Pisasu
-
ఆండ్రియా.. భారీ పారితోషికం కూడా
సంచలన దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పిశాచి–2. 2014లో ఈయన దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని సాధించిన పిశాచి చిత్రానికి ఇది సీక్వెల్. రాక్‌ఫోర్ట్ పతాకంపై మురుగానందం నిర్మించిన ఈ చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించింది. నటుడు విజయ్ సేతుపతి గౌరవ పాత్రలో నటించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హారర్, థ్రిల్లర్ కథా చిత్రం ఈ నెల 31వ తేదీ విధులకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా నటి ఆండ్రియా ఈ చిత్రంలో పూర్తి నగ్నంగా నటించిందని, అందుకు ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందనే ప్రచారం వైరల్ అవుతుంది. దీనిపై దర్శకుడు మిష్కిన్ స్పందిస్తూ చిత్రం కోసం నటి ఆండ్రియాను నగ్నంగా చిత్రీకరించిన విషయం నిజమేనన్నారు. అందుకు ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేయడం కూడా సహజమేనని పేర్కొన్నారు. అయితే ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాలను చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు, అవి కూడా ఆమె సన్నిహితురాలు అయిన ఫొటోగ్రాఫర్‌తోనే తీయించామని తెలిపారు. అక్కడ తాను కూడా లేనని చెప్పారు. అయితే చిత్రాన్ని పిల్లలు కూడా చూడాలన్న ఉద్దేశంతో నగ్న ఫొటోలను చిత్రంలో పొందుపరచలేదని తెలిపారు. చిత్రంలో ఆ ఫొటోలు జత చేస్తే సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇస్తుందని భావించి చేర్చలేదని వివరించారు. -
షాకింగ్ : న్యూడ్‌గా నటించిన హీరోయిన్ ఆండ్రియా?
ప్రముఖ దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన చిత్రం ‘పిశాచు-2’. విజయ్ సేతుపతి పూర్ణ సంతోష్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు.రాక్‌ఫోర్ట్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై టి. మురుగనాథమ్ నిర్మించారు `పిశాచి` చిత్రానికిది సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.. అరణ్మనై అరణ్మనై 2 చిత్రాల్లో నటించిన ప్రేక్షకుల్ని తనదైన నటనతో భయపెట్టిన ఆండ్రియా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో 15నిమిషాల నిడివితో ఉండే ఓ సీన్లో ఆండ్రియా న్యూడ్‌గా నటించినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కథ డిమాండ్ మేరకు 15నిమిషాల పాటు వివిస్త్రగా నటించాలని దర్శకుడు కోరగా, తొలుత ఆండ్రియా అందుకు నిరాకరించినట్లు సమాచారం. కానీ కథ కోసం ఆమె న్యూడ్‌గా నటించిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలియనుంది.గతంలోనూ ఆండ్రియా ‘వడ చెన్నై’ చిత్రంలో బోటులో చిత్రీకరించిన సన్నివేశాల్లో వివస్త్రగా నటించింది. అయితే ఆ తర్వాత ఆ సీన్స్‌ను తొలగించారు. -
రిహార్సల్స్‌లో ప్రయోగ
రిహార్సల్స్ అన్నది ఒకప్పుడు షూటింగ్‌కు ముందుగా జరిగే మంచి విధానం. అదిప్పుడు దాదాపు తెరమరుగవుతున్న పద్ధతి. దర్శకుడు ఆర్.కన్నన్లాంటి అతి కొద్దిమంది తన చిత్ర నటీనటులకు అవసరం అనిపిస్తే రిహార్సల్స్ చేయిస్తుంటారు. ప్రస్తుతం నటి ప్రయోగ మార్టిన్‌తో ఆ దర్శకుడు అలాంటి రిహార్సల్స్ చేయిస్తున్నారు. ఆమెను తన తాజా చిత్రం పోడా ఆండవనే ఎన్పక్కం చిత్రంలో నాయికగా ఎంపిక చేశారు. ప్రయోగ పిశాచు చిత్రంలో చిన్న పాత్రల్లో మెరిసింది. అదే ఆమెనిప్పుడు హీరోయిన్ స్థాయికి చేర్చింది. దీంతో బాధ్యత పెరగడంతో ప్రయోగ నటనలోను, డాన్స్లోను రిహార్సల్స్ చేస్తోందట. దీని గురించి మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈమె తెలుపుతూ కన్నన్ చిత్రంలో నటించే పాత్ర కోసం సంభాషణల ఉచ్ఛరణ, శారీరక భాష తదితర విషయాలు దర్శకుడి సహకారం చాలా హెల్ప్ అవుతోందని చెప్పింది. డాన్స్ విషయంలో నృత్యదర్శకులు కల్యాణ్, బృందాల వద్ద శిక్షణ పొందుతున్నట్లు తెలిపింది. పోడా ఆండవనే ఎన్ పక్కం చిత్రం నగర నేపథ్యంలో సాగే కథ అయినా తన పాత్రలో నటనకు చాలా అవకాశం ఉంటుందంది. ఇది చాలా హోమ్లీ పాత్ర అని అంది. పిశాచు చిత్రంలో చిన్న పాత్ర అయినా చాలా గుర్తింపును తెచ్చిపెట్టిందని, తాజా చిత్రంలో మరింత పేరు తెచ్చుకుంటానని ప్రయోగ అంటోంది. -
ఆ చిత్రంలో ఆమె ఎక్కడ?
నటిగా పేరు తెచ్చుకోవాలంటే అసాంతం చిత్రంలో కనిపిస్తూ పెద్ద పెద్ద సంభాషణలతో ఆవేశపడి పోనవసరం లేదు. కనిపించిన ఒక సన్నివేశంలో అయినా పాత్ర స్వభావానికి తగ్గట్టుగా చిన్న అభినయం కనబరిస్తే చాలు అదృష్టం వరించేస్తుంది. నటి ప్రయోగను ఉదాహరణగా తీసుకోండి. ఆమె ఎవరు అంటారా? పిశాచు చిత్రం చూసిన వారికి ప్రయోగ ఎవరన్న విషయం వివరించనక్కరలేదు. ఆ చిత్రంలో ఆమె ఎక్కడున్నారు? అంటారా? సరిగ్గా గమనిస్తే ఆచిత్రంలో ఒక్క సన్నివేశంలో కనిపించిన ప్రయోగ గుర్తుకొస్తుంది. ఆ సన్నివేశంలో నటించిన ప్రయోగ తదుపరి చిత్రంలో హీరోయిన్ అయిపోయారు. పోడా ఆండవనే ఎన్ పక్కం (పోరా దేవుడే నా పక్క) అన్న మన సూపర్‌స్టార్ రజనీకాంత్ డైలాగ్ గుర్తు కొచ్చిందా? అదే డైలాగ్ ఇప్పుడు సినిమా టైటిల్‌గా మారనుంది. దర్శకుడు ఆర్.కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో విష్ణు హీరో. పిశాచు చిత్రంలో ఒక్క సన్నివేశంలో మెరిసిన ప్రయోగకు అదృష్టం తన పక్కనుండటంతో ఈ చిత్రంలో హీరోయిన్గా అవకాశం పొందేసింది. ఈమెనీ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేయడానికి పిశాచు చిత్రంలో ఆమె ప్లరేనా చెంపపై కొట్టిన సన్నివేశంలో చూసిన హావభావాలే కారణం అంటున్నారు దర్శకుడు ఆర్.కన్నన్. లవ్, కామెడీ, యాక్షన్ అంశాల్లో కలగలిపిన పోడా ఆండవనే ఎన్ పక్కం చిత్ర షూటింగ్ మే నుంచి మొదలవుతుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం కోసం చెన్నైలోని రిచ్ వీధి లాంటి బ్రహ్మాండమైన సెట్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ముత్తయ్య ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్రాన్ని 50 రోజుల్లో పూర్తి చేసి సెప్టెంబర్‌లో తెరపైకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు దర్శకుడు చెప్పారు. -
హీరోయిన్ తల్లిదండ్రులను ఏడిపించిన మిష్కిన్
దర్శకుడు మిష్కిన్ హీరోయిన్ తల్లిదండ్రులను కంట తడిపించారట. అసలు సంగతేమిటో చూద్దామా? ఓ నా యుం ఆట్టుకుట్టియుం చిత్రం తరువాత మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పిశాచు. దర్శకుడు బాలా తన బి.స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అరోస్ కోర్తి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం తొలి పరిచయ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలో జరిగింది. దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ ఎలాంటి ఆధారం లేక కిందపడిపోయిన తనను దర్శకుడు బాలానే మళ్లీ పైకి తీసుకొచ్చారన్నారు. ఈ చిత్రంలో పాత్రను నాయిక ప్రియాంక అంకితభావంతో నటించి చివరలో ప్రాణం పోశారన్నారు. పిశాచి పాత్రలో నటించిన ఆమెను 70 అడుగుల పైన తాడుతో కట్టి వేలాడదీశానన్నారు. కిందకు పడేటప్పుడు రాడ్‌కు కొట్టుకుని చాలా సార్లు గాయాలకు గురయ్యారని తెలిపారు. ఈ సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఏడ్చేశారని తెలిపారు. ఈ చిత్ర నిర్మాత దర్శకుడు బాలా మాట్లాడుతూ ఇకపై ఏడాదికి 3 చిత్రాలు నిర్మించి, ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తానని వెల్లడించారు. తన సంస్థలో ప్రతిభావంతులెవరికైనా అవకాశాలిస్తానని తెలిపారు.