piece
-
డాలర్, యూరోకి షాకిచ్చే కరెన్సీ? ‘గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్’ గురించి తెలుసా?
గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ గురించి ఎపుడైనా విన్నారా.భూమి లేని దేశం కానీ డాలర్, యూరో కంటే బలమైన కరెన్సీ దీని సొంతమా? నిజంగా ఈ కరెన్సీ అంత విలువైందా? మహర్షి మహేశ్ యోగి 2020 అక్టోబర్ 7న స్థాపించిన దీని గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఒక విధంగా చెప్పాలంటే ఆసక్తికరమైన, ప్రత్యేకమైన దేశం గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్. సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలల నుండి శాంతియుత, సామరస్యపూర్వక వ్యక్తులను ఒకచోట చేర్చడమే దీని లక్ష్యం. మహర్షి మహేశ్ యోగి మరణానంతరం ప్రస్తుతం మహర్షి గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్‌కి న్యూరాలజిస్ట్, అధినేత రాజా రామ్ (టోనీ నాడార్) అధినేతగా ఉన్నారు. . గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ దాని స్వంత కరెన్సీని రామ్ అని పిలుస్తారు. ఇది లోకల్ కరెన్సీ. దీన్నే బేరర్ బాండ్ అని కూడా పిలుస్తారు.ఇది అయోవా, నెదర్లాండ్స్‌లో ఉపయోగిస్తున్నారు. ఐరోపాలో 10 యూరోలు, అమెరికా 10 డాలర్లకు సమానమైన ‘రామ్’. రామ్ 1, 5, 10 వివిధ డినామినేషన్లలో లభ్యం. ఇది ఇప్పటికే ఉన్న కరెన్సీలను భర్తీ చేయదు కానీ నిర్దిష్ట లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చు. రామ్‌ను బ్యాకప్ చేయడానికి బంగారాన్ని ఉపయోగించడాన్ని సంస్థ ప్రోత్సహిస్తుంది. 2001లో మహర్షి మహేష్ యోగి జారీ చేసిన కరెన్సీని డచ్ సెంట్రల్ బ్యాంక్ అనుమతించిందట. (వామ్మో! ఇళ్లకి హైదరాబాద్‌లో ఇంత డిమాండా? కళ్లు చెదిరే సేల్స్) అమెరికాలోని పలు నగరాల్లో నిర్మించిన "శాంతి భవనాలు" మరో విశేషం. ఈ భవనాలు దేవాలయాలు పోలిఉంటాయి. ఇక్కడ ఆయుర్వేద చికిత్సలు, మూలికా సప్లిమెంట్లు, అతీంద్రియ ధ్యానం వంటి వాటిపై బోధిస్తారు. బెథెస్డా, మేరీల్యాండ్, హ్యూస్టన్ ఆస్టిన్, టెక్సాస్, ఫెయిర్‌ఫీల్డ్, అయోవా, సెయింట్, పాల్, మిన్నెసోటా , లెక్సింగ్టన్, కెంటుకీ వంటి నగరాల్లో వీటిని చూడవచ్చు. గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ అంతిమ లక్ష్యం హింస లేదా సంఘర్షణ లేని ప్రపంచాన్ని సృష్టించడమేనని చెబుతారు. వారి బోధనలు, అభ్యాసాలతో అంతర్గత శాంతిని, సామరస్యాన్ని సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. 2008 ఫిబ్రవరి 5న నెదర్లాండ్స్‌లోని తన నివాసంలో మహర్షి యోగి కన్నుమూశారు. (ఇదీ చదవండి: Vinod Rai Gupta Net Worth: వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?) ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ రామ్ అంటూ 2020లో సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే రామ్ అనేది లోకల్ కరెన్సీ మాత్రమే తప్ప, గ్లోబల్ కరెన్సీగా గుర్తించలేమని ఆ సందర్భంగా నిపుణులు కొట్టిపారేశారు. మరోవైపు గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ వాటికన్ లాంటి స్వతంత్ర నగర రాజ్యంగా ను ఏర్పాటు చేయాలని సార్వభౌమాధికార హోదాను పొందేందుకు ప్రయత్నిస్తోంది. వారు అనేక దేశాల నుండి భూమిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు, కాని స్వతంత్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వారి భూమిని విక్రయించడానికి అంగీకరించలేదు. ఒకవేళ సార్వభౌమ రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగితే, ఆ తరువాత దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకుంటే, అపుడు రామ్ కరెన్సీ రెగ్యులర్ లీగల్ టెండర్ హోదాను పొందుతుందనేది నిపుణుల మాట. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా) -
భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్‌ని ఇంటికి రప్పించి...
Mutilated Body Found In Indore: ఇండోర్‌లోని పోలీసులు పొదలమాటున చిద్రమైన ట్రాన్స్‌జెండర్ మృత దేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారించడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసు మిస్టరిని చేధించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం....పోలీసుల గుర్తించిన ఆ ట్రాన్స్‌జెండర్ మృతదేహంలో ఒక భాగం మాత్రమే లభించింది. దీంతో పోలీసుల ఆ పరిసర ప్రాంతాల్లో పీసీఫుటేజ్‌ని పరిశీలించగా.... చనిపోయిన ట్రాన్స్ జెండర్ ఆగస్టు 28న కనిపించకుండా పోయిన అలియాస్ జోయా కిన్నార్‌గా గుర్తించారు. ఐతే ఈ కేసులో అనుమానితుడు ఖజ్రానాకు చెందిన నూర్‌మహ్మద్‌గా గుర్తించి విచారణకు పిలిపించారు. అతను విచారణలో చెప్పిన విషాయలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. నిందితుడు విచారణలో అతని భార్య పుట్టింటికి వెళ్లిందని, తాను ఆ సమయంలో ట్రాన్స్‌జెండర్ జోయాతో సోషల్ మీడియాలో చాటింగ్ చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత తాను జోయాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించానని చెప్పాడు. ఇంటికి వచ్చాకే జోయా ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందని, దీంతో ఈ విషయమై మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపాడు. ఆ కోపంలో తాను ఆమె గొంతుకోసి చంపినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి, అందులో ఒక భాగాన్ని సంచిలో వేసి బైపాస్ సమీపంలోని పొదల్లోకి విసిరేసినట్లు తెలిపాడు. మరో భాగాన్ని పారేయలేక తన ఇంట్లోనే పెట్టేలో భద్రపరిచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు మిగతా భాగం మృతదేహాన్ని నిందితుడు నూర్‌మహ్మద్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి) -
చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఉల్లి ముక్క.. ఆపస్మారక స్థితిలో..
హిందూపురం(అనంతపురం జిల్లా): 9 నెలలో చిన్నారి గొంతులో ఉల్లి ఇరుక్కుపోయి ఊపిరాడకుండా చేసింది. తల్లిదండ్రులకు కొన్ని గంటలపాటు ప్రాణాలు నిలవకుండా చేసింది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చాకచక్యంగా ఉల్లి ముక్కను తొలగించడంతో ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. రొద్దం మండలం కలిపి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు (9 నెలల చిన్నారి) శనివారం ఆడుకుంటూ ఉల్లిపాయ ముక్కను మింగేశాడు. చదవండి: నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య అది గొంతులో అడ్డుపడి ఊపిరి ఆడకపోవడంతో పిల్లాడు ఆపస్మారకస్థితిలో పడిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన పట్టణానికి చేరుకుని పలు ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లినా చేరి్పంచుకోలేదు. చివరికి ప్రభుత్వ ఆసుపత్రికి రాగా, సూపరింటెండెంట్ డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో డాక్టర్లు అమరేష్, వెంకట రమణనాయక్, వాహిద్ పిల్లాడికి చికిత్స నిర్వహించారు. ఉల్లి ముక్కను బయటకు తీశారు. తమ బిడ్డకు ఏమౌతుందోనని అప్పటివరకూ తల్లడిల్లిన హృదయాలు దీంతో ఉపశమన పొందాయి. తమ ఇంట ఉగాది సంతోషం నింపారంటూ డాక్టర్లు, వైద్యసిబ్బంది రాజు, నిర్మలమ్మ, సత్తి, తదితరులకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
కేఎఫ్‌సీ భోజనంలో పురుగులు!
కేఎఫ్‌సీ.. తన వినియోగదారులకు షాకుల మీద షాకులిస్తోంది. సాయంత్రం సరదాగా అలా బయట తిందామని వెళ్లిన వారికి కేఎఫ్‌సీ పాప్‌కార్న్ చికెన్ మీల్లో పురుగులు కనిపించడంతో ఆశ్చర్యం, అసహ్యం రెండూ కలిగాయి. ఇటీవలి కాలంలో కేఎఫ్‌సీ మీద పలు సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఇండియాలో హైదరాబాద్, మంగుళూరు తదితర ప్రాంతాల్లో కేఎఫ్‌సీ బర్గర్లలో పురుగులు రావడం, చికెన్‌లో బ్యాక్టీరియా ఉండటం కనిపించాయి. తాజాగా 27 ఏళ్ల జెన్నిఫర్ ఆల్డెర్సన్ తన కుమార్తె లిడియా హోనేతో కలసి బిషప్ ఆక్లాండ్ లోని దుర్హామ్ ప్రాంతంలో ఉన్న కేఎఫ్‌సీకి వెళ్లారు. అక్కడ చికెన్ పాప్‌కార్న్ మీల్ కోసం ఆర్డర్ ఇచ్చారు. తీరా లిడియా తింటున్న పాప్‌కార్న్‌లో పురుగు కనిపించడంతో జెన్నిఫర్ షాకయ్యింది. ఒకేవారంలో ఇలా కేఎఫ్‌సీ ఆహారంలో క్రిములు కనిపించడం ఇది రెండోసారని అక్కడే ఉన్న మరో మహిళ చెప్పడం.. అగ్నికి ఆజ్యం పోసింది. పురుగు కనిపించిన తర్వాత జెన్నిఫర్ కుటుంబ సభ్యులు.. మిగిలిన పదార్థాలను తినలేకపోయారు. పదార్థాలన్నింటినీ వాపస్ ఇచ్చేసిన ఆల్డెర్సన్.. కేఎఫ్‌సీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదార్థాలను చుట్టి ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత పురుగులు ఎలా వస్తాయని, మీ అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందని మండిపడింది. దీంతో కేఎఫ్‌సీ సిబ్బంది మరోసారి ఇలా జరగకుండా చూస్తామంటూ క్షమాపణలు చెప్పారు.. అయితే మొక్కజొన్న వంటి సహజ ఉత్పత్తుల విషయంలో దురదృష్టవశాత్తు అరుదుగా ఇలా అవుతుందని, గింజలను తొలిచి క్రిములు లోపల ఉండటంతో కనపడవని కేఎఫ్‌సీ సిబ్బంది సంజాయిషీ ఇస్తున్నారు. ఇలాంటి తప్పులు జరిగితే తాము ఆర్డర్ పూర్తిగా వాపస్ తీసుకుంటామని, తమ కస్టమర్ కేర్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తారని చెప్తున్నారు. ఆహార భద్రతాధికారులు కూడా ఒకే వారంలో రెండుసార్లు ఇలాంటి ఘటనలు జరగడంపై కేఎఫ్‌సీని వివరణ కోరారు.