ఫుడ్‌పార్క్‌‌ పంచాయతీ ఎమ్మెల్యే పితాని కోర్టుకు | petani interfear in food park issue | Sakshi
Sakshi News home page

ఫుడ్‌పార్క్‌‌ పంచాయతీ ఎమ్మెల్యే పితాని కోర్టుకు

Published Mon, Oct 31 2016 10:32 PM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

ఫుడ్‌పార్క్‌‌ పంచాయతీ ఎమ్మెల్యే పితాని కోర్టుకు - Sakshi

ఫుడ్‌పార్క్‌‌ పంచాయతీ ఎమ్మెల్యే పితాని కోర్టుకు

-కొమ్ముచిక్కాల గ్రామంలో ఉద్యమకారులతో సమావేశం
-ఫుడ్‌పార్క్‌ నిర్మాణం నిలిపివేయాలని తేల్చిచెప్పిన గ్రామ పెద్దలు
-ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళతానంటు సర్ధిచెప్పిన ఎమ్మెల్యే పితాని
 
భీమవరం:
    తుందుర్రు గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్‌ పంచాయతీ మాజీమంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కోర్టుకు చేరింది. ఈ సమస్యను పూర్తిస్ధాయిలో తెలుసుకుని పరిష్కారానికి కృషిచేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే  పితాని ఆదేశించడంతో ఆయన స్వగృహం పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలో సోమవారం  ఫుడ్‌పార్క్‌ వ్యతిరేకపోరాట కమిటీ నాయకులతో చర్చలు నిర్వహించారు.  వివరాల్లోనికి వెళితే భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మాణం చేపట్టిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తు గత రెండున్నరేళ్లుగా  భీమవరం, మొగల్తూరు, న రసాపురం, పాలకొల్లు, వీరవాసరం మండలాలకు చెందిన సుమారు 40 గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపద్యంతో అనేకమందిని కేసులు, కొంతమంది అరెస్టులు జరిగాయి. తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లో పోలీసు ఫికెట్లు, 144 సెక్షన్‌ విధించడంతో గత నెలలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా తుందుర్రు వచ్చి ఫుడ్‌పార్క్‌ను జనావాసాలకు దూరంగా తరలించాలని అప్పటి వరకు ఆందోళనకారులకు మద్దతుగా  ఉంటామని భరోసా ఇచ్చి వెళ్లారు.  దీనితో ఉద్యమపరిస్థితిని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన కారులను ఒప్పించాల్సిన భాద్యత భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు)పై పెట్టారు. దీనితో పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని వెంటేసుకుని తుందుర్రు వెళ్లగా అక్కడి గ్రామపెద్దలు ఉద్యమం యువతచేతుల్లో ఉందని తామేమి చేయలేమని తేల్చిచెప్పడంతో వెనుదిరిగారు. రెండు రోజులు అనంతరం కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లో  సమావేశాలు పెట్టిన అంజిబాబుపై అక్కడి ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ రెండున్నరేళ్లుగా ఉద్యమం చేస్తుంటే ఇప్పడు గుర్తొచ్చామా? అంటూ నిలదీయంతో ఖంగుతిన్న అంజిబాబు మారుమాట్లాడలేక వెనుదిరిగి వెళ్లిపోయారు. అక్కడి పరిస్థితిని అంజిబాబు చక్కదిద్దలేరనే అనుమానంతో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పితానికి అప్పగించినట్లు చెబుతున్నారు. దీనితో  పితాని రంగంలోనికి దిగారు.
    పితాని కాంగ్రెస్‌ప్రభుత్వ హాయాంలో మంత్రిగా పనిచేసిన సమయంలో తుందుర్రుగ్రామాభివృద్దికి కొంతమేరుకు నిధులు కేటాయించడంతో ఆగ్రామస్తులు పరిచయాలున్నాయి. దీనితో గ్రామ పెద్దలతో మాట్లాడి ఫుడ్‌పార్క్‌ విషయమై మాట్లాడాలని అక్కడకు తాను రావడంతో మీరే నా దగ్గరకు వస్తారా? అంటూ వర్తమానం పంపడంతో గ్రామానికి చెందిన కొంతమంది పెద్దలు కొమ్ముచిక్కాల వెళ్లి ఆయన నివాసంలో సమావేశమయ్యారు.  ఫుడ్‌పార్క్‌ వల్ల ఇబ్బందులేమిటంటూ ప్రశ్నించడంతో తాగు, సాగునీటి ఇబ్బందులతోపాటు పర్యావరణ కాలుష్యం  తదితర ఆంశాలు గ్రామ పెద్దలు ఏకరువు పెట్టారు. ఎట్టి పరిస్థితిలోనే ఫుడ్‌పార్క్‌ నిర్మాణానికి అంగీకరించేది లేదంటూ కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు. దీనితో గ్రామంలోని నలుగురు పెద్దలను తనవెంట ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళతాని సమస్యను ఆయనకు వివరించాలని కోరడంతో అందుకు అంగీకరించినట్లు తెలిసింది. త్వరలోనే ముఖ్యమంత్రి ఆపాయింట్‌మెంట్‌ తీసుకుని కబురుపంపుతానని అక్కడి వెళ్లే పెద్దలు సిద్దంగా ఉండాలని ఉద్యమనాయకులు, పెద్దలను పంపించినట్లు తెలిసింది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement