాహనాల దొంగతనాలకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారం కావని, పెండింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వీటిని చాలా వరకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు. కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతో సరిపెడుతున్నారు. దీంతో బాధితులు నష్టపోతున్నారు. (చదవండి: ఉదయగిరిలో బాలిక కిడ్నాప్) -
12 ఏళ్లలో 339 చోరీలు.. కూలీలే కానీ కాస్ట్లీ కార్లలో తిరుగుతూ..
కాస్త రద్దీగా బస్సు కనిపిస్తే చాలు.. ఆ రెండు కార్లకు సడన్ బ్రేకులు పడతాయి. అందులో ఉన్న వాళ్ల ముఖాలు వెలిగిపోతాయి. బస్సులో మహిళల వైపు రష్ కనిపిస్తే.. ఆ ఇద్దరు ఆడవాళ్లలో ఒకరు దిగి తమ చేతివాటం ప్రదర్శించుకొస్తారు. అదే పురుషుల వైపు రద్దీ ఉంటే.. ఆ ఇద్దరు మగవాళ్లలో ఒకరు దిగి తమ పని కానిచ్చేస్తారు. ఏ మాత్రం సందేహం రాకుండా బస్సు దిగిపోయి.. తమ తమ కార్లలో గాయబ్ అవుతారు. ఇలా 12 ఏళ్లుగా 339 చోరీలకు పాల్పడ్డ రెండు జంటలను.. గుజరాత్ సోమనాథ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితులు సంజయ్-గీత, నరేష్-రేఖలను కటకటాల వెనక్కి నెట్టారు. వాళ్ల నుంచి రెండు బ్రెజ్జా కార్లను, ఐఫోన్లను, లక్ష రూపాయల దాకా నగదు, నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కూలీలు ఇలా.. దాహోడ్ జిల్లాకు చెందిన ఈ రెండు జంటలు కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. అయితే.. తేలికగా డబ్బు సంపాదించడం కోసం చేతులు కలిపి ఇలా చోరీలకు దిగారు. ఆ చోరీల ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆరేసి లక్షల రూపాయల విలువ చేసే ఈ రెండు కాస్ట్లీ కార్లను కొనుగోలు చేశారు కూడా. కార్లలోనే తిరుగుతూ పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా దర్జాగా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారు. కానీ, స్థానికులకు ఏమాత్రం అనుమానం రాకుండా అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తూ వస్తున్నారు. అయితే.. ఎలా పట్టారంటే.. ఆగస్టు 21, 22 తేదీల్లో వెరవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ సోమనాథ్ మాంగ్రోల్ బస్ స్టేషన్ వద ఇద్దరు బాధితులు బస్సుల్లోనే.. నగదును పొగొట్టుకున్నారు. దీంతో సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. అందులో బ్రెజ్జా కారులో వచ్చిన ఇద్దరు మహిళలు.. లగేజీ లేకుండా రద్దీ బస్సులు ఎక్కడం, కాసేపటికే ఆ బస్సు దిగి తిరిగి కారులో వెళ్లిపోవడం పోలీసులకు అనుమానంగా అనిపించింది. దీంతో.. కారు నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసి వెరవల్ దగ్గర వాళ్లను పట్టుకున్నారు. ఆపై భార్యలు ఇచ్చిన సమాచారంతో భర్తలనూ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. గత 12 ఏళ్లుగా గుజరాత్లో వివిధ ప్రాంతాల్లో ఇలా రద్దీ బస్సుల్లో చోరీలకు పాల్పడినట్లు ఈ రెండు జంటలు ఒప్పుకున్నాయి. ఇదీ చదవండి: మిస్సింగ్ కాదు.. డబుల్ మర్డర్! -
జేబుదొంగలు అరెస్ట్
– రూ.6.18 లక్షల నగదు, సెల్‌ఫోన్, గ్రాము బంగారం స్వాధీనం కర్నూలు: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టోల్గేట్ల వద్దమాటు వేసి ప్రయాణికుల బ్యాగులు, జేబులు కత్తరించే దొంగల ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి గ్రామానికి చెందిన నీలిషికారి ఫరూక్‌ఖాన్ కర్నూలు ముజఫర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అదే కాలనీకి చెందిన షాలిమియ్య అలియాస్ శాలు, మాదిగ గంగాధర్ అలియాస్ గంగ, గూడూరు గ్రామానికి చెందిన షేక్సుభాన్లతో ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. కర్నూలు రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతూ కన్పించడంతో సీసీఎస్ డీఎస్పీ హుసేన్‌పీరా, సీఐ పవన్‌కిషోర్, ఎస్ఐలు ఎస్ఎం రసూల్, శ్రీనివాసులు తదితరులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, నేరాల చిట్టా బయటపడింది. వారి వద్ద నుంచి రూ.6.18 లక్షల నగదు, నోకియా సెల్‌ఫోన్, గ్రాము బంగారం తాళిబొట్టు స్వాధీనం చేసుకొని ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. ఆదివారం మధ్యాహ్నం పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండు, బళ్లారి చౌరస్తా, వెల్దుర్తి టోల్గేట్, పుల్లూరు టోల్‌ప్లాజా ప్రాంతాల్లో బ్యాగులు, వ్యక్తుల జేబులను కత్తరించి అందులో ఉన్న నగదును తస్కరించి జల్సాలు చేస్తూ తప్పించుకు తిరిగేవారు. ఏపీఎస్పీ రెండో పటాలం వద్ద ఇద్దరు మహిళలను ఆటోల్లో ఎక్కించుకొని, శివారు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి, వారి బ్యాగును దొంగలించారు. 15 రోజుల క్రితం అలంపూర్ చౌరస్తా వద్ద కార్లో నిద్రిస్తున్న ప్రయాణికుల బ్యాగును అపహరించినట్లు పోలీస్ విచారణలో అంగీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు పోలీస్ స్టేషన్, కర్నూలు రెండు, నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్లో వీరిపై చోరీ కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదును రికవరీ చేసేందుకు డీఎస్పీ హుసేన్‌పీరా, సీఐ పవన్‌కిషోర్, ఎస్ఐలు రసూల్, శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్ మస్తా, కానిస్టేబుల్ సుదర్శనం, నాగరాజు, రవి, షమీర్, కిషోర్ తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.