హీరోయిన్ తల్లిదండ్రులను ఏడిపించిన మిష్కిన్ | Kochi girl Prayaga in Mysskin's Pisasu | Sakshi
Sakshi News home page

హీరోయిన్ తల్లిదండ్రులను ఏడిపించిన మిష్కిన్

Published Mon, Nov 17 2014 2:02 AM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

హీరోయిన్ తల్లిదండ్రులను ఏడిపించిన మిష్కిన్ - Sakshi

హీరోయిన్ తల్లిదండ్రులను ఏడిపించిన మిష్కిన్

దర్శకుడు మిష్కిన్ హీరోయిన్ తల్లిదండ్రులను కంట తడిపించారట. అసలు సంగతేమిటో చూద్దామా? ఓ నా యుం ఆట్టుకుట్టియుం చిత్రం తరువాత మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పిశాచు. దర్శకుడు బాలా తన బి.స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అరోస్ కోర్తి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం తొలి పరిచయ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలో జరిగింది.  దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ ఎలాంటి ఆధారం లేక కిందపడిపోయిన తనను దర్శకుడు బాలానే మళ్లీ పైకి తీసుకొచ్చారన్నారు.
 
 ఈ చిత్రంలో పాత్రను నాయిక ప్రియాంక అంకితభావంతో నటించి చివరలో ప్రాణం పోశారన్నారు. పిశాచి పాత్రలో నటించిన ఆమెను 70 అడుగుల పైన తాడుతో కట్టి వేలాడదీశానన్నారు.  కిందకు పడేటప్పుడు రాడ్‌కు కొట్టుకుని చాలా సార్లు గాయాలకు గురయ్యారని తెలిపారు. ఈ సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఏడ్చేశారని తెలిపారు.  ఈ చిత్ర నిర్మాత దర్శకుడు బాలా మాట్లాడుతూ ఇకపై ఏడాదికి 3 చిత్రాలు నిర్మించి, ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తానని వెల్లడించారు. తన సంస్థలో ప్రతిభావంతులెవరికైనా అవకాశాలిస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement