pits
-
ఎక్కడివి అక్కడే..
మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.. పైప్లైన్ల ఏర్పాటుకు తీస్తున్న గుంతలను సరిగా పూడ్చకపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.. గుంతలకోసం తవ్వే క్రమంలో తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రం అన్నపురెడ్డిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి పక్కన నెల రోజుల క్రితం తీసిన భగీరథ గుంతలు ప్రమాదకరంగా ఉన్నట్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగీరథ పైపు లెన్ల నిర్మాణం కోసం గ్రామంలోని ప్రధాన రహదారి వెంట ఉన్న ఇళ్లను సైతం కూల్చారు. గ్రామంలో ఈ పైపులైన్‌ను ఇష్ట రాజ్యంగా వెశారని గ్రామస్తులు తెలుపుతున్నారు. అవసరం లేకున్నా చాలా చోట్ల ఇల్లు కూల్చినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రధాన రహదారి నుంచి 9 మీటర్లు దూరంలో పైపు లైన్ నిర్మాణం చేయాలని నిబంధన ఉన్నా కొన్ని చోట్ల 11 మీటర్లు దూరంలో వేశారు . దీంతో చాలా చోట్ల ఇల్లు కోల్పోవాల్సి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. అన్నపురెడ్డిపల్లి నుండి మాదారం వెళ్లే ప్రధాన రహదారి పక్కన పైపులు, మట్టి కుప్పలు ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భగీరథ పైపు లైన్లు నిర్మాణానికి సూమరు 6 అడుగుల లోతుతో గుంతలను తీసి ఉంచడంతో చిన్న పిల్లలు, జంతువులు ప్రమాదవ శాత్తు పడిపోయే అవకాశం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. త్వరలో గ్రామంలో జరిగే శివరాత్రి పండగ నాటికి గుంతలను పూడ్చకపోతే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆలయ సిబ్బంది అంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు వేడుకుంటున్నారు. త్వరగా పూడ్చాలి పైపులైన్ కోసం తీసిన గుంతలను త్వరగా పూడ్చాలి. ఈ గుంతల్లో చిన్న పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంది. శివాలయంలో త్వరలో జాతర జరగనుంది. జాతరకు వేలలో భక్తులు వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించాలి. – యాదాల జమలయ్య పరిహారం ఇవ్వాలి భగీరథ పైపులైన్ నిర్మాణాల్లో పాడైపోతున్న ఇళ్లకు నష్ట పరిహారం ఇవ్వాలి. నెల క్రితం గ్రామంలో పర్యటించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు నష్ట పరిహారం ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చాం. అయినా స్పందన కనిపించడంలేదు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. – నరసింహారావు -
రోడ్డుపై గుంత కనిపిస్తే సస్పెన్షనే!
-
రోడ్డుపై గుంత కనిపిస్తే సస్పెన్షనే!
ఆర్ అండ్ బీ అధికారులకు సీఎం హెచ్చరిక - మే చివరినాటికి రోడ్లను బాగు చేయాలి - జూన్ 1 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా - రోడ్లన్నింటినీ స్వయంగా పరిశీలిస్తానని వెల్లడి - చరిత్రలో ఎన్నడూ లేనట్టు నిధులిచ్చినా నిర్లక్ష్యమేమిటంటూ ఆగ్రహం - రోడ్లపై సమీక్ష.. ఆ శాఖ తీరుపట్ల అసంతృప్తి - హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్లకు నిధులివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని, వాటితో రోడ్లను గొప్పగా తీర్చిదిద్దుతారనుకుంటే ఇంకా గుంతలు కనిపిస్తూనే ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యాన్ని ఇకపై సహించబోమని, జూన్ ఒకటో తేదీ తర్వాత ఎక్కడైనా రోడ్లపై గుంత కనిపిస్తే అక్కడికక్కడే సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మే చివరినాటికి రోడ్లపై గుంతలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జూన్ ఒకటి తర్వాత తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, రోడ్లపై గుంతలు తన దృష్టికి వస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో రోడ్ల అంశంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, సునీల్ శర్మ, రామకృష్ణ, ఈఎన్సీలు రవీందర్రావు, గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘గతంలో ఎన్నడూ లేనట్టుగా రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశాం. కేంద్రాన్ని ఒప్పించి అనేక జాతీయ రహదారులను సాధించగలిగాం. కొత్త రహదారుల నిర్మాణంతో పాటు రహదారుల మరమ్మతులకు కూడా నిధులిచ్చాం. అయినా ఇంకా రహదారులపై గుంతలు ఎందుకు కనిపిస్తున్నాయి..?’’అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎందుకీ నిర్లక్ష్యం..? రోడ్లపై గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలో పర్యటన సమయంలో వరంగల్ నుంచి పాలకుర్తి వరకు రోడ్డు మార్గంలో వెళ్లినప్పడు తనకు ఎన్నో గుంతలు కనిపించాయన్నారు. రోడ్లపై గుంతలు ఉండవద్దని, ఎప్పటికప్పుడు వాటిని పూడ్చేయాలని గతంలోనే స్పష్టంగా చెప్పినా.. అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని, ఇది మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు. రహదారుల అభివృద్ధిలో భాగంగా పంచాయతీరాజ్ రోడ్లను ఆర్ అండ్ బీ పరిధిలోకి.. ఆర్ అండ్ బీ రహదారులను జాతీయ రహదారుల పరిధిలోకి తెస్తున్నారని చెప్పారు. ఇలా శాఖ మారిన సందర్భంలో కొత్త రోడ్డు నిర్మించడానికి కొంత సమయం పడుతుందని, ఆలోగా గుంతలు పడినా, కొట్టుకుపోయినా మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేస్తున్నారని మండిపడ్డారు. రహదారి పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పనిచేయకుంటే కూడా రహదారి అలాగే ఉండిపోతోందని... దాంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితి పోవాలని, మరమ్మతులు నిరంతరం కొనసాగాలని అధికారులకు సూచించారు. స్టేషన్ ఘనపూర్–పాలకుర్తి రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. పెర్కిట్–జగిత్యాల మధ్య నాలుగు లేన్ల రహదారిని నిర్మించాలని... దానివల్ల నిజామాబాద్ నుంచి వరంగల్ వరకు నాలుగులేన్ల రహదారి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఏడాదిలోగా జిల్లా కార్యాలయాలు కొత్త జిల్లా కార్యాలయాల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించి, డిజైన్లు కూడా ఆమోదించినందున ఏడాదిలోగా వాటి పనులు పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయాల నిర్మాణాన్నీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలను విభజించామని.. సంబంధిత కార్యాలయ భవనాలు అందుబాటులోకి వస్తేనే పాలన చేరువయ్యేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ చేపడతాం.. పనిభారం పెరిగిన శాఖల్లో ఉన్నతోద్యోగుల అవసరం పెరుగుతోందని... రోడ్లు, భవనాలు, నీటి పారుదల తదితర శాఖల్లో ఈఎన్సీలు సహా ఉన్నతాధికారుల సంఖ్య పెంచుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రమైనందున అధికారుల అనుభవాన్ని ఉపయోగించుకునేందుకే పదవీ విరమణ పొందిన కొందరి పదవీ కాలాన్ని పొడిగిస్తున్నామని చెప్పారు. అలాంటి సందర్భంలో పదోన్నతి పొందాల్సిన వారికి అన్యాయం జరుగుతుందని, అందువల్ల పోలీసు శాఖ మాదిరిగా అదనపు పోస్టులు సృష్టించాలని పేర్కొన్నారు. పదోన్నతులు క్రమం తప్పకుండా అందాలని, కొత్తగా సృష్టించిన పోస్టుల్లో పదోన్నతి ద్వారా వచ్చిన వారిని నియమిస్తే.. ఎవరికీ అన్యాయం జరగదని సూచించారు. హైదరాబాద్‌లో వరంగల్, బెంగళూరు, విజయవాడ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగినందున అవసరమైన ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి నిధులివ్వాలని కేంద్ర రవాణా మంత్రి గడ్కరీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం గడ్కరీతో ఫోన్లో మాట్లాడారు. వరంగల్ మార్గంలో ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వరకు 6.4 కిలోమీటర్ల మేర కారిడార్‌కు రూ.950 కోట్లు, బెంగళూరు మార్గంలో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు రూ.290 కోట్లు, విజయవాడ మార్గంలో 26 కిలోమీటర్ల మేర సర్వీసు రోడ్డు (యుటిలిటీ కారిడార్) నిర్మాణానికి రూ.170 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఉప్పల్–ఘట్కేసర్ మధ్య 15 కిలోమీటర్ల దూరం ఉన్నందున 6.4 కిలోమీటర్లు పోను మిగతా పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని వివరించారు. మొత్తం ప్రతిపాదిత పనుల విలువ రూ.1,410 కోట్లు అవుతుందని తెలిపారు. కేసీఆర్ ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో గడ్కరీని కలిసి వినతిపత్రాలు, అంచనాల వివరాలు సమర్పించాల్సిందిగా.. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ను కేసీఆర్ ఆదేశించారు. -
నగరంలోని గుంతలపై వాట్సాప్ చేయండి
సాక్షి, నెట్వర్క్: నగరం.. ఏ మున్నది గర్వకారణం.. ఒక్క గుంతలు తప్ప..! ఏ మార్గంలో వెళ్లినా ఒళ్లు హూనం తథ్యం.. కూకట్పల్లి నుంచి ఎర్రగడ్డ వెళ్లినా.. ఖైరతాబాద్ నుంచి ఆరాంఘర్ చేరినా.. ‘గాంధీ’ నుంచి నారాయణగూడ పయనమైనా మనల్ని భయపెట్టేవి రోడ్లే.... గురువారం నగరంలో సాక్షి బైక్ విజిట్ నిర్వహించింది. ఈ పరిశీలనలో మృత్యువులా వెంటాడే రహదారులే కనిపించాయి.. ఏం చేద్దాం.. ఈ పరిస్థితి ఎప్పడికి మారేనో..! మీరు ప్రయాణించే మార్గంలో రోడ్డు అధ్వానంగా తయారైందా. గుంతలతో వెక్కిరిస్తోందా. వాననీటితో నిండి బ్బందులకుకారణమవుతోందా. ప్రమాదాలకు అదే కారణమని మీరు భావిస్తున్నారా. అయితే ఆగండి. గుంతతో కలిపి మీ ఇబ్బంది కనబడేలా ఫొటో తీసి మాకు పంపండి. ఆ ప్రాంతం వివరాల్ని కూడా రాయండి. సాక్షి వాట్సప్ నెంబర్: 97050 12000 -
నిమజ్జనానికి వచ్చి మహిళ మృతి
* దిక్కుతోచని స్థితిలో ఏడాది పాప సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం కోసం సోమవారం ట్యాంక్‌బండ్‌కు వచ్చిన ఓ మహిళ తిరుగు ప్రయాణంలో ఫిట్స్ వచ్చి అకస్మాత్తుగా మృత్యువాత పడింది. ఏడాది వయసున్న తన పాపతో కలిసి ఆ మహిళ వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని 31 నెంబర్ బస్టాప్ వద్దకు రాత్రి 10 గంటలకు చేరుకుంది. అకస్మాత్తుగా ఆమెకు ఫిట్స్ రావడంతో స్థానికులు 108 సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో చనిపోయింది. అయితే ఆమె వివరాలు తెలియరాలేదు. పాపను పోలీసులు చేరదీశారు. ఆమె ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. -
నరకదారులు
సాక్షి, కడప : ‘రోడ్లకు ఇరువైపుల ఏపుగా దారి మూసుకునిపోయేలా పెరిగిన కంపచెట్లు.. మోకాటిలోతు గుంతలు, కంకర తేలిన రోడ్లు, ప్రమాదకర మలుపులు, మరమ్మత్తులకు నోచుకోని కల్వర్టులు, వర్షం పడితే బురదమయమై ప్రయాణం చేయడానికి వీలుకాని దారులు’...వెరసి జిల్లాలోని గ్రామీణ రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ రోడ్లలో ప్రయాణమంటే ప్రజలు హడలి పోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. వర్షం వచ్చినప్పుడు రోడ్లు బురదమయంగా మారి కొన్నిచోట్ల నరక కూపాలుగా తయారవుతున్నాయి. మొత్తం మీద జిల్లాలో పాలకులు, అధికారులు రోడ్ల గురించి పట్టించుకోక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం రోడ్ల నిర్వహణ కూడా చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. ప్రమాదటపుంచున ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు ద్విచక్ర వాహనాలలో కూడా వెళ్లేందుకు వీలు లేదంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కడప నగరానికి కూతవేటు దూరంలోఉండే చింతకొమ్మదిన్నె మండలం రాజులవడ్డెపల్లె, రాజుల తాతయ్యగారిపల్లెతోపాటు బుగ్గవంకకు వెళ్లే రోడ్డు దుర్భరంగా ఉంది. గూడావాండ్లపల్లె, బీరంఖాన్పల్లె, నాగిరెడ్డిపల్లె, బుగ్గపల్లె, దళితవాడలకు చెందిన గ్రామాల రైతులు ఈ రోడ్డు మీదుగానే పొలాలకు వెళ్లాల్సి ఉంది. 2010లో రోడ్డుకు నామమాత్రంగా మరమ్మత్తులుచేసి వదిలేశారు. రోడ్డుపైన కంకర తేలి ఉండడంతోపాటు కంపచెట్లు ఏపుగా పెరిగి ఉన్నాయి. కడప నగరంతోపాటు అన్ని మున్సిపాలిటీల పరిధిలోగల రోడ్లన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. కమలాపురంలో గ్రామ చావిడి నుంచి రైల్వే గేటు వరకు రోడ్డు మోకాటిలోతు గుంతలతో కంకర తేలి ఉంటుంది. కంకర ఎగిరిపడి పాదచారులకు ఇబ్బందులను పెడుతోంది. మునకవారిపల్లె, విభవాపురం, వల్లూరు- ఆదినిమ్మాయపల్లె, ఖాజీపేట-కమలాపురం రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో రిక్షా కాలనీకి వెళ్లే దారే లేదు. అక్కడికి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అట్లూరు-తంబళ్లగొందిరోడ్డు, రాచాయిపల్లె ఎస్సీ కాలనీ, కలసపాడు-బ్రాహ్మణపల్లె, తంగెడుపల్లె-బి.కోడూరు రోడ్లు కంకర తేలి తారురోడ్లు సైతం మట్టి రోడ్ల మాదిరి దర్శనమిస్తున్నాయి. దీనికితోడు పోరుమామిళ్ల-బద్వేలు రోడ్డు దుర్భరంగా ఉంది. రైల్వేకోడూరు-గంగెద్దుల మిట్టకు ప్రయాణించాలంటే రహదారే లేదు. యేటిలో నడిచి వెళ్లాల్సిందే. దీంతోపాటు రాజీవ్‌నగర్ గిరిజన కాలనీ, పెనగలూరు-దిగువ సిద్దవరం, పల్లంపాడు, పుల్లంపేట మండలంలో కుమారపల్లె వంటి రోడ్లలో ప్రయాణమంటే ప్రజలు హడలిపోతున్నారు. వర్షం పడితే పూర్తి బురదమయం అవుతున్నాయి. దాదాపు 50 గ్రామాలకు వెళ్లే రాజంపేట-ఆకేపాడు రహదారి ఘోరంగా ఉంది. మోకాటిలోతు గుంతలతో ఈ రోడ్డుపైన ప్రయాణమంటే ప్రజలు హడలిపోతున్నారు. ఇరిగేషన్‌శాఖ పరిధిలో ఈ రహదారి ఉండడంతో మరమ్మతులకు నిధులు లేవంటూ చేతులెత్తేశారు. సిద్దవటం మండలం లింగంపల్లె రోడ్డు, నందలూరు మండలం చింతకాయపల్లె రోడ్డుతో పాటు కొన్నిచోట్ల కల్వర్టులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. పులివెందుల-వెలమవారిపల్లె తారురోడ్డు కొన్నేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోవడం లేదు. కంకర తేలి రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. వేముల మండలంలో బచ్చయ్యగారిపల్లె రోడ్డు, గండిరోడ్డు నుంచి బైపాస్కు వెళ్లే రహదారి, తొండూరు మండలంలో బూచువారిపల్లె రోడ్డు, సింహాద్రిపురం మండలంలో హిమకుంట్ల, చెర్లోపల్లె, అంకెవానిపల్లెకు వెళ్లే రహదారి చిధ్రమైంది. వర్షాలకు సెప్టెంబరు, అక్టోబరులో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మత్తులకు నిధులు ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఆర్అండ్బీ పరిధిలో 205.3 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా, మూడుచోట్ల రోడ్లు కోసుకుపోయాయి. 16 చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో * 15 కోట్లతో శాశ్వత అంచనాలు రూపొందించారు. దీంతోపాటు 96 పంచాయతీ రోడ్లు 110.52 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. దీనికోసం 13.36 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. నిధులుమాత్రం మంజూరు కాలేదు. -
ఉసురు తీస్తున్న నిర్లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో: నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం.. బహిరంగ ప్రదేశాల్లో తవ్వి వదిలేసిన గుంతలు, మూతల్లేని సంపులు, మ్యాన్‌హోళ్లు, పైకప్పులేని నాలాలు.. ఇవన్నీ ప్రాణాంతకంగా మారుతున్నాయి. క్షణాల్లో విలువైన ప్రాణాల్ని హరిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో సరైన రక్షణ ఏర్పాట్లు చేయని యంత్రాంగం, అటువంటి చోట్లకు వెళ్లకుండా చూడటంలో ఒక్కోసారి పెద్దలు చూపే ఆదమరుపు పిల్లల్ని ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి. ఈ తరహా దుర్ఘటనలు బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. గుంతల్లో మునిగి, సంపుల్లో పడి చనిపోతున్న వారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. శుక్రవారం నాచారంలో ఓ భవన నిర్మాణం కోసం తవ్వి వదిలేసిన గుంతలో ఈత కొట్టేందుకు దిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన కూడా నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ గుంతలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. చుట్టూ రక్షణ ఏర్పాట్లు లేవు. పాఠశాలకు వెళ్లిన చిన్నారులు ఇక్కడకు ఈత కొట్టేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. భవన నిర్మాణ యాజమాన్యం గుంత చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేపట్టి ఉంటే ఈ దుర్ఘటన చోటుచేసుకునేది కాదని స్థానికులు అంటున్నారు. రోజూ మాదిరిగానే పిల్లలు స్కూలు నుంచి ఇంటికి చేరుకుంటారని తల్లిదండ్రులు భావించారు. కానీ అనుకోని రూపంలో విషాదం వారి కుటుంబాలను కకావికలం చేసింది. అవగాహన లేక కొంత.. పొరుగు జిల్లాలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్న వారికి స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండట్లేదు. భవన నిర్మాణాల కోసం తవ్వి వదిలేస్తున్న గుంతలు, మూతల్లేని సంపులు వంటి వాటి గురించి వీరికి పెద్దగా తెలియట్లేదు. పైగా, కుటుంబపోషణ నిమిత్తం కూలీ పనులకు వెళ్లిపోతున్నారు. దీంతో పిల్లలపై నిఘా, పర్యవేక్షణ కరువవుతున్నాయి. ఇక, పిల్లల ఆలనాపాలనా ఇంటి పట్టున ఉండి చూసుకునే పెద్దదిక్కు కరువవుతోంది. ఇదే వారి కుటుంబాల పాలిట శాపమవుతోంది. ప్రభుత్వ యంత్రాంగాల నిర్లక్ష్యమూ చిన్నారుల ఉసురు తీస్తోంది. బహిరంగ ప్రదేశాల్లోని సంపులు, నీటి గుంతలు ఉన్న చోట్ల రక్షణ ఏర్పాట్లు మర్చిపోతున్నారు. ఇక ఓపెన్ నాలాలు, మ్యాన్‌హోళ్ల విషయం వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇవన్నీ అపశృతులకు కారణమవుతున్నాయి. చిన్నారులకు కుతూహలం మరికొంత.. పరిపక్వత లేని పసి మనసులు. అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూసే కళ్లు. ఏం జరుగుతుందో చూడాలనే కుతూహలం. పెద్దలు ఏ పనులు చేయొద్దని వారిస్తారో అదే చేయడానికి పిల్లలు ఉత్సుకత చూపిస్తారు. ఇంట్లో ఉన్న వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు నీళ్లు సైతం వీరికి ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. తరచు వాటి వద్దకు వెళ్లాలని, ఆడుకోవాలని చూస్తుంటారు. పెద్దలు ఏమాత్రం ఆదమరుపుగా ఉన్నా ఆటలు, సరదా పేరుతో ఈత కొలనులు, గుంతలు వద్దకు చేరుకుంటున్నారు. ఆ సరదానే ప్రాణాల మీదికి తెస్తోంది.