
ఆ విమానం నీటిపై సురక్షితంగా దిగిందా..!
జకార్తా/లండన్: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501ను పైలట్ సురక్షితంగా సముద్రపు నీటిపై దింపి ఉండొచ్చని నిఫుణులు భావిస్తున్నారు. అయితే ఉవ్వెత్తున ఎగసిపడిన అలల కారణంగా విమానం నీటిలో మునిగిపోయి ఉండొచ్చని పేర్కొంటున్నారు. సాధారణంగా విమానం కుప్పకూలితే కనిపించే శకలాలు, అత్యవసర ట్రాన్స్‌మిషన్లు, ఇతర డాటా లాంటివి లభించకపోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కాగా, విమానంలోని బ్లాక్ బాక్స్ గురించి ఇంకా వేట కొనసాగుతోంది. గురువారం మరో ప్రయాణికుడి మృతదేహం లభించింది.