the pilot
-
నాడు శరణార్థి.. నేడు ఆర్మీ పైలట్
అఫ్గాన్ మహిళ ఘన ప్రస్థానం కాబూల్: ఒకనాడు శరణార్థిగా ఉన్న అఫ్గానిస్తాన్ మహిళ నేడు ఆ దేశ ఆర్మీలో విమానం నడిపే స్థాయికి ఎది గింది. అఫ్గానిస్తాన్ ఆర్మీలో ప్రస్తుతం ఇద్దరే మహిళా పైలట్లు ఉండగా వారిలో 26 ఏళ్ల కెప్టెన్ సాఫియా ఫెరోజి ఒకరు. అఫ్గానిస్తాన్‌లో 1990ల్లో అంతర్యుద్ధం జరుగుతున్న కాలంలో ఫెరోజి కుటుంబం కాబూల్‌ను వదిలేసి పాకిస్తాన్‌కు ప్రాణభయంతో పారిపోయింది. తాలిబాన్ ప్రభావం తగ్గాకే మళ్లీ ఆ కుటుంబం కాబూల్ వచ్చింది. అనంతరం పాఠశాలలో చదువుతుండగా ఆర్మీలో చేరడానికి మహిళలు కావాలంటూ వచ్చిన ఒక టీవీ ప్రకటన చూసి ఫెరోజి దరఖాస్తు చేసింది. ఆర్మీ ఆమెను పైలట్‌ను చేసింది. -
'విమానం కూలిపోయిన కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాం'
-
'విమానం కూలిపోయిన కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాం'
కౌలాంలాపూర్: ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిన ప్రాంతాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా విమానం అదృశ్యంపై గాలింపు చర్యలు చేపట్టినా.. తాజాగా కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించి ఆ పరిధిలోనే అన్వేషణ కొనసాగిస్తున్నామని నావీ చీఫ్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఇప్పటి వరకూ 16 ప్రయాణికుల మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. శుక్రవారం కూడా గాలింపు చర్యలు చేపట్టినా ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. 90కు పైగా నౌకలు, పలు దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, యూఎస్ తదితర దేశాలు పాల్గొంటున్నాయి. -
ఆ విమానం నీటిపై సురక్షితంగా దిగిందా..!
జకార్తా/లండన్: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501ను పైలట్ సురక్షితంగా సముద్రపు నీటిపై దింపి ఉండొచ్చని నిఫుణులు భావిస్తున్నారు. అయితే ఉవ్వెత్తున ఎగసిపడిన అలల కారణంగా విమానం నీటిలో మునిగిపోయి ఉండొచ్చని పేర్కొంటున్నారు. సాధారణంగా విమానం కుప్పకూలితే కనిపించే శకలాలు, అత్యవసర ట్రాన్స్మిషన్లు, ఇతర డాటా లాంటివి లభించకపోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కాగా, విమానంలోని బ్లాక్ బాక్స్ గురించి ఇంకా వేట కొనసాగుతోంది. గురువారం మరో ప్రయాణికుడి మృతదేహం లభించింది.