pittalavanipalem
-
‘నన్ను చూసి నవ్వుతావంట్రా.. ఎంత ధైర్యం’
సాక్షి, పిట్టలవానిపాలెం(గుంటూరు): ‘నన్ను చూసి నవ్వుతావంట్రాఎంత ధైర్యంరా నీకు’ అంటూ ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో గొంతు కోసిన ఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం శివారు మండే వారిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామంలో యువకులు అందరూ కలిసి ప్రత్యేక దృశ్య రూపకం వద్ద ఉన్నారు. గ్రామానికి చెందిన జాలాది శివ (20) యువకుడు సమీపంలో మరో వ్యక్తితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. వారికి ఎదురుగా ఉన్న దోనెపాటి శోభన్ నన్ను చూసి నవ్వుతావంట్రా నీకు ఎంత ధైర్యం అంటూ అతనిపై కలబడ్డాడు. సమీపంలో ఉన్నవారు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించారు. అయితే శివాజీ ఇంటికి వెళ్లిపోయాడు. అతనితో పాటే శోభన్ కూడా ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని శివాజీని కడుపులో పొడిచేందుకు ప్రయత్నించగా దగ్గరలో ఉన్నవారు అతన్ని పక్కకు లాగడంతో చేతిపై కత్తిగాయం అయింది. (చదవండి: ప్రియుడి మోసం.. నర్సు ఆత్మహత్య) సమీపంలోని వారు గాయం అయిన చోట పసుపు రాస్తుండగా మరోసారి కత్తితో వచ్చి ఒక్కసారిగా గొంతుకోసి వెళ్లిపోయాడు. రక్తస్రావం అధికం కావడంతో స్థానిక యువకులు శివాజీని చందోలు పోలీసు సేష్టన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం పొన్నూరు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. జాలాది శివాజీ 10 ఏళ్ల వయస్సులో తండ్రిని, 15 ఏళ్ల వయస్సులో తల్లిని కోల్పోయాడు. అప్పటి నుంచి గ్రామస్తులు, బం«ధువులతో సన్నిహితంగా ఉంటూ ఆటోను అద్దెకు తీసుకుని బాడుగలు లేని సమయంలో కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. దిక్కూ మొక్కూలేని వాడని ఈ విధంగా చేస్తారా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై శివాజీ ఆరోగ్యంగా తిరిగి రావాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. -
కామాంధుడికి జీవిత ఖైదు
పిట్టలవానిపాలెం: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేసిన కామాంధుడికి గుంటూరు కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలివీ.. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం శివారు గడ్డంవారిపాలెం గ్రామంలో 2015 మార్చి 17 న ఇదే గ్రామానికి చెందిన చల్లాపల్లి ప్రభుదాసు(55) గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామంలో అందరూ కూలీ పనులకు వెళ్ళడంతో చిన్నారుల ఇళ్ళలో ఎవరూ లేకపోవడంతో ఇంట్లో ఉన్న చిన్నారులను ప్రభుదాసు సమీపంలోని బాత్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం కుటుంబంతోపాటు పరారయ్యాడు. కూలీపనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సరికి ఇద్దరు చిన్నారులు ఇంటి వద్ద మంచంపై పడుకుని ఉన్నారు. తల్లిదండ్రులు వచ్చి అడగడంతో తాతయ్య బాత్రూంలోకి తీసుకెళ్లి ఈ విధంగా చేశాడని ఏడుస్తూ చెప్పారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని ప్రజా సంఘాలు హోరెత్తాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. సాక్షులను విచారించి నేరం రుజువు కావడంతో జిల్లా కోర్టు ప్రభుదాసుకు జీవిత ఖైదు విధించినట్లు చందోలు ఎస్ఐ డి.చెన్నకేశవులు తెలిపారు. -
వంగ రైతు బెంగ!
- పంటకు అంతుచిక్కని తెగుళ్లు - ఈ ఏడాది అనుకూలించని వాతావరణం - కోసిన కాయల్లో సింహభాగం పుచ్చులే.. - క్రిమిసంహారకాలు వాడినా ఫలితం శూన్యం - సాగుకు సూచనలిచ్చే నాథులే లేరు - జాడలేని ఉద్యానశాఖ అధికారులు - కష్టానికి దక్కని ఫలితం.. - అప్పుల ఊబిలో రైతులు పిట్టలవానిపాలెం, న్యూస్‌లైన్ : తాజా కూరల్లో రాజా ఎవరంటే... ఠక్కున చెప్పే సమాధానం వంకాయ అని. గుత్తి వంకాయ పేరు వింటే నోరూరని వారుండరు.. ఆ కూర చూస్తేనే లొట్టలేస్తుంటాం.. ఆస్వాదిస్తూ తింటాం.. అంతటి రుచిగల వంగ.. సాగుచేసే రైతుకు మాత్రం కష్టనష్టాల్నే మిగుల్చుతోంది. గుత్తి వంకాయ రకం సాగుకు బాపట్ల ప్రాంతానికి రాష్ర్టంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పండించే పంట బాపట్ల వంకాయగా పేరెన్నిక గన్నది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పోవడంతో తెగుళ్లు అధికమయ్యాయి. ఎన్ని క్రిమిసంహారక మందులు వాడినా తెగుళ్ల ఉద్ధృతి మాత్రం తగ్గలేదు. రైతు కష్టానికి ఫలితం దక్కడం లేదు. దిగుబడిలో 90 శాతానికిపైగా పుచ్చులే కావడంతో రైతుకు నష్టాలే ఎదురవుతున్నాయి. 50 కిలోల బరువుండే టిక్కీ వంకాయల్లో 10 కిలోలకు మించి పుచ్చుల్లేనివి దొరకడం లేదంటే నష్ట తీవ్రత ఏమేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలోని గరువు నేలల్లో రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో వంగతోటలు విస్తారంగా సాగు చేస్తారు. వాతావరణంలో మార్పుల కారణంగా మొక్కలను ఆశిస్తున్న అంతుచిక్కని తెగుళ్లు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడి తోటల్లో ప్రధానంగా కొమ్మ తెగులు, వెర్రితల తెగులు, కాయపుచ్చు, చె ట్లు ఎండిపోవడంలాంటి తెగుళ్లు కనిపిస్తున్నాయి. కాయపుచ్చు విషయంలో ఎకరం తోటలో 20 టిక్కీల వంకాయలు తెగితే అందులో 10 కిలోలు కూడా మంచి కాయలు దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అందిన చోటల్లా అప్పులు చేసి సాగుకు, పురుగుమందులు తదితరాల కోసం ఎకరానికి రూ.లక్షకు పైగా ఖర్చుచేశామని, కనీసం పెట్టుబడి కూడా దక్కక నష్టాలొస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. దుకాణదారుల సూచనలే.. తోటల్లో సస్యరక్షణ, ఎరువుల వాడకం, నీటి యాజమాన్యానికి సంబంధించి సలహాలు సూచనలు అందించాల్సిన ఉద్యాన శాఖాధికారులు అసలు ఉన్నారో లే రో తెలియని పరిస్థితి. వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిస్తే కూరగాయల సాగు తమకు సంబధించినది కాదని సమాధానమిస్తున్నారు. దీంతో రైతులు చేసేది లేక తమ అనుభవం ఆధారంగా స్థానికంగా ఎరువులు, పురుగుమందుల దుకాణ దారులు ఇచ్చే సలహాల మేరకు క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. అయినా ఎలాంటి ఫలితం దక్కడం లేదు. ఈ విషయంపై పొన్నూరు ఉద్యానవన శాఖాధికారి డి.కల్యాణిని న్యూస్‌లైన్ వివరణ కోరగా వంగతోటలను పరిశీలించి అవసరమైన మేరకు సలహాలు, సూచనలు అందిస్తానని తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఉద్యోగులకిచ్చి చేస్తే పిల్లలు సుఖపడతారని తన ఇద్దరు కుమార్తెలను అన్నదమ్ములిద్దరికీ ఇచ్చి పెళ్లి చేశారు. తొమ్మిది నెలల కిందట చిన్న కూతురు ఆత్మహత్య వార్త వారికి అశనిపాతంలా తగిలింది. కట్టుకున్నవాడే కడతేర్చాడనే అనుమానం ఉన్నా... ఆ కుటుంబంలోనే కోడలిగా ఉన్న మూడో కుమార్తె కాపురానికి ఇబ్బంది కలగకూడదని మారుమాట్లాడలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి వార్తే...ఏడాది వ్యవధిలో ఇద్దరు కూతుళ్లూ విగతజీవులై ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఖాన్ని మిగిల్చివెళ్లారు. పిట్టలవానిపాలెం,న్యూస్‌లైన్ : పిట్టలవానిపాలెం శివారు డేగలవారి పాలెంకు చెందిన వివాహిత శీలం తిరుపతమ్మ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. మృతురాలి తల్లిదండ్రులు,గ్రామస్తుల కథనం ప్రకారం చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెం గ్రామ పంచాయతీలోని మోరవాగుపాలెంకు చెందిన దొంతిరెడ్డి కొండలురెడ్డి, వెంకటేశ్వరమ్మలకు నలుగురు కుమార్తెలు వీరిలో మూడో, నాల్గో కుమార్తెలను పిట్టలవానిపాలెం గ్రామ శివారు డేగలవారిపాలెంకు చెందిన శీలం పోతురాజు రెడ్డి,వెంకటేశ్వరమ్మల కుమారులకు ఇచ్చి పెళ్లిచేశారు. ఆర్మీలో పనిచేస్తున్న పోతురాజురెడ్డి పెద్దకొడుకు నాగరాజురెడ్డికి నాలుగేళ్ల కిందట మూడో కుమార్తె తిరుపతమ్మతో వివాహం చేయగా, ఏడాది కిందట నాలుగో కుమార్తె వీరస్వామమ్మను సీఆర్పీఎఫ్లో పనిచేస్తున్న చిన్న కొడుకు కోటిరెడ్డికి ఇచ్చి పెళ్లిచేశారు. తొమ్మిది నెలల కిందట వీరస్వామమ్మ ఆత్మహత్య చేసుకుందని ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారు. తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని తెలిసినా మూడో కుమార్తె తిరుపతమ్మ కాపురం బాగుండాలనే ఉద్దేశంతో ఎలాంటి కేసులు పెట్టకుండా కొండలురెడ్డి మిన్నకుండిపోయాడు. ఇంతలో శుక్రవారం ఆ దంపతులకు మరో పిడుగుపాటు లాంటి వార్త చెవినపడింది. తిరుపతమ్మ ఉరి వేసుకుని చనిపోయిందని మోరవాగుపాలెంకు చెందిన అక్కల శ్రీనివాసరెడ్డికి తమ అల్లుడు నాగరాజురెడ్డి ఫోన్‌చేసి చెప్పినట్లు మృతురాలి తండ్రి చందోలు పోలీసులకు పిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. చెల్లికి పట్టిన గతే పడుతుంది... అదనపు కట్నం తీసుకురావాలని, లేకపోతే నీ చెల్లిలికి పట్టిన గతే నీకూ పడుతుందని ఇటీవల అనేకసార్లు నాగరాజు రెడ్డి తిరుపతమ్మను శారీరకంగా, మానసికంగా వేధించాడు. దీంతో తిరుపతమ్మ పుట్టింటికి వచ్చింది. ఆర్మీ నుంచి సెలవులో 10 రోజుల క్రితం గ్రామానికి వచ్చిన నాగరాజు ఈ నెల 12న తల్లిదండ్రులు, బంధువులతో కలిసి మోరవాగుపాలెం వచ్చి, ఇక నుంచి ఎలాంటి గొడవలు లేకుండా కాపురం చేసుకుంటానని హామీ ఇవ్వడంతో కొండలురెడ్డి దంపతులు తమ కుమార్తెను అత్తవారింటికి పంపించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తిరుపతమ్మ ఉరివేసుకుని చనిపోయిందనే కబురు అందింది. నాకే పాపం తెలియదు... తన భార్య తిరుపతమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని, తనకు ఏపాపం తెలియదని మృతురాలి భర్త నాగరాజు రెడ్డి చెబుతున్నాడు.పొలంలో నాటు వేస్తున్నామని మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపు వేసి ఉందన్నారు. లోపలికి చూస్తే ఉరికి వేలాడుతోందని, వెంటనే చెరుకుపల్లి ప్రైవేట్ వైద్యశాలకు తీసుకువెళ్లగా, చనిపోయినట్లు వైద్యులు చెప్పారని తెలిపాడు.