
నాడు శరణార్థి.. నేడు ఆర్మీ పైలట్
అఫ్గాన్ మహిళ ఘన ప్రస్థానం
కాబూల్: ఒకనాడు శరణార్థిగా ఉన్న అఫ్గానిస్తాన్ మహిళ నేడు ఆ దేశ ఆర్మీలో విమానం నడిపే స్థాయికి ఎది గింది. అఫ్గానిస్తాన్ ఆర్మీలో ప్రస్తుతం ఇద్దరే మహిళా పైలట్లు ఉండగా వారిలో 26 ఏళ్ల కెప్టెన్ సాఫియా ఫెరోజి ఒకరు. అఫ్గానిస్తాన్‌లో 1990ల్లో అంతర్యుద్ధం జరుగుతున్న కాలంలో ఫెరోజి కుటుంబం కాబూల్‌ను వదిలేసి పాకిస్తాన్‌కు ప్రాణభయంతో పారిపోయింది. తాలిబాన్ ప్రభావం తగ్గాకే మళ్లీ ఆ కుటుంబం కాబూల్ వచ్చింది. అనంతరం పాఠశాలలో చదువుతుండగా ఆర్మీలో చేరడానికి మహిళలు కావాలంటూ వచ్చిన ఒక టీవీ ప్రకటన చూసి ఫెరోజి దరఖాస్తు చేసింది. ఆర్మీ ఆమెను పైలట్‌ను చేసింది.