PINS
-
ముక్కున ధరించే ముక్కెర ఇలా ఉంటే.. మీ లుక్ అదిపోతుంది!
ఆభరణాలు ఎన్ని ఉన్నా ఆ ఒక్క అలంకారం తక్కువైతే అందానికి పరిపూర్ణత చేకూరదు. ఆ ఒక్కటే ముక్కుపుడక లేదా ముక్కెర. వేడుకలలో ప్రత్యేకంగా వెలిగిపోతూ నోస్పిన్గా స్టైల్లో తనదైన శైలిని చూపుతూ మురిపెంగా మెరిసిపోయే ముక్కున సింగారపు వేడుకలకు ప్రత్యేకం. వ్యక్తిగత శైలికి బలమైన ప్రతిబింబంగా నిలిచే ముక్కెర ఎంపిక కోసం కొన్ని కసరత్తులు చేయాల్సిందే. గుండ్రని ముఖం ఉన్న మహిళలు పొడవుగా ఉండే నోస్రింగ్ ఎంచుకోవడం మంచిది. అలాగే, ముఖం కోలగా ఉండేవారు గుండ్రని నోస్‌పిన్ డిజైన్స్ ఎంచుకుంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. సంప్రదాయంలో మెరుపు బ్రైడల్ కలెక్షన్లో భాగంగా స్వచ్ఛమైన బంగారు, డైమండ్ ముక్కు ఆభరణాలను ఎంచుకుంటుంటారు. అయితే గ్రాండ్‌గా ఉండేందుకు బంగారం, డైమండ్, ముత్యాలు, ఇతర రత్నాలతో ఉండే ముక్కెరలను ఎంచుకోవచ్చు. ఇటీవల బ్రైడల్ నోస్ రింగ్స్‌లో డిజైన్స్ సందర్భానికి తగ్గట్టుగా ఉంటున్నాయి. ఆధునిక శైలి వృత్తి, ఉద్యోగాలలో ఉంటున్న మహిళలైతే ఎలాంటి హంగులూ లేని సింపుల్ డిజైన్స్ ఇష్టపడుతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో డ్రెస్సులకు తగినట్టు మార్చుకోగలిగే ట్రెండింగ్ డిజైన్స్‌ను ఎంచుకుంటున్నారు. వీటిలో అన్ని రకాల స్టోన్స్‌కు మాత్రమే కాదు సిల్వర్, స్టీల్ నోస్రింగ్స్కు ఓటేస్తున్నారు. వీటిలో సెంట్రల్ నోస్ రింగ్స్ మరింత ట్రెండీగా మారాయి. రాష్ట్రాల వారీగా... మహారాష్ట్రీయుల ముక్కెర చంద్రవంక లేదా జీడిపప్పు ఆకారాన్ని పోలి ఉంటుంది. ముత్యాలూ, వజ్రాలు, రాళ్లు, పూసలు జత చేసి ఉంటాయి. మహారాష్ట్ర పెళ్లికూతురు కేవలం ముక్కెర కోసమే వధువు కావాలని కోరుకునేంత అందంగా ఉంటుంది. హిమాలయ ప్రాంతాల మహిళలు బులక్ అనే పేరున్న వెడల్పాటి నోస్ రింగ్స్‌ను ఎంచుకుంటారు. పంజాబీయుల నథ్ అనే పేరు గల ముక్కు ఉంగరాలు చాలా తేలికగా ఉంటాయి. గుజరాత్, రాజస్థాన్ మహిళల నోస్ రింగ్స్ కూడా నథ్ లేదా నాథూరి అని పిలిచే నోస్ రింగ్స్‌ను పోలి ఉంటాయి. ఇవి బంగారం లేదా వెండితో ఉంగరంలా తయారుచేస్తారు. వీటిలో విలువైన రత్నాలను పొదుగుతారు. వేడుకలలో ధరించేవి పెద్దవిగా ఉంటాయి. ముక్కు నుంచి జుట్టుకు జత చేసే గొలుసు ఉన్న నోస్ రింగ్స్‌ను కూడా వాడుతుంటారు. ఇవి బ్రైడల్, ప్రత్యేక సంప్రదాయ వేడుకల అలంకారాలలో కనిపిస్తుంటాయి. ప్రాచీన భారతీయ రాజకుటుంబీకులు వీటిని ధరించేవారు. ఆ తర్వాతి కాలాల్లో పెళ్లి కూతురు అలంకరణలో భాగమైంది. ఉత్తరాఖండ్ మహిళల ఆభరణాల్లో నోస్ రింగ్‌ను టెహ్రీ నథ్ అని పిలుస్తారు. దీని అలంకారం అద్భుతంగా చెప్పుకుంటారు. ఈ నోస్ రింగ్‌లో విలువైన కెంపులు, ముత్యాలతో పొదిగిన వెడల్పాటి బంగారు తీగ ఉంటుంది. నెమలి డిజైన్స్ కూడా ఇందులో చూస్తాం. ఇక్కడి వివాహిత మహిళలు ఈ నోస్ రింగ్‌ను శుభప్రదంగా భావిస్తారు. ఆభరణాల కళాత్మకతలో ఈ నోస్ రింగ్‌ను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. తామర పువ్వు, హంస ఆకారంలో ఉన్న ముక్కెరలు గోవా, కోంకణ్ ప్రాంతాల వధువులు ఎంపిక చేసుకుంటారు. ఈ డిజైన్స్ కర్నాటక, కేరళలో కూడా ధరిస్తారు. దక్షిణాన శాశ్వతం తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాలలో ముక్కు ఉంగరాల కన్నా స్టడ్స్కే ప్రాధాన్యత. డైమండ్స్, కెంపులు, బంగారంతో తయారుచేసినవి ఉంటాయి. దక్షిణ భారత దేశాన ముక్కుపుడక ఒక శాశ్వత ఎంపికగా ఉంటుంది. ముక్కుపుడక అందం వారి అనుభవంతో కలిసి ప్రకాశిస్తుందా అన్నట్టుగా ఉంటుంది. (చదవండి: అతియా, అనుష్కాలు ధరించిన టాప్ ధర వింటే..షాకవ్వాల్సిందే!) -
‘పిన్స్’ ఇట్టే పట్టేస్తుంది..!
* ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెట్వర్కింగ్ సిస్టమ్ (పిన్స్)యాప్‌ను ప్రవేశ పెడుతున్న పోలీసులు * నూతన వెబ్సైట్ అందుబాటులోకి.. * ప్రాపర్టీ పూర్తి వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం * బార్‌కోడింగ్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు * ఇక స్టేషన్లలో వాహనాల తుప్పుకు చెల్లు ప్రత్తిపాడు: ‘ సుబ్బారావు వాహనం ప్రమాదానికి గురైంది... పోలీసులు వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు... ఒక సంవత్సరం తరువాత వాహనం కోసం స్టేషన్‌కు వెళ్లాడు. అప్పుడు తీసుకువచ్చిన పోలీసులు ఇప్పుడు లేరు. వాహనం తుప్పుపట్టి, దుమ్ముకొట్టుకుపోయి గుర్తుపట్టలేనట్లుగా ఉంది. వెళ్లి విధుల్లో ఉన్న పోలీసులను అడిగాడు. ఆ వాహనం ఏ కేసులో పట్టుకున్నదో తెలియని పరిస్థితి. రికార్డుల్లో ఎక్కడుందో కనిపించలేదు. మర్నాడు రమ్మన్నారు. అలాంటి మర్నాడులు ఎన్నో పోయాయి. రోజులు వారాలై, వారాలు నెలలయ్యాయి. రికార్డూ దొరకలేదు. తిరుగుడూ తప్పలేదు. విసిగి విసిగి వేసారిన అతను వాహనంపై ఆశలు వదులుకుని వెళ్లిపోయాడు.’ ఇలాంటి పరిస్థితి ఇకపై పోలీస్స్టేషన్లలో దాదాపు కనిపించకపోవచ్చు. నూతన సాంకేతిక విధానంతో వాహనాలకు క్యూఆర్ కోడ్‌ను జనరేట్ చేసి ఎప్పుడైనా వాహనాల పూర్తి వివరాలను సెకనులో తెలుసుకునే విధంగా ‘ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెట్వర్కింగ్ సిస్టమ్’ (పిన్స్)ను పోలీసుశాఖ అందుబాటులోకి తీసుకువస్తోంది. దీని ద్వారా తేలికగా వాహనాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సీజ్ చేసిన వాహనాలను త్వరితగతిన తిరిగి ఇచ్చేందుకూ ఈ సాఫ్ట్వేర్ దోహదపడుతుంది. నూతన విధానం ఇలా.. * తొలుత యాప్‌స్టోర్ నుంచి క్యూఆర్ కోడ్ స్కానర్‌ను డౌన్లోడ్ చేసుకుంటారు. * ప్రాపర్టీ(వాహనం లేదా వస్తువు) వివరాలను నమోదుచేస్తారు. ఏరకం వస్తువు, ఎప్పుడు పట్టుకున్నారు, ఎఫ్ఐఆర్ నంబరు, సెక్షన్ ఆఫ్ లా, పోలీస్‌స్టేషను పేరు, ఇంజిన్మోడల్, ఐడీ నంబర్లు, ఛాసిస్ నంబరు, రిజిస్ట్రేషను నంబరు, సీజ్చేసిన అధికారి పేరును ఆన్లైన్లో నమోదు చేస్తారు. తదనంతరం ప్రాపర్టీ ఫోటో తీసి అప్లోడ్ చేసి క్యూఆర్ కోడ్‌ను జనరేట్ చేస్తారు. * క్యూఆర్ కోడ్‌ను పేపర్‌పై గానీ స్టిక్కర్‌పై గానీ ప్రింట్ తీస్తారు. * క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌ను వెహికల్ లేదా సంబంధిత ప్రాపర్టీపై అతికిస్తారు. * తదనంతరం ముందుగా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న క్యూఆర్‌కోడ్ స్కానర్ ఓపెన్ చేసి వెహికల్‌పై అతికించిన స్టిక్కర్‌పై ఉంచగానే వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు మనముందు ప్రత్యక్షమవుతాయి. సిబ్బందికీ శిక్షణ.. పిన్స్, క్యూఆర్‌కోడ్ స్కానర్‌ను ఇటీవలే అమల్లోకి తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరూ వెబ్‌సైట్‌పై అవగాహన కలిగి ఉండి, పిన్స్లో వాహనాల వివరాలను నమోదు చేసే విధంగా కానిస్టేబుళ్లకు కూడా శిక్షణ ఇచ్చారు. వాహనానికి సంబంధించిన ఏయే వివరాలను నమోదు చేయాలి, నమోదు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాంకేతిక సమస్యలు తలెత్తితే ఏం చేయాలి.. ఇలా పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. సులువుగా ఉంటుంది.. పిన్స్లో వాహనాలు లేదా ప్రాపర్టీ వివరాలను నమోదు చేయడం వలన పని సులభతరం అవుతుంది. ప్రాపర్టీపై అతికించే స్టిక్కర్‌పై క్యూఆర్ కోడ్ స్కానర్‌ను ఆన్ చేసి ఉంచితే ఉన్నతాధాకారుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ సంబంధిత వస్తువు వివరాలను తేలికగా తెలుసుకోవచ్చు. పిన్స్, క్యూఆర్‌కోడ్ స్కానర్‌కు సంబంధించి ఇప్పటికే కానిస్టేబుల్స్‌కు శిక్షణ ఇచ్చాం. సద్వినియోగం చేసుకుంటే పోలీసుల్లో పారదర్శకత పెరుగుతుంది. ఇది మంచి సాఫ్ట్వేర్. - జి.రవికుమార్, సీఐ, చేబ్రోలు సర్కిల్