
'విమానం కూలిపోయిన కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాం'
కౌలాంలాపూర్: ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిన ప్రాంతాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా విమానం అదృశ్యంపై గాలింపు చర్యలు చేపట్టినా.. తాజాగా కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించి ఆ పరిధిలోనే అన్వేషణ కొనసాగిస్తున్నామని నావీ చీఫ్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఇప్పటి వరకూ 16 ప్రయాణికుల మృతదేహాలను వెలికితీశామని తెలిపారు.
శుక్రవారం కూడా గాలింపు చర్యలు చేపట్టినా ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. 90కు పైగా నౌకలు, పలు దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, యూఎస్ తదితర దేశాలు పాల్గొంటున్నాయి.