pitani
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి పితాని బాలకృష్ణ
సాక్షి, కోనసీమ జిల్లా: ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేనలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నాయకులంతా వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి భారీగా వైఎస్సార్సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో తుగ్గలి వద్ద... సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముమ్మిడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లిఖార్జున్ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు చేరారు. జనసేన పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ కలసి టికెట్లు అమ్ముకున్నారని పితాని బాలకృష్ణ మండిపడ్డారు. పార్టీ కోసం కోట్లాదిరూపాయల ఆస్తిని అమ్ముకున్న తనకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: టీడీపీ, జనసేనకు వరుస షాక్‌లు! -
మంత్రి పితానికి చుక్కెదురు
వైఎస్సార్ సీపీనే వరించిన పోడూరు వైస్ ఎంపీపీ సువర్ణరాజు ఎన్నిక ఏకగ్రీవం బెడిసికొట్టిన టీడీపీ కుట్ర ఫుడ్‌పార్క్ సమస్య పరిష్కారంలోనూ మంత్రి విఫలం భీమవరం: రాష్ట్రవ్యాప్తంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష పార్టీ నాయకులను బెదిరించో, పదవులు ఆశచూపో తమ వైపు తిప్పుకుంటున్న ప్రస్తుత తరుణంలో పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలంలో కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు చుక్కెదురైంది. పోడూరు మండల ఉపాధ్యక్ష పదవిని వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఎగరేసుకుపోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆచంట నియోజకవర్గం పోడూరు మండల ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో టీడీపీని వైఎస్సార్సీపీ నాయకులు ఖంగుతినిపించారు. మంత్రి పితాని అండతో బలం లేకున్నా పదవిని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన పితాని 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి ఆచంట ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. నాటి నుంచి అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్, ప్రభుత్వంపై అనేక విమర్శలు గుప్పించారు. 2016లో మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. గతంలో పెనుగొండ మండలంలోని సహకార సంఘం ఎన్నికల్లో అధికార బలంతో తన ప్రతాపాన్ని చూపిన పితాని పోడూరు మండల ఉపా«ధ్యక్ష పదవి విషయంలో కూడా తన పాచీకలు పారుతాయని ఆశించి భంగపడ్డారు. పోడూరు మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో 8 ఆచంట, మరో 8 పంచాయతీలు పాలకొల్లు నియోజవకవర్గాల్లో ఉన్నాయి. మండల కేంద్రం పోడూరు ఆంచట నియోజకవర్గంలో ఉంది. మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాల్లో 11 వైఎస్సార్ సీపీ, 8 టీడీపీ గెల్చుకుంది. అప్పట్లో మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు గుంటూరు వాణి, పెద్దిబోయిన బాబూరావు ఎన్నికయ్యారు. మండల పరిషత్ వైఎస్సార్సీపీ ఖాతాలో చేరడంతో టీడీపీ నేతలు తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. ఈ ఏడాది మండల పరిషత్ ఉపా«ధ్యక్షుడు బాబూరావు వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేశారు. దీనితో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను తమ వైపునకు తిప్పుకుని పదవిని దక్కించుకోవాలని తద్వారా ఎంపీపీ పదవికి ఎసరు పెట్టాలని టీడీపీ నాయకులు వ్యూహం రచించారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను నయానా, భయానా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. దీనికి మంత్రి పితాని తెరవెనుక ఉండి పావులు కదిపారనే ఆరోపణలు ఉన్నాయి. సువర్ణరాజు ఎన్నిక ఏకగ్రీవం శుక్రవారం జరిగిన ఎన్నికను వాయిదా వేయించడానికి టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు 11 మందికి 10 మంది ఎన్నిక సమావేశానికి హాజరయ్యారు. టీడీపీకి చెందిన 8 మంది ఎంపీటీపీల్లో ఆరుగురు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చినా ఎన్నికలో పాల్గొనలేదు. మిగిలినవారిని వైఎస్సార్ సీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ నాటకమాడినా ఫలితం దక్కలేదు. ఎన్నిక సమావేశానికి కోరం ఉండడంతో ఎన్నికల అధికారి యథావిధిగా ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ సీపీకి చెందిన పోడూరు2 ఎంపీటీసీ శెట్టిబత్తుల సువర్ణరాజు ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను ఎంపీపీ వాణి భర్త, వైఎస్సార్ సీపీ నేత గుంటూరి పెద్దిరాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీని ముందుకు నడిపించారు. అధికార పార్టీలోనే మంత్రిపై గుసగుసలు తుందుర్రులో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే పితానికి అప్పగించారు. అప్పట్లో పితాని వల్ల కాకపోవడంతో మంత్రి పదవి వచ్చిన తరువాత సమస్యను పరిష్కరించి ఫుడ్‌పార్క్‌ను సముద్ర తీరప్రాంతానికి తరలిస్తారని ఆందోళనకారులు భావించారు. మంత్రి పితాని పోరాట కమిటీ నాయకులను రెండు పర్యాయాలు సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లినా ప్రయోజనం శూన్యం. పితానికి సీఎం విలువ ఇవ్వలేదని అందుకే పోరాట కమిటీ నాయకులు ఎంత చెప్పినా ముఖ్యమంత్రి ప్యాక్టరీ నిర్మాణం ఆపేదిలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పితాని మంత్రికి పదవి వచ్చిన తరువాత ఆచంట, భీమవరం నియోజకవర్గాల్లో చుక్కెదురైందని అధికార పార్టీ నాయకలే గుసగుసలాడుతున్నారు. -
మాట మార్చారేం.. మంత్రిగారూ!
ఆక్వా పార్క్ విషయంలో మంత్రి పితాని ప్రకటనపై ఆళ్ల నాని ధ్వజం ఏ ఒత్తిళ్లు పనిచేశాయో చెప్పాలని డిమాండ్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ వేస్తానని ప్రకటించిన పరిశ్రమలు, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట మార్చడం ఇటు ప్రజల్లోను, అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. నిపుణుల కమిటీ వేస్తానని ప్రకటించిన మంత్రి పితాని రెండు రోజుల్లోనే మాట మార్చడం వెనుక ఏ ఒత్తిళ్లు పనిచేశాయో చెప్పాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని డిమాండ్ చేశారు. సోమవారం ఆయనొక ప్రకటన చేస్తూ.. ఆక్వా పార్క్ విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని వారి మనోగతానికి అనుగుణంగా మంత్రి పితాని వ్యవహరిస్తారనుకున్నామని నాని పేర్కొన్నారు. చివరకు మంత్రి ప్రజల పక్షాన నిలబడకుండా.. యాజమాన్యానికి కొమ్ముకాస్తూ స్పందించడం వెనుక వచ్చిన ఒత్తిళ్లు ఏమిటో చెప్పాలని పట్టుబట్టారు. మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే అధ్యయన కమిటీ వేస్తామని పితాని ప్రకటించడంతో న్యాయం జరుగుతుందన్న భావనతో స్వాగతించామని చెప్పారు. ఆ వెంటనే మంత్రి మాట మార్చడం శోచనీయమన్నారు. ఆక్వా పార్క్‌ను తుందుర్రు నుంచి జనావాసాలు లేని తీర ప్రాంతానికి తరలించాలని మూడేళ్లుగా తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడి గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నారన్నారు. వారికి మద్దతుగా నిలబడిన విపక్షాలను తప్పు పట్టడం ఎంతమేరకు సమంజసమని పితానిని ప్రశ్నించారు. ఈ విధానానికి ఇకనైనా స్వస్తి పలికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. ఆక్వా పార్క్ యాజమాన్యం నిర్లక్ష్యం, విషవాయువుల కారణంగా ఐదుగురు మృత్యువాత పడితే కనీసం యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే సాహసం కూడా ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోందని నాని నిలదీశారు. మొగల్తూరులో 10 టన్నుల సామర్థ్యంతో నిర్మించిన ప్లాంట్ కాలుష్యకారకంగా మారిందని, అదే యాజమాన్యం భారీస్థాయిలో నిర్మిస్తున్న మెగా అక్వా ఫుడ్ పార్క్‌లో కాలుష్యం రాదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటికే ఇటువంటివి 20 ప్లాంట్లు ఉన్నాయని, తుందుర్రుది 21వ ప్లాంట్ అని మాట్లాడుతున్నారని, ఆ 20 ప్లాంట్లు యనమదుర్రు డ్రెయిన్‌పై ఉన్నాయని, అందువల్ల అది కాలుష్య కాసారంగా మారిపోయిందని వివరించారు. ఇప్పుడు గొంతేరు డ్రెయిన్ కూడా అలా కాకూడదన్నదే తమ అవేదన అన్నారు. కొంతమంది మత్స్యకారులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చే స్తున్నారని, తీరప్రాంతాలకు తరలించినా అక్కడ మత్యకారులకు ఇబ్బంది లేకుండా ఆక్వా పార్క్ ఏర్పాటు చేయాలన్నదే తమ వాదన అని నాని వివరించారు. మొగల్తూరు అక్వా ప్లాంట్‌లో విష వాయువుల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో బాధితుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాడుతుందన్నారు. ఈ ప్రమాదం విద్యుదాఘాతం వల్ల జరిగిందంటూ యాజమాన్యం చేసిన ప్రకటనను ఎంపీ గోకరాజు గంగరాజు వల్లె వేయడం సరికాదని నాని ధ్వజమెత్తారు. -
తహసీల్దార్ నియామకాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే పితాని
కలెక్టర్, పితాని మధ్య విభేదాలే అడ్డు భీమవరం: ఉద్యోగుల నియామకం విషయంలో అధికారపార్టీ నాయకుల జోక్యం ఎక్కువ కావడమేగాక నిబంధనలకు విరుద్దమైనా తాము చెప్పిందే చేయాలంటూ అధికారులపై ఇటీవల కాలంలో ఎక్కువైంది. తాము చెప్పిన మాట వినకపోతే ఎంతకైనా తెగిస్తామనే ధోరణిలో కొంతమంది అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఉద్యోగులపై చేయి చేసుకున్న సంఘటనలు లేకపోలేదు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారపార్టీ ఎమ్మెల్యే కంటే జిల్లా కలెక్టర్‌కే అధికప్రాధాన్యత ఇస్తున్నారని దానితో గ్రామాల్లో తాము చెప్పిన పనులు జరగగక ప్రజల్లో పరువుపోతుందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ బహిరంగంగా ప్రకటించిన విషయం విధితమే. దీనితో కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎమ్మెల్యే పితాని మధ్య పొరపొచ్చలు వచ్చాయనే ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలు మర్చిపోకముందే పోడూరు తహసీల్దార్ నియామక వ్యవహారం ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మధ్య మరొక వివాదానికి దారితీసింది. ఆగస్టు నెలాఖరున భీమవరం తహసీల్దార్ గంధం చెన్నుశేషు, పెనుగొండ తహసీల్దార్ వీఎస్ఎస్ బ్రహ్మానందం పదవి విరమణ చేశారు. సుమారు రెండు మండలాల్లోను ఇన్చార్జ్ తహసీల్దార్లే పాలన సాగించారు. అయితే ఈ¯ð ల 14వ తేది రాత్రి జిల్లాలోని నలుగురు తహసీల్దార్స్ను కొత్తగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సమయంలో భీమవరం తహసీల్దార్‌గా చవ్వాకుల ప్రసాద్, పోడూరు తహసీల్దార్‌గా కొవ్వూరు కే ఆర్‌ఆర్‌సీలో పనిచేస్తున్న కే శ్రీరమణి, పోడూరు తహసీల్దార్‌గా పనిచేస్తున్న వి స్వామినాయుడును యలమంచిలి బదిలీచేస్తూ యలమంచిలి తహసీల్దార్ పనిచేస్తున్న సిహెచ్ గురుప్రసాదరావును హైదరాబాద్ సర్వే అండ్ జాయింట్ సెటిల్మెంట్శాఖకు బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.దీనితో భీమవరం, యలమంచిలి తహసీల్దార్లు మరుసటి రోజునే భాద్యతలు స్వీకరించారు. అయితే పోడూరు తహసీల్దార్ కె శ్రీరమణి జాయినింగ్‌కు ఆటంకం ఏర్పడింది. అక్కడి శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ తనకు తెలియకుండా తన నియోజకవర్గంలోని తహసీల్దార్‌ను ఎలా నియమిస్తారంటూ అడ్డు చెప్పడంతో శ్రీరమణి బాధ్యతలు స్వీకరించనేలేదు. వివాదానికి కారణంగా ఇదీ..... ఎమ్మెల్యే పితాని, కలెక్టర్ భాస్కర్ మధ్య పొరపొచ్చలు ఉన్న నేపద్యంలో గత ఆగస్టు 31న పెనుగొండ తహసీల్దార్ వీఎస్ఎస్ బ్రహ్మనందం పదవీ విరమణ చేశారు. అక్కడ వేరొక తహసీల్దార్‌ను నియమించడానికి వ్యక్తిని సిపార్సు చేయాల్సిందిగా నరసాపురం సబ్‌కలెక్టర్ పితాని కోరడంతో మీకు నచ్చినవారిని బాగా పనిచేసినవ్యక్తిని నియమించాల్సిందిగా సూచించారు. అయితే మీరే వ్యక్తిని సిపార్సుచేయాలంటూ ఆయనపై రెవెన్యూ అధికారులు వత్తిడి తేవడంతో ఎమ్మెల్యే పితాని బొడ్డు శ్రీనివాసరావు పేరును సిపార్సు చేశారు. అయితే పితాని అభిప్రాయానికి భిన్నంగా పెనుగొండ తహసీల్దార్‌గా అప్పట్లో మావూరి రాజశేఖర్‌ను నియమించి శ్రీనివాసరావు కుక్కునూరు తహసీల్దార్‌గా నియమించారు. దీనితో తీవ్రం ఆగ్రహారానికి గురైన∙పితాని తాను సిపార్సు చేసిన వ్యక్తికి తాను చెప్పినచోట పోస్టింగ్ ఇవ్వకపోగా పనిస్మింట్గా కుక్కునూరు వేస్తారంటూ ఈ వ్యవహారంపై సీఎంవోలో రెవెన్యూశాఖ వ్యవహారాలు చూసే సతీష్‌చంద్రకు పిర్యాదు చేశారు. దీనితో పెనుగొండ తహసీల్దార్‌గా నియమించిన మావూరి రాజశేఖర్‌ను రెండురోజుల్లోనే అక్కడి నుంచి బదిలీ చేసి ఆయన స్ధానంలో పితాని సిపార్సుచేసిన బ్రహ్మానందం నియమితులయ్యారు. అయినప్పటికీ పితాని కలెక్టర్ భాస్కర్ వ్యవహారం పట్ల గుర్రుగా ఉన్నారు. ఈ నేపద్యంలోనే పోడూరు తహసీల్దార్ స్వామినాయుడు బదిలీ కావడం ఆయన స్ధానంలో రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి బంధువు శ్రీరమణిని ఎమ్మెల్యే పితాని ప్రమేయం లేకుండా నియామకం చేశారు. అయితే తనకు మాట మాత్రమైన చెప్పకుండా ప్రధానమైన అధికారిని ఎలా నియమిస్తారంటూ పితాని కోపోద్రికుడై శ్రీరమణి నియామకాన్ని అడ్డుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే పితాని కలెక్టర్‌తో విభేదాలు కారణంగానే శ్రీరమణికి అడ్డుచెబుతున్నట్లు రెవెన్యు వర్గాలు చెబుతున్నా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, రాస్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి ఎమ్మెల్యే పితానికి అంతర్గత విబేధాలున్నాయని దానివల్లనే తోట బందువైన శ్రీరమణి నియామకాన్ని అడ్డుకున్నారని కొంతమంది టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద అధికారుల నియమాకంలో టీడీపీ నాయకుల పెత్తనానికి పోడూరు తహసీల్దార్ నియామకం నిదర్శనంగా నిలుస్తోంది. -
ఫుడ్‌పార్క్ పంచాయతీ ఎమ్మెల్యే పితాని కోర్టుకు
-కొమ్ముచిక్కాల గ్రామంలో ఉద్యమకారులతో సమావేశం -ఫుడ్‌పార్క్ నిర్మాణం నిలిపివేయాలని తేల్చిచెప్పిన గ్రామ పెద్దలు -ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళతానంటు సర్ధిచెప్పిన ఎమ్మెల్యే పితాని భీమవరం: తుందుర్రు గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్ పంచాయతీ మాజీమంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కోర్టుకు చేరింది. ఈ సమస్యను పూర్తిస్ధాయిలో తెలుసుకుని పరిష్కారానికి కృషిచేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే పితాని ఆదేశించడంతో ఆయన స్వగృహం పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలో సోమవారం ఫుడ్‌పార్క్ వ్యతిరేకపోరాట కమిటీ నాయకులతో చర్చలు నిర్వహించారు. వివరాల్లోనికి వెళితే భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మాణం చేపట్టిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తు గత రెండున్నరేళ్లుగా భీమవరం, మొగల్తూరు, న రసాపురం, పాలకొల్లు, వీరవాసరం మండలాలకు చెందిన సుమారు 40 గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపద్యంతో అనేకమందిని కేసులు, కొంతమంది అరెస్టులు జరిగాయి. తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లో పోలీసు ఫికెట్లు, 144 సెక్షన్ విధించడంతో గత నెలలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా తుందుర్రు వచ్చి ఫుడ్‌పార్క్‌ను జనావాసాలకు దూరంగా తరలించాలని అప్పటి వరకు ఆందోళనకారులకు మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చి వెళ్లారు. దీనితో ఉద్యమపరిస్థితిని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన కారులను ఒప్పించాల్సిన భాద్యత భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు)పై పెట్టారు. దీనితో పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని వెంటేసుకుని తుందుర్రు వెళ్లగా అక్కడి గ్రామపెద్దలు ఉద్యమం యువతచేతుల్లో ఉందని తామేమి చేయలేమని తేల్చిచెప్పడంతో వెనుదిరిగారు. రెండు రోజులు అనంతరం కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లో సమావేశాలు పెట్టిన అంజిబాబుపై అక్కడి ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ రెండున్నరేళ్లుగా ఉద్యమం చేస్తుంటే ఇప్పడు గుర్తొచ్చామా? అంటూ నిలదీయంతో ఖంగుతిన్న అంజిబాబు మారుమాట్లాడలేక వెనుదిరిగి వెళ్లిపోయారు. అక్కడి పరిస్థితిని అంజిబాబు చక్కదిద్దలేరనే అనుమానంతో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పితానికి అప్పగించినట్లు చెబుతున్నారు. దీనితో పితాని రంగంలోనికి దిగారు. పితాని కాంగ్రెస్‌ప్రభుత్వ హాయాంలో మంత్రిగా పనిచేసిన సమయంలో తుందుర్రుగ్రామాభివృద్దికి కొంతమేరుకు నిధులు కేటాయించడంతో ఆగ్రామస్తులు పరిచయాలున్నాయి. దీనితో గ్రామ పెద్దలతో మాట్లాడి ఫుడ్‌పార్క్ విషయమై మాట్లాడాలని అక్కడకు తాను రావడంతో మీరే నా దగ్గరకు వస్తారా? అంటూ వర్తమానం పంపడంతో గ్రామానికి చెందిన కొంతమంది పెద్దలు కొమ్ముచిక్కాల వెళ్లి ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఫుడ్‌పార్క్ వల్ల ఇబ్బందులేమిటంటూ ప్రశ్నించడంతో తాగు, సాగునీటి ఇబ్బందులతోపాటు పర్యావరణ కాలుష్యం తదితర ఆంశాలు గ్రామ పెద్దలు ఏకరువు పెట్టారు. ఎట్టి పరిస్థితిలోనే ఫుడ్‌పార్క్ నిర్మాణానికి అంగీకరించేది లేదంటూ కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు. దీనితో గ్రామంలోని నలుగురు పెద్దలను తనవెంట ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళతాని సమస్యను ఆయనకు వివరించాలని కోరడంతో అందుకు అంగీకరించినట్లు తెలిసింది. త్వరలోనే ముఖ్యమంత్రి ఆపాయింట్మెంట్ తీసుకుని కబురుపంపుతానని అక్కడి వెళ్లే పెద్దలు సిద్దంగా ఉండాలని ఉద్యమనాయకులు, పెద్దలను పంపించినట్లు తెలిసింది. -
'ఫాస్ట్' పథకంపై హైకోర్టులో విచారణ