Pithapuram MLA Varma
-
కోడ్ ఉల్లంఘించిన పిఠాపురం ఎమ్మెల్యే వర్మ
-
కోడ్ ఉల్లంఘించిన పిఠాపురం ఎమ్మెల్యే వర్మ
కాకినాడ : కాకినాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లోనూ టీడీపీ నేతలు యధేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. మంగళవారం పోలింగ్ సందర్భంగా టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్దే స్లిప్పులు పంపిణీ చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. అయితే 14,15 డివిజన్లలోని పోలీసులతో ఎమ్మెల్యే వర్మ వాగ్వాదానికి దిగారు. బూత్ ఆఫీసులోనే కూర్చొని ఓటు వేయడానికి వచ్చినవారిని ప్రలోభాలతో పాటు భయపెట్టి ఓటు వేయాలంటూ సూచనలు చేశారు. దీంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు 4వ డివిజన్ పరిధిలో బీజేపీ అభ్యర్థి తోట నాగలక్ష్మి ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారానికి దిగారు. పోలింగ్ బూత్ నం.4/2లో ఆమె ప్రచారం చేస్తున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ‘సాక్షి’ రాకతో బీజేపీ అభ్యర్థిని పోలీసులు అక్కడ నుంచి పంపేశారు. -
ఎమ్మెల్యే వర్మ దిష్టిబొమ్మ దహనం
కాకినాడ: పిఠాపురం జగ్గయ్యచెరువు బాధితులు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. పేదలకు అందజేసిన పట్టా భూముల్లో నిర్మించుకున్న గృహాలను అధికారపార్టీ ప్రజాప్రతినిధి ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు అక్రమంగా కూల్చివేయడంపై నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ గేటు ఎదుట కొద్దిసేపు ధర్నా చేపట్టి అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అక్కడే స్ధానిక ఎమ్మెల్యే వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు నేతృత్వంలో బాధితులు కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు వినతిపత్రంను అందజేశారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో జగ్గయ్యచెరువులో ఇళ్ళస్ధలాలు మంజూరు చేశారని గుర్తు చేశారు ఆ స్థలాల్లో పేదలు అప్పులుచేసి, బంగారం తాకట్టు పెట్టుకుని పునాదులు నిర్మించుకుంటే ఆక్రమణలంటూ అధికారులు కూల్చివేస్తున్నారన్నారు. అక్కడ నివసిస్తున్న 719 కుటుంబాలు భయంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. బాధితులకు న్యాయం చేయాలని, తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబ్జి, పట్టణ అధ్యక్షుడు బొజ్జారామయ్య, మండల జనరల్ సెక్రటరీ ఉలవల భూషణం, గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు వర్ల రాజు తదితరులతోపాటు బాధితులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. -
మీరేమైనా రౌడీలా ?
పిఠాపురం : ఎవరైనా వేలెత్తి చూపితే వేలు తీసేస్తాననడానికి మీరేమైనా బజారు రౌడీలా, అడిగిన వారందరి అంతు చూస్తారా ? అయితే మీ అధికార దుర్వినియోగాన్ని బహిరంగంగా ఎండగడతా అంటూ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సవాల్ విసిరారు. కొత్తపల్లిలో హోటల్ మేనేజ్మెంటు కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నామని ఏదైనా చేస్తామని, ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తల వైపు వేలెత్తి చూపితే అవి తీసేస్తానని వ్యాఖ్యానించడంపై పెండెం మంగళవారం ఘాటుగా స్పందించారు. పాలక పక్షం చేసే అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించడం దానిని వేలెత్తి చూపే హక్కు ప్రతిపక్షానికి ఉందని, ఆ హక్కును కాలరాయాలని చూస్తే ఎంతటి వారైనా కాలగర్భంలో కలిసిపోతారని చరిత్ర చెబుతోందన్నారు. టికెట్టు ఇవ్వకపోతే ఇప్పుడు దేవుడంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునే పచ్చిదగా కోరని, మోసగాడని, నమ్మిన వారిని నట్టేట ముంచుతాడని బహిరంగంగా విమర్శించి ఆ పార్టీ జెండాలు నడిరోడ్డుపై తగలబెట్టించిన వర్మ ఈ రోజు గతం మర్చిపోయి మాట్లాడడం ప్రజలు చూస్తున్నారని వారు తగిన బుద్ది చెప్పే రోజు దగ్గర పడిందన్నారు. ఏ పార్టీ పేరుతో ఇప్పుడు పబ్బం గడుపుకుంటున్నావో అదే పార్టీకి ప్రాణాలు దారబోసిన నేతలను కార్యకర్తలను ఎందుకు పక్కన పెడుతున్నావో సమాధానం చెప్పుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉందన్నారు. గతంలో ప్రతి పక్ష నేతగా గత ఎమ్మెల్యే చేసిన ప్రతి పనిని వర్మ వేలెత్తి చూపాడని, అన్ని పనులకు అడ్డు తగిలాడని ఆ ఎమ్మెల్యేలు మీలాగే వేలు తీసేసుంటే ఈ రోజు వర్మకు అసలు వేళ్లే ఉండేవి కాదని ఆయన అన్నారు. ఒక వేలుతో ఎదుటి వారిని చూపిస్తే నాలుగేళ్లు నీవైపు చూపిస్తాయన్న నిజాన్ని మరిచి అధికార దాహంతో మాట్లాడడం మానుకోకపోతే తీవ్రస్థాయిలో ప్రజా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. గతంలో హోటల్ మేనేజ్మెంటు కాలేజీకి ఒక చోట శంకుస్థాపన చేశారని, కొత్తపల్లి హైస్కూలులో మినీ స్టేడియం నిర్మాణానికి నిధులు విడుదల అవ్వడం మట్టి నమూనాలు తీయడం పనులు ప్రారంభం కావడం జరిగిన విషయాన్ని చెప్పడం ప్రతిపక్షం చేసిన తప్పుగా భావించడం ఎంతవరకు సమంజసమో వర్మ సమాధానం చెప్పాలన్నారు. కొత్తపల్లి మండలంలో ఎమ్మెల్యే వర్మ తన అనుచర గణంతో చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలపై కార్యకర్తలు నాయకులతో వచ్చి అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.