
విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ డ్రామాలు
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
సాక్షి, హైదరాబాద్: మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ తెలంగాణ విమోచనం పేర కొత్త డ్రామాలకు తెరలేపిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇక, విమోచన దినం జరపాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం సంస్థానం దేశంలో విలీనమైతే, దానిని ముస్లింల అరాచకాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.