pilice
-
సిద్ధూ హత్య కేసు: వెలుగులోకి వస్తున్నకీలక విషయాలు
న్యూఢిల్లీ: పంజాబ్ సింగర్ సిద్ధూ హత్య కేసుకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...పంజాబ్ సింగర్ సిద్ధూని హత్యకు సంబంధించిన కుట్రదారుల్లో ఒక వ్యక్తి హత్యకు నెలరోజుల మందుగానే నకిలీ పాస్పోర్టుతో భారత్ వదిలి పారిపోయాడని చెప్పారు. ఆ వ్యక్తి సచిన్ బిష్ణోయ్ అని, అతను జైల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహిత సహచరుడని పేర్కొన్నారు. ఈ హత్యకు ప్లాన్ చేసి తర్వాతే నకీలీ పాస్‌పోర్ట్ సహాయంతో ఇండియా వదిలి పారిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని తాము ముందుగానే గుర్తించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు సచిన్ బిష్ణోయ్ ఏప్రిల్ 21 వరకు భారత్‌లోనే ఉన్నాడని తెలిపారు. నిందితుడు కెనడాకు చెందిన గోల్డీ బ్రార్‌తో పాటు రాపర్‌ని హత్య చేసిన ఇద్దరు ప్రధాన కుట్రదారులలో ఒకరుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని సంగమ్ విహార్ చిరునామాతో తిలక్ రాజ్ తోటేజా పేరుతో సచిన్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌ను పొందినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధూ మూసే వాలేని హత్య చేసింది మే 29న అయితే సచిన్ బిష్ణోయ్ ఏప్రిల్ 21నే భారత్‌ని వదలి దూబాయ్ పారిపోయాడని అక్కడి నుంచి అజర్బైజాన్ వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు సచిన్ బిష్ణోయ్ ఢిల్లీలో ఉన్నప్పుడే మూస్ వాలా హత్యకు సంబంధించిన మొత్తం ప్లాన్‌ని సిద్ధం చేసి, షూటర్లకు షెల్టర్లు, డబ్బు, వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదీగాక సిద్ధూ మూసే వాలేకి ఉన్న 424 భద్రతా సిబ్బంది తొలగించిన తర్వాత ఈ హత్య జరగడం గమనార్హం. (చదవండి: Sidhu Moose Wala Murder Case: మాస్టర్ మైండ్ అతనేనన్న ఢిల్లీ పోలీసులు) -
పోలీసుల ఆకలి కేకలు..
బందోబస్తులో భోజన సదుపాయాలులేక తిప్పలు రాజానగరం: పుష్కర బందోబస్తుకు తీసుకువచ్చి, తమ కడుపులు మాడుస్తున్నారని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి వచ్చిన పోలీసులు ఆక్రోశిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికే ఇక్కడకు చేరుకున్న పోలీసు సిబ్బందికి తగిన వసతులు కల్పించడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. పురుషుల మాటెలావున్నా మహిళా పోలీసుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తాగు నీరు, కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం కల్పించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు భోజనాల నిమిత్తం తమకు ఇచ్చేది రూ. 50 అయితే ఒక్కపూటకే రూ. 80 వెచ్చించవలసి వచ్చిందని పలువురు పోలీసులు చెప్పారు. రోజుకు తమకు టీఏగా రూ. 200 చొప్పున ఐదు రోజులకు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రస్తుత రోజుల్లో రోజుకు రూ. 50 ఏవిధంగా సరిపోతాయన్నారు. -
నకిలీ కరెన్సీ గుట్టు రట్టు
డెంకాడ, న్యూస్‌లైన్: నకిలీ కరెన్సీ చెలామణి చేస్తూ నలుగురు వ్యక్తులు పోలీసులకు గురువారం అడ్డంగా దొరికిపోయారు. మండలంలోని అయినాడ జంక్షన్ వద్ద ఒక పాన్‌షాప్ వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి కొబ్బరి బొండాలు తీసుకున్నారు. షాపు యజమానికి వారు రూ.100 నోటు ఇవ్వగా, యజమాని దాన్ని నకిలీ నోటుగా గుర్తించారు. దీనిపై వారితో వాదనకు దిగారు. అంతలోనే ఆ ఇద్దరికి మరో ఇద్దరు తోడై షాపు యజమానితో ఘర్షణకు దిగారు. దీంతో యజమాని స్థానికుల సహాయంతో డెంకాడ ఎస్ఐ సి.హెచ్.శ్రీధర్‌కు సమాచారాన్ని చేరవేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు పురుషులు, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరి వద్దనున్న నకిలీ నోట్లను కూడా స్వాధీన పరచుకున్నారు. వీరు నలుగురూ విశాఖ జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. వీరికి నకిలీ కరెన్సీ ఎలా వచ్చింది, ఎవరెవరు వీరిని వెనుకనుంచి నడిపిస్తున్నారు, నకిలీ కరెన్సీ నోట్లు ఎక్కడ ముద్రిస్తున్నారు, ఎప్పటి నుంచి చెలామణి చేస్తున్నారు వంటి విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. గురువారం రాత్రి డెంకాడ పోలీసు స్టేషన్లో నలుగురు అనుమానితులను డీఎస్పీ కృష్ణప్రసన్న, సీఐ ప్రవీణ్‌కుమార్ విచారించినట్లు తెలిసింది. ‘రూ.పదివేలు నకిలీ కరెన్సీ గుర్తించాం’ ఇదే విషయమై భోగాపురం సీఐ ప్రవీణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ డెంకాడ మండలంలోని అయినాడ జంక్షన్ వద్ద నకిలీ కరెన్సీ చెలామణీ చేస్తుండగా డెంకాడ పోలీసులకు సమాచారం అందిందని చెప్పా రు. అక్కడకు వెళ్లి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఈ నలుగురి వద్ద నుంచి సుమారు పదివేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు విశాఖ జిల్లాలోని పోతుల మల్లయ్యపాలెం, భీమిలికి చెందినవారని చెప్పారు. నకిలీ కరెన్సీ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. -
కారు బోల్తా.. ఇద్దరు యువకుల మృతి
శివయ్యస్థూపం(వినుకొండ), న్యూస్‌లైన్ : ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు సెలవుపై గ్రామానికి వచ్చాడు.. స్నేహితులతో కలిసి మల్లన్న దర్శనానికి శ్రీశైలం వెళ్లొద్దామనుకున్నారు. ఆరుగురు మిత్రులు సఫారీ కారులో సంతోషంగా బయలుదేరారు. గుంతల మయమైన రోడ్డులో వీరిపాలిట మృత్యువైంది. ఈపూరు మండలం బోడిశంభునివారిపాలెం వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. గురువారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డకు చెందిన కొంగా హరినాథరెడ్డి(23) బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన సెలవుపై స్వగ్రామానికి రావటంతో స్నేహితులంతా కలిసి శ్రీశైలానికి వెళ్లొద్దామనుకున్నారు. జొన్నలగడ్డ, తాడికొండ మండలం లాం శివారు తాతిరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన ఆరుగురు యువకులు బుధవారం రాత్రి సఫారీ కారులో బయలుదేరారు. వినుకొండ సమీపంలో ఈపూరు మండలం బోడిశంభునివారిపాలెం వద్ద కర్నూలు-గుంటూరు రాష్ట్ర ర హదారిపై కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. కారులో ముందు కూర్చున్న తాతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కొండా నాగార్జునరెడ్డి(24) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కొంగా హరినాథరెడ్డి(23)ని గుంటూరు తరలిస్తుండా మార్గంమధ్యలో మృతిచెందాడు. కారులో ఉన్న కొంగా అమర్నాథ్రెడ్డి, శ్యామల వెంకటరెడ్డి, కొండా కోటిరెడ్డి, కుర్రా వంశీలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో డ్రైవింగ్ చేసిన కొండా కోటిరెడ్డికి తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. బోడిశంభునివారిపాలెం రోడ్డుపై గోతులు ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఈపూరు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నాగార్జునరెడ్డి కుటుంబసభ్యులు, బంధువులు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.