Pidarmati Ravi
-
విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ డ్రామాలు
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి సాక్షి, హైదరాబాద్: మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ తెలంగాణ విమోచనం పేర కొత్త డ్రామాలకు తెరలేపిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇక, విమోచన దినం జరపాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం సంస్థానం దేశంలో విలీనమైతే, దానిని ముస్లింల అరాచకాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. -
అమిత్షా రాష్ట్ర పర్యటన ఎందుకు?: పిడమర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పర్యటనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఎందుకు వస్తున్నారో చెప్పాలని ఆ పార్టీని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు పెడ తారో చెప్పాలన్నారు. అలాగే ఎస్టీ రిజర్వేషన్లు పెంచే చట్టాన్ని పార్లమెంట్లో ఎప్పుడు పెడతారు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల పెంపుపై మీ వైఖరి ఏంటో చెప్పాలన్నారు. ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తారా? ట్రిపుల్ తలాక్లో మీ జోక్యం ఎందుకు అంటూ ప్రశ్నించారు. -
ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయండి
పిడమర్తి రవి సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పంటలకు మద్దతు ధర విషయంలో టీడీపీ, బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి వ్యాఖ్యానించారు. కేంద్రం చేయాల్సిన పనులకు రాష్ట్రానిదా బాధ్యత అంటూ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 12, 13 తేదీల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఖమ్మంలో ధర్నా చేస్తామంటున్నారని, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కేవలం చంద్రబాబు దృష్టిలో పడాలనే ఖమ్మం మార్కెట్ యార్డుపై దాడికి పురి గొల్పారని విమర్శించారు. వాణిజ్య పంటల మద్దతు ధర కేంద్రం చేతుల్లో ఉంటుందని ఆ పార్టీల నేతలకు తెలి యదా అని ప్రశ్నించారు. రైతుల మధ్య అపోహలు సృష్టించేందుకే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ కలసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.